బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ ను కోల్పోయింది. రెండో రోజు ఆటలో భాగంగా షేన్ వాట్సన్ (25) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ వార్నర్ (29) పరుగులకే అవుటవ్వడంతో ఆసీస్ వంద పరుగుల లోపు రెండు వికెట్లను నష్టపోయింది. తొలి టెస్టులో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్ .. భారత అటాకింగ్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగగా. వాట్సన్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు.
రెండో రోజు ఆట లంచ్‌లోపే భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మురళీ విజయ్ (144) పరుగులతో ఆకట్టుకోగా, రహేనా(81) పరుగులు చేశాడు. అనంతరం రోహిత్ శర్మ 32, కెప్టెన్ ధోనీ 33, అశ్విన్ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్ అయిదు వికెట్లు, స్పిన్నర్ లియాన్ మూడు వికెట్లు తీశారు