
స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేపై భారీ జరిమానా పడింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దాంతో రహానేపై మ్యాచ్ రిఫరీ రూ. 12 లక్షల జరిమానా విధించారు.
ఈ సీజన్‌లో ఓ జట్టు కెప్టెన్‌పై జరిమానా పడటం ఇది రెండో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత నెలలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు కోహ్లిపై కూడా రూ. 12 లక్షల జరిమానా పడింది.