మూడో వికెట్టు కోల్పోయిన ఆసీస్(121/3) | australia lose third wicket at 121 runs against team india in second test | Sakshi
Sakshi News home page

మూడో వికెట్టు కోల్పోయిన ఆసీస్(121/3)

Published Thu, Dec 18 2014 10:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

australia lose third wicket at 121 runs against team india in second test

బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ 121 పరుగుల వద్ద మూడో వికెట్టును కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ రోజర్స్ (55)పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు రెండో రోజు ఆటలో భాగంగా డేవిడ్ వార్నర్ (29), షేన్ వాట్సన్ (25) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. లంచ్ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ తొలుత కుదురగా ఆడినట్టు కనిపించినా.. వరుసుగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 వంద పరుగుల లోపు రెండు వికెట్లను కోల్పోయిన ఆసీస్ టీ విరామ సమయానికి మరో 23 పరుగులు మాత్రమే జోడించింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 408 పరుగులకే చాపచుట్టేసింది. కేవలం 97 పరుగులకే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement