బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 208 పరుగుల వద్ద నాల్గో వికెట్టును కోల్పోయింది. మైకేల్ క్లార్క్ స్థానంలో జట్టులోకి వచ్చిన షాన్ మార్ష్(32)పరుగులు చేసి నాల్గో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీతో జట్టు స్కోరు బోర్డును చక్కదిద్దుతున్న సమయంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో షాన్ మార్ష్ అవుటయ్యాడు.
అంతకుముందు డేవిడ్ వార్నర్ (29), షేన్ వాట్సన్ (25), రోజర్స్ (55) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టీ విరామానికి ముందు వరుసుగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ను స్మిత్ తన బ్యాటింగ్ తో గాడిలో పెట్టాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు మూడు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్టు లభించింది.
నాల్గో వికెట్ కోల్పోయిన ఆసీస్(208/4)
Published Thu, Dec 18 2014 12:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement