Rahane
-
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
రంజీ ట్రోఫీకి సర్వం సిద్దం.. బరిలో సీనియర్ క్రికెటర్లు
దేశంలోని వివిధ నగరాల్లో భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీకి శుక్రవారం తెర లేవనుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. ఎలైట్ డివిజన్లో 32 జట్లు... ప్లేట్ డివిజన్లో 6 జట్లు ఉన్నాయి. ఎలైట్ డివిజన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో విశాఖపట్నంలో బెంగాల్‌తో ఆంధ్ర జట్టు... ప్లేట్ డివిజన్లో నాగాలాండ్ జట్టుతో హైదరాబాద్ తలపడతాయి. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ క్రికెటర్లతో పాటు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
తదుపరి కెప్టెన్ రహానే
-
రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎర్త్ పెట్టిన రహానే
-
మరో 280 పరుగులు...
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల ఛేదన 418... సాధించి 20 ఏళ్లయింది... ఓవల్ మైదానంలో అయితే 263 పరుగులే, అదీ 1902లో వచ్చింది. ఈ రెండింటితో పోలిస్తే ప్రస్తుత లక్ష్యం 444 పరుగులు చాలా ఎక్కువ... అయితే పాత లెక్కల ప్రతికూలతలకంటే పట్టుదలతో కూడిన ప్రదర్శన ఫలితాన్ని ఇవ్వవచ్చు! వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలుచుకునేందుకు భారత్‌ను విజయం ఊరిస్తోంది. పరుగు తేడాతో రోహిత్, పుజారా వెనుదిరిగినప్పుడు సందేహం ఉన్నా... కోహ్లి, రహానే కలిసి ఆశలు రేపారు. వీరిద్దరి ఆటతో పాటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. అయితే మరో వికెట్ ఆసీస్‌కు దారులు తెరిచే అవకాశమూ ఉంది. టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు! లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేతగా నిలిచేందుకు భారత్, ఆ్రస్టేలియా మధ్య ఆఖరి రోజు ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు),రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ఇప్పటికే అభేద్యంగా 71 పరుగులు జోడించారు. ఆఖరి రోజు విజయం కోసం భారత్‌కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్‌కు 7 వికెట్లు అవసరం. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. క్యారీ జోరు... ఆ్రస్టేలియా భారత్‌కు భారీ లక్ష్యాన్ని విధించగలగడంలో కీపర్ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు)దే కీలకపాత్ర. శనివారం ఆసీస్ 40.3 ఓవర్లు ఆడి మరో 147 పరుగులు జత చేసింది. వాటిలో క్యారీ, మిచెల్ స్టార్క్ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్‌కు 20 ఓవర్లలో 93 పరుగులు జోడించడం విశేషం. ఓవర్ నైట్ బ్యాటర్లు లబుషేన్ (41; 4 ఫోర్లు), గ్రీన్ (25; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా, క్యారీ మాత్రం బౌండరీలతో చకచకా పరుగులు రాబట్టాడు. 82 బంతుల్లో క్యారీ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు స్టార్క్‌ను అవుట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, తాను అవుట్ కాగానే కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. రోహిత్ రాణించినా... ఛేదనను ఓపెనర్లు రోహిత్, గిల్ (19 బంతుల్లో 18; 2 ఫోర్లు) దూకుడుగానే ఆరంభించారు. దాంతో 7 ఓవర్లలోనే స్కోరు 41 పరుగులకు చేరింది. ఈ దశలో గ్రీన్ పట్టిన వివాదాస్పద క్యాచ్‌తో గిల్ నిష్క్రమించాడు. గ్రీన్ క్యాచ్ అందుకుంటున్నప్పుడు బంతి నేలకు తగిలినట్లుగా కనిపించింది. టీవీ రీప్లేలోనూ సందేహాస్పదంగానే ఉన్నా అంపైర్ చివరకు అవుట్‌గా ప్రకటించడంతో గిల్ నిష్క్రమించక తప్పలేదు. టీ విరామం తర్వాతా రోహిత్ ధాటి కొనసాగింది. అయితే లయన్ తొలి ఓవర్లో అనవసరపు స్వీప్ షాట్‌కు ప్రయత్నించి అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఐదు బంతులకే పుజారా (47 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా అవుట్ కావడంతో భారత్ కుప్పకూలుతుందేమో అనిపించింది. కానీ కోహ్లి, రహానే తమ అపార అనుభవంతో జట్టును ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా క్రీజులో నిలబడటంతో పాటు వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లు కూడా పూర్తిగా నియంత్రణ కోల్పోయి బంతులు వేశారు. ఆట చివర్లో మరో వికెట్ తీయలేక కంగారూ శిబిరంలో తీవ్ర అసహనం కనిపించింది. భారత్ ఈ ఇన్నింగ్స్‌లో 4.10 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469; భారత్ తొలి ఇన్నింగ్స్: 296; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) భరత్ (బి) ఉమేశ్ 13; వార్నర్ (సి) భరత్ (బి) సిరాజ్ 1; లబుషేన్ (సి) పుజారా (బి) ఉమేశ్ 41; స్మిత్ (సి) శార్దుల్ (బి) జడేజా 34; హెడ్ (సి అండ్ బి) జడేజా 18; గ్రీన్ (బి) జడేజా 25; క్యారీ (నాటౌట్) 66; స్టార్క్ (సి) కోహ్లి (బి) షమీ 41; కమిన్స్ (సి) (సబ్) అక్షర్ (బి) షమీ 5; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (84.3 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 270. వికెట్ల పతనం: 1–2, 2–24, 3–86, 4–111, 5–124, 6–167, 7–260, 8–270. బౌలింగ్: షమీ 16.3–6–39–2, మొహమ్మద్ సిరాజ్ 20–2–80–1, శార్దుల్ ఠాకూర్ 8–1–21–0, ఉమేశ్ యాదవ్ 17–1–54–2, రవీంద్ర జడేజా 23–4–58–3. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీ) (బి) లయన్ 43; శుబ్‌మన్ గిల్ (సి) గ్రీన్ (బి) బోలండ్ 18; పుజారా (సి) క్యారీ (బి) కమిన్స్ 27; విరాట్ కోహ్లి (బ్యాటింగ్) 44; అజింక్య రహానే (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–41, 2–92, 3–93. బౌలింగ్: కమిన్స్ 9–0–42–1, బోలండ్ 11–1–38–1, మిచెల్ స్టార్క్ 7–0–45–0, గ్రీన్ 2–0–6–0, నాథన్ లయన్ 11–1–32–1. -
CSK: అట్టడుగు నుంచి అగ్రస్థానానికి.. ఒక్క సీజన్లో ఎంత మార్పు..!
ఐపీఎల్ 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాలు సాధిస్తూ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చివరి నుంచి రెండో స్థానంతో గత సీజన్‌ను ముగించిన సీఎస్కే.. ప్రస్తుత సీజన్లో అనూహ్యంగా పుంజుకుని ఓ రేంజ్లో ఇరగదీస్తుంది. ఈ సీజన్‌ను సైతం ఓటమితో (గుజరాత్ చేతిలో) ప్రారంభించిన ధోని సేన.. ఆతర్వాత ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క ఓటమిని (రాజస్థాన్) మూటగట్టుకుని బ్రేకుల్లేని బుల్డోజర్గా దూసుకుపోతుంది. నిన్న (ఏప్రిల్ 23) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా భారీ జంప్ చేసింది. కేకేఆర్‌పై భారీ స్కోర్ చేయడంతో ఆ జట్టు రన్‌రేట్ సైతం గణనీయంగా మెరుగుడింది. సీఎస్కేలో ఒక్క సీజన్లో ఇంత మార్పు రావడంతో ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టు ఇదే జోరును కొనసాగించి, ఐదో టైటిల్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు యువకులు, వెటరన్ ఆటగాళ్ల సమ్మేళనంలా ఉన్న సీఎస్కే సైతం ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని దృడ నిశ్చయంతో ఉంది. తమ సారధి ధోనికి బహుశా ఈ సీజన్ ఆఖరిది కావొచ్చనే సంకేతాలు అందడంతో సీఎస్కే సభ్యులంతా తమలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసి టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు లాంటి వెటరన్లకు కూడా ఇదే సీజన్ ఆఖరిది అయ్యే అవకాశం ఉండటంతో, వారిని సైతం ఘనంగా సాగనంపాలని భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అయిన తమ నాయకుడికి టైటిల్‌తో వీడ్కోలు పలకడమే తామందించగలిగే గౌరవమని సీఎస్కే సభ్యులు భావిస్తున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్ బౌలర్లపై సీఎస్కే బ్యాటర్లు ఓ రేంజ్లో డామినేషన్ చలాయించారు. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
ముంబైకి చెన్నై చెక్
ముంబై: ఐదు సార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తొలి విజయం కోసం మరింతగా నిరీక్షించక తప్పదు. తొలి పోరులో బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిన రోహిత్ సేన రాత సొంత మైదానంలోనూ మారలేదు. శనివారం జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 32; 5 ఫోర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (3/20) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అనంతరం చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సమష్టి వైఫల్యం... ముంబైకి లభించిన ఆరంభం చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. తొలి ఓవర్లో రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు కొట్టగా, మగాలా ఓవర్లో ఇషాన్ కిషన్ 3 ఫోర్లు బాదాడు. తుషార్ ఓవర్లో సిక్స్‌తో జోరు పెంచే ప్రయత్నం చేసిన రోహిత్, అదే ఓవర్లో ఒక అద్భుత బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. అంతే...ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గత మ్యాచ్ తరహాలో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత డేవిడ్ మెరుపులు ముంబైకి కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాయి. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో డేవిడ్ వరుసగా 6, 4, 6 కొట్టి తర్వాతి బంతికే వెనుదిరగడం విశేషం. కీలక భాగస్వామ్యం... ఛేదనలో తొలి ఓవర్లోనే చెన్నై జట్టు కాన్వే (0) వికెట్ కోల్పోయింది. అయితే రహానే దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు వేగంగా సాగింది. ముఖ్యంగా అర్షద్ వేసిన ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతుల్లో రహానే వరుసగా 6, 4, 4, 4, 4 బాదడం అతని సత్తాను చూపించింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చావ్లా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రహానే 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ కాగా...ఐపీఎల్లో 2020 తర్వాత రహానేకు ఇదే మొదటి ఫిఫ్టీ కావడం మరో విశేషం. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) తుషార్ 21; ఇషాన్ కిషన్ (సి) ప్రిటోరియస్ (బి) జడేజా 32; గ్రీన్ (సి) అండ్ (బి) జడేజా 12; సూర్యకుమార్ (సి) ధోని (బి) సాన్‌ట్నర్ 1; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) జడేజా 22; అర్షద్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 2; టిమ్ డేవిడ్ (సి) రహానే (బి) తుషార్ 31; స్టబ్స్ (సి) రుతురాజ్ (బి) మగాలా 5; షోకీన్ (నాటౌట్) 18; చావ్లా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–38, 2–64, 3–67, 4–73, 5–76, 6–102, 7–113, 8–131. బౌలింగ్: దీపక్ చహర్ 1–0–10–0, తుషార్ దేశ్‌పాండే 3–0–31–2, మగాలా 4–0–37–1, సాన్‌ట్నర్ 4–0–28–2, జడేజా 4–0–20–3, ప్రిటోరియస్ 4–0–28–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: కాన్వే (బి) బెహ్రన్‌డార్ఫ్ 0; రుతురాజ్ (నాటౌట్) 40; రహానే (సి) సూర్యకుమార్ (బి) చావ్లా 61; దూబే (బి) కార్తికేయ 28; రాయుడు (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–82, 3–125. బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 3–0–24–1, అర్షద్ ఖాన్ 2.1–0–35–0, గ్రీన్ 3–0–20–0, చావ్లా 4–0–33–1, కార్తికేయ 4–0–24–1, హృతిక్ షోకీన్ 2–0–19–0. ఐపీఎల్లో నేడు గుజ రాత్ VS కోల్‌కతా (మ. గం. 3:30 నుంచి) హైదరాబాద్ VS పంజాబ్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. టీమిండియాకు ఏమైంది..?
గతేడాది కాలంగా టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 11 నెలల కాలంలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారడంతో ఏ సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 2021 జూన్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరగా, అదే సమయంలో శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అనంతరం అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల చేత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నుంచి విరాట్ కోహ్లి తప్పుకోగా ఆ మ్యాచ్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించారు. తదనంతరం కెప్టెన్సీ విషయంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో విరాట్ కోహ్లి టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి మొత్తంగా తప్పుకోగా.. సౌతాఫ్రికా టూర్లో రెండో టెస్టుకు ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేయగా, సిరీస్ ప్రారంభానికి ముందే అతను గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో బీసీసీఐ రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టులో పంత్‌కు చోటు దక్కడంతో ఐర్లాండ్‌లో పర్యటించే మరో జట్టుకు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇలా వివిధ కారణాల చేత 11 నెలల కాలంలో టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లు మారారు. చదవండి: టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..! -
హార్ధిక్, గబ్బర్లకు భారీ షాక్.. రహానే, పుజారాలకు డిమోషన్
BCCI Contracts: 2021-22 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు చుక్కెదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌ను నిలబెట్టుకోగా.. టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మలు తమ ‘ఎ’ గ్రేడ్‌ను కోల్పోయి ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గాయాల కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డేలు మాత్రమే పరిమితమైన శిఖర్ ధవన్లు ఏకంగా ‘ఎ’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు దిగజారగా.. మయాంక్ అగర్వాల్, సాహాలు ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు పడిపోయారు. ఇప్పటివరకు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ‘బి’ గ్రేడ్ దక్కగా.. కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు ఏకంగా కాంట్రక్ట్నే కోల్పోయారు. బీసీసీఐ ఈ ఏడాదికి గాను 27 మందితో సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకోగా.. రోహిత్, కోహ్లి, బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌లో.. అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీలు ‘ఎ’ గ్రేడ్‌లో.. పుజారా, రహానే, అక్షర్, శార్ధూల్, శ్రేయస్, సిరాజ్, ఇషాంత్‌లు ‘బి’ గ్రేడ్‌లో.. ధవన్, ఉమేశ్, భువనేశ్వర్, హార్ధిక్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, విహారి, చహల్, సూర్యకుమార్ యాదవ్, సాహా, మయాంక్‌లు ‘సి’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో 'ఎ ప్లస్' కేటగిరీలో ఉన్నవాళ్లకు ఏటా రూ.7 కోట్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లకు రూ.5 కోట్లు, ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, ‘సి’ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ.1కోటి పారితోషికంగా లభించనుంది. చదవండి: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు -
సిరాజ్‌కు ప్రమోషన్.. ఇకపై ఎంత జీతం అంటే!
ముంబై: భారత స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా బీసీసీఐ కొత్తగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో కూడా ‘ఎ’ ప్లస్’ గ్రేడ్‌లోనే కొనసాగనున్నారు. వీరికి బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న టెస్టు స్పెషలిస్ట్‌లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మల స్థాయి తగ్గిస్తూ బోర్డు ‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు)లోకి మార్చింది. ఈ ముగ్గురు టెస్టు జట్టులో స్థానం కోల్పోయారు. గాయాలతో వరుసగా మ్యాచ్‌లకు దూరమవుతున్న హార్దిక్ పాండ్యా, వన్డేలకే పరిమితమైన శిఖర్ ధావన్‌లను కూడా ‘ఎ’ నుంచి తప్పించి ‘సి’లో (రూ. 1 కోటి) పడేశారు. దాంతో ‘ఎ’ గ్రేడ్‌లో (రూ. 5 కోట్లు) ఐదుగురు ఆటగాళ్లు అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీ మాతమ్రే మిగిలారు. మయాంక్, సాహాలను కూడా ‘బి’ నుంచి ‘సి’కి మార్చారు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడంతో పాటు పరిమిత ఓవర్ల జట్లలో కూడా చోటు దక్కించుకున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్ లభించింది. ఇప్పటి వరకు ‘సి’లో ఉన్న అతడిని గ్రేడ్ ‘బి’లోకి తీసుకున్నారు. హనుమ విహారి ‘సి’లోనే కొనసాగనున్నాడు. 27 మందితో రూపొందించిన ఈ కాంట్రాక్ట్ జాబితానుంచి కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలను పూర్తిగా తప్పించారు. మరోవైపు మహిళా క్రికెటర్లలో హర్మన్, స్మృతి, పూనమ్ యాదవ్ ఉన్న గ్రూప్ ‘ఎ’ (రూ.50 లక్షలు)లోకి దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లను తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు. జెమీమా ‘బి’ నుంచి ‘సి’ (రూ. 10 లక్షలు)లోకి పడిపోయింది. మిథాలీ, జులన్ గ్రూప్ ‘బి’ (రూ. 30 లక్షలు)లో కొనసాగనున్నారు. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
పుజారా పర్వాలేదు.. రహానేకైతే మరో అవకాశం ఇవ్వను..!
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. పేలవ ఫామ్‌లో ఉన్న రహానే తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన సూచించాడు. కేప్‌టౌన్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన రహానేకు తానైతే మరో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో రహానే చివరిసారిగా రాణించడం చూసామని, గతేడాది అతనాడిన 15 మ్యాచ్‌ల్లో 20.25 సగటున కేవలం 547 పరుగులు మాత్రమే చేశాడని, ఇక అతను తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్న ఆశలు తనకు లేవని అన్నాడు. రహానేతో పోలిస్తే పుజారా కాస్త బెటర్ అని, అతనికైతే మరో అవకాశం ఇచ్చినా తప్పులేదని అభిప్రాయడ్డాడు. కాగా, దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి, 3 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు.. -
Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు..
Virat Kohli On Purane Future: దక్షిణాఫ్రితో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పరోక్షంగా వెనకేసుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం 'పురానే(పుజారా, రహానే)'ల భవిష్యత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు భారత సారధి బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పురానే భవిష్యత్తుని నిర్ణయించడం తన పని కాదని, జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వారి విషయంలో నా జోక్యం ఏంటని విలేకరులను ఎదురు ప్రశ్నించాడు. సెలక్టర్లు వారిద్దరిని జట్టులో ఎంపిక చేస్తే మాత్రం మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని బదులిచ్చాడు. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకి చాలా అవసరమని పురానేలకు పరోక్షంగా తన మద్దతు తెలిపాడు. కాగా, గతేడాది కాలంగా పుజారా, రహానేలు వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో వీరి ప్రదర్శన మరింత దిగజారింది. మూడు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరు చేసిన పరుగులతో పోలిస్తే.. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్ట్‌ల్లో కలిపి దక్షిణాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్‌ట్రాలు సమర్పించారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. Opponents drops Rahane's catch, Pujara drops opponents catch but our management drops neither of them. — Heisenberg ☢ (@internetumpire) January 14, 2022 సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. అన్నీ రంగాల్లో అద్భుతంగా రాణించి హాట్ ఫేవరెట్ అయిన టీమిండియాకు ఊహించని షాకిచ్చింది. మరోవైపు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ మాత్రం ఆశించిన మేరకు రాణించలేక చతికిలబడింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమై, సిరీస్ కోల్పోవడానికి పరోక్ష కారణమైంది. కేఎల్ రాహుల్, పంత్ మినహా ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు. సీనియర్ ఆటగాళ్లైన పుజారా, రహానేలు కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఈ సిరీస్‌లోనే ఎదుర్కొన్నారు. Rahane and Pujara are the major reason for India's loss. — Rahul(Astrologer)Contact for 100% wrong prediction (@rahulpassi) January 14, 2022 పేలవ ఫామ్‌లో ఉన్న 'పురానే'కు వరుస అవకాశాలు ఇచ్చిన టీమిండియా యాజమాన్యం తగిన మూల్యమే చెల్లించుకుంది. ఈ ఇద్దరు బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచారు. కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లను జారవిడిచి జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు వీరిపై విరుచుకుపడుతున్నారు. టీమిండియా సిరీస్ కోల్పోవడానికి వీరే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. #INDvSA High time Rahane and Pujara should be dropped off permanently from the test team squad! Dey got ample amount of chances to prove themselves! Gill, Hanuman Vihari, Shreyas Iyer we have dem waiting since forever! Its high tym now! — Angel Anki 🇮🇳 (@angel_ank1) January 14, 2022 'పురానే'కు వరుస అవకావాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కోవాలని.. పుజారా, రహానేల కథ ముగిసిందని.. శ్రేయస్ అయ్యర్, విహారి, శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, కేప్‌టౌన్ టెస్ట్‌లో రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43,9 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించకపోగా మ్యాచ్ కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు జారవిడిచారు. చదవండి: లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి -
Ind Vs Sa Test Series: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా..’’
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే గత కొద్ది కాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో 19.57 సగటుతో 411 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే అతడికి విదేశీ పిచ్‌లపై ఉన్న రికార్డల దృష్ట్యా దక్షిణాఫ్రికా పర్యటనకు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన శ్రేయాస్ అయ్యర్ రూపంలో రహానే స్ధానానికి గట్టి పోటీ నెలకొంది. అంతే కాకుండా హనుమ విహారి రూపంలో ఐదోస్ధానానికి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంచూరియాన్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో రహానేకి చోటు దక్కడం కష్టమని అతడు అభిప్రాయపడ్డాడు. "జట్టులో ఐదో స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ స్ధానంలో ఎవరని ఎంపిక చేయాలో అన్నది కష్టంగా మారింది. కేవలం గణంకాల ఆధారంగా మాత్రమే జట్టును ఎంపిక చేస్తే, కోహ్లి కూడా గత ఏడాదిగా ఫామ్‌లో లేడు. అయితే ఇప్పుడు కోహ్లి ఫామ్‌లో లేడని జట్టు నుంచి తప్పిస్తారా? పూజారా కూడా గత కొంత కాలంగా ఫామ్‌లో లేడు. అతడి గురించి ఎవరూ మాట్లాడరు. పూజారాకి జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుంది. కానీ చివరకు మిగిలినది రహానే మాత్రమే. అతడు రానున్న రోజుల్లో జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు రహానే సారథ్యం వహించాడు. ఇక రెండో టెస్ట్‌కు విరాట్ కోహ్లి జట్టులోకి రావడంతో రహానే ఏకంగా జట్టులో స్ధానాన్నే కోల్పోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు టీమిండియా 5లేదా 6గురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని భావిస్తే రహానేకి చోటు దక్కడం కష్టం. కోహ్లికి లేదా పుజారాకు ఇదేమి కొత్త కాదు. కోహ్లి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటాడు. 2018 పర్యటనలో జోహన్స్‌బర్గ్, కేప్‌టౌన్ పిచ్‌లపై భారత ఆటగాళ్లు ఆడటానికి ఇబ్బంది పడ్డారు. అయితే కోహ్లి మాత్రం 150 పరుగులు సాధించి అధ్బుతంగాగ రాణించాడు. ఈసారి కూడా కోహ్లి రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇక రహానే స్ధానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా హనుమా విహారికు చోటు దక్క వచ్చు" అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. చదవండి: దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం.. సిరీస్ వాళ్లదే: టీమిండియా మాజీ క్రికెటర్ -
ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి ఛాన్స్!
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు దక్షిణాఫ్రికా పర్యటనే చివరి అవకాశం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఇషాంత్‌కు స్ధానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం చాలా కష్టం. ఇప్పటి వరకు 105 టెస్ట్‌ల్లో తన సేవలను భారత జట్టుకు అందించాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌ల రూపంలో ఇషాంత్‌కు జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఇషాంత్‌తో పాటు జట్టు సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పూజారా భవిష్యత్తు కూడా ఈ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. "భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా రహానె తొలగింపు ఇషాంత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక వంటిది. సీనియర్ ఆటగాడిగా ఇషాంత్ మరింత రాణించాలి. పుజారా విషయంలో కూడా ఇదే నిజం. పుజారా చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. అతడు ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కానీ ఒక సీనియర్ ఆటగాడిగా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని జట్టు ఆశిస్తోంది. ఒకవేళ వారు ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తే, తమ టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోగలరు" అని బీసీసీఐ అధికారి ఒకరు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ -
Ind Vs Nz 1st Test: ప్చ్.. మనకు నిరాశే.. డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు
Ind Vs Nz 2021 1st Test Day 5 Highlights Updates Telugu: 04:22 PM: ►గెలుపు ఖాయమనుకున్న తొలి టెస్టులో భారత్‌కు నిరాశ తప్పలేదు. చివరి వికెట్ తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుగోడగా నిలబడి విలియమ్సన్ బృందాన్ని ఓటమి బారి నుంచి తప్పించారు. ఫలితంగా మ్యాఛ్ డ్రాగా ముగిసింది. అరంగేట్ర హీరో శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో అయ్యర్ మొత్తంగా 170 పరుగులు చేశాడు. టీమిండియా : ►తొలి ఇన్నింగ్స్: 345-10 (111.1 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్: 234-7 డిక్లేర్డ్ (81 ఓవర్లు) న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296-10 (142.3 ఓవర్లలో) రెండో ఇన్నింగ్స్: 165-9(98 ఓవర్లు). 3:55 PM ►విజయం దిశగా పయనిస్తున్న భారత్ ►ఐదో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో టిమ్ సౌథీ పెవిలియన్ చేరాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర క్రీజులో ఉన్నారు. ఇక విజయానికి ఒక వికెట్ దూరంలో ఉన్న నేపథ్యంలో రహానే ఫీల్డింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాడు. 3: 44 PM: ►రెండు వికెట్లు పడగొడితే చాలు విజయం టీమిండియాదే. ►‘సర్’ రవీంద్ర జడేజా.. జేమీసన్ వికెట్ పడగొట్టడంతో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ప్రస్తుత స్కోరు- 147/8 (86.2) 3:35 PM: ►విజయానికి మూడు వికెట్ల దూరంలో టీమిండియా ►కివీస్ స్కోరు: 143/7 ►న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ బ్లండెల్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ప్రస్తుతం కివీస్ టీమిండియా కంటే 138 పరుగులు వెనుకబడి ఉంది. 3:14PM: ►టీమిండియా కంటే న్యూజిలాండ్ 146 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత స్కోరు: 138/6 (77). ►రచిన్ రవీంద్ర(6), టామ్ బ్లండెల్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 2:55PM: టీమిండియా విజయానికి మరింత చేరువైంది. విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ ఆశలు ఆవిరయ్యాయి. కాగా టీమిండియా విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండెల్(2) ఉండగా, రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చాడు న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. హెన్రీ నికోల్స్‌ను అక్షర్ పటేల్ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 24 పరుగులతో ఉండగా, టామ్ బ్లండల్ క్రీజులోకి వచ్చాడు 2:14 PM: న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 6 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 24 పరుగులతో ఉండగా,హెన్రీ నికోల్స్ క్రీజులోకి వచ్చాడు. న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను, రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(7), రాస్ టేలర్(0) పరుగులతో ఉన్నారు. 12: 58 PM: కివీస్ స్కోర్: 99/2, భారత్ కంటే ఇంకా 185 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(49),విలియమ్సన్(7) పరుగులతో ఉన్నారు. 12: 14PM: 79 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన విలియం సోమర్విల్లే, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో శుభమాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(32),విలియమ్సన్ ఉన్నారు. 11:30AM: ఐదో రోజు ఆట: లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు(సెకండ్ ఇన్నింగ్స్): ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు. భారత్ కంటే ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్. 11:18 Am: న్యూజిలాండ్ స్కోర్: 70/1, ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(32), విలియం సోమర్విల్లే(32) పరుగులతో ఉన్నారు. 10:10 Am: ఐదో రోజు ఆట ప్రారంభించిన కివీస్ నిలకడగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి న్యూజిలాండ్ 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(10), విలియం సోమర్విల్లే(18) పరుగులతో ఉన్నారు. 9:30 Am: కాన్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అఖరి రోజు ఆట ప్రారంభమైంది. కాగా చివరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇరు జట్లుకు విజయం ఊరిస్తోంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్, విలియం సోమర్విల్లే ఉన్నారు. కాగా భారత్.. విజయానికి ఇంకా 9 వికెట్ల దూరంలో నిలవగా, మరోవైపు న్యూజిలాండ్ 284 పరుగుల లక్ష్యాన్ని చేధించి గెలుపు రుచి చూడాలని భావిస్తోంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్- వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
Ind Vs Nz Test Series:‘చాంపియన్’తో సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై తమ సొంతగడ్డలో బదులు తీర్చుకునేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌లో తమకు టైటిల్ అందకుండా చేసిన జట్టును కసితీరా ఓడించేందుకు టీమిండియా ఎప్పటిలాగే స్పిన్ అస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు కివీస్ కూడా టి20లో ఎదురైన క్లీన్‌స్వీప్ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాన్పూర్: భారత్‌తో జరిగిన గత మూడు టెస్టుల్లో న్యూజిలాండ్‌దే విజయం. ఇందులో రెండు మ్యాచ్‌లో కివీస్ సొంతగడ్డపై ఆడగా...మరో మ్యాచ్ తటస్థ వేదికపై (డబ్ల్యూటీసీ ఫైనల్) జరిగింది. అయితే భారత్‌లో భారత్‌ను టెస్టుల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం కివీస్‌కు బాగా తెలుసు. 2016 సిరీస్‌లో ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గత మూడు పరాజయాలకు బదులు తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత్ ఉంది. పైగా సొంతగడ్డపై ఆడే అనుకూలత కూడా టీమిండియాకు కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరుజట్ల మధ్య మొదలయ్యే తొలి టెస్టు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగే అవకాశముంది. భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కాగా... టి20ల నుంచి విశ్రాంతి తీసుకున్న కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టెస్టు పరీక్షకు అందుబాటులో ఉండటం ప్రత్యర్థి జట్టుకు బలం. ఆత్మవిశ్వాసంతో టీమిండియా పొట్టి మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న భారత్ టెస్టు సిరీస్‌నూ విజయవంతంగా ముగించాలనే లక్ష్యంతో ఉంది. మయాంక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. టెస్టుల్లో స్పెషలిస్ట్ ఓపెనర్లయిన వీరిద్దరు శుభారంభం అందించగలరు కాబట్టి లోకేశ్ రాహుల్ లేని లోటైతే కనిపించదు. కోహ్లి విశ్రాంతి జట్టుకు ఇబ్బందికరమైనప్పటికీ నాలుగో స్థానంలో తాత్కాలిక సారథి రహానే ఫామ్‌లోకి వస్తే అంతా సర్దుకుంటుంది. వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు నీరసించక తప్పదు. శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రం చేస్తాడని ఒక రోజు ముందుగానే రహానే ప్రకటించాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం! భారత్‌లో స్పిన్నే ప్రధాన ఆయుధం... ఈ నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌తో పాటు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఖాయంగా ఆడతారు. పేసర్లలో ఇషాంత్ శర్మతో హైదరాబాదీ సీమర్ సిరాజ్ లేదంటే ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. కోహ్లి, రోహిత్, బుమ్రా, షమీ, పంత్‌లాంటి ప్లేయర్లు లేకపోయినా స్వదేశంలో తిరుగు లేని జట్టయిన భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే టెస్టు విజయం కష్టం కాబోదు. విలియమ్సన్ అండతో... రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేని జట్టు మూడు టి20ల్లోనూ చిత్తుగా ఓడింది. కానీ టెస్టులకు కొండంత అండ కేన్ హాజరుతో లభించింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కూడా అందుబాటులోకి రావడం జట్టును పటిష్టంగా మార్చింది. అయితే భారత్‌లో న్యూజిలాండ్ రికార్డే అత్యంత పేలవంగా ఉంది. ఇప్పటివరకు 34 టెస్టులు ఆడితే కేవలం 2 టెస్టులే గెలవగలిగింది. అప్పుడెప్పుడో 1988లో చివరిసారిగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ విజయానికి చేరువగా రాలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్ హోదాతో భారత్‌కు వచ్చింది. ప్రధాన బౌలర్లలో ఒకడైన ట్రెంట్ బౌల్ట్ విశ్రాంతితో స్వదేశం చేరాడు. ఈ నేపథ్యంలో పేస్ భారమంతా సీనియర్ సీమర్ సౌతీపైనే ఉంది. భారత్‌లోని స్పిన్ పిచ్‌ల దృష్ట్యా ఎజాజ్ పటేల్, సొమర్విల్లేలను తీసుకొచ్చినా... వీళ్లు ఏమాత్రం ప్రభావం చూపుతారో మైదానంలోనే చూడాలి. -
కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..?
Senior Indian Cricketers Revolted Against Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక గల కారణాలపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పూర్తైన నాటి నుంచి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, రహానే, పుజారాలు కోహ్లిపై అసంతృప్తిగా ఉన్నారని, ఆ ముగ్గురే కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, దీన్ని పరిగణలోకి తీసుకునే కోహ్లి ప్రమేయం లేకుండా టీమిండియా టీ20 ప్రపంచకప్ బృందం ప్రకటించబడిందని, ఇది నచ్చకే కోహ్లి టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని ఆ కథనంలో పేర్కొనబడింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి పుజారా, రహానే, అశ్విన్‌లను బాధ్యులని చేస్తూ.. కోహ్లి నోరుపారేసుకోవడంతో వివాదం మొదలైందని, అది కాస్తా చినికిచినికి గాలివానలా మారి కోహ్లి టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టిందని ప్రచురించింది. అలాగే, టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి వన్డే కెప్టెన్సీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి.. -
టీమిండియా క్రికెటర్ భార్య వెటకారం.. కోహ్లి, రహానేలపై సెటైర్లు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా కోహ్లి, రహానే, పుజారాపై సెటైర్లు వేసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మయంతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ.. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన అతను.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు. చదవండి: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్ -
చరిత్ర సృష్టించిన ఆండర్సన్.. ఆ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా రికార్డు
లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అజింక్య రహానే వికెట్ పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్ వెటరన్ పేసర జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో(ఇంగ్లండ్ గడ్డపై) 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అతను రికార్డుల్లోకెక్కాడు. ఆండర్సన్‌కు ముందు ఇంగ్లండ్‌లో ఏ ఇతర బౌలర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ జాబితాలో ఆండర్సన్ తర్వాతి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్(341 వికెట్లు), ఫ్రెడ్ ట్రూమన్(229 వికెట్లు) ఉన్నారు. ఇక, ఓవరాల్ సొంత గడ్డపై 400 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీథరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత ఆండర్సన్(400), అనిల్ కుంబ్లే(350), స్టువర్ట్ బ్రాడ్(341),షేన్ వార్న్(319) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆండర్సన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు అండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్‌పై నమోదై ఉంది. అండర్వుడ్ భారత్‌కు 322 మెయిడిన్ ఓవర్లు వేసాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. 215/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఏ దశలోనూ కనీస పోరాటం ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓలి రాబిన్సన్(5/65), ఒవర్టన్(3/47) ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కలిపి మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. చదవండి: టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి -
రసపట్టులో.. భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా... రెండో టెస్టులో మాత్రం భారత్, ఇంగ్లండ్ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రహానే మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా... మార్క్ వుడ్, మొయిన్ అలీ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా... ఆఖరి రోజు భారత్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేయడంపై ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి లార్డ్స్ టెస్టులో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది. లండన్: మూడో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. నాలుగో రోజు మ్యాచ్‌పైనే పట్టు సాధించే పరిస్థితిని సృష్టించుకుంది. ఆతిథ్య జట్టు పేస్–స్పిన్‌ల కలబోత భారత్‌ను కష్టాలపాలు చేసింది. పేసర్ మార్క్ వుడ్ (3/40) ‘టాప్’ లేపగా... స్పిన్నర్ మొయిన్ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ చేతిలో ఒక బ్యాట్స్‌మనే ఉన్నాడు. మిగతా వాళ్లంతా బౌలర్లే! వణికించిన వుడ్ భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రహానే అర్ధసెంచరీ తర్వాత భారత్ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో సెషన్ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. బౌలింగ్: అండర్సన్ 18–6–23–0, రాబిన్సన్ 10–6–20–0, వుడ్ 14–3–40–3; స్యామ్ కరన్ 15–3–30–1, మొయిన్ అలీ 20–1–52–2, రూట్ 5–0–9–0. -
పదిహేను సర్జరీలు అయినప్పటికీ పరిష్కారం దొరకలేదు..
ప్రతి విజయం వెనుక కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు నిరంతర సాధనతో సమస్యలను అధిగమించి విజయ తీరాలకు చేరతారు. కానీ వైకల్యంతో ఉన్నతస్థాయికి ఎదగాలంటే మాత్రం... ‘కష్టాల కడలి’ని ఈదాల్సిందే. ఇటువంటి కష్టాల కడలిని ఎంతో ధైర్యంగా ఈది సమాజంలో తనకంటూ గుర్తింపును ఏర్పర్చుకున్నారు ‘ఇయర్‌బుక్ కాన్వాస్’ సహవ్యవస్థాపక సీఈవో సురాశ్రీ రహానే. వైకల్యాన్ని ఓడించి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ప్రేరణగా నిలసున్నారు సురాశ్రీ. నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో సురాశ్రీ రహానే జన్మించింది. పుట్టుకతోనే ఆరోగ్య సమస్య ఏర్పడడంతో సురాశ్రీ పదిహేను రోజుల శిశువుగా ఉన్నప్పుడే కాళ్లకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అంతటితో సమస్య తీరుతుంది అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ అది ప్రారంభం మాత్రమే అని తర్వాత తెలిసింది వారికి. ఒకపక్క తనసమస్యతో బాధపడుతూనే సురాశ్రీ స్కూలుకెళ్లి చక్కగా చదువుకునేది. ఒకసారి మేజర్ సర్జరీ అయింది. అప్పుడు కొన్ని నెలల పాటు స్కూలుకు వెళ్లడం కుదరలేదు. దీంతో స్కూలుకు వెళ్లలేకపోతున్నందుకు తనకు ఎంతో బాధపడేది. ఇప్పటిదాక మొత్తం పదిహేను సర్జరీలు అయినప్పటికి సురాశ్రీ∙వైకల్యానికి శాశ్వత పరిష్కారం దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు! ఇలా ఉంటే నేను ముందుకు వెళ్లలేను బాగా చదువుకోని ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయ్యాక అందరిలాగే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ సురాశ్రీ వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ‘‘చిన్నప్పుడు నాకాళ్ల మీద నేను నిలబడేందుకు కాళ్లు సహకరించలేదు! అయినా ఎంతో కష్టపడి నడవడం నేర్చుకున్నాను! ఇప్పుడు కెరియర్లో కూడా నాకు నేనే ఎదగాలి’’ అని నిర్ణయించుకుంది. జ్ఞాపకాల ఐడియా.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న కష్టాలు, వైకల్యంతో కోల్పోయిన కార్యక్రమాలు, ఆనందకరమైన సందర్భాలు, స్నేహితులతో సరిగ్గా గడపలేని క్షణాలు తనకి గుర్తుకొచ్చాయి. ‘‘ఇటువంటి మధుర, చేదు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఒక దగ్గర రాసుకుని ఏడాది తరువాత చూసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది’ అన్న సురాశ్రీ ఆలోచనకు ప్రతిరూపమే ‘ఇయర్‌బుక్ కాన్వాస్’. స్టార్టప్ మార్వారీ కెటలిస్ట్ ఇన్వెస్ట్ చేయడంతో ఇయర్‌బుక్ కాన్వాస్ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇయర్‌బుక్ కాన్వాస్‌కు మంచి గుర్తింపు రావడంతో ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ ఆసియా పసిఫిక్ యూనివర్సిటి నుంచి ‘అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా’ అవార్డులు సురాశ్రీని వరించాయి. టెడెక్స్, యూనెస్కో, యుపెన్ వంటి అంతర్జాతీయ వేదికలపై మోటివేషనల్ స్పీకర్‌గాకూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘నేను ఎప్పుడూ జ్ఞాపకాలు రాసుకోవడానికి బుక్ కొనుక్కోలేదు. నాకు ఎవ్వరూ సలహా కూడా ఇవ్వలేదు. అప్పుడు నేను బుక్ కొనకపోవడం వల్లే ఈరోజు ఇయర్ బుక్‌ను తీసుకు రాగలిగాను. భారతదేశంలో నంబర్ వ¯Œ ఇయర్ బుక్ కంపెనీగానేగాక, ఆసియాలో మొబైల్ అప్లికేషన్ కలిగిన ఏకైక బుక్ కంపెనీ గా నిలవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ‘కార్పొరేట్ మెమరీ బుక్’ను తీసుకొచ్చాం. గతకాలపు జ్ఞాపకాలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇయర్‌బుక్, కార్పొరేట్ మెమరీ బుక్‌లు తీసుకొచ్చాము. త్వరలోనే వైకల్యం గలిగిన పిల్లల కోసం ‘ఫ్యూచర్ ఎంట్రప్రెన్యూర్ బుక్’ తీసుకొస్తున్నాం’’అని సురాశ్రీ చెప్పింది. -
రహానేకు జరిమానా
ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో కెప్టెన్‌కు శిక్ష పడింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఓవర్‌రేట్ బాధితుడైన రెండో కెప్టెన్ రహానే. శనివారం కింగ్స్ ఎలెవన్ మ్యాచ్‌లో కూడా ఆలస్యం చేసినందుకు ముంబై సారథి రోహిత్ శర్మకు కూడా రూ. 12 లక్షల జరిమానా పడింది. -
రాజసం తిరిగొచ్చేనా..!
ఐపీఎల్‌లోని ఎనిమిది జట్లలో ప్రతిభకు కొదవ లేకున్నా ‘స్టార్ అట్రాక్షన్’ తక్కువగా కనిపించే జట్టు రాజస్తాన్ రాయల్స్. భీకరమైన ఆటతో ఒకరితో మరొకరు పోటీపడుతూ రికార్డులు కొల్లగొట్టే ఆటగాళ్లు లేకపోయినా ప్రశాంతంగా ఫలితాలు రాబడుతూ వెళ్లిపోయింది. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత రెండేళ్ల నిషేధానికి గురై గత ఏడాది పునరాగమనం చేసిన ఆ జట్టు స్మిత్‌లాంటి ఆటగాడూ దూరమైనా సరే... ఎలాంటి ఒత్తిడి దరి చేరనీయకుండా ప్లేఆఫ్స్ చేరుకోవడం దీనికి ఉదాహరణ. మొదటి నుంచి రాయల్స్‌తోనే కొనసాగుతున్న కొందరితో పాటు కొత్తగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువ ఆటగాళ్లతో ఈ సారి రాజస్తాన్ ఎలాంటి సవాల్ విసురుతుందో చూడాలి. బలాలు: బట్లర్, స్టోక్స్ రూపంలో ఇద్దరు విధ్వంసకర విదేశీ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. వీరికి ఇప్పుడు ఆసీస్ సంచలనం టర్నర్ కూడా జత కలిశాడు. ఇక తిరిగొస్తున్న స్టీవ్ స్మిత్ బ్యాటింగ్, అనుభవం, వ్యూహ నైపుణ్యం కూడా జట్టుకు అదనపు బలం కానున్నాయి. ఒషాన్ థామస్, లివింగ్‌స్టోన్ రూపంలో మరో ఇద్దరు ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్, జోఫ్రా ఆర్చర్‌లాంటి బౌలర్ ఉన్నా... నలుగురు ఆటగాళ్ల పరిమితి నేపథ్యంలో వీరిలో ఎవరికి ఎన్ని అవకాశాలు లభిస్తాయనేది ఆసక్తికరం. భారత ఆటగాళ్లలో కెప్టెన్ రహానే, శామ్సన్, మనన్ వోహ్రాలపై జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు వరల్డ్ కప్ సన్నాహకాల నేపథ్యంలో ముందుగానే వెళ్లిపోయే అవకాశం ఉండటంతో ఆరంభ మ్యాచ్‌లలో వారిని సమర్థంగా వినియోగించుకుంటే తగినన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో మళ్లీ మన ఆటగాళ్లే జట్టును నడిపించాల్సి ఉంటుంది. లోయర్ ఆర్డర్లో కృష్ణప్ప గౌతమ్ దూకుడుగా ఆడగలడు. బౌలింగ్‌లో ఉనాద్కట్, శ్రేయస్ గోపాల్ కీలకం కానున్నారు. అయితే బౌలింగ్ వనరులతో పోలిస్తే బ్యాటింగ్‌పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధార పడుతోంది. బలహీనతలు: భారత్‌కు చెందిన నిఖార్సయిన టి20 హిట్టర్ ఒక్కరు కూడా జట్టులో లేకపోవడం పెద్ద లోటు. టోర్నీలో మున్ముందు అదే సమస్యగా కనిపించవచ్చు. రహానేలో టెక్నిక్కు సమస్య లేకున్నా అతని శైలి అందరికీ తెలిసిందే. 2018లో 14 ఇన్నింగ్స్‌లలో కేవలం 370 పరుగులు... అదీ 118.21 స్ట్రయిక్ రేట్‌తో చేశాడంటేనే రహానే ప్రభావం గురించి చెప్పేయవచ్చు! గత ఏడాది బట్లర్ మినహా అంతా విఫలమయ్యారు. వీరిలో చాలా మంది ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఏడాది కాలంగా దాదాపు ఆటకు దూరంగా ఉండి కొద్దిపాటి మ్యాచ్ ప్రాక్టీస్‌తో ఐపీఎల్‌కు వస్తున్న స్మిత్ ఏమాత్రం ఆడతాడనేదానిపై కూడా జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇతర ఆటగాళ్లలో మహిపాల్ లోమ్రోర్, ప్రశాంత్ చోప్రా, రాహుల్ త్రిపాఠి, సుధేశన్ మిథున్, రియాన్ పరాగ్, శుభమ్ రంజనేలాంటి ఆటగాళ్లపై నమ్మకముంచడం కష్టం. బౌలింగ్‌లో భారీ మొత్తానికి తీసుకున్న ఉనాద్కట్ గత ఏడాదే (11 వికెట్లు) తీవ్రంగా నిరాశ పర్చాడు. ఈసారి కూడా అతనే ప్రధాన బౌలర్ కాగా, జోఫ్రా ఆర్చర్ ప్రభావం చూపించగలడు. ఎప్పుడో ప్రభ తగ్గిపోయిన వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణిలకు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇది ఒక రకంగా ప్రతికూలమే. జట్టు వివరాలు: రహానే (కెప్టెన్), సంజు శామ్సన్, రంజనే, బిన్నీ, శ్రేయస్ గోపాల్, మిథున్, ఉనాద్కట్, ప్రశాంత్ చోప్రా, మహిపాల్, రియాన్ పరాగ్, ధావల్ కులకర్ణి, కె.గౌతమ్, ఆరోన్, శశాంక్ సింగ్, మనన్ వోహ్రా, రాహుల్ త్రిపాఠి, ఆర్యమాన్ బిర్లా (భారత ఆటగాళ్లు), స్టోక్స్, టర్నర్, స్టీవ్ స్మిత్, ఇష్ సోధి, ఒషాన్ థామస్, జోఫ్రా ఆర్చర్, లివింగ్‌స్టోన్, బట్లర్ (విదేశీ ఆటగాళ్లు). ►2008లో తొలిసారి జరిగిన ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. 2016, 2017లో లీగ్‌కు దూరమైన జట్టు గత ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. -
పరుగుల కొండకు... అండ తోడైతేనే!
సునీల్ గావస్కర్ హయాంలో... సచిన్ టెండూల్కర్ శకంలో... విరాట్ కోహ్లి తరంలో... కాలం ఎంత మారినా విదేశీ పర్యటనల్లో టీమిండియాది ఒకటే కథ! పరాజయాల వ్యథ! దీనికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం! జట్టులోని టాప్ బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించినా, మిగతా వారు సహాయ పాత్ర పోషించ లేకపోవడంతో పరాభవాలు పరిపాటి అయిపోయాయి. ఎక్కడిదాకో ఎందుకు? ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనలే దీనికి సరైన నిదర్శనం. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ వంతు వచ్చింది. విజయం మనదేనన్న అంచనాలున్నాయి. అయితే, బలమైన ప్రత్యర్థి బౌలింగ్ బలగాన్ని ఎదుర్కొంటూ... కోహ్లికి సహచరులు శక్తిమేర సహకరిస్తేనే ఇది సాధ్యం. సాక్షి క్రీడా విభాగం : దక్షిణాఫ్రికాలో 1–2తో ఓటమి. ఇంగ్లండ్‌లో 1–4తో పరాజయం. 2018లో టీమిండియా రెండు విదేశీ పర్యటనల్లో ఫలితాలివి. గణాంకాల ప్రకారం మన జట్టు ఈ సిరీస్‌లు కోల్పోయిందనే చెప్పాలి. వాస్తవంలో మాత్రం విరాట్ కోహ్లి మినహా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని విశ్లేషించాలి. సఫారీలపై 72, 135 పరుగుల తేడాతో రెండు టెస్టులను చేజార్చుకోగా, ఇంగ్లండ్‌పై 31, 60, 118 పరుగుల వ్యత్యాసంతో ఏకంగా మూడు టెస్టుల్లో పరాజయం పాలయ్యాం. ఛేదించదగిన లక్ష్యాలతో బరిలో దిగిన ఈ సందర్భాల్లో కెప్టెన్ వీరోచిత ఆటకు ఏ మాత్రం సహకారం అందినా ఫలితం మనవైపే ఉండేది. మళ్లీ మళ్లీ రాని ఇలాంటి సువర్ణావకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే, ప్రస్తుత జట్టు రికార్డుల్లోకి ఎక్కేది. ఈ గతమంతా మర్చిపోయి... రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ‘పేరు గొప్ప’ లైనప్ సమష్టిగా రాణిస్తేనే సిరీస్ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితేమిటో చూద్దాం! ఆరంభం అదిరితేనే... సంప్రదాయ క్రికెట్లో శుభారంభాలే మ్యాచ్ గతిని నిర్దేశిస్తాయి. కానీ, కొంతకాలంగా టీమిండియా ఓపెనర్ల విషయంలోనే ఎక్కువ సమస్య ఎదుర్కొంటున్నది. ధావన్‌తో పాటు మురళీ విజయ్, లోకేశ్ రాహుల్‌లకు పదేపదే అవకాశాలు వచ్చినా జట్టు ఆశించినదైతే ఇవ్వలేకపోయారు. వీరిలో తన ఫామ్ కంటే... రాహుల్ నిలకడ లేమి, అనుభవం రీత్యా విజయ్ ఆసీస్ పర్యటనకు అనూహ్యంగా ఎంపికయ్యాడు. అయితే, అతడు మునుపటిలా సాధికారికంగా లేడు. యువ పృథ్వీ షా గాయపడకుంటే తుది జట్టులో చోటు కష్టమే అయ్యేది. ఏదేమైనా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో వైఫల్యాల తర్వాత అంతా మర్చిపోతున్న సమయంలో దక్కిన ఈ చాన్స్ విజయ్‌కు ఒక రకంగా రెండో ఇన్నింగ్సే. ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకంతో ఫర్వాలేదనిపించిన అతడు... కెరీర్‌ను రెండు, మూడేళ్లు పొడిగించుకోవాలంటే ఆస్ట్రేలియాలో ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. లేదంటే, ఇంతటితో తన ఇన్నింగ్స్ ముగిసినట్లే. ఇక, చక్కటి స్ట్రోక్ ప్లే, డిఫెన్స్, దూకుడు అన్నీ ఉన్నా రాహుల్‌ది మరో కథ. ఒక మ్యాచ్‌లో శతకం చేస్తే మరో మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే ఔటవుతుంటాడు. మూడు ఫార్మాట్లలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువగా మారనిది టెస్టుల్లోనే అయినా, ప్రతిభకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌పై చివరి టెస్టులో భారీ శతకం తర్వాత, లోపలకు దూసుకొచ్చే బంతులకు వికెట్ ఇచ్చేసే బలహీనతతో సొంతగడ్డపై వెస్టిండీస్ సిరీస్‌లో విఫలమయ్యాడు. కంగారూ బౌలర్లను ఎదుర్కొనాలంటే ఈ లోపాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వయసు, ఫామ్ పరంగా 35 ఏళ్ల విజయ్‌కు..., నిలకడ లేమి, టెక్నిక్ లోపాల కారణంగా రాహుల్‌కు ఆసీస్ సిరీస్ కఠిన పరీక్ష. ఓ విధంగా ఆఖరి అవకాశం. ఈసారి రాణించకుంటే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లకు తమ స్థానాలను అప్పగించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. కెప్టెన్‌కు అటు ఇటు... ద్రవిడ్ తర్వాత ది వాల్‌గా గుర్తింపు పొందిన పుజారా కొన్నాళ్లుగా ఆ స్థాయిలో గోడ కట్టలేకపోతున్నాడు. క్రీజులో గంటలకొద్దీ పాతుకుపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షించే ఒకప్పటి పుజారా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. అతడు పూర్తి సామర్థ్యం మేర రాణించి ఉంటే గత రెండు విదేశీ పర్యటనల్లో భారత్ కొంత మెరుగైన ఫలితాలు సాధించేది. టెక్నిక్ లోపం కొంత, దృక్పథం లోపం కొంత కలగలిసి అతడిని వెనక్కు లాగుతున్నాయి. మెడపై నిత్యం వేటు కత్తి వేలాడుతున్న పరిస్థితుల్లో తక్కువ స్ట్రయిక్ రేట్ వంటి అంశాలను సాకుగా చూపి తొలగించకుండా ఉండాలంటే కంగారూల పర్యటనలో పుజారా భారీ ఇన్నింగ్స్‌లు ఆడక తప్పదు. మరోవైపు ఆడినా, ఆడకున్నా వైస్ కెప్టెన్ హోదా పొందుతూ వస్తోన్న అజింక్య రహానేది చిత్రమైన సమస్య. జట్టులో తానొకడు ఉన్నాడన్న సంగతే గుర్తురానంతగా ఉంది అతడి బ్యాటింగ్ పాటవం. ఇంగ్లండ్‌లో రహానే ఆట మరీ సాధారణం. ఈ నేపథ్యంలో వీరికి ముందున్నది ముళ్లబాటే. ముఖ్యంగా హనుమ విహారి రూపంలో తక్షణ ప్రత్యామ్నాయం ఉన్న నేపథ్యంలో రహానే ఉనికిని బలంగా చాటుకోక తప్పదు. కోహ్లికి అటు ఇటు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చే వీరు రాణిస్తే భారత్‌కు పెద్ద బెంగ తీరుతుంది. ఊరట... ఊరింపు! టెస్టులపై ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో... పరిమిత ఓవర్ల ఫామ్‌తో ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు రోహిత్ శర్మ. ఇంతకాలం ఆరో స్థానంలో తప్ప తనను మరోచోట ఆడించే ఆలోచన చేయలేదు. అయితే, జట్టు అవసరాలను గుర్తించిన రోహిత్ ఓపెనింగ్‌కైనా సిద్ధమన్నాడు. అందుకు తగ్గట్లే పృథ్వీ గాయంతో ఓ దశలో అతడి పేరు ఓపెనింగ్‌కు ప్రస్తావనకొచ్చింది. ఇదే సిరీస్‌లో ఇందుకు ఉన్న అవకాశాలను పూర్తిగా కొట్టి పారేయలేం కూడా. ఇప్పటికైతే రోహిత్ ఆరో స్థానానికే పోటీదారు. తుది జట్టులో చోటు లేకున్నా, అసలు టెస్టు జట్టులోనైతే ఉన్నానన్న సంతృప్తితో రోహిత్ ఊరట పొందొచ్చు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆఖరి టెస్టులో అవకాశంతో సత్తా చాటిన విహారి... ఆస్ట్రే లియా పర్యటనపై ఆశావహంగా ఉండొచ్చు. ఆఫ్ స్పిన్‌తో వికెట్లు పడగొట్టగల నైపుణ్యం ఉన్నందున విహారి సేవలను కోహ్లి ఏ క్షణమైనా ఉపయోగించుకునే ఆలోచన చేయొచ్చు. అయితే, ఆరుగురు బ్యాట్స్‌మెన్ వ్యూహంతో బరిలో దిగితేనే రోహిత్, విహారిలలో ఎవరికైనా అవకాశం ఉంటుంది. టెస్టు సిరీస్ షెడ్యూల్ తొలి టెస్టు (అడిలైడ్) డిసెంబర్ 6–10 రెండో టెస్టు ( పెర్త్) డిసెంబర్ 14–18 మూడో టెస్టు (మెల్బోర్న్) డిసెంబర్ 26–30 నాలుగో టెస్టు (సిడ్నీ) జనవరి 3–7 -
రహానే, ఇషాన్ కిషన్ సెంచరీలు
న్యూఢిల్లీ: ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ను విజయం వరించింది. కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగారు. ఫలితంగా దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ‘సి’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశారు. అనంతరం ఇషాన్ ఔటైనా... శుబ్‌మన్ గిల్ (26), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్స్‌లు)ల సాయంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రహానే జట్టుకు భారీ స్కోరు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్ 3, దీపక్ చహర్, మయాంక్ మార్కండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ ‘బి’ జట్టు 46.1 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ‘బి’ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (14) త్వరగానే ఔటైనా... కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం రుతురాజ్, హనుమ విహారి (8), మనోజ్ తివారి (4) వెంట వెంటనే ఔటయ్యారు. ఆ సమయంలో అంకుశ్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి శ్రేయస్ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. 60 బంతుల్లో 70 పరుగులు చేయాల్సిన దశలో అయ్యర్ క్రీజులో ఉండటంతో గెలుపు సునాయాసమే అనిపించినా... 43వ ఓవర్ చివరి బంతికి అయ్యర్ ఏడో వికెట్‌గా వెనుదిరగడంతో భారత్ ‘బి’ ఓటమి ఖాయమైంది. ‘సి’ జట్టు బౌలర్లలో పప్పు రాయ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
నేటి నుంచే దేవధర్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఉనికి చాటేందుకు అటు సీనియర్లకు, సత్తా నిరూపించుకునేందుకు ఇటు కుర్రాళ్లకు మరో అవకాశం. ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచే దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ. టీమిండియా వన్డే జట్టులోకి పునరాగమనం ఆశిస్తున్న అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్‌లకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. దీంతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ‘ఎ’కు ఎంపికయ్యేందుకు కుర్రాళ్లకూ ఓ వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో భారత్ ‘బి’ తలపడుతుంది. ఈ టోర్నీలో భాగంగా ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఫైనల్ 27న జరుగుతుంది. అశ్విన్, పృథ్వీ షా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్‌లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టుకు దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని ‘బి’ జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రోహిత్ రాయుడు, దీపక్ చహర్‌లకు స్థానం దక్కింది. రహానే కెప్టెన్‌గా ఉన్న ‘సి’ జట్టులో సురేశ్ రైనా, అభినవ్ ముకుంద్, శుబ్‌మన్ గిల్, ఆర్. సమర్థ్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు. -
‘విజయ్ హజారే’ విజేత ముంబై
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించి అజేయంగా నిలిచిన ముంబై జట్టు 12 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెల్చుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. పేసర్లు ధవల్ కులకర్ణి (3/30), శివమ్ దూబే (3/29) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 45.4 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో కీలక బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(8), అజింక్య రహానే(10), శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమైనా... ఆదిత్య తరే అద్భుత అర్ధశతకంతో (89 బంతుల్లో 71; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ముంబై 35 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. ఓవరాల్‌గా విజయ్ హజారే ట్రోఫీని ముంబై దక్కించుకోవడం ఇది పదోసారి. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆదిత్య తరేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. -
‘ఓపెనింగ్’ మార్పుకు సమయం
టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయి... కొత్త బంతి దాడిని కాచుకుంటూ... వీలునుబట్టి బౌలర్ల లయను దెబ్బతీస్తూ... ఒకవిధంగా మిడిలార్డర్లోని మేటి బ్యాట్స్‌మెన్‌కు రక్షణ కవచంగా నిలిచేది ఓపెనింగ్ జోడి! ప్రత్యర్థిపై ఆదిలోనే ఆధిపత్యం చూపుతూ, జట్టు మానసికంగా పైచేయి సాధించడంలో వీరిదే ప్రధాన పాత్ర. అయితే మిగతా జట్లలో ఒకరు విఫలమైతే మరొకరు నిలదొక్కుకుంటూ కొంతలో కొంత నయం అనిపిస్తున్నారు. కానీ, టీమిండియా విషయంలో మాత్రం ‘ముగ్గురు’ ఓపెనర్లూ మూకుమ్మడిగా చేతులెత్తేస్తున్నారు. ఏ ఇద్దరిని ఆడించినా, ఆటగాడి మార్పు తప్ప ఆటతీరు మారడం లేదు. సాక్షి క్రీడా విభాగం ఓపెనర్లకు ఉండాల్సిన కనీస లక్షణాలు భారత ఆరంభ జోడీలో లోపించాయి. దీంతో కీలక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చాలా ముందుగానే క్రీజులోకి రావాల్సి వస్తోంది. బర్మింగ్‌హామ్, లార్డ్స్ టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి 25 ఓవర్లలోపే బ్యాటింగ్‌కు దిగాడు. కొత్త బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్‌లో, వందల కొద్దీ ఓవర్లు ఆడాల్సిన ఐదు రోజుల మ్యాచ్‌కు ఇది ఎంతమాత్రం సరైన తీరు కాదు. కోహ్లి, పుజారా, రహానే విఫలమైతే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించే వారే లేకుండా పోతారు. ఇక్కడే(నా) పోటాపోటీ... మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్... స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే వీరిలో ఎవరిని తప్పించి, ఎవరిని ఆడించాలి అనేది టీమిండియాకు పెద్ద తలనొప్పి. అదే విదేశాలకు వచ్చేసరికి మాత్రం ఒకరివెంట ఒకరి వైఫల్యంతో అసలు ఎవరిని ఆడించాలో తెలియని డైలమా. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో, ప్రస్తుత ఇంగ్లండ్ టూర్లో ఇదే విషయం మళ్లీమళ్లీ స్పష్టమైంది. అయినా శుభారంభం మాత్రం కలే అవుతోంది. విజయ్–ధావన్ ద్వయం తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుదురుగానే కనిపించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఆ ప్రదర్శన మరుగునపడింది. ఇక రాహుల్‌ది మరో తరహా కథ. భారత్‌లో భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతూ, విదేశాల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఆడిన నాలుగు టెస్టుల్లో అతడు కనీసం అర్ధ శతకమైనా చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. విజయ్‌కి ఏమైంది టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్ ఓపెనర్ మురళీ విజయ్. వాస్తవంగా చూస్తే ఇటీవల ఎక్కువగా నిరాశపరుస్తోంది అతడే. కానీ, డిఫెన్స్‌తో పాటు విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం విజయ్ను కాపాడుతోంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్... సఫారీ టూర్లో ఆకట్టుకోలే కపోయాడు. అయినప్పటికీ తనపై భరోసా ఉంచారు. బౌలర్ల వలలో పడకుండా వారి సహనాన్ని పరీక్షించే విజయ్ ఇటీవల దానికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఫుట్‌వర్క్ కూడా మునుపటిలా లేకపోవడంతో వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితుల నుంచి విజయ్ తొందరగా బయటపడాల్సిన అవసరం ఉంది. లేదంటే... తననూ పక్కనపెట్టక తప్పదు. యువతరం తలుపు తడుతోంది... విజయ్ వయసు 34. ధావన్‌కు 32 దాటుతున్నాయి. వీరిద్దరిపై మరెంతో కాలం ఆధారపడలేం. ఇప్పటికే కొత్తవారిని పరీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా తెరపైకి వస్తున్నారు. ఇటీవల జంటగా రాణిస్తున్నారు. వీరితోపాటు ప్రియాంక్ పాంచల్, ఫైజ్ ఫజల్, ఆర్.సమర్ధ్లు సైతం పరిశీలించదగినవారే. మరోవైపు దశాబ్ద కాలంలో భారత్ తరఫున టెస్టు ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే. వీరిలో అభినవ్ ముకుంద్ ఒక్కడే ప్రస్తుత జట్టులో లేడు. ధావన్, విజయ్... తర్వాత రాహుల్ ఆశలు రేకెత్తించడంతో మరొకరి గురించి ఆలోచన రాలేదు. ఇప్పుడు మాత్రం కొత్తవారిని పరీక్షించక తప్పదనేలా ఉంది. అందులోనూ ఎడమచేతి వాటం ఓపెనర్ అయితే మరీ ఉపయోగం. కానీ, దేశవాళీల్లో ఫైజ్ ఫజల్ మినహా మరో నాణ్యమైన ఆటగాడు కనిపించడం లేదు. అయితే, అతడికి 33 ఏళ్లు. ఈ కోణంలో చూస్తే 28 ఏళ్ల ముకుంద్‌కు అవకాశాలివ్వొచ్చు. నేను రెడీ: రోహిత్ ముంబై: సంప్రదాయ ఫార్మాట్లోనూ ఓపెనింగ్‌కు సిద్ధం అంటున్నాడు వన్డే, టి20ల ఓపెనర్ రోహిత్‌శర్మ. టెస్టుల్లో విజయ్, ధావన్, రాహుల్‌ల వరుస వైఫల్యాలతో టీమిండియా సతమతం అవుతున్న వేళ తననూ పరీక్షించి చూడాలన్నట్లుగా మాట్లాడాడు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్... ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ కోరితే మాత్రం అందుకు సిద్ధం. దేశం తరఫున వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తానని ఎప్పు డూ ఊహించలేదు. అయినా అది అలా జరిగిపోయింది. టెస్టుల్లోనూ అవకాశం వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఆడాలనేది తన కోరికని... అయినా అది తన చేతుల్లో లేదని రోహిత్ వివరించాడు. -
‘రహానే తప్పుకుంటే మంచిది’
బెంగళూరు : అఫ్గానిస్తాన్‌తో జరిగిన చారిత్రక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌డౌన్‌లో చతేశ్వర పుజారా బదులు కేఎల్ రాహుల్‌ను పంపడంపై టీమిండియా మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ తప్పుబట్టారు. టెస్టుల్లో మూడు, నాలుగు బ్యాటింగ్ స్థానాలు ఎంతో కీలకమైనవని, వాటిపై ఎప్పుడూ ప్రయోగాలు చేయకూడదని సూచించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని టెస్టు సిరీస్‌లలోనూ మూడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా పుజారా అద్భుతంగా రాణిస్తున్నాడని, జులైలో కీలక ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం టీమిండియాకు మంచిది కాదన్నారు. అఫ్గాన్ టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడి ఉంటే పుజారాను మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపించే వారు కదా అని ప్రశ్నించారు. ఇక పరుగుల చేయడానికి ఆపసోపాలు పడుతున్న అజింక్యా రహానే తప్పుకొని రాహుల్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. కేఎల్ రాహుల్ ఆటలో ఎంతో పరిణితి చెందాడని, అతనికి వరసగా అవకాశాలు కల్పిస్తే ఇంకాస్త మెరుగ్గా రాణిస్తాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. -
భారత వాకిట్లో అఫ్గాన్ చరిత్ర
అంకెల పరంగా చూస్తే క్రికెట్ చరిత్రలో ఇది 2307వ టెస్టు మ్యాచ్ మాత్రమే. పోలికను బట్టి చూస్తే ఇరు జట్ల మధ్య భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంది. కానీ ఇది ఒకానొక టెస్టు మ్యాచ్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఈ పోరులో గెలుపు మాత్రమే తుది లక్ష్యం కాదు. ఈ తరంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచే పోరాట కథలు ఈ రోజు ఆట వెనుక దాగి ఉన్నాయి. కోట్లాది ప్రజల భావోద్వేగాలు దీంతో ముడిపడి ఉన్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం స్వదేశంలో శతఘ్నుల సవాళ్ల నుంచి బయటకు వచ్చి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫైవ్‌లో విజేతగా నిలిచిన రోజు ప్రపంచ క్రికెట్ చూపు అఫ్గానిస్తాన్‌పై పడింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలతో దూసుకొచ్చిన ఆ జట్టు ఇప్పుడు టెస్టు టీమ్‌గా తొలిసారి బరిలోకి దిగనుంది. తమ ఆట స్థాయిని పెంచడంలో అన్ని విధాలా అండగా నిలిచిన భారత్‌తోనే ఆ జట్టు మొదటి పోరులో తమ సత్తాను పరీక్షించుకోబోతోంది. సొంతగడ్డపై ఆడుతున్న నంబర్‌వన్ టెస్టు టీమ్ భారత్ అన్ని విధాలా దుర్బేధ్యంగా ఉంది. అలాంటి జట్టును ఐదు రోజుల ఆటలో ఎదుర్కోవడం తొలి టెస్టు ఆడుతున్న అఫ్గానిస్తాన్‌కు అతి పెద్ద పరీక్ష. టి20ల్లో, వన్డేల్లో అప్పుడప్పుడు సంచలనాలు సాధించినా, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కనీస అనుభవం కూడా లేని ఆటగాళ్లతో ఆ జట్టు ఏమాత్రం నిలబడుతుందో చూడాలి. బెంగళూరు: ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపిన టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో నేటి నుంచి జరిగే ఏకైక టెస్టులో భారత్‌తో అఫ్గానిస్తాన్ తలపడుతుంది. ఐసీసీ ఇటీవల టెస్టు హోదా ఇచ్చిన రెండు దేశాల్లో ఐర్లాండ్ కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్‌తో తలపడగా... 12వ జట్టుగా ఇప్పుడు అఫ్గాన్ వంతు వచ్చింది. బలాబలాలపరంగా భారత్ అందనంత ఎత్తులో ఉండగా, అఫ్గాన్ టెస్టు స్థాయి అంచనా వేసేందుకు ఈ మ్యాచ్ అవకాశం కల్పించనుంది. కోహ్లి దూరం కావడంతో అజింక్య రహానే టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. నాయర్‌కు చాన్స్... ముగ్గురు ప్రధాన ఓపెనర్లు ధావన్, విజయ్, రాహుల్ అందుబాటులో ఉండగా ఇద్దరిని ఎంచుకోవడంలో ఇటీవల భారత్‌కు పెద్దగా సమస్య ఎదురు కాలేదు. ఒకరు గాయపడటమో లేదా మరో కారణం వల్లో ఇది సాగిపోయింది. ఇప్పుడు ముగ్గురు పోటీలో నిలిచారు. అయితే మంగళవారం సాయంత్రం ప్రాక్టీస్ సెషన్ సమయంలో ధావన్ ఫిజియోలతో సుదీర్ఘంగా చర్చించడం చూస్తే ఫిట్నెస్ సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే విజయ్, రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన రాహుల్, అంతకుముందు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో మాత్రం విఫలమయ్యాడు. అయితే సొంతగడ్డపై అతనికి ఈసారి ఇబ్బంది ఉండకపోవచ్చు. మరో లోకల్ ప్లేయర్ కరుణ్ నాయర్ కూడా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కోహ్లి గైర్హాజరులో మిడిలార్డర్లో నాయర్‌కు చోటు లభిస్తుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత దినేశ్ కార్తీక్ టెస్టు బరిలోకి దిగబోతుండగా... హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాల్సి ఉంది. భువనేశ్వర్, బుమ్రా టెస్టుకు దూరం కాగా, తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఇద్దరు పేసర్లుగా ఉమేశ్, ఇషాంత్ ఉంటారు కాబట్టి నవ్‌దీప్ సైనికి అరంగేట్రం కష్టమే. సొంతగడ్డపై అశ్విన్, జడేజాల రికార్డు చూస్తే భారత్ మూడో స్పిన్నర్ ఆలోచన చేయకపోవచ్చు. నిలబడతారా... టి20ల్లో 4 ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసినంత సులువు కాదు టెస్టు క్రికెట్లో సుదీర్ఘ సమయం పాటు అంతే క్రమశిక్షణతో, పట్టుదలతో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం! సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఇప్పుడు అలాంటి పరీక్షే ఎదురవుతుంది. అత్యంత పటిష్టమైన భారత బ్యాటింగ్‌ను రషీద్ తన లెగ్‌స్పిన్‌తో నిరోధిస్తాడని అఫ్గాన్ ఆశ పడుతోంది. 4 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉన్న రషీద్, ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడని ఆఫ్ స్పిన్నర్ ముజీబ్, మరో స్పిన్నర్ ఆమిర్ హమ్జాలతో అఫ్గాన్ బౌలింగ్‌లో వైవిధ్యం మాత్రం ఉంది. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ నబీ ఉన్నాడు. అయితే ఆ జట్టు ప్రధాన బలహీనత బ్యాటింగ్. ఇటీవల టెస్టుల్లో పెద్ద పెద్ద జట్లే సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేయలేక కూలిపోతుండగా... ఈ టీమ్ ఎంత సేపు పట్టుదలగా నిలబడుతుందనేదే కీలకం. తుది జట్లు (అంచనా) భారత్: రహానే (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, నాయర్, కార్తీక్, పాండ్యా, అశ్విన్, జడేజా, ఇషాంత్, ఉమేశ్. అఫ్గానిస్తాన్: అస్గర్ స్తానిక్‌జై (కెప్టెన్), షహజాద్, జావేద్ అహ్మదీ, రహ్మత్ షా, నాసిర్ జమాల్, నబీ, అఫ్సర్ జజై, రషీద్ ఖాన్, ఆమిర్ హమ్జా, యమిన్ అహ్మద్‌జై, ముజీబ్. -
అజింక్య రహానేకు రూ. 12 లక్షల జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేపై భారీ జరిమానా పడింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దాంతో రహానేపై మ్యాచ్ రిఫరీ రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఓ జట్టు కెప్టెన్‌పై జరిమానా పడటం ఇది రెండో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత నెలలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు కోహ్లిపై కూడా రూ. 12 లక్షల జరిమానా పడింది. -
సారథిగా అజింక్య రహానే!
బెంగళూరు: కొన్నాళ్లుగా చక్కగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం. వచ్చే నెల 14 నుంచి అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరగనున్న చారిత్రక టెస్టుకు అతడు భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి జూన్ నెల మొత్తం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడనుండటంతో అతని స్థానంలో శ్రేయస్‌కు చోటు దాదాపు ఖాయమైంది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్టర్లు మంగళవారం బెంగళూరులో జట్టును ఎంపిక చేయనున్నారు. తుది జట్టులో స్థానం దక్కితే శ్రేయస్‌కు ఇదే తొలి టెస్టు అవుతుంది. ఇప్పటివరకు 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన అతడు... 53.90 సగటుతో 3,989 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు. రహానే గతేడాది ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులోనూ కెప్టెన్‌గా చేశాడు. మరోవైపు ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ సహా మిగతా రెగ్యులర్ ఆటగాళ్లంతా అఫ్గాన్‌తో టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ మ్యాచ్‌తోనే అఫ్గాన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనుండటం విశేషం. రాయుడొస్తున్నాడు! కౌంటీల కారణంగా విరాట్ ఐర్లాండ్‌తో రెండు టి20ల సిరీస్‌కూ దూరంగా ఉండనున్నాడు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపడతాడు. నిదహాస్ ట్రోఫీ గెలిచిన జట్టునే దాదాపుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నా, ఈ ఐపీఎల్లో అదరగొడుతున్న హైదరా బాద్ సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పేరు కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. ‘ఎ’ జట్టులో పృథ్వీ, శుబ్‌మన్, మావి యువ సంచలనాలు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, శివం మావి ఇంగ్లండ్‌లో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక కానున్నారు. ఈ సిరీస్‌లో మూడో జట్టుగా వెస్టిండీస్ ‘ఎ’ బరిలో దిగనుంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడు. పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు జులై 16–19 మధ్య ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు)తో నాలుగు రోజుల టెస్టు ఆడనుంది. -
సరైన ఆరంభమే సునీల్ గావస్కర్
చెన్నై సూపర్ కింగ్స్ పునరాగమనం చిరస్మరణీయం. కఠిన పరిస్థితుల్లోనూ అద్భుతంగా ఆడగల బ్రేవో వంటి అనుభవజ్ఞులతో కూడిన ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఓటమి అంచుల నుంచి సూపర్ కింగ్స్ సాధించిన విజయంతో ఐపీఎల్–11వ సీజన్‌కు సరైన ఆరంభం లభించినట్లయింది. జట్టులో ఆల్‌రౌండర్లు ఉండటం ఎంతటి సౌలభ్యమో బ్రేవో అసాధారణ ఇన్నింగ్స్ చెబుతోంది. అంతకుముందు బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరు 180కి చేరకుండా నిలువరించాడు. చివరి ఓవర్లలో అతడి నెమ్మదైన బంతులు, వేగవంతమైన యార్కర్లను ముంబై బ్యాట్స్‌మెన్ భారీ షాట్లుగా మలచలేకపోయారు. ఛేదనలో 16వ ఓవర్ ముగిసేసరికి చెన్నై దాదాపు 11 రన్‌రేట్‌తో పరుగులు సాధించాల్సి ఉంది. ఈ దశలో బ్రేవో భారీ హిట్టింగ్తో ఫలితాన్ని మార్చేశాడు. లీగ్‌లో పునరాగమనం చేస్తున్న మరో జట్టు రాజస్తాన్ రాయల్స్ కూడా చెన్నైను చూసి స్ఫూర్తి పొందుతుందనడంలో సందేహం లేదు. స్టీవ్ స్మిత్ దూరమైనా... వార్న్ వంటి వారు మెంటార్‌గా ఉండటంతో జట్టు సమతూకంతో కనిపిస్తోంది. రహానే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలడు. సిక్స్‌లు కొట్టలేకపోయినా బౌండరీలతో పరుగులు రాబట్టగలడు. వార్నర్ లేకపోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. బ్యాటింగ్‌లో అతడే జట్టు మూలస్తంభం. తన కెప్టెన్సీ కూడా అద్భుతం. అతడి స్థానంలో వస్తున్న విలియమ్సన్ ఈ సీజన్లో తమ దేశం తరఫున బాగా ఆడాడు. కెప్టెన్‌గా అతడు బాగా ఎదిగాడు. భావాలను బహిరంగంగా ప్రదర్శించే అతడు... పరిస్థితులను అంతే చక్కగా అర్థం చేసుకుంటాడు. గొప్ప బ్యాట్స్‌మన్, గొప్ప బౌలర్ మధ్య జరిగినట్లే కెప్టెన్ల మధ్య కూడా పోరాటం ఉంటుంది. ఏదేమైనా... ఈ ఏడాది ఏ కెప్టెనైతే మ్యాచ్‌ను మలుపుతిప్పగల వ్యూహాలు పన్నుతాడో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. -
అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాం: రహానే
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ సారథిగా తనను నియమించడంతో ఎంతో ఉత్కంఠకు, ఉద్వేగానికి లోనయ్యానని భారత క్రికెటర్ అజింక్య రహానే అన్నాడు. మంగళవారం అతడు ఇక్కడ మీడియాకు ప్రకటన విడుదల చేశాడు. ‘ఈ జట్టును ఓ కుటుంబంలా భావిస్తా. నాపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం. రాబోయే సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం. మా వెనుక నిలిచిన అభిమానులకు కూడా కృతజ్ఞతలు. వారి మద్దతు ఇకపైనా కొనసాగాలని కోరుకుంటున్నా’ అని రహానే పేర్కొన్నాడు. -
బ్యాట్స్‌మెన్ బాగా ఆడాలి
ఇప్పుడిక మూడో టెస్టు వంతు. వాండరర్స్ దక్షిణాఫ్రికాలోనే వేగవంతమైన, బౌన్స్ అధికంగా ఉండే పిచ్. విదేశీ జట్లకు ప్రేక్షకుల నుంచి కనీస మద్దతు కూడా లభించదు. గత మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ స్ఫూర్తితోనైనా భారత బ్యాటింగ్ బల పడాలి. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్స్‌మెన్ బాధ్యతగా ఆడి భారీగా పరుగులు సాధించాలి. ఈ సిరీస్‌లో అయిదుగురు బ్యాట్స్‌మెన్ సిద్ధాంతం నడవదని తేలిపోయింది. ఆతిథ్య జట్టు తమ ఏకైక స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను తప్పించి అయిదుగురు పేసర్లను ఆడించే యోచన చేస్తే... భారత్ కూడా అశ్విన్‌ను పక్కన పెట్టాలి. అప్పుడు హార్దిక్ సహా అయిదుగురు పేసర్లు తుది జట్టులో ఉంటారు. కష్టమే అయినా... రహానేను తీసుకుని కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించాలి. సెంచూరియన్‌లో మాదిరిగా ఇక్కడా టర్న్ కనిపిస్తే అది కొంతైనా ప్రభావం చూపుతుంది. నైపుణ్యానికి కొదవలేని ఈ జట్టు దేశం కోసం ఆడుతున్న సందర్భంలో మైదానంలో దానిని పూర్తిగా ప్రదర్శించింది. ఫీల్డింగ్ ప్రమాణాలు ఏమంత బాగోలేకున్నా బౌలర్లు విశేషంగా రాణించి అవకాశాలు కల్పించారు. రెండు టెస్టుల్లోనూ ప్రొటీస్ చివరి వరుస బ్యాట్స్‌మెన్ జోడించిన పరుగులు అంతిమంగా తేడా చూపించాయి. ఏదేమైనా పరువు దక్కించుకునేందుకు భారత్‌కు ఇది చివరి అవకాశం. -
అశ్విన్, జడేజా శైలి మార్చుకోవాలి: రహానే
న్యూఢిల్లీ: సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలిద్దరు దక్షిణాఫ్రికా పిచ్‌లకు అనుగుణంగా తమ బౌలింగ్ శైలి మార్చుకోవాలని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానే సూచించాడు. జాతీయ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ వాళ్లిద్దరు విజయవంతం కావాలి. భారత పిచ్‌లపై ఎలా బౌలింగ్ వేయాలో వాళ్లకు బాగా తెలుసు. అలాగే విదేశీ పిచ్‌లపై కూడా తెలుసుకోవాలి. మొయిన్ అలీ (ఇంగ్లండ్), లయన్ (ఆసీస్) దేశం మారితే వాళ్ల శైలి మార్చుకుంటారు. భిన్నమైన శైలితో ఫలితాలు రాబడతారు’ అని అన్నాడు. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవి శాస్త్రిలు జట్టులోని ఆటగాళ్లందరికీ మద్దతుగా ఉంటారని, బాగా రాణించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చాడు. -
నంబర్‌వన్‌గా కొనసాగడమే లక్ష్యం
కోల్‌కతా: భారత జట్టుకు సంబంధించి ప్రతీ సిరీస్‌కు ప్రాధాన్యత ఉందని, అన్ని మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతామని జట్టు వైస్‌కెప్టెన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. ఇటీవల శ్రీలంకను తాము చిత్తుగా ఓడించినా... తాజా పోరులో ఆ జట్టును తేలిగ్గా తీసుకోబోమని రహానే తేల్చి చెప్పాడు. ‘శ్రీలంక గడ్డపై సాధించిన ఘన విజయం ముగిసిన కథ. ఇప్పుడు ఆడబోయే సిరీస్ పూర్తిగా కొత్తది కాబట్టి దానితో పోలిక అనవసరం. ప్రస్తుతం టెస్టుల్లో మా నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాం. కాబట్టి ప్రతీ సిరీస్‌కు ప్రాధాన్యత ఉంది. అందుకే అన్ని మ్యాచ్‌లు, సిరీస్‌లు గెలవాలని కోరుకుంటాం. శ్రీలంక కూడా బాగా సన్నద్ధమై వచ్చింది. వారిని తక్కువగా అంచనా వేయడం లేదు. ఇప్పుడు తొలి టెస్టుపైనే మా దృష్టంతా. దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’ అని రహానే స్పష్టం చేశాడు. సొంత ఆటను మెరుగుపర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని, అందుకే సాంప్రదాయ భిన్నమైన స్వీప్, రివర్స్ స్వీప్, ప్యాడల్ స్వీప్ షాట్లను తాను ప్రత్యేకంగా సాధన చేస్తున్నానన్న రహానే... తనకు వంద శాతం నమ్మకం వచ్చిన తర్వాతే మ్యాచ్‌లో ఆయా షాట్లను ప్రయత్నిస్తానని చెప్పాడు. జోరుగా ప్రాక్టీస్... మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు ప్రాక్టీస్ సుదీర్ఘంగా సాగింది. కెప్టెన్ కోహ్లి, పుజారా ఎక్కువ సేపు నెట్స్‌లో గడిపారు. పుజారా తన శైలికి భిన్నంగా కొన్ని హుక్ షాట్స్ కూడా ఆడగా... కార్పెంటర్ సహకారంతో తన బ్యాట్ మందాన్ని అంగుళం పాటు తగ్గించి కోహ్లి ప్రత్యేకంగా సాధన చేశాడు. భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్ ముగించి వెళ్లిపోయినా, అశ్విన్ మాత్రం అదనపు సమయం బౌలింగ్ కొనసాగించాడు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తొలి టెస్టు జరగనున్న పిచ్‌ను పరిశీలించారు. ‘ఇది మంచి వికెట్’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
మళ్లీ అదరగొట్టారు
-
మళ్లీ అదరగొట్టారు
►రెండో వన్డేలో భారత్ 50 పరుగులతో విజయం ►రాణించిన కోహ్లి, రహానే ►కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ ►భువనేశ్వర్ 3/9 ►మూడో వన్డే ఆదివారం భారత్ తమదైన శైలిలో మరోసారి సత్తా చాటింది. శ్రీలంకను చిత్తుగా ఓడించి వచ్చినా, ఆస్ట్రేలియాతో అంత సులువు కాదని అంతా భావించారు. అయితే అద్భుతమైన ఆట ముందు ఆసీస్ అయినా ఎవరైనా ఒకటే అని మన జట్టు మళ్లీ రుజువు చేసింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు నిలవలేక కంగారూలు మళ్లీ తలవంచారు. భారీ స్కోరు సాధించకపోయినా... తమ బౌలింగ్ వనరులతో చెలరేగిన కోహ్లి సేన ప్రత్యర్థి పని పట్టింది. వరుసగా రెండో విజయంతో సిరీస్‌పై పట్టు బిగించింది. కోహ్లి కీలక ఇన్నింగ్స్... అండగా నిలిచిన రహానే... ఈ ఇద్దరి శతక భాగస్వామ్యం భారత్‌ను నడిపించాయి. చివర్లో ఎలాంటి మెరుపులు లేకున్నా... జట్టు మెరుగైన స్కోరుతో సవాల్ విసిరింది. ఛేదనలో భువనేశ్వర్ కుమార్ దెబ్బకు 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ గత మ్యాచ్ వైఫల్యాన్నే కొనసాగించింది. మధ్యలో కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ జోరుకు ఆ జట్టు కుదేలైంది. స్మిత్, స్టొయినిస్ అర్ధ సెంచరీలు గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి. కోల్‌కతా: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. సమష్టి కృషితో టీమిండియా మరో సారి సత్తా చాటింది. గురువారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత్ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (107 బంతుల్లో 92; 8 ఫోర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, అజింక్య రహానే (64 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టొయినిస్ (65 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (76 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ‘హ్యాట్రిక్’ సాధించడం విశేషం. 33వ ఓవర్లో వరుస బంతుల్లో వేడ్, అగర్, కమిన్స్‌లను కుల్దీప్ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో మూడో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం... 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 185/3. కోహ్లి మరో సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ దశలో భారత్ 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే తర్వాతి ఐదు ఓవర్ల వ్యవధిలో కోహ్లితో పాటు పాండే, ధోని కూడా అవుట్ కావడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివర్లో కూడా భారత్ ఆఖరి 20 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. పిచ్‌పై ఉన్న తేమను బాగా ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్లు కమిన్స్, కూల్టర్ నీల్ ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆరో ఓవర్లో కూల్టర్‌నీల్‌కు రోహిత్ శర్మ (7) రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో రహానే, కోహ్లి కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే రహానే రనౌట్‌తో వీరిద్దరి 102 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రెండో పరుగు తీసే ప్రయత్నంలో కోహ్లి వేగానికి తగిన విధంగా స్పందించని రహానే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటి వరకు కోల్‌కతా వేడిలో చెమటలు చిందిస్తూ ఇబ్బంది పడిన ఆసీస్‌కు ఈ వికెట్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే జోరులో తక్కువ వ్యవధిలో పాండే (3), ధోని (5), కోహ్లిలను అవుట్ చేసి ఆ జట్టు పట్టు బిగించింది. ఒక దశలో తాను ఆడిన వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టి దూకుడు ప్రదర్శించిన కేదార్ జాదవ్ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. పాండ్యా (20), భువనేశ్వర్ (20) కలిసి ఏడో వికెట్‌కు 35 పరుగులు జత చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. సొంతగడ్డపై ముందుగా బ్యాటింగ్ చేస్తూ భారత్ ఆలౌట్ కావడం 2013 జనవరి (పాక్‌పై) తర్వాత ఇదే తొలిసారి. స్మిత్ మినహా... సాధారణ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి తడబాటుకు లోనైంది. భువనేశ్వర్ అద్భుత బౌలింగ్ ముందు ఆసీస్ ఓపెనర్లు పరుగు తీయడమే గగనంగా మారింది. భువీ జోరుకు ముందుగా కార్ట్‌రైట్ (15 బంతుల్లో 1), ఆ తర్వాత వార్నర్ (9 బంతుల్లో 1) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అనంతరం స్మిత్, హెడ్ (39 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 15 పరుగుల వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ వదిలేయగా... వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు చకచకా పరుగులు సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ జంట మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 76 పరుగులు జత చేసిన అనంతరం చహల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కుల్దీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది జోరు ప్రదర్శించిన మ్యాక్స్‌వెల్ (14) ఎక్కువ సేపు నిలవలేదు. చహల్ చక్కటి బంతికి ధోని మెరుపు స్టంపింగ్ తోడై మ్యాక్సీ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్... పాండ్యా ఉచ్చులో చిక్కాడు. బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. చివర్లో స్టొయినిస్ పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ►భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో చేతన్ శర్మ (న్యూజిలాండ్‌పై), కపిల్‌దేవ్ (శ్రీలంకపై) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో కుల్దీప్‌కిది రెండో హ్యాట్రిక్. 2014లో జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ ‘హ్యాట్రిక్’ సాధించాడు. ► 1 ఆస్ట్రేలియాపై రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, భారత్ 119 రేటింగ్ పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
రహానేకు చోటు లేకపోవడమా?
శ్రీలంకతో వన్డే సిరీస్ ఫలితం తేలిపోవడంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఏమైనా ప్రయోగాలు చేస్తుందో లేదో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మార్పులు చేసినా జట్టు సమతుల్యం దెబ్బకుండా జాగ్రత్త పడాలి. అయితే రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో వరుస విజయాలు సాధిస్తున్న జట్టులో మార్పులు చేయాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. తొలి మూడు వన్డేల్లో ఆడని నలుగురు ఆటగాళ్లలో ఇద్దరు మాత్రం తుది జట్టులో తమకు ఆడే సత్తా ఉందని... ప్రయోగాల పేరుతో తమకు ఆడే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్‌లాంటి అపార నైపుణ్యమున్న ఇద్దరు ఆటగాళ్లు డ్రింక్స్ తేవడానికి పరిమితమయ్యారంటే భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతోంది. అడపాదడపా అందివచ్చిన అవకాశాలను వీరిద్దరు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకున్నారు. అయితే అజింక్య రహానే పరిస్థితి ఏమిటి? ఈపాటికే తానేంటో నిరూపించుకున్నా... ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయేలా రహానే ఆటతీరు ఉండటంలేదని భావించి అతడిని పక్కనబెట్టారనిపిస్తోంది. భారీ సిక్సర్లు కొట్టే నైపుణ్యం రహానేలో లేకపోయినా కళాత్మక షాట్లతో అతను కొట్టే బౌండరీలతో పరుగులు నిలకడగా వస్తుంటాయి. జట్టులో నిలదొక్కుకొని గాయాల కారణంగా మ్యాచ్‌లకు దూరమై... పునరాగమనం చేసే సందర్భంలో వారికే చోటు కల్పించడం, ఒకే స్థానంలో బాగా ఆడిన వారిని అదే స్థానంలో కొనసాగించడం భారత జట్టు విధానంగా ఉంది. అయితే జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న ఆటగాళ్లకు సమాన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు కూడా కనిపిస్తుంటారు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించినప్పటికీ రహానేకు ఈ సిరీస్‌లో తుది జట్టులో చోటు లభించడంలేదు. ప్రస్తుతం భారత్ వరుస విజయాలు సాధిస్తుండటంతో ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వేయడంలేదు. బాగా ఆడి కూడా తుది జట్టులో స్థానం లభించకపోవడం వేరే ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. సునీల్ గావస్కర్ -
భారత్ తొలి ఇన్నింగ్స్ 344/3
-
‘నయా వాల్’ మరోసారి...
∙ పుజారా అజేయ సెంచరీ ∙ రహానే శతకం ∙ భారత్ తొలి ఇన్నింగ్స్ 344/3 ∙ శ్రీలంకతో రెండో టెస్టు కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్ చెలరేగుతోంది. చతేశ్వర్ పుజారా (225 బంతుల్లో 128 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి తన క్లాస్ ఆటతో అభిమానులను సమ్మోహనపరుస్తూ వరుసగా రెండో సెంచరీతో సత్తాను చాటుకున్నాడు. అతనికి తోడు అజింక్యా రహానే (168 బంతుల్లో 103 బ్యాటింగ్; 12 ఫోర్లు) కూడా ఈ ఫార్మాట్లో తన లయను అందుకున్నాడు. ఆరంభంలో కాస్త ఇబ్బందిపెట్టిన లంక బౌలర్లను ఈ జోడి అద్భుత నైపుణ్యంతో ఎదుర్కొన్న తీరు ఆమోఘం. వీరిద్దరి అజేయ శతకాలతో జట్టు తొలి రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో గురువారం తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో మూడు వికెట్లకు 344 పరుగులు చేసింది. పుజారా, రహానే మధ్య ఇప్పటికే నాలుగో వికెట్‌కు అజేయంగా 211 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (82 బంతుల్లో 57; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ ధావన్ (37 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కోహ్లి (29 బంతుల్లో 13; 2 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. హెరాత్, పెరీరాలకు చెరో వికెట్ దక్కింది. తొలి సెషన్ ధావన్ వేగం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. అయితే ధావన్ ప్రారంభం నుంచే దూకుడు కనబరిచాడు. రెండో ఓవర్లోనే సిక్సర్ బాదిన తను దాదాపుగా బంతికో పరుగు చొప్పున వేగంగా ఆడడంతో జట్టు 52 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. అయితే పెరీరా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధావన్ ఎల్బీగా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పుజారా, రాహుల్ ఆచితూచి ఆడడంతో స్కోరు నెమ్మదించింది. 72 బంతుల్లో ఓ ఫోర్‌తో రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. మరో వికెట్ పడకుండా జట్టు లంచ్ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 28, పరుగులు: 101, వికెట్లు: 1 రెండో సెషన్ : పుజారా క్లాస్ బ్రేక్ తర్వాత మూడో ఓవర్లోనే జోరు మీదున్న రాహుల్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 31వ ఓవర్లో రాహుల్ కవర్లో షాట్ ఆడగా పరుగు కోసం పిలిచిన పుజారా అంతలోనే వెనక్కి వెళ్లాడు. అప్పటికి కాస్త ముందుకు వచ్చిన రాహుల్ తిరిగి వెనక్కి వెళ్లినా కీపర్ డిక్వెల్లా వికెట్లను పడగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లి.. హెరాత్ బౌలింగ్‌లో వైడ్ బంతిని ఆడబోయి క్యాచ్ అవుటయ్యాడు. ఈదశలో పుజారాకు రహానే జత కలవడంతో లంకకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 104 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచిన అనంతరం ఈ జోడి టీ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 30, పరుగులు: 137, వికెట్లు: 2 చివరి సెషన్ పుజారా, రహానే శతకాలు టీ విరామం అనంతరం పుజారా జోరును ప్రదర్శించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ 164 బంతుల్లో కెరీర్లో 13వ శతకాన్ని అందుకున్నాడు. అయితే 112 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పుజారా ఆ తర్వాత 50 పరుగులను కేవలం 52 బంతుల్లోనే సాధించడం తన వేగాన్ని సూచిస్తోంది. ఇక 80 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్న రహానే 151 బంతుల్లో కెరీర్లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన ఈ జోడి తొలి రోజును విజయవంతంగా ముగించింది. డీఆర్ఎస్ ద్వారా రహానే రెండుసార్లు ఎల్బీ నుంచి లబ్ధి పొందడం విశేషం. ఓవర్లు: 32, పరుగులు: 106, వికెట్లు: 0 వైద్య పరీక్షల కోసం స్వదేశానికి రోహిత్ గత నవంబర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రొటీన్ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం భారత్‌కు చేరుకున్నాడు. ⇒3 సెహ్వాగ్ (79), గావస్కర్ (81) తర్వాతవేగంగా (84 ఇన్నింగ్స్) 4 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్ పుజారా. ⇒ 6 రాహుల్ వరుసగా చేసిన అర్ధ సెంచరీల సంఖ్య. గతంలో గుండప్ప విశ్వనాథ్, ద్రవిడ్ ఇలాగే వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించారు. -
ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధం..
కింగ్స్టన్: భవిష్యత్తు గురించి ఆలోచించనని జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడుతానని భారత క్రికెటర్ అజింక్యా రహానే స్పష్టం చేశాడు. విండీస్ టూర్ లో ఓపెనర్‌గా చెలరేగిన ఈ స్టైలీష్ క్రికెటర్ ఆదివారం జరిగే ఏకైక టీ20లో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే విండీస్ పర్యటన అనంతరం అజింక్యా రహానేకు జట్టులో స్థానంపై ఆందోళన నెలకొంది . గత చాంపియన్స్ ట్రోఫీలో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన రహానేకు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్ అనంతరం భారత్ శ్రీలంకతో 3టెస్టులు, 5 వన్డే, 2 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. దీంతో జట్టులో స్థానం కోసం రహానేకు పోటి నెలకొంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన రహానే భవిష్యత్తు గురించి ఆలోచించనని, ప్రస్తుతం వన్డే, టీ20లపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. ఓపెనర్‌గానే కాకుండా టీం మేనేజ్మెంట్ కోరితే నెం.4 , నెం.2, నెం.1 స్థానాల్లోనైనా ఆడటానికి సిద్ధమన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని, నా వంతుగా జట్టు విజయం కోసం వంద శాతం కృషి చేస్తానని తెలిపాడు. ఇక వన్డే, టీ20లో స్థిరంగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రహానే పేర్కొన్నాడు. గత వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి రాణించానని గుర్తు చేశాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసన్నాడు. ఇది పెద్ద సమస్యకాదని రహానే పేర్కొన్నాడు. విండీస్ పర్యటనపై స్పందిస్తూ.. ఈ సిరీస్ నాకు చాల ముఖ్యమైనది. చాలా రోజుల తర్వాత నాకు అవకాశం లభించింది. చాంపీయన్స్ ట్రోఫీలో నాకు అవకాశం లభించలేదు. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతావని విరాట్ చెప్పాడంతో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. బ్యాట్‌తో నాప్రతిభను చూపించాలని నిర్ణయించుకున్నాను. ఈ సిరీస్ మొత్తం బ్యాటింగ్ ఆస్వాదిస్తూ రాణించానని రహానే తెలిపాడు. టీ20 మ్యాచ్‌లో క్రిస్ గేల్ రాకపై స్పందిస్తూ ప్రత్యర్ధి జట్టులో గేల్ ఒకరే లేరు..11 మంది ఆటగాళ్లు ఉంటారు. మేము మా బలంపైనే దృష్టి పెట్టామని రహానే చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో రహానే ఒక సెంచరీ 3 అర్ధ సెంచరీలతో ఓపెనర్‌గా రాణించాడు. -
'అందుకు విరాట్‌కు కృతజ్ఞతలు
ఆంటిగ్వా:వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, ఆపై రెండు వన్డేల్లో భారత్ జట్టు ఘన విజయాలు సాధించింది. భారత్ కు భారీ విజయాలు లభించడంలో ఓపెనర్ రహానే పాత్ర వెలకట్టలేనిది. రద్దయిన తొలి వన్డేలో 62 పరుగులు చేసిన రహానే.. రెండో వన్డేలో 102 పరుగులు చేశాడు. ఇక మూడో వన్డేలో సైతం 72 పరుగులు చేసి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. మూడో వన్డేలో భారత్ జట్టు గెలుపొందిన తర్వాత రహానే తన ఫామ్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధానంగా టాపార్డర్‌లో ఆడే అవకాశాన్ని కల్పించి తన నిలకడైన ఆటకు కారణమైన కెప్టెన్ విరాట్ కోహ్లి, జట్టు మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. మూడో వన్డేలో భారత్ జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లు విజృంభించడంతో కరీబియన్లు 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలిపోయారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), అజింక్యా రహానేల(71) అర్ధ సెంచరీలకు తోడు జాదవ్(40), యువరాజ్(39)లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. -
కుల్దీప్ తిప్పేశాడు
♦ వెస్టిండీస్‌తో రెండో వన్డే ♦ 105 పరుగులతో భారత్ విజయం ♦ 30న మూడో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అజింక్య రహానే అద్భుత సెంచరీతో భారీ స్కోరు సాధించిన భారత్... ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (3/50) తన మేజిక్ బౌలింగ్‌తో వెస్టిండీస్ భరతం పట్టాడు. దీంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 105 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాయ్ హోప్ (88 బంతుల్లో 81; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోగలిగాడు. ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లి సేన 1–0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఈనెల 30న ఆంటిగ్వాలో జరుగుతుంది. ఇక తొలి ఓవర్ మూడో బంతికే పావెల్ వికెట్ తీసిన భువనేశ్వర్ తన మరుసటి ఓవర్లో జేసన్ మొహమ్మద్‌ను కూడా పెవిలియన్‌కు పంపడంతో విండీస్ ఆది నుంచే తడబడింది. ఆ తర్వాత కుల్దీప్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి తన ‘తొలి’ వన్డేలోనే ఆకట్టుకోగలిగాడు. హోప్, లూయిస్ (21) మధ్య మూడో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అయితే 26వ ఓవర్లో హోప్‌ను కుల్దీప్ ఎల్బీగా అవుట్ చేశాక పరుగుల వేగం తగ్గింది. అటు రన్‌రేట్ కూడా 12కు పెరిగిపోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసినా లక్ష్యం వైపు పయనించలేకపోయింది. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 310/5; విండీస్ ఇన్నింగ్స్: పావెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; హోప్ ఎల్బీడబ్ల్యూ (బి) కుల్దీప్ 81; జేసన్ మొహమ్మద్ (సి) పాండ్యా (బి) భువనేశ్వర్ 0; లూయిస్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 21; కార్టర్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 13; హోల్డర్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్29; చేజ్ నాటౌట్ 33; నర్స్ నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో ఆరు వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–93, 4–112, 5–132, 6–174. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–9–2; ఉమేశ్ యాదవ్ 6–0–36–0; హార్దిక్ పాండ్యా 9–0–32–0; అశ్విన్ 9–0–47–1; కుల్దీప్ 9–0–50–3; యువరాజ్ 5–0–25–0. ♦ వన్డేల్లో 300కు పైగా పరుగులు స్కోరు చేయడం భారత్‌కిది 96వ సారి. గతంలో ఆసీస్ (95)పేరిట ఈ రికార్డు ఉంది. ♦ కరీబియన్‌లో విండీస్‌పై భారత్‌కిదే అతిపెద్ద విజయం. ♦ ధావన్, రహానే భాగస్వామ్య సగటు 76. వన్డేల్లో ఏ జోడీకి కూడా ఈ స్థాయి సగటు లేదు. ♦ రాహుల్ ద్రవిడ్ తర్వాత వెస్టిండీస్‌లో వన్డే సెంచరీ చేసిన ఓపెనర్‌గా రహానే. రహానే మాపై ఒత్తిడి తగ్గించాడు... అజింక్య రహానేతో జట్టులో చక్కటి సమతూకం ఏర్పడింది. కొద్దికాలంగా రహానే జట్టు వన్డే సెటప్‌లో ఉన్నాడు. టాప్ ఆర్డర్లో అతను కీలకం అవుతాడని మేం ముందే ఊహించాం. మూడో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా అతను సిద్ధంగా ఉంటున్నాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ అతడి ఆట అద్భుతం. తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుని స్వేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. మిడిలార్డర్లో కూడా తను రాణించగలడు కాబట్టి ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీలో అదనపు బౌలర్‌తో బరిలోకి దిగేందుకు అనువుగా ఉంటుంది. డ్రై వికెట్‌పై తాను ఎంత ప్రమాదకరమో కుల్దీప్ చాటిచెప్పాడు. ఇక వచ్చే ప్రపంచకప్ గురించి మాట్లాడుకుంటే 15 మంది ఆటగాళ్లు ఇక్కడ ఉన్నారు. మరో 12 మంది భారత్‌లో సిద్ధంగా ఉన్నారు. ఒత్తిడిని జయించి మధ్య ఓవర్లలో ఎవరు మెరుగ్గా రాణించగలరో గుర్తించాల్సి ఉంది. –కోహ్లి, భారత్ కెప్టెన్ -
'అతని వల్ల అదనపు బౌలర్ కు అవకాశం'
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనర్ అజింక్యా రహానేపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక టెస్టు బ్యాట్స్‌మన్ గా గుర్తింపు పొందిన రహానే.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో సైతం తనదైన ముద్రతో దూసుకుపోతున్నాడని కొనియాడాడు. 'ఈ సిరీస్ లో రహానే బ్యాటింగ్ చూడండి.. అద్భుతంగా ఉంది. ప్రధానంగా వన్డే సిరీస్‌లకు తగ్గట్టుగా రహానే బ్యాటింగ్ సాగుతోంది. మాకు మూడో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రహానే రూపంలో ఉండటం జట్టు బలాన్ని తెలియజేస్తుంది. రహానే ఎప్పుడూ పెద్దగా ఒత్తిడి తీసుకోకుండానే ఆడతాడు. ముఖ్యంగా గేమ్‌ను ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం రహానేలో నాకు కనబడిన లక్షణం. భారత జట్టు సమతుల్యంగా ఉండటానికి రహానే పాత్ర కూడా కారణం. వరల్డ్ కప్ వంటి మేజర్ టోర్నీల్లో ఆడేటప్పుడు అదనపు బ్యాట్స్ మన్ గురించి కాకుండా అదనపు బౌలర్ గురించి ఆలోచించే పరిస్థితిని రహానే కల్పించాడు. అతని వల్ల అదనంగా ఒక బౌలర్ ను జట్టు వెంట ఎటువంటి సంకోచం లేకుండా తీసుకెళ్లవచ్చు. విండీస్ పర్యటనకు 15 మంది ముఖ్యమైన ఆటగాళ్లతో వెళ్లాం. స్వదేశంలో మరో 10 నుంచి 12 మంది ఆటగాళ్ల కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా టెస్టింగ్ ప్రాసెస్ లో ఉన్నారు. ఒత్తిడిలో ఎలా ఆడతారు అనే దానిపై వారిని పరిశీలిస్తున్నాం'అని కోహ్లి పేర్కొన్నాడు. -
విండీస్‌పై భారత్ ఘనవిజయం
► రహానే అజయ శతకం ► రాణించిన కోహ్లీ, ధావన్ ► ఆకట్టుకున్న కుల్ధీప్, భువీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో భారత్ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక యువ బౌలర్ కుల్ధీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ విండీస్‌పై సునాయసంగా విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. భారీ లక్ష్య చేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పోవెల్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ను కూడా భువీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ షై హోప్(89) ఒంటిరి పోరాటం చేయగా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో నిర్ణీత 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక భారత్ బౌలర్లలో భువీ 2, కుల్దీప్ యాదవ్ (3), అశ్విన్ (1) దక్కాయి. శతక వీరుడు అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
విండీస్‌పై రహానే శతకం..
► హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్ ట్రినిడాడ్: భారత్- వెస్టిండీస్ రెండో వన్డేలో టీంఇండియా ఓపెనర్ అజింక్యా రహానే శతకం సాధించాడు. గత కొద్ది రోజులుగా నిలకడలేమి ఆటతో సతమతవుతున్న రహానే ఎట్టకేలకు శతకం బాది తన సత్తా చాటాడు. గత చాంపియన్స్ ట్రోఫీలో రహానే నిలకడలేమి ఆటతో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రహానే అర్ధశతకం సాధించాడు. కానీ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు మంచి శుభారంబాన్ని అందించారు. వీరి దూకుడుకు భారత్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఈ తరుణంలో 49 బంతుల్లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో ధావన్(63) అష్లే నర్స్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రహానే 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత మరింత దూకుడు పెంచిన రహానే 102 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లతో కెరీర్లో మూడో శతకం సాధించాడు. అనంతరమే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ ఫినీషర్ హర్డీక్ పాండ్యా(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. మరో వైపు కెప్టెన్ కోహ్లీ(43), యువరాజ్ సింగ్(0) క్రీజులో ఉన్నారు. భారత్ 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. -
చిత్తయిన రాజులు
-
చిత్తయిన రాజులు
►పుణే అలవోకగా ప్లే–ఆఫ్‌కు... ►చిత్తుగా ఓడిన పంజాబ్ ►సమష్టిగా రాణించిన పుణే బౌలర్లు పుణే: హోరాహోరి తప్పదనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. తుదికంటా పోరాడాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అరంభం నుంచే తడబడింది. కనీస బాధ్యతే లేకుండా బ్యాట్లేత్తేసింది. దీంతో రైజింగ్ పుణే చెమటోడ్చకుండానే ప్లే–ఆఫ్ చేరింది. ఆదివారం జరిగిన పోరులో బౌలర్లు సమష్టిగా రాణించడంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగుల వద్ద ఆలౌటైంది. అక్షర్ పటేల్ (22)దే అత్యధిక స్కోరు. శార్దుల్ ఠాకూర్ 3, ఉనాద్కట్, జంపా, క్రిస్టియాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత పుణే 12 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది. రహానే (34 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (20 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 73 పరుగులకే ఆలౌట్ టాస్ నెగ్గిన పుణే సారథి స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బౌలర్లు తమ బౌలర్ నిర్ణయం సరైందని తొలి బంతినుంచే నిరూపించారు. వృద్ధిమాన్ సాహా (13)తో పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గప్టిల్ (0) ఉనాద్కట్ తొలిబంతికే డకౌట్ అయ్యాడు. తర్వాత శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ తలా ఒక దెబ్బతీయడంతో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ (32/5) సగం వికెట్లను కోల్పోయింది. మార్‡్ష (10), మోర్గాన్ (4), రాహుల్ తెవాటియా (4), మ్యాక్స్‌వెల్ (0) ఇలా అందరూ ఆడేందుకు కాకుండా... వికెట్లు సమర్పించుకునేందుకే వరుస కట్టారు. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (22) కాస్త మెరుగనిపించినా... క్రిస్టియాన్ అతన్ని బోల్తాకొట్టించాడు. టెయిలెండర్లు మోహిత్ శర్మ (6), ఇషాంత్ శర్మ (1) జంపా ఔట్ చేయడంతో 73 పరుగుల వద్ద పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. రాణించిన రహానే సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడారు. తర్వాత స్పీడ్ పెంచిన త్రిపాఠి... ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, రాహుల్ తెవాటియా మరుసటి ఓవర్లో భారీ సిక్సర్‌తో అలరించాడు. ఇదే జోరులో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ స్మిత్ (18 బంతుల్లో 15 నాటౌట్), రహానేకు జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో 18 పాయింట్లు పొందిన పుణే రెండో స్థానంలో నిలిచింది. 16న ముంబైతో జరిగే తొలి క్వాలిఫయర్‌లో తలపడనుంది. అందులో ఓడిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశం రెండో క్వాలిఫయర్ రూపంలో సజీవంగా ఉంటుంది. -
పుణే ‘సూపర్’
-
పుణే ‘సూపర్’
⇒ ముంబై ఇండియన్స్‌పై విజయం ⇒రహానే, స్మిత్ అర్ధ సెంచరీలు ⇒హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ వృథా గత సీజన్లో ఎదురైన పరాభవాన్ని మరచిపోయేందుకు సరి‘కొత్త’గా తయారైన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ తొలి మ్యాచ్‌లోనే జోరు చూపింది. ఆరంభంలో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్పిన్నర్ తాహిర్, పేసర్ రజత్ భాటియా కట్టడి చేయగా.. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్, రహానే అదరగొట్టే ఆటతీరుతో జట్టును విజయం దిశగా నడిపించారు. పుణే: కొత్త కెప్టెన్ రాకతో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఆటతీరు కూడా మారింది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన జట్టు ఐపీఎల్ పదో సీజన్లో బోణీ కొట్టింది. చివరి ఓవర్లో 13 పరుగులు రావాల్సి ఉండగా తొలి మూడు బంతులు సింగిల్స్ రావడంతో ఉత్కంఠ నెలకొన్నా... మరో రెండు బంతులను కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్లుగా మలచడంతో పుణే గట్టెక్కింది. అజింక్యా రహానే (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నితిష్ రాణా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడగా చివర్లో హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ 19.5 ఓవర్లలో మూడు వికెట్లకు 187 పరుగులు చేసింది. ఐపీఎల్లో అతి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన స్టోక్స్ బౌలింగ్‌లో ఓ వికెట్ తీయగా బ్యాటింగ్‌లో 21 (14 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు మాత్రమే చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్మిత్‌కి దక్కింది. చివర్లో ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 11 పరుగులు రాబట్టింది. అయితే దిండా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పార్థివ్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను థర్డ్ మ్యాన్‌లో ఉన్న రజత్ భాటియా జారవిడిచాడు. బెన్ స్టోక్స్ తను వేసిన తొలి ఓవర్లోనే బట్లర్ రెండు సిక్సర్లు బాది జోరు చూపాడు. ఇమ్రాన్ తాహిర్ వేసిన తొలి ఓవర్లోనే పార్థివ్‌ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరో ఓవర్లో బట్లర్ మరోసారి విరుచుకుపడి వరుస బంతుల్లో 4,6 తో రెచ్చిపోయాడు. అయితే తాహిర్ తన రెండో ఓవర్ మూడు బంతుల్లో కెప్టెన్ రోహిత్ (3), ధాటిగా ఆడుతున్న బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత రాణా, పొలార్డ్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా 6,6,6,4,6 బాదడంతో జట్టు స్కోరు అమాంతం 154 పరుగుల నుంచి 184 పరుగులకు చేరింది. రహానే, స్మిత్ అదుర్స్: పుణే ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ నుంచి అజింక్యా రహానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిచాడు. హార్ధిక్ వేసిన ఆ ఓవర్లో మూడు ఫోర్లు బాదగా మూడో ఓవర్లో వరుసగా 6,4తో చెలరేగాడు. కానీ మూడో ఓవర్లో మయాంక్ (6) వికెట్‌ను మెక్లీనగన్ తీశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ దశలో రహానేకు సహకారం అందించాడు. మెక్లీనగన్ మరుసటి ఓవర్లో స్మిత్ ఫోర్‌తో పాటు రహానే వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో పవర్‌ప్లేలో పుణే 59 పరుగులు చేసింది. 9వ ఓవర్లో రహానే బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సౌతీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రహానే సూపర్ ఇన్నింగ్స్ నితిష్ రాణా అద్భుత డైవ్ క్యాచ్‌తో ముగిసింది. అయితే అటు స్మిత్ జోరు మాత్రం ఆగలేదు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచాడు. 13వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ చివరి బంతికి ఇచ్చిన క్యాచ్‌ను రాణా మిస్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 37 బంతుల్లో తను అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్లో ధోని (12 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ఇచ్చిన క్యాచ్‌ను సౌతీ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్లో స్మిత్ జోరుతో పుణే నెగ్గింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (బి) తాహిర్ 19; బట్లర్ ఎల్బీడబ్లు్య (బి) తాహిర్ 38; రోహిత్ (బి) తాహిర్ 3; రాణా (సి) భాటియా (బి) జంపా 34; రాయుడు (సి అండ్ బి) భాటియా 10; కృనాల్ పాండ్యా (సి) ధోని (బి) భాటియా 3; పొలార్డ్ (సి) మయాంక్ (బి) స్టోక్స్ 27; హార్దిక్ పాండ్యా నాటౌట్ 35; సౌతీ రనౌట్ 7; మెక్లీనగన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–45, 2–61, 3–62, 4–92, 5–107, 6–125, 7–146, 8–183 బౌలింగ్: దిండా 4–0–57–0 ; దీపక్ చహర్ 2–0–21–0; స్టోక్స్ 4–0–36–1; తాహిర్ 4–0–28–3; జంపా 3–0–26–1; భాటియా 3–0–14–2 రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) రాణా (బి) సౌతీ 60; మయాంక్ అగర్వాల్ (సి) రోహిత్ శర్మ (బి) మెక్లీనగన్ 6; స్మిత్ నాటౌట్ 84; స్టోక్స్ (సి) సౌతీ (బి) హార్దిక్ పాండ్యా 21; ధోని నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 4; (19.5 ఓవర్లలో 3 వికెట్లకు) 187 వికెట్ల పతనం: 1–35, 2–93, 3–143 బౌలింగ్: సౌతీ 4–0–34–1, హార్దిక్ పాండ్యా 4–0–36–1; మెక్లీనగన్ 4–0–36–1; బుమ్రా 4–0–29–0; కృనాల్ పాండ్యా 2–0–21–0, పొలార్డ్ 1.5–0–30–0 ►ఐపీఎల్లో నేటి మ్యాచ్ గుజరాత్ లయన్స్ & కోల్‌కతా నైట్ రైడర్స్ ►వేదిక: రాజ్‌కోట్; రాత్రి. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అతనే కరెక్ట్!
కీలకమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ మట్టికరిపించి.. సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో.. ఈ టెస్టులో టీమిండియాకు సారథ్యం వహించిన అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను రహానేకు అప్పగిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. 'కెప్టెన్‌గా రహానేను కొనసాగించాలి. ఇది చాలా కఠినమైన సిరీస్. అయినా ఈ సిరీస్ ఆటగాళ్ల ప్రతిభతో బాగా సాగింది' అని జాన్సన్ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. కెప్టెన్ విరాట్ కోహ్లికి రాంచీ టెస్టులో భుజానికి గాయం కావడంతో అతను నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మశాల టెస్టుకు నాయకత్వం వహించిన రహానే మైదానంలో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శరవేగంగా 38 పరుగులు చేశాడు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా ఈ సిరీస్‌లో ఆరో అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి బోర్డర్-గవస్కర్ ట్రోఫీని 2-1తో సొంతం చేసుకుంది. అయితే, వాడీవేడిగా జరిగిన ఈ సిరీస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను తాను స్నేహితులుగా పరిగణించబోనంటూ కెప్టెన్ కోహ్లి కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లికి కౌంటర్ ఇచ్చేందుకు జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడా? అని పరిశీలకులు భావిస్తున్నారు. -
ధోని సరసన రహానే
ధర్మశాల: భారత క్రికెట్ జట్టు ప్రధాన ఆటగాడు అజింక్యా రహానే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత టెస్టు క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్న రికార్డును రహానే సాధించాడు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ లోనే విజయాన్ని సాధించిన తొమ్మిదో భారత టెస్టు కెప్టెన్‌గా రహానే నిలిచాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లేలు వంటి దిగ్గజాల సరసన రహానే చేరాడు. వీరంతా కెప్టెన్ గా చేసిన తొలి మ్యాచ్ ల్లో విజయం సాధించిన భారత క్రికెటర్లు. అయితే భారత తరపున కెప్టెన్ గా చేసిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన చివరి కెప్టెన్ ధోని. ఆ తరువాత ఆ ఘనతను రహానే అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టెస్టుకు ముందు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడటంతో రహానే కు ఆ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో భారత 33వ టెస్టు కెప్టెన్‌గా రహానే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-1తో కైవశం చేసుకుంది.ఆసీస్ విసిరిన 106 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. 19/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. తొలి సెషన్ ఆదిలో భారత్ వరుసగా మురళీ విజయ్(8), చటేశ్వర పూజరా(0)ల వికెట్లను కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్, కెప్టెన్ అజింక్యా రహానేలు మిగతా పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగులు పెట్టించడంతో భారత్ జట్టు 25.0 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. రాహుల్(52 నాటౌట్;76 బంతుల్లో9 ఫోర్లు), రహానే(38 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ తొలి సెషన్‌లోపే గెలుపును సొంతం చేసుకుంది. -
సమం... సమం...
⇒ దీటుగా బదులిస్తున్న భారత్ ⇒ తొలి ఇన్నింగ్స్‌లో 120/1 ⇒ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 451 ⇒ ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా రెండో రోజు ఆటలో భారత్, ఆస్ట్రేలియా జట్లు సమ ఉజ్జీ ఆటతీరును ప్రదర్శించాయి. పిచ్ కాస్త టర్న్ అయినప్పటికీ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అదే నిలకడ.. అదే ఏకాగ్రతను ప్రదర్శించాడు. భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చూపుతూ అజేయంగా నిలిచాడు. స్మిత్, మ్యాక్స్‌వెల్ కలిసి ఐదో వికెట్‌కు191 పరుగులు జోడించడంతో ఇక భారీ స్కోరు ఖాయమే అనుకున్న తరుణంలో జడేజా జట్టుకు ఆపద్బాంధవుడిలా మారాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో ఆసీస్ భరతం పట్టగా... అటు పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా తన పదునైన బంతులతో ప్రత్యర్థిపై ఉచ్చు బిగించడంతో 152 పరుగులు జోడించి ఆసీస్ తమ చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఇక ఆసీస్‌కు దీటుగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో జట్టుకు శుభారంభం అందింది. చక్కటి స్ట్రోక్‌ప్లేతో ఆకట్టుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ సిరీస్‌లో తన నాలుగో అర్ధ సెంచరీని సాధించగా మురళీ విజయ్, పుజారా క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశాన్ని కల్పించారు. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో ఆసీస్ బౌలర్లకు బదులిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. రాంచీ: కెప్టెన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రెండో రోజు కూడా మైదానంలో దిగకపోయినా భారత జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. రహానే నాయకత్వంలో తొందరగానే ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించిన జట్టు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో దీటుగా బదులిచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (102 బంతుల్లో 67; 9 ఫోర్లు) ఈ సిరీస్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో నాలుగో అర్ధ సెంచరీ సాధించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసి మంచి స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (112 బంతుల్లో 42 బ్యాటింగ్; 6 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (10 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్‌కన్నా భారత్ మరో 331 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు రవీంద్ర జడేజా (5/124) ధాటికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 137.3 ఓవర్లలో 451 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (361 బంతుల్లో 178 నాటౌట్; 17 ఫోర్లు) చివరి వరకు అజేయంగా నిలవగా మ్యాక్స్‌వెల్ (185 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పేసర్ ఉమేశ్ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి. తొలి సెషన్: జడేజా జోరు 299/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆసీస్ ఆట ప్రారంభించగా.. తొలి బంతికే బ్యాట్ విరగ్గొట్టుకున్న మ్యాక్స్‌వెల్ చివరి బంతిని బౌండరీగా మలిచి రెండో రోజు పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికే మరో బౌండరీతో మ్యాక్స్ కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవకుండానే జడేజా వేసిన ఓ అద్భుత బంతికి తను సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు స్మిత్ మాత్రం ఫోర్లతో స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. వేడ్ (50 బంతుల్లో 37; 6 ఫోర్లు) కూడా నిలకడగా ఆడుతుండడంతో మరో మంచి భాగస్వామ్యం వైపు ఆసీస్ వెళ్లింది. అయితే జడేజా మరోసారి తన స్పిన్ సత్తాను ప్రదర్శించి మూడు బంతుల వ్యవధిలో వేడ్, కమ్మిన్స్ వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. వేడ్‌తో కలిసి స్మిత్ ఆరో వికెట్‌కు 64 పరుగులు జత చేశాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో స్మిత్ 315 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఓవర్లు: 28, పరుగులు: 102, వికెట్లు: 3. రెండో సెషన్: వికెట్లు టపటపా బ్రేక్ తర్వాత కాసేపు స్మిత్, ఒకీఫ్ జోడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ముఖ్యంగా ఒకీఫ్ చక్కటి డిఫెన్స్‌తో స్మిత్‌కు సహకారం అందించాడు. అయితే ఐదు ఫోర్లు బాదిన తను ఉమేశ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే జడేజా.. లయన్‌ను అవుట్ చేసి ఐదు వికెట్లను పూర్తి చేశాడు. మరో రెండు ఓవర్ల అనంతరం హాజల్‌వుడ్‌ను జడేజా వికెట్ల వైపు చూడకుండానే మెరుపు వేగంతో రనౌట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా వికెట్ నష్టపోకుండా 20 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. ఆసీస్ ఆడిన ఓవర్లు: 18.4, పరుగులు: 49, వికెట్లు: 3 భారత్ ఆడిన ఓవర్లు: 8, పరుగులు: 20, వికెట్: 0. చివరి సెషన్: రాహుల్ దూకుడు బ్రేక్ తర్వాత ఫామ్‌లో ఉన్న రాహుల్ చక్కటి కవర్ డ్రైవ్‌లతో బౌండరీలు బాదుతూ స్కోరును పెంచాడు. ఇదే జోరుతో 69 బంతుల్లోనే స్వీప్ షాట్‌తో ఫోర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ సాగుతున్న రాహుల్ జోరును కమ్మిన్స్ అడ్డుకున్నాడు. 31.2 ఓవర్లో తను విసిరిన స్లో బౌన్సర్‌ను ఆడటంలో విఫలమైన రాహుల్, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఓవర్లోనే కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. 39వ ఓవర్లో విజయ్ ఎల్బీ కోసం ఆసీస్ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే భారత్ ఆడిన 40 ఓవర్లలో ఆసీస్ ఒక్క ఎక్స్ట్రా పరుగే ఇవ్వడం విశేషం. ఓవర్లు: 32, పరుగులు: 100, వికెట్: 1. ఉమేశ్ దెబ్బకు బ్యాట్ ముక్కలు! రెండో రోజు ఆటలో మొదటి బంతికే మైదానంలో నవ్వులు పూశాయి. 137కి.మీ వేగంతో ఉమేశ్ సంధించిన బంతిని మ్యాక్స్‌వెల్ డిఫెన్స్ ఆడాడు. వెంటనే పరుగు కోసం ప్రయత్నించి ముందుకు చూడగా మ్యాక్సీ చేతిలో బ్యాట్ హ్యాండిల్ మాత్రమే ఉంది. ఉమేశ్ వేగానికి బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటనతో మ్యాక్సీ కన్ఫ్యూజ్ అయ్యాడు. దీన్ని గమనించిన ఉమేశ్ వెంటనే సరదాగా నవ్వుతూ తన కండలు ప్రదర్శించాడు. దాంతో మ్యాక్స్‌వెల్ కూడా నవ్వాపుకోలేకపోయాడు. విరాట్ కోలుకుంటున్నాడు తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడిన భారత కెప్టెన్ కోహ్లి వేగంగా కోలుకుంటున్నాడు. అతను రెండోరోజు ఆటలో ఫీల్డ్‌లో కనిపించకపోయినా... మ్యాచ్‌కు ముందు జరిగిన వార్మప్‌లో టీమ్ తో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కోచ్ కుంబ్లేతో పాటు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించాడు. మరోవైపు పేసర్ ఉమేశ్‌యాదవ్ ఈ మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించాడు. ‘కోహ్లి ఫిట్‌గా ఉన్నాడు. నెట్స్‌లో అతను ప్రాక్టీస్ చేశాడు కూడా. మ్యాచ్‌లో అ తను బ్యాటింగ్‌కు దిగుతాడు’ అని ఉమేశ్ అన్నాడు. ► 3 ఓ టెస్టు సిరీస్‌లో సెంచరీ లేకుండా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్ రాహుల్. ఇంతకుముందు చేతన్ చౌహాన్, సిద్ధూ ఈ జాబితాలో ఉన్నారు. ► 1 భారత గడ్డపై అత్యధి క వ్యక్తిగత స్కోరు చేసిన ఆసీస్ కెప్టెన్‌గా క్లార్క్ (130)ను అధిగమించిన స్మిత్ (178). ► 8 జడేజా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 8వ సారి. ► 2 మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన రెండో ఆసీస్ ఆటగాడిగా (వాట్సన్ తర్వాత) మ్యాక్స్‌వెల్ నిలిచాడు. -
మన వైపు తిరిగింది!
►మెరుగైన స్థితిలో భారత్ ►రెండో ఇన్నింగ్స్‌లో 213/4 ►రాణించిన పుజారా, రాహుల్ ►ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యం హమ్మయ్య... ఎట్టకేలకు టెస్టు సిరీస్‌లో ఒక రోజు భారత్ పక్షాన నిలిచింది. ఎట్టకేలకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మన జట్టు సెషన్ మొత్తం ఆడగలిగింది. ఎట్టకేలకు పుజారా, రహానే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ సిరీస్‌లోనే పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగారు. వీరికి తోడు సొంత మైదానంలో లోకేశ్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్. వెరసి మూడోరోజు ఆటను భారత్ సంతృప్తిగా ముగించగా... తొలిసారి సిరీస్‌లో ఆసీస్ వెనుకంజ వేసింది. నాలుగు వికెట్లు నా చేతుల్లోనే అంటూ సోమవారం ఆటలో ముందుగా జడేజా ఆసీస్‌ను కట్టి పడేశాడు. భారీ స్కోరు చేసి ఒత్తిడి పెంచాలనుకున్న ఆ జట్టు జడేజా దెబ్బకు మరో 39 పరుగులకే ఆట ముగించేసింది. అనంతరం తక్కువ వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన భారత్, ప్రత్యర్థి ఆధిక్యాన్ని మినహాయిస్తే ఒక దశలో 33/4తో నిలిచింది. ఈ స్థితిలో పుజారా, రహానే జోడి తమ ఆటతో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. అయితే ఇంకా పూర్తిగా మ్యాచ్ చేతుల్లోకి రాలేదు. ఈ పిచ్‌ను చూస్తే తీవ్ర ఒత్తిడిలో 200 పరుగులు ఛేదించడం ఆసీస్‌కు చాలా కష్టమని పిస్తున్నా... పుజారా, రహానే బ్యాటింగ్ వారిలో పట్టుదల పెంచవచ్చు. భారత్ ప్రస్తుత ఆధిక్యం 126 పరుగులు, రెగ్యులర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ సహా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కనీసం మరో వంద పరుగులైనా జతచేసే అవకాశం ఉంది. అదే జరిగితే సిరీస్ సమం చేసేందుకు కోహ్లి సేనకు చక్కటి అవకాశం చిక్కినట్లే! బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత్ తమ స్థాయికి తగిన ఆటను ప్రదర్శించింది. ముందుగా ఆసీస్ తొలి ఇన్నిం గ్స్‌ను త్వరగా ముగించిన టీమిండియా... ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్‌తో టెస్టులో తమ విజయావకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (173 బంతుల్లో 79 బ్యాటింగ్; 6 ఫోర్లు), అజింక్య రహానే (105 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఐదో వికెట్‌కు అభేద్యంగా 93 పరుగులు జోడించి క్రీజులో ఉన్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (85 బంతుల్లో 51; 4 ఫోర్లు) కూడా అర్ధసెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధించిన 87 పరుగుల ఆధిక్యాన్ని తీసివేస్తే భారత్ ప్రస్తుతం 126 పరుగులు ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 237/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (6/63) ఆరు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. సెషన్–1: జడేజా మాయ మూడో రోజు ఆస్ట్రేలియాను తొందరగా ఆలౌట్ చేయడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసిన అతను మరో క్యాచ్ కూడా అందుకొని పడిన నాలుగు వికెట్లలోనూ భాగస్వామి అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి స్టార్క్ (26) డీప్ మిడ్ వికెట్లో జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే జడేజా వరుస బంతుల్లో వేడ్ (113 బంతుల్లో 40; 4 ఫోర్లు), లయన్ (0)లను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. తన తర్వాతి ఓవర్లోనే హాజల్‌వుడ్ (1) వికెట్ కూడా తీసి జడేజా కంగారూల ఆట ముగించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రాహుల్, ముకుంద్ చకచకా పరుగులు సాధించారు. ఆసీస్ పేసర్ల నుంచి కొన్ని షార్ట్ బంతులు ఎదురైనా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఓవర్లు: 16.4, పరుగులు: 39, వికెట్లు: 4 (ఆస్ట్రేలియా) ఓవర్లు: 10, పరుగులు: 38, వికెట్లు: 0 (భారత్) సెషన్–2: ఆసీస్ బౌలింగ్ జోరు లంచ్ తర్వాత హాజల్‌వుడ్ వేసిన తొలి ఓవర్లోనే ముకుంద్ (16) వెనుదిరిగాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లయన్ బౌలింగ్‌లో పుజారా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో స్మిత్ వదిలేయడంతో భారత్‌కు ఊరట లభించింది. మరో ఎండ్‌లో ఏమాత్రం తడబాటు లేకుండా చక్కటి షాట్లతో దూసుకుపోయిన రాహుల్ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే స్లిప్‌లో స్మిత్ అద్భుత క్యాచ్‌తో రాహుల్ ఇన్నింగ్స్ ముగిసింది. 26వ ఓవర్ తొలి బంతికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని భారత్ దాటింది. అయితే కొద్ది సేపటికే కోహ్లి (15) వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన జడేజా (2) విఫలం కాగా, మరో ఎండ్‌లో పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఓవర్లు: 29, పరుగులు: 84, వికెట్లు: 4 సెషన్–3: కీలక భాగస్వామ్యం టీ విరామం అనంతరం పుజారా, రహానే కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. గత పది ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 30 పరుగులు దాటగలిగిన రహానే కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ పుజారాకు సహకారం అందించాడు. అప్పుడప్పుడు బంతి అనూహ్యంగా స్పిన్ కావడం, అదనంగా బౌన్స్ అయినా మొత్తంగా బౌలింగ్ ప్రమాదకరంగా మాత్రం కనిపించలేదు. దాంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడాన్ని ఆసీస్ బౌలర్లు నిరోధించలేకపోయారు. ఈ క్రమంలో పుజారా 125 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇదే జోరులో భారత్ ఈ సిరీస్‌లో తొలిసారి 200 పరుగుల స్కోరును దాటింది. ఈ సెషన్లో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా భారత్ మాత్రం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పట్టుదలగా ఆడటం విశేషం. ఓవర్లు: 33, పరుగులు: 91, వికెట్లు: 0 బెంగళూరులో వర్షం... బెంగళూరు నగరాన్ని సోమవారం రాత్రి వాన పలకరించింది. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. భారీగా కాకపోయినా చిన్నపాటి జల్లులతో విరామం లేకుండా అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. సీజన్ కాకపోయినా మార్చిలో కూడా కొన్ని సార్లు ఇక్కడ వానలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం మంగళవారం కూడా వాన కొనసాగే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటకు అంతరాయం కలగవచ్చు. అయితే చిన్నస్వామి స్టేడియంలో భారీ ఖర్చుతో ఇటీవలే ఆధునీకరించిన కొత్త తరహా డ్రైనేజీ వ్యవస్థ వల్ల సాధ్యమైనంత తొందరగా మ్యాచ్‌కు సిద్ధం చేయగలిగే సౌకర్యం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఇక్కడే భారత్, దక్షిణాఫ్రికా టెస్టు భారీ వర్షం కారణంగా రద్దయింది. ►7 ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం జడేజాకిది ఏడోసారి. ► 8 ఆసీస్‌పై ఎనిమిది ఇన్నింగ్స్‌ల తర్వాత పుజారా హాఫ్ సెంచరీ చేశాడు. -
రహానేను తప్పించడమా!
ప్రతీ విజయయాత్రకు ఎక్కడో ఒక చోట విరామం తప్పదని, అన్ని మ్యాచ్‌లు గెలవడం సాధ్యం కాదని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. పుణే ఫలితం ఇప్పుడు గతమని, జట్టు కోచ్‌గా తాను భవిష్యత్తుపైనే దృష్టి పెడతానని ఆయన అన్నారు. ‘మేం మా స్థాయికి తగినట్లుగా ఆడలేదు కాబట్టే ఓడిపోయాం. అలాంటి తప్పు ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడతాం. జరిగినదాని గురించి చర్చ అనవసరం. సిరీస్‌లో మరో మూడు టెస్టులు ఉన్నాయి. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అనే విషయం మరచిపోవద్దు. ఈ టెస్టులో ఎలా విజయం సాధించాలనేదానిపైనే మా దృష్టి’ అని కుంబ్లే అన్నారు. మరో వైపు రహానేను తుది జట్టులోంచి తప్పించాల్సిన అవసరమే లేదని కుంబ్లే స్పష్టం చేశారు. నాయర్ ఇంకా వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు. ‘గత రెండేళ్లుగా రహానే చాలా బాగా ఆడుతున్నాడు. అతడిని తప్పించాలనే ప్రశ్నే తలెత్తదు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా కరుణ్‌కు అవకాశం రాకపోవడం దురదృష్టకరం కానీ తప్పదు. తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐదుగురు బౌలర్లను కొనసాగించాలా, లేదా నలుగురు బౌలర్లతో ఆడి మరో బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాలా అనేది చెప్పలేను’ అని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సమరానికి సై...
-
సమరానికి సై...
► నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ► ఉత్సాహంతో కోహ్లి సేన ► తీవ్ర ఒత్తిడిలో కంగారూలు వేదిక ఏదైనా వరుసగా 19 టెస్టుల్లో పరాజయం దగ్గరికే రాలేదు. సొంతగడ్డపై అయితే గత 20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించగా ఒక్క ఓటమి కూడా లేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే కలిసికట్టుగా 53 వికెట్లు తీసి ఆసీస్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు బౌలర్లు ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ఎదురులేని బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల పని పడుతున్న ఆటగాడు ముందుండి నడిపిస్తుండగా జట్టులో ప్రతీ ఒక్కరు మరొకరితో పోటీ పడుతూ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు. ఇదీ వరల్డ్ నంబర్‌వన్ భారత్ తాజా స్థితి. ఈ జట్టు జోరును ఆపడం సాధ్యమా... ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఆడిన పది టెస్టుల్లో ఎనిమిది ఓడి అతి కష్టంగా రెండింటిలో ‘డ్రా’తో బయటపడింది. అనేక మంది దిగ్గజాలు ఉన్న నాటి ఆసీస్ జట్లు కూడా భారత్ ధాటికి నిలువలేకపోయాయి. ఇప్పుడు స్పిన్ పిచ్‌లపై ఆడటంలో ఏ మాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లను నమ్ముకొని ఆసీస్ భారత్‌లో అడుగు పెట్టింది. ఉపఖండంలో గత తొమ్మిది టెస్టుల్లో నూ చిత్తుగా ఓడిన ఆ జట్టు, అసలు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అసలు ఏమాత్రమైనా నిలబడగలదా లేక పట్టుదలతో పోరాడుతుందా? పుణే: న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తున్న జట్టుతో తలపడేందుకు ఇప్పుడు కంగారూల బృందం సన్నద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు (గురువారం) తొలి టెస్టు ప్రారంభమవుతుంది. భారత్ వరుసగా ఆరు టెస్టు సిరీస్‌లు గెలిచి ఊపు మీదుండగా, ఆసీస్ ఇటీవలే స్వదేశంలో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. అయితే అక్కడికంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరిగే ఈ మ్యాచ్‌లలో ఆసీస్ అదే తరహా ఆటతీరును ప్రదర్శించడం అంత సులువు కాదు. మరోవైపు జట్టులో ప్రతీ ఆటగాడు ఫామ్‌లో ఉండటంతో వరుస విజ యాలు సాధించిన కోహ్లి సేన మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య భారత గడ్డపై 2013లో జరిగిన సిరీస్‌లో ఆసీస్ 0–4తో ఓడగా, ఆఖరిసారిగా ఈ రెండు జట్లు ఆస్ట్రేలియాలో 2014లో తలపడిన సిరీస్‌లో ఆసీస్ 2–0తో నెగ్గింది. ముగ్గురు స్పిన్నర్లతో... ఈ సీజన్లో ఆడిన మూడు టెస్టు సిరీస్‌లలో కూడా భారత్‌లో పిచ్‌లపై ఎలాంటి విమర్శలు రాలేదు. పూర్తిగా స్పిన్ పిచ్‌లను వాడుకొని ఫలితం సాధించారని ప్రశ్నించే అవకాశం లేకుండా అన్ని మైదానాల్లో అన్ని రకాల పరిస్థితుల్లో జట్టు విజయాలు అందుకుంది. జట్టులో అందరూ ఫామ్‌లో ఉండటంతో మరింత ఆత్మవిశ్వాసంతో ఈ సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. విజయ్, రాహుల్, పుజారా, రహానేలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కోహ్లి భీకర బ్యాటింగ్ విషయంలో మరో మాటకు తావు లేదు. వెస్టిండీస్ పర్యటన నుంచి చూస్తే గత 13 టెస్టుల్లో కోహ్లి 80కు పైగా సగటుతో 1,457 పరుగులు సాధించాడు. వరుసగా నాలుగు సిరీస్‌లలో ‘డబుల్ సెంచరీలు’ అతని ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో కీపర్ సాహా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక అశ్విన్, జడేజాల బ్యాటింగ్ విషయంలో కూడా ఎలాంటి సందేహాలు లేవు. గత టెస్టుతో పోలిస్తే ఈసారి స్పిన్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని భారత్ భావిస్తోంది. అందుకే ఒక పేసర్ స్థానంలో జయంత్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక మన స్పిన్ జంట మరోసారి ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు అస్త్రాలతో సిద్ధమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్, నంబర్‌టూ జడేజా మరోసారి భారత భాగ్యచక్రాన్ని పరుగెత్తించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. గత 13 టెస్టుల్లో అశ్విన్ ఏకంగా 78 వికెట్లు తీయగా, 10 టెస్టుల్లో జడేజాకు 49 వికెట్లు దక్కాయి. జడేజా కెరీర్లో తీసిన 117 వికెట్లలో 96 భారత గడ్డపైనే వచ్చాయంటే అతను ఇక్కడ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వాలన్నా, ప్రత్యర్థికి దీటుగా బరిలో నిలవాలన్నా ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌పైనే అంతా ఆధారపడి ఉంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లను ఆ జట్టు ప్రధానంగా నమ్ముకుంటోంది. భారత్‌లో వార్నర్ గత రికార్డు అంత గొప్పగా ఏమీ లేకపోయినా... ఐపీఎల్ అనుభవం, ఇటీవలి ఫామ్ వల్ల అతను ఈ సారి మరింత మెరుగ్గా ఆడగలడని ఆసీస్ భావిస్తోంది. గత కెప్టెన్ క్లార్క్లాగే స్మిత్‌కు కూడా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యం ఉంది. అతను పట్టుదలగా క్రీజ్‌లో నిలబడగలిగితే ఆసీస్ అవకాశాలు మెరుగు పడతాయి. ఇటీవలే శ్రీలంక చేతిలో 0–3తో చిత్తుగా ఓడినప్పుడు కూడా మంచి ప్రదర్శన కనబర్చిన షాన్ మార్‡్ష స్పిన్‌ను బాగా ఆడగలడు. మరోవైపు భారత్‌తో పోలిస్తే ఆసీస్ స్పిన్ విభాగం బలహీనంగానే ఉంది. గతంలో ఇక్కడ ఆడినప్పుడు ప్రభావం చూపిన నాథన్ లియోన్‌తో పాటు ఓ కీఫ్లను ఆ జట్టులో ప్రధాన స్పిన్నర్లు. లెగ్ స్పిన్నర్ స్వెప్సన్కు అప్పుడే అవకాశం దక్కకపోవచ్చు కానీ పిచ్‌ను బట్టి మూడో స్పిన్నర్ అవసరమైతే అగర్ లేదా మ్యాక్స్‌వెల్‌కు చోటు లభి స్తుంది. మరోవైపు స్టార్క్, హాజల్‌వుడ్ రూపంలో ఆ జట్టులో ఇద్దరు బ లమైన పేసర్లు ఉం డటం కలిసొచ్చే అంశం. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రెన్షా, షాన్ మార్ష, హ్యాండ్స్కోంబ్, మిషెల్ మార్ అగర్, వేడ్, స్టార్క్, కీఫ్, లియోన్, హాజల్‌వుడ్. ► నా కెప్టెన్సీ గురించి విశ్లేషించేందుకు ఇది సరైన సమయం కాదు. మరికొన్నేళ్ల తర్వాత కూడా నేను కెప్టెన్‌గానే ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. జట్టు బాగా ఆడినప్పుడే కెప్టెన్సీ కూడా బాగుంటుంది. అయితే నాయకుడినయ్యాక నా ఆట ఇంకా మెరుగు పడిందని మాత్రం చెప్పగలను. మా దృష్టిలో అన్ని సిరీస్‌లూ సమానమే. బంగ్లాదేశ్‌లాగే ఆస్ట్రేలియా జట్టును కూడా గౌరవిస్తాం. ఈ సీజన్లో అన్ని జట్లు మాకు గట్టిపోటీనే ఇచ్చాయి. ఈ వేసవి ఆరంభంలో భారత్‌లో పిచ్‌లు పొడిగా ఉండి స్పిన్‌కు అనుకూలించడం సహజం. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ మాకు సంబంధించి ఇది కఠినమైన సిరీస్ కాబోతుందని తెలుసు. భారత జట్టులో 1 నుంచి 11 వరకు కూడా నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. 0–4తో సిరీస్ ఓడిపోతామని కొందరు చేసిన వ్యాఖ్యలకు నేను ప్రాధాన్యతనివ్వను. మా జట్టుకు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉంది. సిరీస్ హోరాహోరీగా జరుగుతుంది. పేసర్ స్టార్క్ ఇక్కడా మా ప్రధాన ఆయుధం కాగలడు. శ్రీలంక సిరీస్ పరాజయం మాకు పాఠాలు నేర్పింది. ఈ సారి తగిన వ్యూహాలతో వచ్చాం. – స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ ► ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ► 25 భారత్‌లో పుణే 25వ టెస్టు వేదిక పిచ్, వాతావరణం పుణే మైదానంలో ఇదే తొలి టెస్టు మ్యాచ్. పిచ్ బాగా పొడిగా కనిపిస్తోంది. తొలి రోజునుంచే బంతి టర్న్ అయ్యేందుకు అనుకూలం. కొంత రివర్స్ స్వింగ్‌కూ అవకాశం ఉంది. -
బ్రేక్ లేకుండాబాదేశారు
-
బ్రేక్ లేకుండాబాదేశారు
భారత్ 687/6 డిక్లేర్డ్ ► కోహ్లి డబుల్ సెంచరీ ►వృద్ధిమాన్ సాహా శతకం ►రాణించిన రహానే, జడేజా ►బంగ్లాదేశ్ 41/1 వ్యక్తిగత మైలురాళ్లు, జట్టుగా కొత్త రికార్డులు, భాగస్వామ్యంలో కొత్త ఘనతలు... ఏం ఆడినా, ఎలా ఆడినా వెల్లువలా వచ్చి పడిన పరుగులు... ఒకవైపు మన బ్యాట్స్‌మెన్ తమలో తాము పరుగులు చేయడంలో పోటీ పడితే, అటు వైపు నుంచి ఫీల్డింగ్ వైఫల్యాలు, డీఆర్ఎస్ అన్నీ అండగా నిలిచాయి. ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిన భారత్ అద్భుత ప్రదర్శన ముందు ప్రత్యర్థి కకావికలమైంది. పరుగులు ఇవ్వడంలో ఐదుగురు బౌలర్ల సెంచరీ... పేసర్ల ప్రదర్శన జాలి పడేలా ఉంటే, నమ్ముకున్న స్పిన్నర్లు చేతులెత్తేశారు. క్యాచ్‌లు వదిలేశారు, రనౌట్ చేయలేకపోయారు, చిన్నపిల్లాడు కూడా చేయగలిగే స్టంపింగ్ కూడా సాధ్యం కాలేదు. ఒక్కటంటే ఒక్క వ్యూహం పని చేయకపోగా, ఒక్కసారైనా డీఆర్ఎస్ వాడటం రాలేదు. భారత్‌లో టెస్టు మ్యాచ్ అంటే ఆట కాదని, ఇంకా తాము ‘బేబీ’లమేనని బంగ్లాకు ఈపాటికి అర్థమైపోయింది. ఫలితంగా భారత గడ్డపై తొలిసారి ఆడుతున్న టెస్టులో రెండో రోజే బంగ్లాదేశ్ చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోయింది. హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజే భారత్‌కు పట్టు చిక్కింది. కొండలాంటి స్కోరు నమోదు చేసిన టీమిండియా, అప్పుడే ప్రత్యర్థి జట్టు వికెట్ తీసి వేట మొదలు పెట్టేసింది. టీ విరామం తర్వాత కొద్ది సేపటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 687 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లి (246 బంతుల్లో 204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీని పూర్తి చేసుకొని పలు రికార్డులు నమోదు చేశాడు. వృద్ధిమాన్ సాహా (155 బంతుల్లో 106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కెరీర్లో రెండో సెంచరీ సాధించగా... అజింక్య రహానే (133 బంతుల్లో 82; 11 ఫోర్లు), రవీంద్ర జడేజా (78 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో వికెట్ నష్టపో యి 41 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (24 బ్యాటింగ్), మోమినుల్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మరో 646 పరుగులు వెనుకబడి ఉంది. సెషన్ 1: ఆగని జోరు ఓవర్‌నైట్ స్కోరు 356/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఎక్కడా తగ్గలేదు. కోహ్లి బౌండరీలతో విరుచుకుపడగా, మరో ఎండ్‌లో రహానే 73 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రక్షణాత్మక ఫీల్డింగ్ వ్యూహాలు కొనసాగించడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. కొద్దిసేపట్లోనే కోహ్లి 150 పరుగుల మార్క్‌ను కూడా చేరుకున్నాడు. ఎట్టకేలకు రహానేను అవుట్ చేసి తైజుల్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. రెండో రోజు వీరిద్దరు సరిగ్గా 100 పరుగులు జోడించారు. 180 పరుగుల వద్ద అంపైర్ కోహ్లిని ఎల్బీగా ప్రకటించినా... భారత కెప్టెన్ రివ్యూకు వెళ్లి సానుకూల ఫలితం పొందాడు. 4 పరుగుల వద్ద సాహాను స్టంపౌంట్ చేసే సునాయాస అవకాశాన్ని కూడా ముష్ఫికర్ వృథా చేశాడు. ఓవర్లు: 31, పరుగులు: 121, వికెట్లు: 1 సెషన్ 2: పరుగుల వరద విరామం తర్వాత మూడో ఓవర్లోనే భారత అభిమానులంతా ఎదురు చూసిన క్షణం వచ్చింది. తైజుల్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ కొట్టి విరాట్ కేవలం 239 బంతుల్లో కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే అతను ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూలో నాటౌట్‌గా తేలేందుకు కొంత అవకాశం ఉన్నా... కోహ్లి ఈసారి సమీక్ష కోరకుండా నేరుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ దశలో జత కలిసిన సాహా, అశ్విన్ (45 బంతుల్లో 34; 4 ఫోర్లు) చకచకా పరుగులు జోడించారు. తస్కీన్ ఓవర్లో అశ్విన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, షకీబ్ బౌలింగ్‌లో సాహా ఫోర్, సిక్స్ బాదాడు. మరో రనౌట్ అవకాశాన్ని వదిలేసుకున్న బంగ్లా, అదే ఓవర్లో అశ్విన్‌ను అవుట్ చేసి ఊరట పొందింది. సాహా, అశ్విన్ ఆరో వికెట్‌కు 74 పరుగులు జత చేశారు. జడేజా అవుట్ విషయంలో కూడా రివ్యూ కోరి బంగ్లా దానినీ వృథా చేసుకుంది. 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సాహా ఆ తర్వాతా తన ధాటిని కొనసాగించాడు. ఓవర్లు: 32, పరుగులు: 143: వికెట్లు: 2 సెషన్ 3: మెరుపు బ్యాటింగ్ చివరి సెషన్లో సాహా, జడేజా మరింత దూకుడు ప్రదర్శించారు. తైజుల్ వేసిన ఓవర్లో ముందుగా భారీ సిక్సర్ కొట్టిన జడేజా తర్వాతి బంతికి అర్ధ సెంచరీ సాధించాడు. మరుసటి బంతినే మరో భారీ సిక్సర్‌గా మలచి సాహా 153 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు ఓవర్లలో జడేజా రెండు బౌండరీలు కొట్టిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తమీమ్, సర్కార్ (15) జాగ్రత్తగా ఆరంభించారు. భువీ బౌలింగ్‌ను ఆచితూచి ఆడిన వీరిద్దరు ఇషాంత్ బౌలింగ్‌లో మాత్రం చెరో మూడు ఫోర్లు బాదారు. అయితే ఉమేశ్ వేసిన తొలి ఓవర్లోనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి సర్కార్ వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, భారత్ రివ్యూకు వెళ్లి ఫలితం పొందింది. ఓవర్లు:13, పరుగులు: 67, వికెట్లు: 0 (భారత్) ఓవర్లు:14, పరుగులు: 41, వికెట్లు: 1 (బంగ్లాదేశ్) వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరుగులు వరద పారించడమే తన పని అన్నట్లు భారత కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కోహ్లి డబుల్ సెంచరీ (246 బంతుల్లో 204; 24 ఫోర్లు) సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వరుసగా మూడు సిరీస్‌లలో డబుల్ సెంచరీలు చేశారు. తాజా ‘డబుల్ సెంచరీ’తో కోహ్లి వీరిద్దరినీ అధిగమించాడు. ► 200 వెస్టిండీస్‌పై అంటిగ్వాలో జూలై, 2016లో ► 211 న్యూజిలాండ్‌పై ఇండోర్‌లో అక్టోబర్, 2016లో ► 235 ఇంగ్లండ్‌పై ముంబైలో డిసెంబర్, 2016లో ► 204 బంగ్లాదేశ్‌పై హైదరాబాద్‌లో ఫిబ్రవరి, 2017లో -
పాపం నాయర్...
అద్భుతమైన ఆటతో గత టెస్టులో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసినా కరుణ్ నాయర్‌కు తర్వాతి మ్యాచ్‌లో మాత్రం జట్టులో చోటే దక్కలేదు. ముందునుంచీ కోచ్, కెప్టెన్ చెబుతూ వచ్చినట్లు గాయం నుంచి కోలుకొని వచ్చిన రహానేపైనే మేనేజ్మెంట్ నమ్మకముంచింది. దాంతో నాయర్ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. వేర్వేరు కారణాలతో ఇలా ‘ట్రిపుల్ సెంచరీ’ చేశాక తమ జట్టు ఆడిన తర్వాతి మ్యాచ్‌లో చోటు దక్కని నాలుగో ఆటగాడు కరుణ్. గతంలో ఆండీ సాన్దమ్, లెన్ హటన్, ఇంజమామ్ ఈ దురదృష్టవంతుల జాబితాలో ఉన్నారు. -
3 పరుగులు.. 3 వికెట్లు ఢమాల్!
ముంబై: భారత్-ఏ జట్టుతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. రహానే కెప్టెన్సీలో యువ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. టీమ్ స్కోరు 163 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 164 వద్ద ఐదో వికెట్, 165వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన దిండా చివరి బంతికి బెయిర్ స్టో(64: 65 బంతుల్లో 10 ఫోర్లు) కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో బట్లర్ పరుగులేవీ చేయకుండానే రసూల్ బౌలింగ్ లో అతడే క్యాచ్ పట్టడంతో డకౌట్ గా వెనుదిరిగాడు. మరోసారి దిండా మ్యాజిక్ చేశాడు. 29వ ఓవర్ తొలి బంతికి మోయిన్ అలీ(1)ని ఔట్ చేశాడు. ఇక్కడి బ్రాబౌర్న్ స్డేడియంలో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఐదు ఓవర్లలో 42 పరుగుల వద్ద ఓపెనర్ జాసన్ రాయ్ హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. హేల్స్ హాఫ్ సెంచరీ(51: 53 బంతుల్లో 8 ఫోర్లు)తో ఆకట్టుకున్నాడు. అయితే జట్టు స్కోరు 116 వద్ద హెల్స్, ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఔట్ కావడంతో బెయిర్ స్టో, స్టోక్స్ మరో వికెడ్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దిండాను బెయిర్ స్టో ఔట్ చేయగానే మరో రెండు వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. 30 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. -
రిషభ్ పంత్‌పైనే అందరి దృష్టి!
నేడు రెండో వార్మప్ మ్యాచ్ ఇంగ్లండ్ ఎలెవన్‌తో భారత్ ‘ఎ’ పోరు బరిలో రహానే, రైనా ముంబై: సీనియర్ల వార్మప్ ముగిసిపోయింది. ఇప్పుడు ఫామ్‌లో లేని ఆటగాళ్లతో పాటు కొత్త కుర్రాళ్లు తమ సాధనకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్ ఎలెవన్‌తో గురువారం భారత్ ‘ఎ’ జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టి20 టీమ్‌కు ఎంపికైన సురేశ్ రైనా కూడా తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే వీరికంటే కూడా అందరి చూపూ ఇప్పుడు 19 ఏళ్లు కుర్రాడు రిషభ్ పంత్‌పైనే నిలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనికి వారసుడిగా భావిస్తుండటంతో అతని ఆటతీరుపై ప్రత్యేక దృష్టి ఉండటం ఖాయం. మరోవైపు తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ మరోసారి తమ ధాటిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. రహానేకు పరీక్ష... టి20 జట్టులో స్థానం కోల్పోయి కేవలం వన్డేలకే ఎంపికైన రహానే, ఈ మ్యాచ్‌లో తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఇటీవల టెస్టుల్లోనూ విఫలమైన తర్వాత ఒక రకంగా సెలక్టర్ల హెచ్చరికకు గురైన ఈ ముంబై ఆటగాడు, ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించడం ఎంతో అవసరం. మరోవైపు సురేశ్ రైనా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వన్డే జట్టులో అవకాశం దక్కించుకోలేని అతను, టి20 సిరీస్‌కు ముందు ఆడుతున్న ఈ ఏకైక మ్యాచ్‌లో చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. రంజీ ట్రోఫీలో భీకర ప్రదర్శనతో భారత టి20 టీమ్‌లోకి ఎంపికైన పంత్‌కు ఇది చక్కటి అవకాశం. నాలుగు రోజుల మ్యాచ్‌లే అయినా రంజీల్లో కూడా మెరుపు వేగంతో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు అతడి దూకుడును ప్రపంచానికి చూపించాయి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోని మార్గనిర్దేశనంలో ఎదిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సెలక్టర్లు అతడికి చోటు కల్పించారు. తన ఆటను ప్రదర్శించేందుకు ఈ ఢిల్లీ ఆటగాడికి ఇదే సరైన వేదిక. జట్టులో ఇతర సభ్యులలో షాబాద్ నదీమ్ టీమిండియాలో స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా (56) నిలిచిన నదీమ్, ఇంగ్లండ్‌ను తన స్పిన్‌తో ఇబ్బంది పెట్టవచ్చు. దీపక్ హుడా, ఇషాన్ కిషన్వంటి కుర్రాళ్లతో పాటు టీమ్‌లో పునరాగమనాన్ని ఆశిస్తున్న వినయ్ కుమార్, అశోక్ దిండా, పర్వేజ్ రసూల్ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ జోరుగా... మరోవైపు తొలి వార్మప్ మ్యాచ్ విజయం ఇంగ్లండ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆశించినట్లుగానే టీమ్ వన్డే స్పెషలిస్ట్‌లు హేల్స్, రాయ్, బట్లర్ గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు ద్రవిడ్ సూచనలతో స్పిన్‌ను బాగా ఆడటం నేర్చుకున్నానని చెప్పిన బిల్లింగ్స్ కూడా భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కాబట్టి బ్యాటింగ్ పరంగా టీమ్‌కు సమస్య లేదు. అయితే వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మాత్రం ఇంగ్లండ్ కాస్త తడబడింది. బాల్ వికెట్లు తీసినా... అతనితో పాటు వోక్స్, విల్లీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక ప్రధాన స్పిన్నర్లు అలీ, రషీద్ కూడా రాణించాల్సి ఉంది. మొదటి మ్యాచ్ ఆడని కీలక ఆటగాడు స్టోక్స్ ఇందులో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
డీఆర్ఎస్ కంటే ఆట ముఖ్యం: రహానే
రాజ్‌కోట్: ఎనిమిదేళ్ల అనంతరం భారత జట్టు అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి (డీఆర్ఎస్) అమలుతో టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. అయితే దీని గురించి ఎక్కువ చర్చ అనవసరమని... డీఆర్ఎస్ కంటే ఆట గురించి ఆలోచించడం ముఖ్యమని భారత బ్యాట్స్‌మన్ రహానే అన్నాడు. ‘డీఆర్ఎస్ గురించి గత సిరీస్ నుంచే మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మా దగ్గర ప్రణాళికలు ఉన్నారుు. ఇది అమలు ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఎలాంటి నిర్ణయాలను సమీక్షించమని అడగాలి లాంటి అంశాలపై చర్చించుకున్నాం. అరుుతే దీని కంటే నాణ్యమైన క్రికెట్ ఆడటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి’ అని రహానే చెప్పాడు. డీఆర్ఎస్ను ఉపయోగించుకోవడంలో వికెట్ కీపర్, స్లిప్‌లో ఫీల్డర్ పాత్ర కీలకమని అన్నాడు. రివ్యూకు వెళ్లడంపై ప్రతీసారీ స్పష్టత ఉండాల్సిందేనని అన్నాడు. మరోవైపు మూడు దశాబ్దాల అనంతరం భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. దీంతో సిరీస్ ముగింపు వరకు ఆటగాళ్లు తాజాగా ఉండడంతో పాటు ఆసక్తి కోల్పోకుండా ఉండడం ముఖ్యమని రహానే అభిప్రాయపడ్డాడు. అరుుతే ఇంగ్లండ్ పర్యటన (2014)లో తాము ఐదు టెస్టుల సిరీస్ ఆడామని, ఎలా పోరాడాలో తమకు అవగాహన ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ లైనప్ అనుభవంతో కూడుకుందని, వారి స్పిన్నర్లు కొత్తవారే అరుునా అలసత్వం తగదని సూచించాడు. ‘గత ఏడాదిన్నర కాలం నుంచి మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. నిలకడగా ఆడడం చాలా ముఖ్యం. రాజ్‌కోట్‌లో ఆధిక్యం ప్రదర్శించి సిరీస్ మొత్తం అదే ఆటను చూపాలనే ఆలోచనలో ఉన్నాం. విరాట్ కెప్టెన్సీలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నాం. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని 28 ఏళ్ల రహానే తెలిపాడు. డీఆర్ఎస్ కీలకం: బ్రాడ్ ఇంగ్లండ్ జట్టుకు డీఆర్ఎస్ కొత్త కాకపోరుునా భారత గడ్డపై విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్ కాస్త భిన్నంగా ఉంటుంది. మా దగ్గర బంతి సీమ్, స్వింగ్ అయ్యే విధానంతో పోలిస్తే ఇక్కడ స్పిన్ చాలా తేడాగా ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకోవడం కష్టం. ఈ సిరీస్‌లో డీఆర్ఎస్ పాత్ర చాలా కీలకంగా ఉండనుంది’ అని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. -
వన్డేల్లోనూ పని పట్టాలి
రేపు కివీస్‌తో భారత్ తొలి మ్యాచ్ దూకుడు కొనసాగిస్తామన్న రహానే ధర్మశాల: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో 1-4తో చిత్తు... ఆ తర్వాత జింబాబ్వేపై 3-0తో ఘన విజయం... 2016లో భారత వన్డే జట్టు రికార్డు ఇది. ఈ సంవత్సరం మన జట్టు చెప్పుకోదగ్గ సంఖ్యలో వన్డేలు ఆడకపోగా, తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగుతోంది. టెస్టుల్లో కివీస్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత అలాంటి ప్రదర్శనను కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. పైగా కోహ్లి నాయకత్వ పటిమతో ఇప్పుడు ధోనిపై కూడా అదే స్థారుులో అంచనాలు ఉండటంతో పాటు అతనిపై కూడా ఒత్తిడి ఉండటం ఖాయం. పూర్తిగా జూనియర్లతో జింబాబ్వేలో విజయవంతంగా జట్టును నడిపించినా... గత ఏడాది భారత్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవాన్ని అతను మర్చిపోకపోవచ్చు. టెస్టు టీమ్‌తో పోలిస్తే సౌతీ, అండర్సన్‌లాంటి స్పెషలిస్ట్‌లు జట్టులోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచగా... మన జట్టు కీలక బౌలర్లు అశ్విన్, షమీలకు వన్డేలనుంచి విశ్రాంతినిచ్చింది. ఆఖరి సారిగా న్యూజిలాండ్ గడ్డపై ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను భారత్ 1-4తో కోల్పోరుుంది. ర్యాంకుల్లో కివీస్ జట్టు మనకంటే ఒక స్థానం ముందే ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుదీర్ఘ సమయం పాటు భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొంది. కెప్టెన్ ధోని, కోహ్లిలతో పాటు జట్టు సభ్యులంతా నెట్స్‌లో పాల్గొన్నారు. తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ ఎక్కువ సేపు బౌలింగ్ చేశాడు. అశ్విన్ గైర్హాజరులో అతను మ్యాచ్ బరిలోకి దిగవచ్చు. ‘టెస్టుల్లాగే వన్డేల్లోనూ దూకుడుగా ఆడతాం. మా బలమేంటో మాకు బాగా తెలుసు. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉన్నాం. వన్డేలకు అనుగుణంగా ఆటను మార్చుకోవడం సమస్య కాదు. కొత్తగా జట్టుతో చేరిన కుర్రాళ్లు సత్తా చాటుతారని నమ్ముతున్నా’ అని మ్యాచ్ సందర్భంగా భారత బ్యాట్స్‌మన్ అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. భారత్‌లోనే ఇతర మైదానాలతో పోలిస్తే ధర్మశాల మరీ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలం కాదు. పేసర్లకు ఈ పిచ్ చక్కగా అనుకూలిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే కివీస్‌కు కూడా ఒక రకంగా అనుకూల మైదానం ఇది. ఈ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన భారత్ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. 2013లో ఇంగ్లండ్ చేతిలో ఏడు వికెట్లతో ఓడగా... 2014లో వెస్టిండీస్‌పై 59 పరుగులతో నెగ్గింది. -
పరుగుల వరద ఆగలేదు
-
పరుగుల వరద ఆగలేదు
విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ రహానే భారీ శతకం 365 పరుగుల రికార్డు భాగస్వామ్యం తొలి ఇన్నింగ్స్ లో భారత్ 557/5 డిక్లేర్డ్ న్యూజిలాండ్‌తో చివరి టెస్టు విరాట్ కోహ్లి ఎక్కడా తగ్గలేదు... సెంచరీ నుంచి అలవోకగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకొని తన ఆటను, స్థాయిని ప్రదర్శించాడు. ద్విశతకం కొట్టి నాలుగు టెస్టులే అయింది. అంతలోనే బ్యాటింగ్‌లో తడబడుతున్నారని అనేశారు... కానీ భారీ స్కోరు ఎంతో దూరంలో లేదని ఈ మ్యాచ్‌కు ముందు చెప్పిన కోహ్లి, ఇప్పుడు దానిని చేసి చూపించాడు. మరోసారి డబుల్ సెంచరీతో గతంలో భారత కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు. బౌన్సర్లు శరీరాన్ని బలంగా తాకాయి... షార్ట్ పిచ్ బంతులు ఒంటిపై ముద్రలు వేశాయి... కానీ రహానే తొణకలేదు. అతని పట్టుదల ముందు ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయారు. అతని అంకితభావానికి పరుగులు దాసోహమయ్యాయి. త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నా అమూల్యమైన ఇన్నింగ్స్ తో రహానే తన విలువేమిటో చూపించాడు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ సాగిన కోహ్లి, రహానేల కళాత్మక బ్యాటింగ్ పలు రికార్డులను తుడిచి పెట్టేసింది. ఏకంగా 365 పరుగులతో భారత్ తరఫున నాలుగో వికెట్‌కు వీరిద్దరు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి ఆటతో మూడో టెస్టుపైనా రెండో రోజే భారత్ పట్టు బిగించగా... ఇక కివీస్ ఏ మాత్రం పోరాడుతుందనేది ఆసక్తికరం. ఇండోర్: మూడో టెస్టులో తొలిరోజే మొదలైన భారత్ పరుగుల ప్రవాహం రెండో రోజూ ఆగలేదు. కోహ్లి, రహానే అద్భుత ఆటతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనూ దాదాపుగా చేతులెత్తేసింది. ఆదివారం భారత్ తమ తొలి ఇన్నింగ్‌సను 5 వికెట్ల నష్టానికి 557 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (366 బంతుల్లో 211; 20 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించగా, అజింక్య రహానే (381 బంతుల్లో 188; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 365 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత రోహిత్ శర్మ (63 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స ఆడాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. గప్టిల్ (17), లాథమ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుత భారత స్కోరు, పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే మూడో రోజు కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. తొలి సెషన్: తగ్గని దూకుడు ఓవర్‌నైట్ స్కోరు 267/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ అదే జోరు కొనసాగించింది. కోహ్లి, రహానే ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడుతూ అలవోకగా పరుగులు సాధించారు. పేసర్ హెన్రీ మాత్రం వరుసగా షార్ట్ పిచ్ బంతులతో రహానేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రహానే 210 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. కివీస్ బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో కోహ్లి, రహానే చకచకా పరుగులు తీశారు. ఈ సెషన్లో ఆ జట్టు కనీసం ఒక్క మెరుుడిన్ ఓవర్ కూడా వేయలేకపోయింది. ఓవర్లు: 27, పరుగులు: 91, వికెట్లు: 0 రెండో సెషన్: కోహ్లి డబుల్ లంచ్ అనంతరం భారత బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 273 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరుకున్న కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. నీషమ్ బౌలింగ్‌లో కొట్టిన కవర్‌డ్రైవ్, సాన్‌ట్నర్ ఓవర్లో ఆడిన రివర్స్ షాట్ అతని ఇన్నింగ్సలో హైలైట్‌గా నిలిచాయి. ఎట్టకేలకు హెన్రీ వేసిన బంతిని డీప్ స్క్వేర్ దిశగా పంపి 347 బంతుల్లో కోహ్లి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతవిధాలా ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయిన న్యూజిలాండ్, ఈ టెస్టులో వరుసగా మూడో సెషన్లో కూడా వికెట్ పడగొట్టడంలో విఫలమైంది. ఓవర్లు: 30, పరుగులు: 98, వికెట్లు: 0 మూడో సెషన్: రహానే మిస్ విరామం తర్వాత తొలి ఓవర్లోనే కోహ్లి అద్భుత ఇన్నింగ్స ముగిసింది. పటేల్ బౌలింగ్‌లో అతను వికెట్ల ముందు దొరిగిపోవడంతో రికార్డు భాగస్వామ్యానికి తెర పడింది. మరో వైపు ద్విశతకం దిశగా దూసుకుపోరుున రహానేను దురదృష్టం వెంటాడింది. బౌల్ట్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో రహానే డబుల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఈ దశలో రోహిత్ దూకుడుగా ఆడి భారత్ మరింత భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జడేజా (17 నాటౌట్)నుంచి మంచి సహకారం లభించింది. వీరిద్దరు 9.5 ఓవర్లలోనే ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించడం విశేషం. 62 బంతుల్లో రోహిత్ సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే భారత ఇన్నింగ్స్ ను కోహ్లి డిక్లేర్ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స ఆరంభించారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా వారిద్దరు వికెట్ పడకుండా ఆటను ముగించగలిగారు. ఓవర్లు: 22, పరుగులు: 101, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 9, పరుగులు: 28, వికెట్లు: 0 (కివీస్) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ : విజయ్ (సి) లాథమ్ (బి) పటేల్ 10; గంభీర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 29; పుజారా (బి) సాన్‌ట్నర్ 41; కోహ్లి (ఎల్బీ) (బి) పటేల్ 211; రహానే (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 188; రోహిత్ (నాటౌట్) 51; జడేజా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (169 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 557. వికెట్ల పతనం: 1-26; 2-60; 3-100; 4-465; 5-504. బౌలింగ్: బౌల్ట్ 32-2-113-2; హెన్రీ 35-3-127-0; పటేల్ 40-5-120-2; సాన్‌ట్నర్ 44-4-137-1; నీషమ్ 18-1-53-0. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : గప్టిల్ (బ్యాటింగ్) 17; లాథమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. బౌలింగ్: షమీ 2-0-5-0; ఉమేశ్ 2-0-7-0; అశ్విన్ 3-1-9-0; జడేజా 2-1-2-0. ఓకే రహానే రెండో రోజు ఆటలో మొదటినుంచి రహానేపై హెన్రీ వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. ఆరో ఓవర్లో హెన్రీ విసిరిన బౌన్సర్ నుంచి తప్పించుకునే క్రమంలో రహానే తల వెనక్కి తిప్పినా, పూర్తిగా నియంత్రణలో లేకపోయాడు. దాంతో బంతి నేరుగా అతని హెల్మెట్ వెనుక భాగంలో సరిగ్గా చెవి పైన బలంగా తగిలింది. దాంతో అతను కొద్దిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే హెన్రీతో పాటు ఇతర కివీస్ ఆటగాళ్లు ఆందోళనగా బ్యాట్స్‌మన్ వద్దకు వచ్చేశారు. అయితే ఫిజియో స్వల్ప చికిత్స తర్వాత రహానే సాధారణ స్థితికి వచ్చేశాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా హెన్రీ బౌన్సర్ విసరడం విశేషం! ఈ ఇన్నింగ్స నాకెంతో ప్రత్యేకం. చిరకాలం గుర్తుండిపోతుంది. 100/3 నుంచి మరో 365 పరుగులు జోడించడం నిజంగా అద్భుతం. తొలి రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా స్వేచ్ఛగా ఆడాను. షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. దీనిని ఒప్పుకోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. అయితే పట్టుదలగా నిలబడగలిగా. అందుకే ఈ సెంచరీ అమితానందం ఇస్తే, టెస్టు క్రికెట్ గొప్పతనం ఏమిటో కూడా నాకు తెలిసింది. - రహానే జడేజాకు జరిమానా పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా పిచ్‌పై పరుగెత్తిన జడేజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అంపైర్లు ఫిర్యాదుపై స్పందిస్తూ... జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు 3 డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. రెండేళ్ల లోపు ఈ పాయింట్ల సంఖ్య 4కు చేరితే తీవ్రతను బట్టి మ్యాచ్ నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. భారత్ తరఫున నాలుగో వికెట్‌కు ఇదే (365) అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో సచిన్, లక్ష్మణ్ నెలకొల్పిన (353-సిడ్నీ) భాగస్వామ్యాన్ని కోహ్లి, రహానే అధిగమించారు. భారత్ తరఫున ఏ వికెట్‌కై నా ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం. కెప్టెన్‌గా రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకై క భారత ఆటగాడు కోహ్లి. సచిన్ (2010) తర్వాత ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు భారత బ్యాట్స్‌మన్ కూడా అతనే. జడేజా కావాలనే చేశాడా! భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్లు బ్యాటింగ్ చేసేందుకు అప్పుడే క్రీజ్‌లోకి వస్తున్నారు. ఇంకా మన ఫీల్డర్లు పూర్తిగా సిద్ధం కూడా కాలేదు. ఒక్క బంతి కూడా పడలేదు. కానీ స్కోరు బోర్డు మాత్రం 5/0గా చూపించింది! ఇవి భారత్‌కు అంపైర్లు విధించిన పెనాల్టీ పరుగులు. అంతకు కొద్దిసేపు ముందు రవీంద్ర జడేజా పిచ్‌పై పరుగెత్తినందుకు శిక్షగా ఆట ఆరంభానికి ముందే కివీస్ స్కోరులో ఐదు పరుగులు వచ్చి చేరారుు. తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా షాట్ ఆడి పిచ్పైనుంచే పరుగు తీశాడు. ఒకసారి హెచ్చరించిన అంపైర్లు రెండో సారి అలాగే చేయడంతో పెనాల్టీని విధించారు. ఇది పాత నిబంధనే అరుునా చాలా అరుదుగా మాత్రమే అమల్లో కనిపించింది. అయితే పొరపాటున కాకుండా పిచ్ నుంచి మరింత సహకారం పొందేందుకు జడేజా కావాలని దీనిని చేసినట్లు కూడా వినిపించింది! సరిగ్గా క్రీజ్‌కు సమీపంలో ఫుట్ మార్క్‌లు ఏర్పడటం వల్ల బంతి విపరీతంగా టర్న్ అయి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అలాంటి పరిస్థితిని సృష్టించేందుకే ’సర్’ ఇలాంటి వ్యూహం పాటించాడా అనేదే సందేహం! -
సత్తాచాటిన కోహ్లీ, రహానే
ఇండోర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడోటెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ(366 బంతుల్లో 211: 20 ఫోర్లు)కి అజింక్యా రహానే(381 బంతుల్లో 188 పరుగులు: 18 ఫోర్లు, 4 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. చివర్లో రోహిత్ హాఫ్ సెంచరీ(63 బంతుల్లో 51 నాటౌట్: 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన తర్వాత జట్టుస్కోరు 557/5 వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. భారత్ ఇంకా 529 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్ నైట్ స్కోరు 267/3తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేసింది. కోహ్లీ, రహానే రెండో రోజూ కివీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. డబుల్ సెంచరీ చేసిన తర్వాత జీతన్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా నాలుగో వికెట్ రూపంలో నిష్ర్రమించాడు. కోహ్లీ, రహానే నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 365 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. డబుల్ సెంచరీకి చేరువవుతున్న దశలో వ్యక్తిగత స్కోరు 188 వద్ద బౌల్ట్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచిచ్చి రహానే నిరాశగా వెనుదిరిగాడు. చివర్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. జడేజా(27 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 557/5 వద్ద కోహ్లీ భారత్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 17, లాథమ్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. -
కోహ్లి.. ఒకే ఒక్కడు
ఇండోర్:న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా విరాట్ 347 బంతుల్లో 18 ఫోర్లు సాయంతో ద్విశతకాన్ని పూర్తి చేశాడు. ఇది విరాట్ టెస్టు కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ. అంతకుముందు వెస్టిండీస్ తో ఆంటిగ్వాలో జరిగిన టెస్టుల్లో విరాట్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన భారత కెప్టెన్ గా కోహ్లి కొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్ నమోదు చేసిన ఈ రెండు డబుల్ సెంచరీలు ఒకే ఏడాదిలో రావడం మరో విశేషం. ఆదివారం 267/3 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కు విరాట్-రహానేల జోడి ఆద్యంతం ఆకట్టుకుంది. వీరిద్దరూ కుదురుగా ఆడటంతో భారత్ 144.0 ఓవర్లలో 451 పరుగులు చేసింది. ఈ జోడి నాల్గో వికెట్ కు 350 కు పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ అత్యంత పటిష్ట స్థితికి చేరింది. -
కివీస్ ను కుమ్మేస్తున్నారు!
ఇండోర్:న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలు చెలరేగిపోతున్నారు. ఈ జోడి తమ బ్యాట్లకు మరింత పని చెబుతూ కివీస్‌ను కుమ్మేస్తోంది. నాల్గో వికెట్ కు మూడొందలకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి న్యూజిలాండ్‌కు పరీక్షగా నిలిచారు. దాంతో భారత్ జట్టు 133.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. కోహ్లి(184), రహానే(154)లతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ సాధించిన స్కోరులో 32 ఫోర్లు ఉండటం విశేషం. 267/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ అత్యంత నిలకడగా ఆడటంతో పటిష్టస్థితికి చేరింది. ఇది రెండో రోజు మాత్రమే కావడంతో భారత్ మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది. -
కెప్టెన్ కోహ్లీ శతక్కొట్టాడు!
-
కెప్టెన్ కోహ్లీ శతక్కొట్టాడు!
ఇండోర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(191 బంతుల్లో 103: 10 ఫోర్లు) సాధించాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్ ల తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో శతకం చేశాడు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. దీంతో వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కోహ్లీ, అజింక్యా రహానే(172 బంతుల్లో 79 నాటౌట్: 9 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్ కు అభేద్యమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(10)ను త్వరగా కోల్పోయింది. రెండేళ్ల తర్వాత జట్టులోకొచ్చిన గౌతం గంభీర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో గంభీర్(29, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ను కివీస్ బౌలర్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. పుజారా(41) మరోసారి రాణించాడు. అయితే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయి 100 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 37వ ఓవర్ నుంచి తొలి రోజు ఆట నిలిపివేసే వరకూ రహానే, కోహ్లీలు కివీస్ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. వీరి అజేయ భాగస్వామ్యం (167)తో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. కివీస్ బౌలర్లలో పటేల్, బౌల్ట్, శాంట్నర్ తలో వికెట్ తీశారు. -
కివీస్ కు కోహ్లి, రహానేల పరీక్ష
ఇండోర్: చివరిదైన మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టుకు భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానేలు పరీక్షగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేసి కివీస్ బౌలర్లకు గోడలా నిలిచారు. శనివారం ఆరంభమైన మ్యాచ్‌లో 100 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయినా, ఆ తరువాత కోహ్లి-రహానేల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చింది. వీరిద్దరూ రాణించడంతో భారత తన తొలి ఇన్నింగ్స్ లో 78.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(83), రహానే(53) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు మురళీ విజయ్(10),గౌతం గంభీర్(29), చటేశ్వర పూజారా(41)లు పెవిలియన్ కు చేరారు. -
రహానే @ 2000!
ఇండోర్: భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే టెస్టు క్రికెట్ లో రెండు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ఈ టెస్టు మ్యాచ్ కు ముందు ఈ ఘనతను చేరుకోవడానికి రెండు పరుగుల దూరంలో ఉన్న రహానే దాన్ని పూర్తి చేశాడు. తద్వారా టెస్టు క్రికెట్ లో రెండు వేలకు పైగా పరుగులు సాధించిన 36వ భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. ఈ టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మురళీ విజయ్(10)తొలి వికెట్ గా అవుటైన తరువాత, రెండేళ్ల తరువాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న గౌతం గంభీర్(29;53 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే గంభీర్ టచ్ లోకి వచ్చినట్లు కనిపించినా బౌల్ట్ వేసిన చక్కటి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం చటేశ్వర పూజారా(41;108 బంతుల్లో 6 ఫోర్లు) నిలకడగా ఆడాడు. దాంతో టీ విరామానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
రహానే కెరీర్ బెస్ట్ ర్యాంక్!
దుబాయ్: ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో రాణించిన భారత బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే ఇంర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు . సోమవారం ఐసీసీ వెల్లడించిన ఆటగాళ్ల ర్యాంకుల జాబితాలో రహానే తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్‌తో సంయుక్తంగా 11వ ర్యాంకులో ఉన్న రహానే.. తాజా టెస్టు ర్యాంకుల్లో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన యూనిస్ ఖాన్ మరోసారి టాప్ 5లో చోటు సంపాధించాడు. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్ట్ ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. -
విండీస్ 48/4.. విజయానికి వర్షం అడ్డంకి
► చేతులేత్తేసిన వెస్టిండీస్ టాప్ ఆర్డర్ ► ఇంకా 256 పరుగుల ఆధిక్యంలో కోహ్లి సేన ► కీలకంగా మారిన ఐదో రోజు మ్యాచ్ కింగ్స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. మంగళవారం కూడా వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో నాలుగో రోజు కేవలం 15.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. లంచ్ విరామానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 48 పరుగులు చేసింది. బ్లాక్‌వుడ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత్ 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. తీవ్ర వర్షం కారణంగా లంచ్ తర్వాత మ్యాచ్ జరగలేదు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో అంపెర్లు నాలుగో రోజు ఆట నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెస్టిండీస్‌కు భారీ ఊరట లభించింది. ఈ మ్యాచ్ ఫలితానికి ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది. వరుణుడు శాంతిస్తే తప్ప భారత్‌కు విజయం ఖాయమని చెప్పాలి. గత రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో బుధవారం కూడా వర్షం పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు బ్రాత్‌వైట్, చంద్రిక ఇన్నింగ్స్‌ను ఆరంభించగా... మూడో ఓవర్లోనే ఇషాంత్ శర్మ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. అద్భుత బౌలింగ్‌తో చంద్రికను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన బ్రావో, బ్రాత్‌వైట్ లు రెండో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత బౌలింగ్ ధాటికి వారి ప్రయత్నం ఫలించలేదు. మిశ్రా బౌలింగ్‌లో బ్రాత్‌వైట్(23) ఔటయ్యాడు. వెంటనే శామ్యూల్స్(0)ను షమి ఔట్ చేశాడు. దీంతో విండీస్ 41 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న బ్రావో(20) కూడా వెనువెంటనే షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు, మిశ్రా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. మంగళవారం వర్షం అంతరాయం లేకపోతే మ్యాచ్ విజయం భారత్ ఖాతాలో చేరేది. ఇప్పటికే నాలుగు టెస్టులు సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి 1/0 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 304 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం అంతరాయం కలిగించడంతో సోమవారం వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించని విషయం తెలిసిందే. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 196 భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) డౌరిచ్ (బి) గాబ్రియల్ 158; ధావన్ (సి) బ్రావో (బి) చేజ్ 27; పుజారా (రనౌట్) 46; కోహ్లి (సి) చంద్రిక (బి) చేజ్ 44; రహానే నాటౌట్ 108; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) బిషూ 3; సాహా ఎల్బీడబ్ల్యు (బి) హోల్డర్ 47; మిశ్రా (సి) చంద్రిక (బి) చేజ్ 21; షమీ (బి) చేజ్ 0; ఉమేశ్‌యాదవ్ (సి) హోల్డర్ (బి) చేజ్ 19; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (171.1 ఓవర్లలో 9 వికెట్లకు) 500 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 187, 2-208, 3-277, 4-310, 5-327, 6-425, 7-458, 8-458, 9-500. బౌలింగ్: గాబ్రియల్ 28-8-62-1; కమిన్స్ 26.4-4-87-0; హోల్డర్ 34.2-12-72-1; చేజ్ 36.1-4-121-5; బిషూ 35-5-107-1; బ్రాత్‌వైట్ 11-0-40-0. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) రాహుల్ (బి) మిశ్రా 23; చంద్రిక (బి) ఇషాంత్ 1; బ్రేవో (సి) రాహుల్ (బి) షమీ 20; శామ్యూల్స్ (బి) షమీ 0; బ్లాక్‌వుడ్ బ్యాటింగ్ 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 48. వికెట్ల పతనం: 1-5, 2-41, 3-41; 4-48. బౌలింగ్: ఇషాంత్ 6-0-19-1; షమీ 7.5-2-25-2; మిశ్రా 2-1-4-1. -
ఢిల్లీ బౌలింగ్ అద్భుతం: ధోనీ
సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమితో అష్టకష్టాలు పడుతున్న పుణే సూపర్ జెయింట్స్ మూడో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని పొగిడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా అమిత్ మిశ్రా, ఇమ్రాన్ తాహిర్ చాలా చక్కని బంతులతో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించాడు. బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. పటిస్టమైన ఢిల్లీని కేవలం 162 పరుగులకే పరిమితం చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ వల్లే గెలిచామని అభిప్రాయపడ్డాడు. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ కాస్త మాములుగా అనిపించినా వెంటనే కుదురుకుని విజయాన్ని సాధించామని చెప్పాడు. ఈ విజయంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది ధోనీ పరిస్థితి. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ రేసులో దాదాపు అన్ని సీజన్లలో నిలిచే మహేంద్ర సింగ్ ధోనీ పరిస్థితి ప్రస్తుతం అలా కనపడటం లేదు. గురువారం ఢిల్లీపై నెగ్గి ఈ సీజన్లో ధోనీ నేతృత్వంలోని పుణే మూడో విజయం సొంతం చేసుకుంది. స్టార్ ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి వైదొలగడం, తరచూ మార్పులతో ఓటములు పుణేను వెంటాడాయి. అయితే డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్లో మూడో విజయం సొంతం చేసుకుని ధోనికి కాస్త ఊరట కలిగించినట్లయింది. -
ధోనిసేన గెలిచిందోచ్!
► ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై నెగ్గిన పుణే సూపర్ జెయింట్స్ ► రాణించిన రహానే సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమి... గాయాలతో స్టార్ క్రికెటర్లు దూరం... జట్టులో అనేక మార్పులు... అంతా గందరగోళం... ఇలాంటి స్థితిలో ఉన్న పుణే సూపర్ జెయింట్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. జట్టులో కొత్తగా చేరిన క్రికెటర్లు రాణించడంతో పాటు... రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్లో మూడో విజయం సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: యువ క్రికెటర్ల రాణింపుతో సంచలన విజయాలు సాధిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జోరుకు పుణే సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధోనిసేన ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. డుమిని (32 బంతుల్లో 34; 1 ఫోర్), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 32; 5 ఫోర్లు) రాణించారు. పుణే బౌలర్లలో బోలాండ్, భాటియా రెండేసి వికెట్లు తీసుకున్నారు. పుణే జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రహానే (48 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయంగా అర్ధసెంచరీ చేయగా... తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఖవాజా (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ధోని (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తలా ఓ చేయి... గత మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన పంత్ (2) ఈసారి విఫలం కావడంతో ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే సంజు శామ్సన్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి పరిస్థితిని సరిదిద్దారు. డుమిని, బిల్లింగ్స్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే పుణే బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో ఢిల్లీని నియంత్రించే ప్రయత్నం చేశారు. బ్రాత్‌వైట్ (8 బంతుల్లో 20) మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగినా... ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి పుణే బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఓవర్లో నెగి (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు లభించింది. రాణించిన టాపార్డర్ కొత్తగా జట్టుతో చేరిన ఖవాజా కుదురుకునేందుకు సమయం తీసుకోగా... ఫామ్‌లో ఉన్న పుణే ఓపెనర్ రహానే పవర్‌ప్లేలో చెలరేగి ఆడాడు. క్రమంగా ఖవాజా కూడా బ్యాట్ ఝళిపించడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. మిశ్రా బౌలింగ్‌లో ఖవాజా అవుటయ్యాక... సౌరవ్ తివారీ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాక తివారీ అవుటయ్యాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డ రహానే 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోని భారీ సిక్సర్‌తో ఫామ్‌లో కనిపించాడు. పుణే విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో... షమీ బౌలింగ్‌లో ధోని వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టడంతో ఒకే ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్ తొలి బంతికి ధోని భారీ షాట్ ఆడినా... బిల్లింగ్స్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. పెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లు బాది... ఎలాంటి నష్టం జరగకుండా పుణే విజయాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: రిషబ్ పంత్ (బి) దిండా 2; శామ్సన్ (సి) ఆర్. అశ్విన్ (బి) బోలాండ్ 20; కరుణ్ నాయర్ (సి) పెరీరా (బి) భాటియా 32; డుమిని రనౌట్ 34; బిల్లింగ్స్ (సి) రహానే (బి) భాటియా 24; బ్రాత్‌వైట్ (సి) పెరీరా (బి) బోలాండ్ 20; పవన్ నెగి నాటౌట్ 19; జయంత్ రనౌట్ 1; షమీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-13; 2-48; 3-65; 4-110; 5-137; 6-138; 7-143. బౌలింగ్: దిండా 4-0-34-1; పెరీరా 1-0-9-0; బోలాండ్ 4-0-31-2; ఆర్.అశ్విన్ 4-0-34-0; భాటియా 4-0-22-2; ఎం.అశ్విన్ 3-0-31-0. పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 63; ఖవాజా (స్టం) శామ్సన్ (బి) మిశ్రా 30; సౌరవ్ తివారీ (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 21; ధోని (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 27; పెరీరా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-59; 2-104; 3-146. బౌలింగ్: జయంత్ 4-0-25-0; బ్రాత్‌వైట్ 2-0-17-0; షమీ 3.1-0-50-0; అమిత్ మిశ్రా 4-0-28-1; డుమిని 1-0-9-0; తాహిర్ 4-0-26-2; నెగి 1-0-10-0. -
లయన్స్ ‘సిక్సర్’
► గుజరాత్‌కు ఆరో విజయం ► భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైనా జట్టు ► దుమ్మురేపిన మెకల్లమ్, డ్వేన్ స్మిత్ ► పుణేకు తప్పని ఓటమి స్మిత్ సెంచరీ వృథా పుణే: ఆఖర్లో ఉత్కంఠ చోటు చేసుకున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నా గట్టెక్కింది. దీంతో ఐపీఎల్-9 సీజన్లో ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు స్లాగ్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోయిన పుణే ఖాతాలో మరో పరాజయం చేరిం ది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పుణేపై గెలిచింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. రహానే (45 బంతుల్లో 53; 5 ఫోర్లు), ధోని (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (37 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (22 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. భారీ భాగస్వామ్యం... స్టార్ ఆటగాళ్లు పీటర్సన్, డు ప్లెసిస్‌లు దూరంకావడంతో పుణే కొత్త కూర్పుతో బరిలోకి దిగింది. రహానేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరభ్ తివారి (1) మూడో ఓవర్లోనే రనౌటయ్యాడు. ఈ దశలో వచ్చిన స్మిత్... యాంకర్ పాత్రతో అదరగొట్టాడు. ఐదో ఓవర్లో వరుస బౌండరీలతో కుదురుకున్న అతను ఆ తర్వాతి దశల్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలి ఎండ్‌లో రహానే నెమ్మదిగా ఆడినా... స్మిత్ మాత్రం లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సింగిల్స్ రావాల్సిన చోట డబుల్స్ తీస్తూ... ఆపై బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును కదం తొక్కించాడు. దీంతో పవర్‌ప్లేలో 48/1 ఉన్న పుణే స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 85/1కు చేరింది. ఈ క్రమంలో స్మిత్ 29, రహానే 43 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. 13వ ఓవర్లో రెండో సిక్స్, ఫోర్‌తో స్మిత్ 14 పరుగులు రాబట్టినా... 14వ ఓవర్లో రహానే అవుట్ కావడంతో రెండో వికెట్‌కు 67 బంతుల్లో 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ధోని... స్మిత్‌కు స్ట్రయిక్ ఇవ్వడంతో మరో రెండు సిక్సర్లు బాదేశాడు. 17వ ఓవర్లో ధోని కూడా వరుస సిక్సర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి జోరుతో తర్వాతి రెండు ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్ రెండో బంతికి సెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ వెంటనే అవుటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 35 బంతుల్లోనే 64 పరుగులు జతయ్యాయి. ఐపీఎల్లో ఇది మూడో సెంచరీ. ఇప్పటికే డికాక్ (ఢిల్లీ), విరాట్ కోహ్లి (బెంగళూరు) ఒక్కో సెంచరీ చేశారు. మెకల్లమ్ మోత... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెకల్లమ్ భారీ విధ్వంసాన్ని సృష్టించాడు. తొలి రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే రాగా... మూడో ఓవర్లో మెకల్లమ్ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 24 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి మూడు ఓవర్లలో 39 పరుగులు రావడంతో పవర్‌ప్లేలో లయన్స్ 72 పరుగులు చేసింది. తర్వాత మరో సిక్స్ బాదిన మెకల్లమ్ 9వ ఓవర్లో అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్మిత్ ఆ తర్వాత అశ్విన్‌ను ఫోర్లతో మడత పెట్టేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో లయన్స్ స్కోరు 112/1కి చేరింది. కానీ 11వ ఓవర్లో స్మిత్ అవుట్ కావడంతో పుణే కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత కెప్టెన్ రైనా (28 బంతుల్లో 34; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (20 బంతుల్లో 33; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడినా రన్‌రేట్ తగ్గకుండా చూశారు. దీంతో ఐదు ఓవర్లలో 35 పరుగులు సమకూరాయి. తర్వాత మరో రెండు ఫోర్లు కొట్టి 17వ ఓవర్లో కార్తీక్ అవుటయ్యాడు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశారు. ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో బ్రేవో (7), జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ స్థితిలో వరుస బంతుల్లో రైనా, ఇషాన్ కిషన్ (0) అవుటైనా చివరి బంతికి ఫాల్క్‌నర్ (9 నాటౌట్) జట్టును గట్టెక్కించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 53; సౌరభ్ తివారి రనౌట్ 1; స్మిత్ (బి) బ్రేవో 101; ధోని నాటౌట్ 30; పెరీరా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1-13; 2-124; 3-188. బౌలింగ్: ప్రవీణ్ 4-0-37-0; ధవల్ కులకర్ణి 3-0-25-0; జడేజా 4-0-37-0; కౌశిక్ 3-0-32-0; ఫాల్క్‌నర్ 2-0-22-0; బ్రేవో 4-0-40-1. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) పెరీరా 63; మెకల్లమ్ (సి) మోర్కెల్ (బి) భాటియా 43; రైనా (బి) పెరీరా 34; దినేశ్ కార్తీక్ (సి) రహానే (బి) దిండా 33; బ్రేవో (సి) ధోని (బి) దిండా 7; జడేజా రనౌట్ 0; ఫాల్క్‌నర్ నాటౌట్ 9; ఇషాన్ కిషన్ రనౌట్ 0; ప్రవీణ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-93; 2-115; 3-166; 4-180; 5-180; 6-193; 7-193. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 2-0-30-0; అశోక్ దిండా 4-0-40-2; పెరీరా 4-0-41-2; ఆర్.అశ్విన్ 4-0-37-0; రజత్ భాటియా 3-0-26-1; ఎం.అశ్విన్ 3-0-22-0. -
కోల్‌కతా తీన్మార్
► వరుసగా మూడో విజయం ► రాణించిన సూర్యకుమార్, యూసుఫ్ ► రహానే శ్రమ వృథా పుణే: జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న ఓపెనర్లు తొలిసారి విఫలమైనా... చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుతంగా కాపాడుకుంది. సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పుణేను ఓడించి వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. రహానే (52 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (28 బంతుల్లో 31; 2 ఫోర్లు) రాణించారు. ఆరంభంలో నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించడంతో నాలుగో ఓవర్లోనే డు ప్లెసిస్ (4) వికెట్ కోల్పోయింది. అయితే స్మిత్, రహానే నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మ్యాచ్ మధ్యలో స్పిన్నర్లు రాణించడంతో పుణే తొలి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ దశలో పెరీరా (9 బంతుల్లో 12; 1 సిక్స్) నిరాశపర్చినా.... ఆల్బీ మోర్కెల్ (9 బంతుల్లో 16; 2 సిక్సర్లు), రహానేలు భారీ సిక్సర్లతో రన్‌రేట్‌ను పెంచారు. ఆఖర్లో ధోని (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. చివరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు సమకూరడంతో పుణే భారీ స్కోరు సాధించింది. తర్వాత కోల్‌కతా 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కాడు. మూడు ఓవర్లు ముగియకముందే ఓపెనర్లు ఉతప్ప (0), గంభీర్ (11) అవుట్‌కాగా, వన్‌డౌన్‌లో షకీబ్ (3) కూడా నిరాశపర్చాడు. దీంతో కోల్‌కతా 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్, యూసుఫ్ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించినా...వరుస ఓవర్లలో అవుట్ కావడం దెబ్బతీసింది. తర్వాత రసెల్ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) వేగంగా ఆడినా వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు. ఇక 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో సతీష్ (10) సిక్స్ కొట్టి అవుట్ కావడంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో చావ్లా (8) కూడా అవుటైనా... ఉమేశ్ (7 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి అండ్ బి) నరైన్ 67; డు ప్లెసిస్ (బి) షకీబ్ 4; స్మిత్ రనౌట్ 31; పెరీరా (బి) సతీష్ 12; ఆల్బీ మోర్కెల్ (బి) ఉమేశ్ 16; ధోని నాటౌట్ 23; భాటియా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-24; 2-80; 3-99; 4-119; 5-133. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 3-0-30-0; రసెల్ 2-0-16-0; షకీబ్ 3-0-14-1; నరైన్ 4-0-32-1; చావ్లా 3-0-26-0; సతీష్ 3-0-20-1; ఉమేశ్ 2-0-16-1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 0; గంభీర్ రనౌట్ 11; సూర్యకుమార్ ఎల్బీడబ్ల్యు (బి) ఎం.అశ్విన్ 60; షకీబ్ (బి) భాటియా 3; యూసుఫ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 36; రసెల్ (సి) డు ప్లెసిస్ (బి) పెరీరా 17; సతీష్ (బి) మోర్కెల్ 10; చావ్లా (సి) స్మిత్ (బి) పెరీరా 8; ఉమేశ్ నాటౌట్ 7; నరైన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (19.3 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-0; 2-31; 3-60; 4-111; 5-119; 6-139; 7-151, 8-156. బౌలింగ్: ఆల్బీ మోర్కెల్ 3-0-36-2; పెరీరా 3.3-0-28-2; ఆర్.అశ్విన్ 2-0-21-0; భాటి యా 4-0-19-2; అంకిత్ శర్మ 3-0-26-0; ఎం.అశ్విన్ 4-0-32-1. -
లయన్స్ ‘పవర్’
► గుజరాత్‌కు వరుసగా రెండో విజయం ►7 వికెట్లతో పుణే జెయింట్స్ చిత్తు ► చెలరేగిన ఫించ్, మెకల్లమ్ ► బంతితో మెరిసిన జడేజా ఐపీఎల్లో తొలి సారి బరిలోకి దిగి తలపడిన రెండు జట్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లేవర్ కనిపించింది. ధోని, అశ్విన్, డు ప్లెసిస్ ఒక వైపు... రైనా, జడేజా, మెకల్లమ్, బ్రేవో మరో వైపు నిలిచారు. అయితే పుణేతో పోలిస్తే లయన్స్ జట్టులో భారీ షాట్లు ఆడే ‘పవర్’ హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చింది. పుణేలో అత్యుత్తమ క్లాసిక్ ఆటగాళ్లు ఉన్నా... టి20కి కావలసిన ‘పవర్’తో ఆడలేకపోయారు. మొత్తానికి తమిళుల కొత్త సంవత్సరం రోజున రెండు పాత తమిళ జట్ల పోరాటంలా సాగిన మ్యాచ్‌లో ధోనిపై రైనా పైచేయి సాధించాడు. రాజ్‌కోట్:ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో సాధికార విజయం సాధించింది. గురువారం పుణే జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (43 బంతుల్లో 69; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ పీటర్సన్ (31 బంతుల్లో 37; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 61 బంతుల్లో 86 పరుగులు జోడించగా... చివర్లో ధోని (10 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. జడేజా, తాంబే చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లయన్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (31 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 51 బంతుల్లోనే 85 పరుగులు జత చేసి జట్టు విజయాన్ని సులువు చేశారు. భారీ భాగస్వామ్యం: సూపర్‌జెయింట్స్‌కు చక్కటి ఆరంభం అందించిన ఓపెనర్ రహానే (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) చకచకా పరుగులు చేసినా తాంబే బంతికి వెనుదిరిగాడు. దీంతో డు ప్లెసిస్, పీటర్సన్ జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వరుసగా రెండు ఓవర్లలో కలిపి 29 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 57 పరుగులకు చేరింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. అయితే గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్కసారిగా పరుగుల వేగం తగ్గింది. ఒక దశలో డు ప్లెసిస్, పీటర్సన్ ధాటిగానే ఆడినా... తమ స్థాయికి తగినట్లుగా మెరుపులు ప్రదర్శించలేకపోయారు. ఈ క్రమంలో 33 బంతుల్లో ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత బ్రేవో చక్కటి బంతితో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ప్లెసిస్, స్మిత్ (5), మార్ష్ (7) వెనుదిరిగారు. దాంతో రన్‌రేట్ తగ్గిపోయి జట్టు 150 పరుగులు కూడా దాటుతుందా అనిపించింది. అయితే చివర్లో ధోని మెరుపులతో పుణే చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. బ్రేవో వేసిన ఈ ఓవర్లో ధోని 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 20 పరుగులు రాబట్టాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులతో పటిష్టంగా ఉన్న పుణే... చివరి 10 ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. తన చివరి రెండు ఓవర్లలో 3 పరుగులే ఇచ్చి జడేజా ఇందులో కీలక పాత్ర పోషించాడు. మెరుపు ఓపెనింగ్: లయన్స్‌కు ఓపెనర్లు ఫించ్, మెకల్లమ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఆర్పీ సింగ్ ఓవర్లో మెకల్లమ్ రెండు సిక్సర్లు బాదగా, ఆ తర్వాత ఇషాంత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. తన తొలి ఓవర్లో నాలుగే పరుగులు ఇచ్చి అశ్విన్ కాస్త తెరిపినిచ్చినా... తర్వాతి రెండు ఓవర్లు గుజరాత్ పంట పండించాయి. మురుగన్ అశ్విన్ వేసిన మరుసటి ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన ఫించ్... భాటియా తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 33 పరుగులు వచ్చాయి. ఇదే జోరులో 33 బంతుల్లోనే ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మురుగన్ అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత తన దూకుడు కొనసాగించిన మెకల్లమ్ అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మెకల్లమ్, కొద్ది సేపటికే రైనా (24 బంతుల్లో 24; 1 ఫోర్) కూడా వెనుదిరిగినా... బ్రేవో (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీ) (బి) తాంబే 21; డు ప్లెసిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) తాంబే 69; పీటర్సన్ (బి) బ్రేవో 37; స్మిత్ (సి) ఫాల్క్‌నర్ (బి) జడేజా 5; ధోని (నాటౌట్) 22; మార్ష్ (బి) జడేజా 7; భాటియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-27; 2-113; 3-132; 4-134; 5-143. బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0; జకాతి 4-0-40-0; తాంబే 4-0-33-2; బ్రేవో 4-0-43-1; జడేజా 4-0-18-2; ఫాల్క్‌నర్ 2-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) ఇషాంత్ (బి) మురుగన్ 50; మెకల్లమ్ (సి) డు ప్లెసిస్ (బి) ఇషాంత్ 49; రైనా (స్టంప్డ్) ధోని (బి) మురుగన్ 24; బ్రేవో (నాటౌట్) 22; జడేజా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-85; 2-120; 3-147. బౌలింగ్: ఆర్పీ సింగ్ 2-0-21-0; ఇషాంత్ 4-0-39-1; అశ్విన్ 4-0-26-0; మురుగన్ 4-0-31-2; భాటియా 3-0-30-0; మార్ష్ 1-0-10-0. జడేజా స్పెషల్... గతంలో మూడు ఐపీఎల్ జట్ల తరఫున బరిలోకి దిగినా... సొంత రాష్ట్రంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని లోటు జడేజాకు ఉండేది. ఇప్పుడు గుజరాత్ లయన్స్ తరఫున అతను తొలిసారి తన సొంత ప్రేక్షకుల మధ్య రాజ్‌కోట్‌లో ఆడి సత్తా చాటాడు. రాజ్‌కోట్‌లోనూ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. తన తొలి రెండు ఓవర్లలో ఒక సిక్స్‌తో 15 పరుగులు ఇచ్చిన జడేజా తర్వాతి రెండు ఓవర్లు మ్యాచ్ దిశను మార్చాయి. 17వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చిన అతను, 19వ ఓవర్లో మరో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. ఓ దశలో 180 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించిన పుణే... జడేజా స్లాగ్ ఓవర్ల ప్రదర్శన కారణంగా 163 పరుగులకే పరిమితమైంది. -
ఓపికగా... కొండంత...
► భారీ ఆధిక్యంలో భారత్ ► భారీ ఆధిక్యంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 190/4 ► భారీ ఆధిక్యంలో భారత్ మొత్తం ఆధిక్యం 403 పరుగులు ► భారీ ఆధిక్యంలో భారత్ రాణించిన కోహ్లి, రహానే ► భారీ ఆధిక్యంలో భారత్ దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా కనీసం 250 మార్కును చేరలేదు. ఏకంగా ఐదు ఇన్నింగ్స్‌లో 200లోపే ఆలౌటైంది. అలాంటి జట్టుకు నాలుగో టెస్టులో కొండంత లక్ష్యం ఎదురవబోతోంది. బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతున్న పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ ఎనలేని ఓపికను చూపించి ఏకంగా ఆధిక్యాన్ని 400 దాటించారు. రహానే మరోసారి తన క్లాస్ చూపిస్తే... కోహ్లి ఎట్టకేలకు కుదురుగా ఆడాడు. ఫలితం... భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఇంకా డిక్లేర్ చేయకుండానే మ్యాచ్ గెలిచే ఆధిక్యం సాధించింది. ఇక తేలాల్సింది ఒక్క విషయమే. నాలుగో టెస్టును నాలుగోరోజే ముగిస్తారా..? లేక సఫారీలు ఈ కొండను చేరుకునేందుకు పోరాడి ఐదో రోజు దాకా తీసుకెళతారా..? న్యూఢిల్లీ: బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ నిలకడను చూపెట్టారు. పరుగులు భారీగా రాకపోయినా.. వికెట్లను కాపాడుకుంటూ సఫారీ బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నారు. అద్భుతమైన టెక్నిక్‌తో పాటు కొండంత ఓపికను చూపెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లి (154 బంతుల్లో 83 బ్యాటింగ్; 10 ఫోర్లు),రహానే (152 బంతుల్లో 52 బ్యాటింగ్; 5 ఫో ర్లు) జట్టుకు భారీ ఆధిక్యాన్ని సమకూర్చారు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసిన భారత్ నాలుగో రోజు లంచ్‌కు అటు ఇటూగా డిక్లేర్ చేసే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా శనివారం మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. కోహ్లి, రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లిసేన 403 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 334 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 121 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) విలాస్ (బి) మోర్కెల్ 3; ధావన్ (బి) మోర్కెల్ 21; రోహిత్ (బి) మోర్కెల్ 0; పుజారా (బి) తాహిర్ 28; కోహ్లి బ్యాటింగ్ 83; రహానే బ్యాటింగ్ 52; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (81 ఓవర్లలో 4 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1-4; 2-8; 3-53; 4-57. బౌలింగ్: మోర్కెల్ 17-6-29-3; అబాట్ 17-6-38-0; పీట్ 18-1-53-0; తాహిర్ 21-4-49-1; ఎల్గర్ 8-1-19-0. ఈసారి అదృష్టం... ఇన్నింగ్స్ 34వ ఓవర్లో స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బంతి విరాట్ కోహ్లి బ్యాట్‌కు దగ్గరి నుంచి వెళ్లి కీపర్ విలాస్ చేతుల్లో పడింది. కీపర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అవుటిచ్చాడు. దీనిపై కొన్ని సెకన్ల పాటు అసంతృప్తిని వ్యక్తం చేసిన కెప్టెన్ ఇక చేసేదేమీ లేక పెవిలియన్‌కు వెళ్తున్నాడు. అయితే థర్డ్ అంపైర్ రీప్లేలో అది నోబాల్‌గా తేలడంతో కోహ్లి ఊపిరి పీల్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి దురదృష్టవశాత్తు అవుటైన సంగతి తెలిసిందే. సెషన్-1 మోర్కెల్ హవా... ఆరంభంలో పిచ్‌పై ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న ప్రొటీస్ పేసర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. దీంతో పరుగులు చేయడానికి భారత ఓపెనర్లు బాగా ఇబ్బందులుపడ్డారు. చివరకు ఐదో ఓవర్లోనే మోర్కెల్ వేసిన షార్ట్ బంతిని ఎదుర్కోలేక విజయ్ (3) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో రోహిత్ శర్మ (0)ను మేనేజ్మెంట్ మూడోస్థానానికి ప్రమోట్ చేసింది. అయితే మోర్కెల్ దెబ్బకు అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ స్కోరు 8/2గా మారింది. ధావన్ (21), పుజారా (28)లు పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో భారత్ 51/2 స్కోరుతో లంచ్‌కు వెళ్లింది. ఓవర్లు: 26; పరుగులు: 51; వికెట్లు: 2 సెషన్-2 కోహ్లి నిలకడ లంచ్ తర్వాత మూడో ఓవర్లోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోర్కెల్ వేసిన అద్భుతమైన యార్కర్‌కు ధావన్ వికెట్ ఎగిరిపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లి చాలా నెమ్మదిగా ఆడినా... స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అయితే రెండో ఎండ్‌లో తాహిర్ బంతిని కట్ చేయడానికి ప్రయత్నించి పుజారా వెనుదిరగడంతో భారత్ 57 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇక రహానే ఈసారి మరింత నిలకడను చూపెట్టాడు. సెషన్ ముగిసే వరకు ఈ ఇద్దరు ఏమాత్రం తడబాటు లేకుండా ఆడటంతో భారత్ ఇన్నింగ్స్ కాస్త గాడిలో పడింది. ఓవర్లు: 28; పరుగులు: 65; వికెట్లు: 2 సెషన్-3 సూపర్ భాగస్వామ్యం కోహ్లి 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఓవైపు కెప్టెన్ జోరు కొనసాగుతుంటే రెండోవైపు రహానే ఇన్నింగ్స్‌లో వేగం పెరగలేదు. రహానే 146 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ జోడిని విడదీయడానికి ఆమ్లా బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 133 పరుగులు జోడించారు. బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్‌ను కాస్త ముందుగానే ముగించడంతో భారత్ మరో వికెట్ పడకుండా సెషన్‌ను పూర్తి చేసింది. ఓవర్లు: 27; పరుగులు: 74; వికెట్లు: 0 -
రహానేకు ‘ఎ’ గ్రేడ్
‘బి’కి పడిపోయిన సురేశ్ రైనా ముంబై: వచ్చే ఏడాది కాలానికి క్రికెటర్లకు బీసీసీఐ గ్రేడింగ్‌లు ప్రకటించింది. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తూ వచ్చిన అజింక్య రహానేకు తొలి సారి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. వన్డే, టి20 కెప్టెన్ ధోని, టెస్టు కెప్టెన్ కోహ్లిలతో పాటు జట్టు ప్రధాన స్పిన్నర్ ఆర్. అశ్విన్‌లు మాత్రమే ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరికి ఏడాదికి రూ. కోటి కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది. మరో వైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న భువనేశ్వర్, వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సురేశ్ రైనాలను ‘ఎ’ గ్రేడ్‌నుంచి తొలగించి ‘బి’ గ్రేడ్‌లో ఉంచారు. ఈ గ్రేడ్‌లోని రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజాలు ‘సి’కి పడిపోగా...‘సి’లో ఉన్న ఏడుగురు యువ ఆటగాళ్లు తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. ‘బి’ గ్రేడ్ ఆటగాడికి రూ. 50 లక్షలు, ‘సి’ గ్రేడ్ ఆటగాడికి రూ. 25 లక్షలు లభిస్తాయి. ఈ ఏడాది ఆటగాళ్ల సంఖ్య 32నుంచి 26కు తగ్గడం విశేషం. మిథాలీరాజ్‌కు ‘ఎ’ గ్రేడ్ బీసీసీఐ తొలి సారి మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌లు ప్రకటించింది. రూ. 15 లక్షలు లభించే ‘ఎ’ గ్రేడ్‌లో మిథాలీరాజ్‌తో పాటు జులన్, హర్మన్‌ప్రీత్, తిరుష్కామినిలకు స్థానం లభించగా, మరో ఏడుగురు ‘బి’ గ్రేడ్ (రూ. 10 లక్షలు)లో ఉన్నారు. -
తొలి రోజే 'తమాషా'
►మొహాలీలో స్పిన్ తంత్రం ►ఒకే రోజు 12 వికెట్లు ►భారత్ 201 ఆలౌట్ ►దక్షిణాఫ్రికా 28/2 ఓ టెస్టు మ్యాచ్ తొలి రోజే 12 వికెట్లు... కొత్త బంతితో స్పిన్నర్ మొదటి ఓవర్ బౌలింగ్ చేయడం... బంతి ఎటు పడి ఎటు తిరుగుతుందో... ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో బ్యాట్స్‌మెన్... అంతా తమాషా..! టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 201 పరుగులకే ఆలౌట్... ఇప్పటివరకూ 17 టెస్టులాడినా పది వికెట్లు తీయలేకపోయిన ఓ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌కు నాలుగు వికెట్లు... క్రీజులో ఉన్న సహచరుడు ఏ క్షణంలోనైనా రావచ్చని బయట మరో ఇద్దరు ప్యాడ్లతో సిద్ధంగా ఉండటం... అంతా తమాషా..! అవును... మొహాలీ పిచ్‌పై స్పిన్నర్ల హవాను ఊహించినా... మరీ ఈ స్థాయిలో తొలి రోజే పిచ్ ఇలా స్పందిస్తుందనేది ఎవరి ఊహకూ అందని విషయం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ మ్యాచ్ నాలుగోరోజుకు చేరితేనే గొప్ప. మొత్తానికి ‘ఫ్రీడమ్ సిరీస్’లోతొలి రోజే పలు మలుపులు. మొహాలి: ఆటగాళ్ల ప్రదర్శనకంటే పిచ్ గురించి ఎక్కువగా చర్చ సాగిన తొలి టెస్టులో పిచ్ తన పని తాను పూర్తి చేసింది. గింగిరాలు తిరిగే స్పిన్‌తో ఇక్కడి పీసీఏ స్టేడియంలో తొలి రోజే 12 వికెట్లు నేలకూలగా, అందులో 9 స్పిన్నర్లే తీశారు. గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసిన మురళీ విజయ్ (136 బంతుల్లో 75; 12 ఫోర్లు)కు తోడు చివర్లో జడేజా (92 బంతుల్లో 38; 4 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో డీన్ ఎల్గర్ (4/22) సంచలన ప్రదర్శన చేయగా, తాహిర్, ఫిలాండర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా కూడా భారత స్పిన్ ముందు తీవ్రంగా ఇబ్బంది పడింది. 20 ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు కేవలం 28 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఎల్గర్ (13 బ్యాటింగ్), ఆమ్లా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి సెషన్ కీలక భాగస్వామ్యం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడంతో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అటు దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో చెలరేగిన రబడకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఫిలాండర్ తన తొలి ఓవర్లోనే చక్కటి బంతితో ధావన్ (0)ను అవుట్ చేసి సఫారీలకు శుభారంభం అందించాడు. ఈ దశలో విజయ్, పుజారా (66 బంతుల్లో 31; 6 ఫోర్లు) మంచి సమన్వయంతో ఆడారు. వీరిద్దరు చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. అయితే పార్ట్ టైమర్ ఎల్గర్‌కు ఆమ్లా బంతినివ్వడం ఆ జట్టుకు కలిసొచ్చింది. తన నాలుగో బంతికే అతను పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 63 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించగా... మరో నాలుగు బంతులకే బర్త్‌డే బాయ్ కోహ్లి (1)ని అవుట్ చేసి రబడ కెరీర్లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్లు: 27, పరుగులు: 82, వికెట్లు: 3 రెండో సెషన్: ఎల్గర్ మ్యాజిక్ లంచ్ తర్వాత భారత్ కోలుకున్నట్లే కనిపించింది. పిచ్ ఎలా ఉన్నా ఇబ్బంది పడకుండా ఓపిగ్గా ఆడిన విజయ్ 115 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఎల్గర్ భారత్‌ను మళ్లీ దెబ్బ కొట్టాడు. అతని వరుస బంతుల్లో రహానే (15), సాహా (0) స్లిప్‌లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కష్టాలు పెరిగాయి. విజయ్, జడేజా కొద్ది సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసి 45 బంతుల్లో 38 పరుగులు జత చేశారు. అయితే హార్మర్ బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి విజయ్ అవుట్ కాగా... ఆ వెంటనే మిశ్రా (6)ను కూడా ఎల్గర్ పెవిలియన్ చేర్చాడు. ఓవర్లు: 28, పరుగులు: 86, వికెట్లు: 4 మూడో సెషన్: ఉత్కంఠ బ్రేక్ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగలేదు. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచిన జడేజాను ఫిలాండర్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఒక ఎండ్‌లో అశ్విన్ (20 నాటౌట్) కొన్ని పరుగులు జోడించినా... తాహిర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్ ముగించాడు. స్పిన్ బలం చూసిన కోహ్లి మరో ఆలోచన లేకుండా అశ్విన్‌తోనే మొదటి ఓవర్ వేయించాడు. ఆ నమ్మకం నిలబెడుతూ అశ్విన్...తన నాలుగో ఓవర్లో వాన్‌జిల్ (5)ను అవుట్ చేశాడు. జడేజా తన రెండో బంతికే డు ప్లెసిస్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరంలో ఆనందం నెలకొంది. అనూహ్యంగా తిరుగుతున్న బంతిని అతి కష్టమ్మీద ఎదుర్కొంటూ ఎల్గర్, ఆమ్లా రోజును ముగించారు. వీరిద్దరు కలిసి 70 బంతులు ఆడి 19 పరుగులు మాత్రం జోడించగలిగారు. కోహ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా మూడో వికెట్ దక్కలేదు. ఓవర్లు: 13, పరుగులు: 33, వికెట్లు: 3 (భారత్). ఓవర్లు: 20, పరుగులు: 28, వికెట్లు: 2 (దక్షిణాఫ్రికా) టాస్ గెలవడంతో వచ్చిన అవకాశం వృథా చేసుకున్న మాట కొంత వరకు వాస్తవం. అయితే 20 ఓవర్ల తర్వాత ప్రత్యర్థి స్కోరు చూస్తే ఇలాంటి పిచ్‌పై మా 201 చాలా పెద్ద స్కోరు. ఇప్పటికే 2 వికెట్లు తీశాం కాబట్టి మ్యాచ్ సమాన స్థితిలోనే ఉంది. బంతి నెమ్మదిగా వస్తున్న ఈ వికెట్‌పై పరుగులు చేయడం అంత సులువు కాదు. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా ఇది సవాల్‌లాంటిదే. ఓపిగ్గా ఆడితే ఫలితం వస్తుందని విజయ్ రుజువు చేశాడు. అయితే దక్షిణాఫ్రికా చాలా చక్కటి ప్రణాళికతో బౌలింగ్ చేసింది. మా బ్యాట్స్‌మెన్ ఇప్పుడు చేసిన పొరపాట్లు తర్వాతి ఇన్నింగ్స్‌లో పునరావృతం చేయరని నమ్ముతున్నా. - సంజయ్ బంగర్, భారత బ్యాటింగ్ కోచ్ మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉన్నా నా దృష్టిలో ఇదో చెత్త వికెట్. ఇక ముందు కూడా భారత్‌లో మా కోసం ఇలాంటి పిచ్లే సిద్ధం చేస్తారని అనిపిస్తోంది (వ్యంగ్యంగా). ఇప్పుడున్న స్థితిని బట్టి మ్యాచ్ ఎవరి వైపు అయినా మొగ్గవచ్చు. నాకు దక్కిన నాలుగు వికెట్ల పట్ల నేనే ఆశ్చర్యంగా ఉన్నా. అయితే భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడం సంతోషం. రెండో రోజు మాకు బ్యాటింగ్ కష్టం కావడం ఖాయం. నా కెరీర్లో ఇది కఠినమైన టెస్టు మ్యాచ్. అయితే సొంతగడ్డపై ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే భారత్ వ్యూహం ఈ సారి విఫలం కావాలని ఆశిస్తున్నా. - డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా ఆటగాడు 2008లో దక్షిణాఫ్రికా చేతిలో 76కు ఆలౌట్ అయిన తర్వాత భారత్ సొంతగడ్డపై తొలి రోజే ఆలౌట్ కావడం ఇదే మొదటి సారి. -
‘తేడా’ చూపించాల్సిందే!
గత సిరీస్‌కు ప్రతీకారంపై దృష్టి కొత్త జోష్‌లో భారత జట్టు రెండేళ్లలో పెరిగిన అనుభవం సఫారీ టీమ్‌లోనూ కొన్ని మార్పులు దాదాపు రెండేళ్ల క్రితం ధోని నాయకత్వంలో భారత జట్టు... దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ‘అనుభవం లేని లైనప్’ అంటూ చర్చోపచర్చలు సాగాయి. అయితే అలాంటి జట్టు కూడా తొలి టెస్టులో ప్రత్యర్థిని ఓడించినంత పని చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు జట్టు ఆటతో పాటు ఆలోచనా ధోరణి కూడా మారింది. ఒక రకంగా ఊతపదంగా మారిపోయిన ‘దూకుడు’ అన్ని చోట్లా కనిపిస్తోంది. నాటి జట్టుతో పోలిస్తే ఎక్కువగా మార్పులు లేకపోయినా... యువ క్రికెటర్లంతా ఎంతో మెరుగై కావాల్సినంతగా రాటుదేలారు. పైగా సొంతగడ్డపైనే సిరీస్ జరుగుతోంది. 2013-14 పర్యటనలో నామ్‌కే వాస్తేగా కూడా ఒక్క విజయమూ లేకుండా ఖాళీ చేతులతో తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు టెస్టులు, వన్డేలు రెండింట్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. సాక్షి క్రీడా విభాగం గత సిరీస్‌లో ప్రపంచంలోని ఫాస్టెస్ట్ పిచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన డర్బన్‌లో రెండో టెస్టు జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా... రహానే రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగులుతో అజేయంగా నిలిచిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి స్ట్రోక్‌లతో 96 పరుగులు చేశాడు. అది రహానే కెరీర్లో మూడో టెస్టు మాత్రమే. అంతకుముందు జొహన్నెస్‌బర్గ్ మ్యాచ్‌లో కూడా రహానే ఫీల్డింగ్‌లో తనదైన ముద్ర చూపించాడు. ఆ తర్వాత రహానే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు వేదికల్లో మరో 15 టెస్టులు ఆడాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అప్పుడే అంత పరిపక్వత చూపించిన బ్యాట్స్‌మన్ ఇప్పుడు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. నాటి ఓటమిని మరిపించే విధంగా ఆడతానని రహానే కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. కెప్టెన్‌గా కొత్తగా: విరాట్ కోహ్లి కూడా గత సిరీస్‌ను మరచిపోలేడు. తొలి టెస్టులో 119, 96 పరుగుల స్కోర్లతో భారత్‌ను విజయం కోసం అతను సన్నద్ధం చేశాడు. అయితే అనుభవలేమి జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. అది ఇప్పటికీ కోహ్లిని బాధిస్తోంది. అతను ఇంటర్వ్యూలలో తరచుగా జొహన్నెస్‌బర్గ్ టెస్టు ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కోహ్లి ఆటగాడిగానే కాకుండా టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడు. శ్రీలంకతో సిరీస్ విజయం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పైగా దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై కోహ్లి తొలిసారి ఆడబోతున్నాడు. కాబట్టి ఈ సిరీస్ అతనికి మంచి అవకాశం కల్పిస్తోంది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా అప్పుడు 2 టెస్టుల్లో కలిపి 280 పరుగులతో సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మళ్లీ జట్టులోకి వచ్చి కొలంబో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అతను, మళ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు. లెక్క సరి చేస్తారా: టెస్టుల కోసం ఇంకా భారత జట్టును ప్రకటించకపోయినా... ఎవరైనా ఒక ఆటగాడు అదనంగా చేరడం తప్పితే శ్రీలంకతో సిరీస్ ఆడిన టీమ్ మార్పుల్లేకుండానే ఉండవచ్చు. రెగ్యులర్ సభ్యులలో విజయ్, ధావన్, రోహిత్ నాటి దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమయ్యారు. అప్పుడు ఒకే టెస్టు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అశ్విన్ ఇప్పుడు స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. ఇక భారత్‌లోనైతే అతనికి ఘనమైన రికార్డు ఉంది. వీరంతా లెక్క సరి చేయాల్సి ఉంది. ఆ సిరీస్‌లో మెరుగైన బౌలింగ్ చేసిన ముగ్గురు ఆటగాళ్లు జహీర్, జడేజా, షమీ ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుత టీమ్‌లో కేఎల్ రాహుల్ ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు. రోహిత్ ఎలా ఆడతాడో... కొన్నాళ్ల క్రితమే వన్డేల్లో డబుల్ సెంచరీతో వచ్చిన స్టార్ హోదాతో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన రోహిత్ శర్మ ఒక్కసారిగా బేలగా మారిపోయాడు. తొలి వన్డేలోనైతే స్టెయిన్ అతడిని ఆడుకున్నాడు. తొలి 15 బంతుల పాటు రోహిత్ కనీసం బ్యాట్‌ను కూడా తాకించలేకపోయాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా అదే వైఫల్యం. కానీ ఆ తర్వాత రోహిత్ మళ్లీ చెలరేగాడు. సొంతగడ్డపైనే రెండో రికార్డు డబుల్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అంటే అతనికి నాటి స్టెయిన్ స్పెల్ కచ్చితంగా గుర్తుకు వస్తుంది. ప్రపంచకప్‌లోనూ సఫారీలతో డకౌట్ అయిన అతను భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఆ సిరీస్‌లో మూడో వన్డే రద్దు కాగా... రెండు వన్డేలు కలిపి భారత్ నుంచి ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదైంది అంటే మనోళ్ల వైఫల్యం ఏమిటో అర్థమవుతుంది. కోహ్లి, రైనా, రహానేలు తమ సత్తా చూపించాల్సి ఉంది. అప్పుడు ఆడిన జడేజా, షమీ, ఇషాంత్, యువరాజ్ ప్రస్తుతం జట్టులో లేరు. స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్, గుర్కీరత్ పూర్తిగా కొత్త ముఖాలు. సఫారీ జోరు కొనసాగేనా... నాటి దక్షిణాఫ్రికా టెస్టుతో తాజా జట్టును పోలిస్తే... స్మిత్, కలిస్, అల్విరో పీటర్సన్ రిటైర్ కాగా... ఎనిమిది మంది మరోసారి భారత్‌తో పోటీకి సిద్ధమయ్యారు. అయితే దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఐదుగురికి మాత్రమే గతంలో ఇక్కడ టెస్టు ఆడిన అనుభవం ఉంది. ఇక వన్డేల్లో అప్పుడు వరుసగా మూడు సెంచరీలతో మన బెండు తీసిన క్వాంటన్ డి కాక్ మళ్లీ వస్తున్నాడు. మొత్తంగా ఎనిమిది మందికి గత సిరీస్‌లో భారత్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. మైదానంలో బరిలోకి దిగినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లలోనూ గత సిరీస్ జ్ఞాపకాలు మదిలో ఉండటం ఖాయం. ఈసారి మనోళ్లు తగిన రీతిలో బదులిస్తారా లేక దక్షిణాఫ్రికా ఇక్కడా తమ జోరు కొనసాగిస్తుందా చూడాలి. -
ఈ సారైనా అందుకుంటారా!
సిరీస్ విజయంపై భారత్ గురి ♦ ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన ♦ అనిశ్చితిలో శ్రీలంక ♦ నేటినుంచి మూడో టెస్టు తొలి టెస్టు చేతుల్లోకి వచ్చి పోయింది... తప్పును దిద్దుకున్న కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని కుప్పకూల్చింది... ఇప్పుడు మిగిలింది మరో టెస్టు విజయం. మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థి ‘ఫామ్’ చూస్తే 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలిచేందుకు మన జట్టుకు ఇది సువర్ణావకాశం. మరో వైపు నాలుగున్నరేళ్ల క్రితం విదేశీ గడ్డపై సిరీస్ నెగ్గిన టీమిండియా ఆ తర్వాతి ఏడు సిరీస్‌లలో రిక్తహస్తాలతోనే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారైనా అవకాశాన్ని అందుకుంటారా అనేది ఆసక్తికరం. కొలంబో : కెప్టెన్‌గా తొలి టెస్టు విజయాన్ని రుచి చూసిన విరాట్ కోహ్లి ఇప్పుడు తొలి సిరీస్ గెలుపుపై కన్నేశాడు. రెండో టెస్టులో అద్భుత విజయం తర్వాత రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్న టీమిండియా చివరి టెస్టుపై కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. నేటినుంచి (శుక్రవారం) ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగే సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టులో భారత్, శ్రీలంకతో తలపడుతుంది. మరో వైపు సంగక్కర రిటైర్మెంట్తో కొత్తగా కనిపిస్తున్న లంక, తుది జట్టు విషయంలో గందరగోళంలో ఉంది. సొంతగడ్డపై వరుసగా రెండో సిరీస్ ఓడిపోకూడదని భావిస్తున్న ఆ జట్టు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. పుజారా, ఓజాలకు చోటు గాలే టెస్టులో రెండో ఇన్నింగ్స్ మినహా సిరీస్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. రోహిత్ శర్మ మినహా బ్యాటింగ్‌లో అంతా కీలక సమయాల్లో పరుగులు సాధించారు. లోకేశ్ రాహుల్, కోహ్లి, రహానే సెంచరీలు సాధించగా, సిరీస్‌నుంచి తప్పుకున్న ధావన్, విజయ్, సాహా కూడా ఆకట్టుకున్నారు. కాబట్టి జట్టు బ్యాటింగ్‌కు సంబంధించి భారత శిబిరంలో ఎలాంటి ఆందోళన లేదు. భారత్ ఆడిన గత నాలుగు టెస్టుల్లో స్థానం లభించని పుజారా మళ్లీ టీమ్‌లోకి రానున్నాడు. ఆర్డర్ విషయంలో కోహ్లి మరీ కొత్తగా ఆలోచించకపోతే పుజారా, రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. తన సత్తాను నిరూపించుకునేందుకు పుజారాకు ఇది మంచి అవకాశం. వికెట్ కీపర్‌గా నమన్ ఓజాకు 32 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడనున్నాడు. తుది జట్టులో ఈ రెండు మార్పులు ఖాయం. బిన్నీ బ్యాట్స్‌మన్‌గా పెద్దగా ప్రభావం చూపకపోయినా బౌలింగ్‌లో రాణించాడు కాబట్టి కోహ్లికి సమస్య లేదు. అందువల్ల కొత్తగా వచ్చిన కరుణ్ నాయర్ బెంచీకే పరిమితం కానున్నాడు. బౌలింగ్‌లో భారత్ మరోసారి తమ ప్రధానాస్త్రం అశ్విన్‌నే నమ్ముకుంది. 2 టెస్టుల్లో అతను ఇప్పటికే 17 వికెట్లు పడగొట్టి లంక బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నంగా తయారయ్యాడు. అతనికి మిశ్రా (12 వికెట్లు) అండగా నిలుస్తుండగా... పేస్‌లో ఇషాంత్, ఉమేశ్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. తరంగకు అవకాశం మరో వైపు కెప్టెన్ మ్యాథ్యూస్ చక్కటి ఫామ్‌లో ఉండటం మినహా... లంక పరిస్థితి ఆశాజనకంగా లేదు. మరో సీనియర్ హెరాత్ తొలి టెస్టులో చెలరేగినా, సారా ఓవల్‌లో తేలిపోయాడు. సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగకు అవకాశం దక్కనుంది. అతడిని ఏ స్థానంలో ఆడించాలి, ప్రధాన బ్యాట్స్‌మన్ తిరిమన్నెను ముందుగా పంపించాలా వద్దా, వికెట్ కీపింగ్ ఎవరితో చేయించాలి... ఇలా ప్రతీది ఆ జట్టుకు సమస్యగా కనిపిస్తోంది. ఘోరంగా విఫలమవుతున్న ముబారక్ స్థానంలో వన్డే స్పెషలిస్ట్ కుషాల్ పెరీరా తొలి టెస్టు ఆడే అవకాశం ఉంది. అయితే అతడు కీపింగ్ చేస్తే చండీమల్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఆర్డర్ మారవచ్చు. అశ్విన్ తీసిన 17 వికెట్లలో 12 లెఫ్ట్ హ్యండర్లవే ఉన్నాయి. అలాంటప్పుడు ఇద్దరు ఎడం చేతివాటం ఆటగాళ్లను బరిలోకి దించడం ఎంతవరకు ప్రయోజనమో ఆ జట్టు ఆలోచిస్తోంది. మ్యాథ్యూస్‌కు కూడా తాను ఆడే స్థానంపై స్పష్టత లేదు. బౌలింగ్‌లో గాయంనుంచి కోలుకున్న పేసర్ ప్రదీప్ తిరిగి జట్టులోకి రానుండటం ఊరట. అయితే రెండో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన ప్రధాన స్పిన్నర్ కౌశల్ దూరమైతే, దిల్రువాన్ పెరీరాను ఆడించాల్సి ఉంటుంది. మొత్తానికి తమ దిగ్గజాలు జయవర్ధనే, సంగక్కర రిటైర్ అయ్యాక తొలి టెస్టు ఆడుతున్న లంక మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. జట్లు(అంచనా) : భారత్: కోహ్లి (కెప్టెన్), పుజారా, రాహుల్, రహానే, రోహిత్, బిన్నీ, నమన్, అశ్విన్, ఉమేశ్, మిశ్రా, ఇషాంత్. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కరుణరత్నే, సిల్వ, తరంగ, తిరిమన్నె, చండీమల్, కుషాల్ పెరీరా, ప్రసాద్, ప్రదీప్, హెరాత్, కౌశల్/దిల్రువాన్ పిచ్, వాతావరణం ఇక్కడ జరిగిన గత ఐదు టెస్టుల్లో నాలుగు డ్రాగా ముగిశాయి. గత ఏడాది కాలంలో ప్రపంచంలోని అతి ‘ఫ్లాట్’ వికెట్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్సీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఆరంభంలో కొంత పేస్ ప్రభావం చూపినా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించవచ్చు. గత కొన్ని రోజులుగా నగరంలో తరచూ వర్షం పడుతోంది. -
రహానే తెలివైన బ్యాట్స్‌మన్
అనిల్ కుంబ్లే రెండో టెస్టు మూడు, నాలుగో రోజుల్లో భారత ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శనే వచ్చింది. ఈ ఆటతో చివరి టెస్టుకు 1-1తో వెళ్లగలిగే అవకాశం చిక్కింది. నిజానికి భారత జట్టు తొలి టెస్టులోనే నెగ్గాల్సింది. ఇప్పుడు కోహ్లి బృందానికి ఇంతకన్నా మంచి తరుణం లేదు. మరోవైపు ఆదివారం శ్రీలంక క్రికెట్ తమ దిగ్గజ ఆటగాడి ఆటను చివరిసారిగా చూసేసింది. సంగక్కర తన దేశం తరఫున చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. అయితే కెరీర్లో ఆఖరి టెస్టును విజయంతో ముగించడం అనుమానమే. అయితే మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మైకేల్ క్లార్క్ ఆసీస్ ఓదార్పు విజయంతో కెరీర్‌కు ముగింపు పలికాడు. ఇక నాలుగో రోజు ఆటలో భారత బ్యాటింగ్ మూడో స్థానంలో ఓ కొత్త అధ్యాయానికి సంకేతాలు పంపినట్టయ్యింది. దీంతో రహానే స్థానంపై కొద్దికాలమైనా చర్చలకు తెర పడతాయోమే. ఎందుకంటే అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు మరో సెంచరీ సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. రహానే తన అంతర్జాతీయ కెరీర్లో ఇంగ్లండ్, ఆసీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఇలా ఏ దేశంలో ఆడినా పరిస్థితులను చాలా త్వరగా అర్థం చేసుకోగలిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానం అటు ఇటూ ఎలా మార్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా రాణిస్తున్నాడు. సరైన సమయంలో ఓ యువ బ్యాట్స్‌మన్ మూడో స్థానంలో ఆడి శతకం చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. మొత్తానికి ఈ నాలుగు రోజుల బాధ్యతాయుతమైన ఆటతీరును భారత ఆటగాళ్లు వృథా చేసుకోరాదు. ఓ యూనిట్‌గా తొలి ఇన్నింగ్స్‌లో చాలా ఓపిక ప్రదర్శించారు. ఇదే రీతిన చివరి రోజు కూడా చూపితే విరాట్ కోహ్లి తన ఖాతాలో తొలి కెప్టెన్సీ విజయాన్ని అందుకుంటాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌ను కోహ్లి, మ్యాథ్యూస్, స్టీవ్ స్మిత్ రూపంలో నూతన జనరేషన్ తమ చేతుల్లోకి తీసుకోవడంతో మున్ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. -
ఈసారి వదలొద్దు!
చేజేతులా తొలి టెస్టును జారవిడుచుకున్న భారత్‌కు లంక గడ్డపై గెలిచేందుకు మరో అవకాశం వచ్చింది. రహానే సూపర్ బ్యాటింగ్‌కు తోడు అశ్విన్ స్పిన్ మాయాజాలంతో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. లంక విజయానికి ఇంకా 341 పరుగులు అవసరంకాగా, భారత్ విజయానికి 8 వికెట్లు మాత్రమే చాలు. పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తుం డటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదులుకోవద్దని కోహ్లి సేన పట్టుదలతో ఉంది. కొలంబో: అజింక్యా రహానే (243 బంతుల్లో 126; 10 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో రెండో టెస్టులో భారత్... శ్రీలంక ముందు 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కరుణరత్నే (25 బ్యాటింగ్), కెప్టెన్ మ్యాథ్యూస్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 70/1తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 91 ఓవర్లలో 8 వికెట్లకు 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానేకు తోడు విజయ్ (133 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లలో ప్రసాద్, కౌశల్ చెరో 4 వికెట్లు తీశారు. నమన్ ఓజా, కరుణ్లకు పిలుపు కండరాల గాయంతో తొలిటెస్టుకు దూరమైన ఓపెనర్ మురళీ విజయ్‌కి రెండో టెస్టు సందర్భంగా మళ్లీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఈ నెల 28 నుంచి జరిగే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉండటంలేదు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా కండరాల గాయంతో మూడో టెస్టుకు దూరమ య్యాడు. వీరిద్దరి స్థానాల్లో నమన్ ఓజా, కరుణ్ నాయర్లను మూడో టెస్టుకోసం ఎంపిక చేశారు. నాలుగు రోజుల పాటు మంచి క్రికెట్ ఆడాం. ఇక ఐదో రోజు మరింత ఓపికగా ఉండాలి. ఇది చాలా కీలకం. ఎందుకంటే పిచ్ బాగా నెమ్మదైంది. కాబట్టి మంచి భాగస్వామ్యాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్క సెషన్ మేం బాగా ఆడగలిగితే మ్యాచ్ గెలిచినట్లే. నాలుగో రోజు మంచి భాగస్వామ్యాలను ఏర్పర్చడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాం. విజయ్ బాగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ గురించి చాలా చర్చించుకున్నాం. రోహిత్, నా మధ్య నెలకొన్న భాగస్వామ్యం కూడా చాలా కీలకమైంది. -రహానే (భారత బ్యాట్స్‌మన్) సెషన్ 1 ఆ ఇద్దరి ఆధిపత్యం... ఈ సెషన్లో మొదటి గంట ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రహానే, విజయ్‌లు ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా... తర్వాత బ్యాట్లు ఝళిపించారు. ఈ క్రమంలో 36వ ఓవర్లో విజయ్ 104 బంతుల్లో 11వ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ వెంటనే రహానే 118 బంతుల్లో 8వ అర్ధశతకం సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్‌కు 13.4 ఓవర్లలో 68 పరుగులు సమకూరాయి. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 46వ ఓవర్లో కౌశల్ విడగొట్టాడు. విజయ్ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ కోహ్లి (10) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో లంచ్‌కు కొద్ది ముందు అవుటయ్యాడు. అయితే రోహిత్ శర్మ (34), రహానే మరో వికెట్ పడకుండా 179/3 స్కోరుతో లంచ్‌కు వెళ్లారు. ఓవర్లు: 27; పరుగులు: 109; వికెట్లు: 2 సెషన్ 2 కొనసాగిన జోరు... వీలైనంత త్వరగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో లంచ్ తర్వాత రహానే, రోహిత్ వేగంగా ఆడారు. కానీ లంక బౌలర్ కౌశల్ రౌండ్ ది వికెట్‌తో ఈ జోడిని కట్టడి చేశాడు. దీంతో రన్‌రేట్ ఓవర్‌కు మూడు పరుగుల కంటే తక్కువగా నమోదైంది. ఈ క్రమంలో 67వ ఓవర్లో రహానే 212 బంతుల్లో కెరీర్లో 4వ శతకం పూర్తి చేశాడు. ఇదే ఓవర్లో భారత్ 300 స్కోరునూ అందుకుంది. తర్వాత ఈ ఇద్దరు అటాకింగ్‌కు దిగినా... మూడు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరు అవుటయ్యారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ దశలో బిన్నీ (17)తో జతకలిసిన సాహా (13 నాటౌట్) కొద్దిసేపు ఆడిన తర్వాత కాలిపిక్క కండరం పట్టేయడంతో రిటైర్‌హర్ట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ (19)... బిన్నీకి చక్కని సహకారం అందిస్తూ మరో వికెట్ పడకుండా సెషన్ ముగించాడు. ఓవర్లు: 26; పరుగులు: 104; వికెట్లు: 2 సెషన్ 3 అశ్విన్ అదుర్స్... టీ తర్వాత తొలి బంతికే బిన్నీ అవుట్‌కాగా... మిశ్రా (10) బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో ఎండ్‌లో అశ్విన్ రెండు ఫోర్లు, సిక్స్ బాదడంతో భారత్‌కు 400 పరుగుల స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఏడో వికెట్‌కు 28 పరుగులు జోడించాక అశ్విన్ వెనుదిరిగాడు. ఈ దశలో సాహా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చినా... 89వ ఓవర్లో మిశ్రాను ప్రసాద్ బోల్తా కొట్టించాడు. ఉమేశ్ (4 నాటౌట్), సాహాలు కొద్దిసేపు ఆడిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన లంకను అశ్విన్ దెబ్బతీశాడు. ఉమేశ్‌తో కలిసి బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ మూడో ఓవర్లోనే సిల్వ (1)ను వెనక్కిపంపాడు. దీంతో లంక స్కోరు 8/1గా మారింది. సంగక్కర (18) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేసినా... మళ్లీ అశ్విన్‌కే వికెట్‌ను సమర్పించుకున్నాడు. కరుణరత్నేతో కలిసి రెండో వికెట్‌కు అతను 25 పరుగులు జోడించాడు. సాహా స్థానంలో రాహుల్ కీపింగ్ చేశాడు. మ్యాథ్యూస్, కరుణరత్నేలు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఓవర్లు: 9; పరుగులు: 42; వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 21; పరుగులు: 72; వికెట్లు: 2 (శ్రీలంక) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 393 ఆలౌట్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 306 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 82; రాహుల్ (బి) ప్రసాద్ 2; రహానే (సి) చండిమల్ (బి) కౌశల్ 126; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 10; రోహిత్ (సి) ముబారక్ (బి) కౌశల్ 34; బిన్నీ (సి) తిరిమన్నే (బి) ప్రసాద్ 17; సాహా నాటౌట్ 13; అశ్విన్ (సి) చండిమల్ (బి) ప్రసాద్ 19; మిశ్రా (సి) ముబారక్ (బి) ప్రసాద్ 10; ఉమేశ్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (91 ఓవర్లలో 8 వికెట్లకు) 325 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1-3; 2-143; 3-171; 4-256; 5-262; 6-283; 7-311; 8-318. బౌలింగ్: ప్రసాద్ 15-0-43-4; హెరాత్ 29-4-96-0; చమీరా 14-0-63-0; మ్యాథ్యూస్ 2-1-1-0; కౌశల్ 31-1-118-4. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సిల్వ (సి) బిన్నీ (బి) అశ్విన్ 1; కరుణరత్నే బ్యాటింగ్ 25; సంగక్కర (సి) విజయ్ (బి) అశ్విన్ 18; మ్యాథ్యూస్ బ్యాటింగ్ 23; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1-8; 2-33. బౌలింగ్: అశ్విన్ 10-5-27-2; ఉమేశ్ 2-0-10-0; ఇషాంత్ 4-0-18-0; మిశ్రా 5-1-13-0. -
రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో అజింక్యా రహానె (126) సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 70/1తో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ ఓవరాల్‌గా 370 పరుగుల ఆధిక్యంలో ఉంది. మురళీ విజయ్ (82) హాఫ్ సెంచరీకి తోడు రోహిత్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్ కౌశల్ 4 వికెట్లు తీశాడు. కాసేపట్లో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో భారత్ 393, లంక 306 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
మన చేతుల్లోనే!
►రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 70/1 ► ఓవరాల్ ఆధిక్యం 157 పరుగులు ► తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 306 ఆలౌట్ ► మ్యాథ్యూస్ సెంచరీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో విజయ్, రహానేల సమయోచిత ప్రదర్శనతో మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో టెస్టు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న 157 పరుగుల ఆధిక్యానికి నాలుగో రోజు వీలైనన్ని పరుగులు జోడిస్తే... టీమిండియా మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే తొలి టెస్టులో మాదిరిగా లంకేయులు అద్భుతం చేయకుండా జాగ్రత్తపడాలి. కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం దిశగా సాగుతోంది. నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా.. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. ఫలితంగా 140/3 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు ఆట కొనసాగించిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 87 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ మ్యాథ్యూస్ (167 బంతుల్లో 102; 12 ఫోర్లు) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో తిరిమన్నే (168 బంతుల్లో 62; 5 ఫోర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. మిశ్రాకు 4 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 29.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విజయ్ (39 బ్యాటింగ్), రహానే (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 157 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెషన్-1: నెమ్మదిగా పరుగులు ఓవర్లు: 28; పరుగులు: 84; వికెట్లు: 0 పేసర్లకు వికెట్ నుంచి సహకారం లేకపోవడంతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ తిరిమన్నే, మ్యాథ్యూస్‌లు నిలకడగా ఆడారు. ఇషాంత్ వేసిన సెషన్ ఐదో బంతి.. తిరిమన్నే బ్యాట్ ఎడ్జ్‌ను తాకి ఫస్ట్ స్లిప్‌లోకి వెళ్లింది. కీపర్ సాహా డైవ్ చేసినా అందలేదు. ఇది మినహా ఈ సెషన్ మొత్తం వీరిద్దరు చాలా మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. అయితే రన్‌రేట్ పెరగకుండా భారత బౌలర్లు చాలా జాగ్రత్తగా బంతులు వేశారు. స్పిన్నర్లు కొద్దిగా ప్రభావం చూపెట్టినా.. బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడటంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో మ్యాథ్యూస్ 81 బంతుల్లో, తిరిమన్నే 142 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓవరాల్‌గా 73వ ఓవర్లో 200 పరుగులకు చేరిన లంక లంచ్ వరకు 3 వికెట్లకు 224 పరుగులు సాధించింది. ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినా భారత్‌కు వికెట్ దక్కలేదు. సెషన్-2: పుంజుకున్న భారత్ ఓవర్లు: 22; పరుగులు: 74; వికెట్లు: 4 ఈ సెషన్లో రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 33 నిమిషాల ఆట వృథా అయ్యింది. ఈ అవకాశాన్ని ఇషాంత్ సూపర్‌గా సద్వినియోగం చేసుకున్నాడు. అశ్విన్, మిశ్రా కూడా చక్కని సహకారం అందించారు. 85వ ఓవర్లో ఇషాంత్ ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేయబోయి తిరిమన్నే సాహా చేతికి చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌కు నెలకొన్న 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే చండిమల్ (11)నూ వెనక్కి పంపాడు. రెండో ఎండ్‌లో మ్యాథ్యూస్ నెమ్మదిగా ఆడి 164 బంతుల్లో కెరీర్లో 6వ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ దశలో విరాట్ చికిత్స కోసం బయటకు వెళ్లగా రహానే కెప్టెన్సీ చేశాడు. 99వ ఓవర్లో బిన్నీ.. ఊహించని రీతిలో మ్యాథ్యూస్‌ను అవుట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. ఆ వెంటనే దమ్మిక ప్రసాద్ (5)ను మిశ్రా బోల్తా కొట్టించాడు. ఓవరాల్‌గా 224/3 స్కోరుతో పటిష్టంగా ఉన్న లంక సెషన్ ముగిసేసరికి 298/7గా మారింది. సెషన్-3: బ్యాట్స్‌మెన్ నిలకడ ఓవర్లు: 5; పరుగులు: 8; వికెట్లు: 3 (శ్రీలంక) ఓవర్లు: 29.2; పరుగులు: 70; వికెట్లు: 1 (భారత్) టీ తర్వాత మిశ్రా విజృంభించాడు. స్వల్ప విరామాల్లో ముబారక్ (22), తరిండ్ కౌశల్ (6)ను అవుట్ చేశాడు. రెండో ఎండ్‌లో అశ్విన్... హెరాత్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఐదో బంతికే లోకేశ్ రాహుల్ (2)ను అవుట్ చేసి దమ్మిక ప్రసాద్ షాక్ ఇచ్చాడు. దీంతో కోహ్లిసేన స్కోరు 3/1గా మారింది. తర్వాత విజయ్, రహానేలు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. పేసర్ల నుంచి ఒత్తిడి ఎదురైనా... భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఒకటి, రెండుసార్లు ఎల్బీడబ్ల్యు అప్పీల్ల నుంచి బయటపడి స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు కదలించారు. ఓవరాల్‌గా మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడి విజయ్, రహానే రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 393 ఆలౌట్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్: కరుణరత్నే ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 1; సిల్వ (సి) అశ్విన్ (బి) మిశ్రా 51; సంగక్కర (సి) రహానే (బి) అశ్విన్ 32; తిరిమన్నే (సి) సాహా (బి) ఇషాంత్ 62; మ్యాథ్యూస్ (సి) విజయ్ (బి) బిన్నీ 102; చండిమల్ (సి) రాహుల్ (బి) ఇషాంత్ 11; ముబారక్ (బి) మిశ్రా 22; ప్రసాద్ (సి) రహానే (బి) మిశ్రా 5; హెరాత్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 1; తరిండ్ కౌశల్ (స్టం) సాహా (బి) మిశ్రా 6; చమీరా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (108 ఓవర్లలో ఆలౌట్) 306. వికెట్ల పతనం: 1-1; 2-75; 3-114; 4-241; 5-259; 6-284; 7-289; 8-300; 9-306; 10-306. బౌలింగ్: ఇషాంత్ 21-3-68-2; ఉమేశ్ 19-5-67-1; బిన్నీ 18-4-44-1; అశ్విన్ 29-3-76-2; మిశ్రా 21-3-43-4. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 39; రాహుల్ (బి) ప్రసాద్ 2; రహానే బ్యాటింగ్ 28; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (29.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 70. వికెట్ల పతనం: 1-3. బౌలింగ్: ప్రసాద్ 4-0-12-1; హెరాత్ 11.2-3-23-0; చమీరా 4-0-14-0; మ్యాథ్యూస్ 2-1-1-0; కౌశల్ 8-0-20-0. -
నిరాశపరిచిన విజయ్, రహానే
కొలంబో: శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 12 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా నిలబడ్డారు. మూడో వికెట్ కు వీరిద్దరూ 85 పరుగులు జోడించడంతో భారత్ కోలుకుంది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. కోహ్లి 48, రాహుల్ 39 పరుగులతో ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌటయ్యాడు. అజింక్య రహానే(4) మరోసారి నిరాశపరిచాడు. వీరిద్దరినీ ప్రసాద్ అవుట్ చేశాడు. -
రహానే అజేయ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 314/6 లంక బోర్డు ప్రెసిడెంట్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కొలంబో : శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (127 బంతుల్లో 109 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లిసేన 79 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు చేసింది. రహానేతో పాటు అశ్విన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (96 బంతుల్లో 43; 6 ఫోర్లు), శిఖర్ ధావన్ (102 బంతుల్లో 62; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే కాసన్ రజిత ధాటికి వన్‌డౌన్‌లో రోహిత్ శర్మ (7)తో పాటు కెప్టెన్ కోహ్లి (8) కూడా విఫలం కావడంతో లంచ్‌కు ముందు భారత్ 133 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రహానే, పుజారా (89 బంతుల్లో 42; 5 ఫోర్లు)లు నిలకడగా ఆడి ఐదో వికెట్‌కు 134 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే స్పిన్ ఆడటంలో కాస్త ఇబ్బందిపడ్డ పుజారా అసహనానికి గురై 66వ ఓవర్లో వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆ వెంటనే సాహా (3) అవుటైనా.. అశ్విన్ మెరుగ్గా ఆడటంతో ఏడో వికెట్‌కు అజేయంగా 41 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. కాసన్ రజిత 3, వాండర్సే 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) గుణతిలక (బి) గమగే 43; ధావన్ (సి) పెరీరా (బి) కాసన్ రజిత 62; రోహిత్ (బి) కాసన్ రజిత 7; కోహ్లి (సి) సిరివందన (బి) కాసన్ రజిత 8; రహానే బ్యాటింగ్ 109; పుజారా (సి) పతిరనా (బి) వాండర్సే 42; సాహా (సి) తిరిమన్నే (బి) వాండర్సే 3; అశ్విన్ బ్యాటింగ్ 10; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: (79 ఓవర్లలో 6 వికెట్లకు) 314. వికెట్ల పతనం: 1-108; 2-121; 3-130; 4-133; 5-267; 6-273. బౌలింగ్: ఫెర్నాండో 15-2-29-0; గమగే 15-2-65-1; కాసన్ రజిత 13-2-47-3; వాండర్సే 20-1-76-2; లాహిర్ గమగే 13-2-66-0; సిరివందన 3-1-14-0. -
ఓ పనైపోయింది!
-
ఓ పనైపోయింది!
రెండో వన్డేలోనూ భారత్ గెలుపు ♦ జింబాబ్వేపై 2-0తో సిరీస్ వశం ♦ రాణించిన విజయ్, రహానే, రాయుడు తొలి వన్డేలో తడబడ్డా... రెండో వన్డేలో భారత కుర్రాళ్లు సత్తా చూపించారు. అన్ని రంగాల్లోనూ జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం కనబరిచి అద్భుత విజయంతో సిరీస్‌ను గెలుచుకున్నారు. ఇక నామమాత్రపు చివరి వన్డేలో మిగిలిన రిజర్వ్లనూ పరిశీలిస్తే సరిపోతుంది. హరారే : జింబాబ్వేపై సిరీస్ గెలవడానికి భారత్‌కు ద్వితీయ శ్రేణి జట్టు సరిపోయింది. రెండో వన్డేలోనే సిరీస్ గెలిచి రహానే సేన ఓ పని పూర్తి చేసింది. మురళీ విజయ్ (95 బంతుల్లో 72; 1 ఫోర్, 2 సిక్సర్లు), కెప్టెన్ రహానే (83 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 62 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. టాస్ గెలిచి ఆతిథ్య జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో రాయుడు (50 బంతుల్లో 41; 3 ఫోర్లు) ఫామ్‌ను కొనసాగించగా, మనోజ్ తివారీ (26 బంతుల్లో 22; 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు) మోస్తరుగా ఆడారు. విజయ్, రహానే తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత నిలకడగా ఆడిన రాయుడు... విజయ్‌తో కలిసి రెండో వికెట్‌కు 47; తివారీతో కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. చివర్లో బిన్నీ, జాదవ్ (16) ఆరో వికెట్‌కు 17 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో ప్రత్యర్థి ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. మద్జీవా 4 వికెట్లు తీశాడు. తర్వాత జింబాబ్వే 49 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటై ఓడింది. చిబాబా (100 బంతుల్లో 72; 9 ఫోర్లు) టాప్ స్కోరర్. ముత్తుబామి (32), క్రెమెర్ (27), సీన్ విలియమ్స్ (20)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వేకు సరైన ఆరంభం లభించలేదు. విలియమ్స్‌తో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన చిబాబా... రజా (18)తో ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఓ దశలో ఆతిథ్య జట్టు 132 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయితే ముత్తుబామి, క్రెమెర్‌లు ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించినా... రన్‌రేట్ పెరిగిపోవడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. భువనేశ్వర్ 4 వికెట్లు తీశాడు. మురళీ విజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) రజా (బి) చిబాబా 63; విజయ్ (సి) సబ్ వాలర్ (బి) మద్జీవా 72; రాయుడు (సి) సబ్ వాలర్ (బి) రజా 41; తివారీ (సి) విటోరి (బి) తిరిపానో 22; ఉతప్ప (బి) మద్జీవా 13; బిన్నీ (సి) రజా (బి) విటోరి 25; జాదవ్ (సి) ముత్తుబామి (బి) మద్జీవా 16; హర్భజన్ నాటౌట్ 5; అక్షర్ పటేల్ (సి) రజా (బి) మద్జీవా 1; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1-112; 2-159; 3-203; 4-205; 5-233; 6-264; 7-266; 8-269. బౌలింగ్: విటోరి 8-0-47-1; తిరిపానో 9-0-42-1; మద్జీవా 10-0-49-4; విలియమ్స్ 5-0-23-0; క్రెమెర్ 5-0-32-0; చిబాబా 5-0-27-1; మసకద్జా 4-0-26-0; సికిందర్ రజా 4-0-25-1. జింబాబ్వే ఇన్నింగ్స్: సిబండా (సి) విజయ్ (బి) ధవల్ 2; చిబాబా రనౌట్ 72; మసకద్జా (సి) ఉతప్ప (బి) భువనేశ్వర్ 5; చిగుంబురా (సి) రహానే (బి) భువనేశ్వర్ 9; సీన్ విలియమ్స్ (బి) అక్షర్ 20; రజా (సి) ఉతప్ప (బి) హర్భజన్ 18; ముత్తుబామి (సి) అక్షర్ (బి) బిన్నీ 32; క్రెమెర్ (సి) రహానే (బి) భువనేశ్వర్ 27; మద్జీవా రనౌట్ 0; తిరిపానో (సి) అక్షర్ (బి) భువనేశ్వర్ 6; విటోరి నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్) 209. వికెట్ల పతనం: 1-24; 2-31; 3-43; 4-95; 5-130; 6-132; 7-184; 8-186; 9-195, 10-209. బౌలింగ్: భువనేశ్వర్ 10-3-33-4; ధవల్ 9-1-39-1; హర్భజన్ 10-0-29-1; బిన్నీ 7-0-42-1; అక్షర్ పటేల్ 10-1-40-1; విజయ్ 3-0-18-0. -
'ధోనీ, ద్రావిడ్, కోహ్లీలను ఫాలోఅవుతా'
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ లక్షణాలు తనకు ఆదర్శమని జింబాబ్వే పర్యటనలో భారత్‌కు నాయకత్వం వహించనున్న యువ ఆటగాడు అజింక్యా రహానె అన్నాడు. ధోనీలోని ప్రశాంతత, కోహ్లీలోని దూకుడును నియంత్రించుకునే తత్వం, ద్రావిడ్ నిరాండబరత వంటి లక్షణాలు తనకు ఇష్టమని, వాటిని అలవరచుకుంటానని రహానె చెప్పాడు. జింబాబ్వే పర్యటనకు రహానె సారథ్యంలో భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్‌తో పాటు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువకులకు అవకాశం కల్పించారు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, అతడి నాయకత్వ లక్షణాలు తనకెంతో ఇష్టమని రహానె ప్రశంసించాడు. ఇక దూకుడును ఎలా నియంత్రించుకోవాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలని చెప్పాడు. ఇక రాహుల్ ఎంతో సింపుల్‌గా ఉంటారని కితాబిచ్చాడు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకుని జట్టును నడిపిస్తానని రహానె చెప్పాడు. -
ఆ షాట్ ఆడినందుకు.. రాత్రంతా నిద్రపోలేదు
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ అజింక్యా రహానె నిలకడగా రాణిస్తున్నాడు. రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో గత మ్యాచ్‌లో రహానె 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెత్త షాట్ ఆడినందుకు, ఆ రోజు రాత్రి నిద్రపోలేదని రహానె చెప్పాడు. ఈ నెల 1న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రహానె 16 పరుగుల వద్ద వినయ్ కుమార్ బౌలింగ్‌లో క్యాచవుటయ్యాడు. 'చెత్త షాట్ ఆడినందుకు తాను చాలా బాధపడ్డాను. ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపా. ఆ షాట్ గురించి, జట్టు పరాజయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను' అని రహానె చెప్పాడు. రహానె తర్వాతి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఈ సీజన్లో రహానె 400 పైచిలుకు పరుగులు చేశాడు. -
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టులో నాలుగో రోజు
-
కోహ్లి, రహానే అర్థ సెంచరీలు
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. 108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్(68) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు పూజారా(25) అవుటయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లి, అజింక్య రహానే అర్థ సెంచరీలు సాధించడంతో టీమిండియా కుదురుకుంది. ముందుగా కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 10వ అర్థ సెంచరీ. తర్వాత రహానే టెస్టుల్లో 7వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే 60 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి(88), రహానే(78) క్రీజ్ లో ఉన్నారు. డ్రింక్స్ విరామ సమయానికి భారత్ స్కోరు 279 పరుగులు చేసింది. -
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టులో రెండు రోజు
-
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి రోజు
-
భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మూడో రోజు
-
పట్టు చిక్క లేదు!
రెండో రోజు ఆట సమం ఆస్ట్రేలియా 221/4 రాణించిన స్మిత్, రోజర్స్ ఉమేశ్‌కు 3 వికెట్లు భారత్ 408 ఆలౌట్ బ్రిస్బేన్: రెండో టెస్టు మ్యాచ్‌లో ఆధిక్యం కోసం భారత్, ఆస్ట్రేలియా తీవ్రంగా పోరాడుతున్నాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను తొందరగానే ముగించగలిగిన ఆసీస్, ఆ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (88 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్ రోజర్స్ (79 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మరో 187 పరుగులు వెనుకబడి ఉంది. స్మిత్‌తో పాటు మిషెల్ మార్ష్ (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా, అశ్విన్ మరో వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో మూడో రోజు శుక్రవారం ఆట కీలకం కానుంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 109.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్లో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేకపోయారు. తొలి టెస్టు ఆడుతున్న జోష్ హాజల్‌వుడ్ (5/68) ఐదు వికెట్లు పడగొట్టగా, కీపర్ హాడిన్ ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లతో ఆసీస్ రికార్డు సమం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) లయోన్ 144; ధావన్ (సి) హాడిన్ (బి) మిషెల్ మార్ష్ 24; పుజారా (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 18; కోహ్లి(సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 19; రహానే (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 81; రోహిత్ (సి) స్మిత్ (బి) వాట్సన్ 32; ధోని (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 33; అశ్విన్ (సి) వాట్సన్ (బి) హాజల్‌వుడ్ 35; ఉమేశ్ (సి) రోజర్స్ (బి) లయోన్ 9; ఆరోన్ (సి) (సబ్) లాబషాన్ (బి) లయోన్ 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (109.4 ఓవర్లలో ఆలౌట్) 408 వికెట్ల పతనం: 1-56; 2-100; 3-137; 4-261; 5-321;6-328;7-385; 8-394; 9-407; 10-408. బౌలింగ్: జాన్సన్ 21-4-81-0; హాజల్‌వుడ్ 23.2-6-68-5; స్టార్క్ 17-1-83-0; మిషెల్ మార్ష్ 6-1-14-1; లయోన్ 25.4-2-105-3; వాట్సన్ 14.4-6-39-1; వార్నర్ 1-0-9-0; స్మిత్ 1-0-4-0. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 55; వార్నర్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 29; వాట్సన్ (సి) ధావన్ (బి) అశ్విన్ 25; స్మిత్ (బ్యాటింగ్) 65; షాన్ మార్ష్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 32; మిషెల్ మార్ష్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (52 ఓవర్లలో 4 వికెట్లకు) 221 వికెట్ల పతనం: 1-47; 2-98; 3-121; 4-208. బౌలింగ్: ఇషాంత్ 9-0-47-0; ఆరోన్ 12-1-59-0; ఉమేశ్ 13-2-48-3; అశ్విన్ 18-3-66-1. వెల్డన్: మూడు కీలక వికెట్లు తీయడంతోపాటు ఈ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బంతి (147.8 కిమీ/గం.) విసిరిన భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ చేతిలో ఆరు వికెట్లు... ఒక భారీ భాగస్వామ్యం నెలకొల్పినా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసేది. కానీ కొత్త కుర్రాడు హాజల్‌వుడ్ దెబ్బ తీశాడు. మన ముగ్గురు ఆటగాళ్లు 30లు దాటినా ఒక్కరూ వాటిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరుకు అదనంగా 97 పరుగులతోనే సరిపెట్టేశారు. ఆసీస్దీ దాదాపు అదే పరిస్థితి. శుభారంభాలు చేసినా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. రెండేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న ఉమేశ్ యాదవ్ తన పేస్ పదునేమిటో చూపించి భారత్‌ను మళ్లీ ముందు నిలిపాడు. మిషెల్ జాన్సన్‌ను మించిన వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. మొత్తానికి రెండో రోజు ఆటలో ఇరు జట్లు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా... ఎవరికీ మ్యాచ్‌పై పట్టు చిక్కలేదు. ప్రస్తుతం టీమిండియా ముందంజలోనే ఉన్నట్లు కనిపిస్తున్నా... అటువైపు స్మిత్ అడ్డుగోడలా గట్టిగా నిలబడ్డాడు. వారి చేతిలోనూ ఆరు వికెట్లు ఉన్నాయి. కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాలంటే మూడో రోజు ధోని సేన కాస్త శ్రమించాల్సిందే. సెషన్-1 ముగిసిన ఇన్నింగ్స్ చేతిలో ఉన్న ఆరు వికెట్లతో రెండో రోజు భారత్ భారీ స్కోరు చేస్తుందని ఆశించినా... హాజల్‌వుడ్ చెలరేగడంతో అది సాధ్యం కాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 311/4తో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. అయితే మరో ఆరు పరుగులు మాత్రమే జత చేసి మూడో ఓవర్లోనే రహానే (81) వెనుదిరిగాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ (32) కూడా అవుటయ్యాడు. ఈ దశలో జత కలిసిన ధోని (53 బంతుల్లో 33; 4 ఫోర్లు), అశ్విన్ (41 బంతుల్లో 35; 6 ఫోర్లు) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. స్టార్క్ బౌలింగ్‌లోనే అశ్విన్ మూడు ఫోర్లు బాదగా, ధోని కూడా రెండు ఫోర్లు కొట్టాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరు 11.1 ఓవర్లలో 57 పరుగులు జోడించడం విశేషం. అయితే 9 పరుగుల వ్యవధిలో హాజల్‌వుడ్ వీరిద్దరిని పెవిలియన్ పంపించగా... ఆ తర్వాతి రెండు వికెట్లు లయోన్ తీయడంతో జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లు: 26.4, పరుగులు: 97, వికెట్లు: 6 సెషన్-2 ఉమేశ్ జోరు తమ ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్ (28 బంతుల్లో 29; 6 ఫోర్లు), రోజర్స్ ధాటిగా ఆరంభించారు. ఉమేశ్ ఆకట్టుకున్నా... ఇషాంత్, ఆరోన్‌ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టారు. ఇషాంత్ ఓవర్లో వార్నర్, ఆరోన్ ఓవర్లో రోజర్స్ మూడేసి ఫోర్లు కొట్టడం విశేషం. అయితే వార్నర్‌ను అవుట్ చేసి ఉమేశ్ జట్టుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో అంచనా తప్పి వాట్సన్ (29 బంతుల్లో 25; 4 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. మరోవైపు 73 బంతుల్లో రోజర్స్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే మరో చక్కటి బంతితో ఉమేశ్, అతడిని పెవిలియన్ పంపించాడు. ఓవర్లు: 24.5, పరుగులు: 121, వికెట్లు: 3 సెషన్-3 స్మిత్ దూకుడు విరామం తర్వాత కెప్టెన్ స్మిత్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అశ్విన్ వేసిన ఒక ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. ఇదే క్రమంలో 68 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు షాన్ మార్ష్ (70 బంతుల్లో 32; 5 ఫోర్లు) కాస్త తడబడుతూ ఇన్నింగ్స్ సాగించాడు. 32 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రహానే వదిలేశాడు. అయితే అదే స్కోరు వద్ద ఉమేశ్ బౌలింగ్‌లో స్లిప్‌లో అశ్విన్ అద్భుత క్యాచ్‌తో మార్ష్ వెనుదిరిగాడు. మరో ఐదు ఓవర్ల తర్వాత వెలుతురు తగ్గడంతో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలని అంపైర్లు చేసిన ప్రతిపాదనకు ధోని తిరస్కరించడంతో రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్లు: 27.1, పరుగులు: 100, వికెట్లు: 1 మేం తొలి ఇన్నింగ్స్‌లో మరికొన్ని పరుగులు చేయాల్సింది. అప్పుడు పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్‌కు అవకాశం వచ్చినా... నేను అవుట్ అయిన తీరు పట్ల కూడా నిరాశ చెందాను. ప్రస్తుతం మ్యాచ్‌లో మేం ముందంజలో ఉన్నాం. మూడో రోజు తొలి సెషన్లో బాగా ఆడితే మ్యాచ్‌పై పట్టు దొరుకుతుంది. ఆర్డర్‌తో సంబంధం లేకుండా ప్రతీ బ్యాట్స్‌మన్ వికెట్ మాకు కీలకమే. స్మిత్ నా బౌలింగ్‌లో కాస్త దూకుడుగా ఆడాడు. రేపు నా వంతు వస్తుందేమో - అశ్విన్, భారత బౌలర్ అంపైర్‌తో ధోని వాగ్వాదం తొలి టెస్టు నుంచీ ఈ సిరీస్‌లో అంపైర్ల నిర్ణయాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రెండో రోజు ఆటలో అంపైర్ ఎరాస్మస్ నిర్ణయం భారత కెప్టెన్ ధోనికి ఆగ్రహం తెప్పించింది. ధోని స్కోరు సున్నా వద్ద జాన్సన్ అతనికి షార్ట్ బంతి విసిరాడు. అయితే దానిని తప్పించుకునే క్రమంలో అతను వికెట్లకు అడ్డంగా జరగ్గా... బంతి ధోని వీపునకు తగిలి ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. దాంతో లెగ్‌బైగా భావించి మహి, రోహిత్ పరుగు ప్రారంభించారు. ఫీల్డర్ బంతి విసిరేలోగా ధోని మూడు పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే పరుగు ఇవ్వకుండా ఎరాస్మస్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించడంతో భారత కెప్టెన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ధోని షాట్‌కు ప్రయత్నించలేదని అంపైర్ భావించడం దీనికి కారణం కావచ్చు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ధోని వాదనకు దిగాడు. సుదీర్ఘ వివరణ తర్వాత వివాదం ముగిసినా ధోని తన అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోయాడు. సబ్‌స్టిట్యూట్ క్యాచ్... సాధారణంగా మ్యాచ్‌లో 12వ ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగుతుంటాడు. మరొకరి అవసరం ఉంటే ఆ జట్టు సభ్యుడు ఎవరైనా మైదానంలోకి వస్తారు. కానీ ఆసీస్ 12 మంది సభ్యుల జట్టునే బ్రిస్బేన్‌లో ఉంచింది. తొలి రోజు అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా ముగ్గురు బయటి వ్యక్తులు సబ్స్టిట్యూట్లుగా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. క్వీన్స్లాండ్ ఓపెనర్ మార్నస్ లాబషాన్, రాష్ట్ర జట్టు సెకండ్ ఎలెవన్ ప్లేయర్ ఆండ్రూ గోడ్, అండర్-19 ఆటగాడు స్యామ్ హీజ్లెట్ ఇలా బరిలోకి దిగారు. రెండో రోజు చివర్లో లయోన్ బౌలింగ్‌లో ఆరోన్ క్యాచ్‌ను షార్ట్‌లెగ్‌లో లాబషాన్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే బంతి ఆరోన్ బ్యాట్‌కు తగల్లేదని రీప్లేలో తేలింది. అంతర్జాతీయ జట్టులో స్థానం లేకపోయినా లాబషాన్ క్యాచ్‌ను మాత్రం తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు అందుకొని బ్రాడ్ హాడిన్ ఆస్ట్రేలియా రికార్డును సమం చేశాడు. గతంలో మరో ముగ్గురు ఈ ఘనతను సాధించారు. ఓవరాల్‌గా ఒకే ఇన్నింగ్స్‌లో 7 క్యాచ్‌ల రికార్డు వసీమ్ బారి, బాబ్ టేలర్, ఇయాన్ స్మిత్, రిడ్లే జాకబ్స్ పేరిట ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లలో భాగస్వామి (క్యాచ్‌లు, స్టంపింగ్‌లు) జాబితాలో హీలీని దాటి ధోని నాలుగో స్థానానికి (మొత్తం 629) చేరుకున్నాడు. బౌచర్, గిల్‌క్రిస్ట్, సంగక్కర ముందున్నారు. భారత్‌పై తొలి టెస్టులోనే 5 వికెట్లు తీసిన మూడో ఆసీస్ బౌలర్ హాజల్‌వుడ్. నాయకత్వం వహిస్తున్న తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా కెప్టెన్ కనీసం అర్ధ సెంచరీ చేయడం 1978 తర్వాత ఇదే తొలిసారి. స్మిత్ ఇప్పుడు ఆ ఘనత సాధించాడు. -
భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్ట్ రెండో రోజు
-
రెండో రోజు బౌలర్లదే హవా
-
రెండో రోజు బౌలర్లదే హవా
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బౌలర్ల హవా కొనసాగింది. నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుసుగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమిండియా 408 పరుగులకే పరిమితమైంది. అయితే అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 52 ఓవర్లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లను చేజార్చుకుంది. తొలి రోజు బ్యాట్స్ మెన్ ల హవా కొనసాగినా.. రెండో రోజు ఆటలో మాత్రం బౌలర్లు చెలరేగిపోయారు. ఈ రోజు ఆటలో మొత్తం మీద 10 వికెట్లు నేలరాలడం విశేషం. రెండో రోజు తన తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ స్వల్వ వ్యవధిలో కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(29)పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరగగా, అతని స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన షేన్ వాట్సన్ (25) పరుగులు మాత్రమే పెవిలియన్ చేరాడు. తరువాత ఆసీస్ ను రోజర్స్ (55), కెప్టెన్ స్టీవెన్ స్మిత్(65*) పరుగులతో ఆదుకున్నారు ప్రస్తుతం 221 పరుగులకు నాలుగు వికెట్ల కోల్పోయిన ఆసీస్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ కంటే 187 పరుగుల వెనకబడి ఉంది. ఇంకా చేతిలో ఆరు వికెట్లు చేతిలో ఉండటంతో మూడు రోజు ఆట మరింత రసవత్తరంగా జరగనుంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు మూడు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్టు లభించింది. -
నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్(208/4)
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 208 పరుగుల వద్ద నాల్గో వికెట్టును కోల్పోయింది. మైకేల్ క్లార్క్ స్థానంలో జట్టులోకి వచ్చిన షాన్ మార్ష్(32)పరుగులు చేసి నాల్గో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీతో జట్టు స్కోరు బోర్డును చక్కదిద్దుతున్న సమయంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో షాన్ మార్ష్ అవుటయ్యాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (29), షేన్ వాట్సన్ (25), రోజర్స్ (55) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టీ విరామానికి ముందు వరుసుగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ను స్మిత్ తన బ్యాటింగ్ తో గాడిలో పెట్టాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు మూడు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్టు లభించింది. -
ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీ(198/3)
బ్రిస్బేన్:టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్టీవెన్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. స్మిత్ 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్స స్మిత్ .. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి సాయంగా షాన్ మార్ష(32)పరుగులతో క్రీజ్ ఉన్నాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (29), షేన్ వాట్సన్ (25), రోజర్స్ (55) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. వరుసుగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. స్మిత్ బ్యాటింగ్ తిరిగి ఆసీస్ తేరుకుంది.భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్టు లభించింది. -
మూడో వికెట్టు కోల్పోయిన ఆసీస్(121/3)
-
మూడో వికెట్టు కోల్పోయిన ఆసీస్(121/3)
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ 121 పరుగుల వద్ద మూడో వికెట్టును కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ రోజర్స్ (55)పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు రెండో రోజు ఆటలో భాగంగా డేవిడ్ వార్నర్ (29), షేన్ వాట్సన్ (25) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. లంచ్ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ తొలుత కుదురగా ఆడినట్టు కనిపించినా.. వరుసుగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వంద పరుగుల లోపు రెండు వికెట్లను కోల్పోయిన ఆసీస్ టీ విరామ సమయానికి మరో 23 పరుగులు మాత్రమే జోడించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 408 పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 97 పరుగులకే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. -
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్(98/2)
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ ను కోల్పోయింది. రెండో రోజు ఆటలో భాగంగా షేన్ వాట్సన్ (25) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ వార్నర్ (29) పరుగులకే అవుటవ్వడంతో ఆసీస్ వంద పరుగుల లోపు రెండు వికెట్లను నష్టపోయింది. తొలి టెస్టులో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్ .. భారత అటాకింగ్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగగా. వాట్సన్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. రెండో రోజు ఆట లంచ్‌లోపే భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మురళీ విజయ్ (144) పరుగులతో ఆకట్టుకోగా, రహేనా(81) పరుగులు చేశాడు. అనంతరం రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్ అయిదు వికెట్లు, స్పిన్నర్ లియాన్ మూడు వికెట్లు తీశారు -
47 పరుగుల వద్ద తొలి వికెట్టు కోల్పోయిన ఆసీస్
బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్టును కోల్పోయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ ఓపెనర్ వార్నర్ (29) పరుగులకే అవుటయ్యాడు. తొలి టెస్టులో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్ .. భారత అటాకింగ్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో రోజు ఆట లంచ్‌లోపే భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మురళీ విజయ్ (144) పరుగులతో ఆకట్టుకోగా, రహేనా(81) పరుగులు చేశాడు. అనంతరం రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్ అయిదు వికెట్లు, స్పిన్నర్ లియాన్ మూడు వికెట్లు తీశారు. -
408 పరుగులకు భారత్ ఆలౌట్
-
408 పరుగులకు భారత్ ఆలౌట్
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బ్రిస్బేన్ టెస్ట్ రెండో రోజు ఆట లంచ్‌లోపే భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది.. రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్ అయిదు వికెట్లు, స్పిన్నర్ లియాన్ మూడు వికెట్లు తీశారు. -
రహానే, రోహిత్ శర్మ అవుట్
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆట ప్రారంభమైంది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన టిమిండియా 321 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అజింక్య రహానే(81) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. హాజల్‌వుడ్ బౌలింగ్ లో హాడిన్ కు క్యాచ్ ఇచ్చి రహానే అవుటయ్యాడు. తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ 328 పరుగుల జట్టు స్కోరు వద్ద అవుటయ్యాడు. వాట్సన్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. -
జోరు పెంచిన టీమిండియా
అహ్మదాబాద్: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో 275 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ జోరు పెంచింది. 20 ఓవర్లకు ఆచితూచి ఆడిన కోహ్లి సేన తర్వాత నుంచి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 21.2 ఓవర్లలో భారత్ స్కోరు బోర్డు 100 పరుగులు దాటింది. శిఖర్ ధావన్ అర్థ సెంచరీ పూర్తి చేసిన జోరు పెంచాడు. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతకిది 10వ అర్థ సెంచరీ. అంబటి రాయుడి నుంచి మంచి సహకారం లభించింది. భారత్ ఓపెనర్ అజింక్య రహానే(8) త్వరగా అవుటవడంతో కోహ్లి సేన మొదట ఆత్మరక్షణలో పడింది. వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. తర్వాత నుంచి వేగం పెంచింది. శ్రీలంక కూడా మొదట నెమ్మదిగా ఆడి తర్వాత వేగం పెంచింది. భారత్ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనబడుతోంది. శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. -
శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం
కటక్: శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 169 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. టీమిండియా విసిరిన 364 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో లంకేయులు చతికిలబడ్డారు.ఆదిలోనే శ్రీలంకకు దిల్షాన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దిల్షాన్(18) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరగా, మిడిల్ ఆర్డర్ ఆటగాడు కుమార సంగక్కరా(13) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనంతరం మరో ఓపెనర్ ఉపల్ తరంగ(28) పరుగులు చేసి నిష్క్రమించడంతో శ్రీలంకకు కష్టాలు ఆరంభమయ్యాయి. తరువాత జయవర్ధనే(43), మాథ్యూస్ (23), పెరీరా (29) పరుగులు మాత్రమే చేయడంతో లంకేయులు 39. 2 ఓవర్లలో 194 పరుగులకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు లభించగా,ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ కు తలో రెండో వికెట్లు దక్కాయి. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో భారత్ కు భారీ పరుగులతో ఆకట్టుకుంది. -
కటక్ వన్డే.. కష్టాల్లో లంక
కటక్: కటక్ వన్డేలో శ్రీలంక ఓటమి దిశగా పయనిస్తోంది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన లం 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులే చేసింది. దిల్షాన్ (18) , సంగక్కర (13), తరంగ (28), ప్రసన్న (5), మహేల జయవర్ధనె (43) అవుటయ్యారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ రెండు, ఇషాంత్, ఉమేష్, అశ్విన్ తలా వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ లంకేయులను కట్టడి చేస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంకేయులు గెలవడం కష్టం. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు. -
కటక్ వన్డే.. భారత్ స్కోరు 363/5
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా 364 పరుగుల లక్ష్యాన్ని లంకకు నిర్దేశించింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రహానె (109), ధవన్ (113) సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. రహానె, ధవన్ జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీలు చేసిన అనంతరం ధవన్, రహానె వెనుదిరిగారు. అనంతరం రైనా (34 బంతుల్లో 52) దూకుడుగా ఆడుతూ అదే జోరు కొనసాగించాడు. కోహ్లీ 22, అంబటి రాయుడు 27 పరుగులు చేశారు. -
మొదటి వన్డేలో జోరుమీదున్న భారత్
-
రహానె, ధవన్లు సెంచరీలు
కటక్: కటక్ వన్డేలో భారత్ ఓపెనర్లు రహానె, ధవన్ సెంచరీలతో విజృంభించారు. వన్డే కెరీర్లో రహానె రెండో సెంచరీ, ధవన్ ఆరో సెంచరీ నమోదు చేశారు. ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. రహానె (109), ధవన్ (113) జోడీ 231 పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించింది. కాగా సెంచరీ చేసిన అనంతరం ధవన్ ప్రియంజన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రహానెకు తోడుగా రైనా బ్యాటింగ్‌కు దిగాడు. -
రహానె, ధవన్లు హాఫ్ సెంచరీలు
కటక్: శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 23 ఓవర్లలో 124 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రహానె (54), ధవన్ (63) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించారు. భారత జట్టులో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మురళీ విజయ్ ఆడడం లేదు. వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్, అక్షర పటేల్ జట్టులోకి వచ్చారు. టీమిండియాకు విరాట్ కోహ్లి, శ్రీలంక జట్టుకు మాథ్యూస్ నేతృత్వం వహిస్తున్నారు. -
ప్రాక్టీస్ లేకుండా టెస్ట్‌కు రెడీ
-
భారత్ ‘ఎ’తడబాటు
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు తడబడింది. టాప్ ఆర్డర్లో పుజారా (54), రహానే (36) మినహా మిగతా వారు నిరాశపర్చారు. దీంతో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మన్ రాయుడు (14 బ్యాటింగ్), పర్వేజ్ రసూల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఇంకా 196 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో పుజారా నిలకడను కనబర్చినా... విజయ్ (4) విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే హెండ్రిక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత రహానే , పుజారాలు మంచి సమన్వయంతో ఆడి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పుజారాను హెండ్రిక్స్ మరోసారి బోల్తా కొట్టించాడు. తర్వాత వచ్చిన కార్తీక్ (0) నిరాశపర్చినా... రాయుడు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చాడు. ఈ దశలో నిలకడగా ఆడుతున్న రహానే... హెండ్రిక్స్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో సాహా (14), బిన్ని (0) ఒక్క పరుగు వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ కోలుకోలేకపోయింది. హెండ్రిక్స్ 3, హార్మర్ 2, అబాట్ ఒక్క వికెట్ తీశారు.