
ఐపీఎల్-2024 మినీ వేలంలో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్ తగిలింది. పావెల్‌ను రూ.7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా ఉన్న పావెల్ కోసం కోల్‌కత్ నైట్‌రైడర్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది.
కానీ ఎంతైనా తగ్గేదేలే అని భావించిన రాజస్తాన్.. భారీ మొత్తానికి పావెల్‌ను దక్కించుకుంది. కాగా పావెల్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని రూ.2.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పావెల్‌ను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన పావెల్‌పై కాసుల వర్షం కురిసింది. కాగా టీ20ల్లో పావెల్‌కు మంచి రికార్డు ఉంది. వరల్డ్‌క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడిగా పావెల్‌కు పేరొంది. ఇప్పటివరకు 66 మ్యాచ్‌లు ఆడిన పావెల్ 1202 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ పావెల్ అదరగొడుతున్నాడు.
చదవండి: IPL 2024: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!?
Comments
Please login to add a commentAdd a comment