Rajastan Rayols
-
ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన విండీస్ కెప్టెన్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2024 మినీ వేలంలో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్ తగిలింది. పావెల్‌ను రూ.7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా ఉన్న పావెల్ కోసం కోల్‌కత్ నైట్‌రైడర్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఎంతైనా తగ్గేదేలే అని భావించిన రాజస్తాన్.. భారీ మొత్తానికి పావెల్‌ను దక్కించుకుంది. కాగా పావెల్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని రూ.2.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పావెల్‌ను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన పావెల్‌పై కాసుల వర్షం కురిసింది. కాగా టీ20ల్లో పావెల్‌కు మంచి రికార్డు ఉంది. వరల్డ్‌క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడిగా పావెల్‌కు పేరొంది. ఇప్పటివరకు 66 మ్యాచ్‌లు ఆడిన పావెల్ 1202 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ పావెల్ అదరగొడుతున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!? -
చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు..
Ravichandran Ashwin- Prithi Narayanan: దశాబ్ద కాలంగా టీమిండియా కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన స్పిన్ మాయాజాలంతో ఇప్పటికే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక రికార్డులు సృష్టించిన అశూ.. వ్యక్తిగత జీవితంలోనూ సక్సెస్ఫుల్ ఫ్యామిలీమ్యాన్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో అతడి భార్య ప్రీతి నారాయణన్‌ది కీలక పాత్ర. అశ్విన్‌కు చిన్ననాటి స్నేహితురాలైన ఆమె.. 2011, నవంబరు 13న వివాహ బంధంతో అతడి జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు అఖీరా అశ్విన్, ఆద్య అశ్విన్ సంతానం. కాగా ఐపీఎల్-2023లో అశ్విన్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. లవ్‌స్టోరీ చెప్పిన ప్రీతి ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో జియో సినిమా ‘హ్యాంగవుట్’ షోలో అశ్విన్ సతీమణి ప్రీతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, వేదా క్రిష్ణమూర్తి(క్రికెటర్), దినేశ్ సైత్ తదితరులు కలిసి హోస్ట్ చేసిన ఈ షోలో ప్రీతి.. అశ్విన్‌తో తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. సీఎస్కే అకౌంట్ హ్యాండిల్ చేస్తునపుడు ‘‘మేమిద్దరం ఒకే స్కూళ్లో చదువుకున్నాం. అలా ఇద్దరికీ చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. అయితే, స్కూల్ చదువు పూర్తైన తర్వాత చాలాకాలం పాటు మేము ఒకరినొకరం కలిసే సందర్భాలు పెద్దగా రాలేదు. అప్పట్లో నేను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసేదాన్ని. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న సమయంలో అశ్విన్‌ను చూశాను. ఆరడుగుల ఎత్తు.. తన లుక్ చూసి షాకయ్యా. మాటలు మొదలయ్యాయి. ఒకరోజు తను నన్ను క్రికెట్ గ్రౌండ్‌కి తీసుకువెళ్లి.. ‘‘నీతో కలిసి జీవితాంతం నడవాలనుకుంటున్నాను’’ అని నేరుగా తన మనసులో మాట చెప్పేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్లకు పైగా మా అనుబంధం అలాగే కొనసాగుతోంది’’ అని ప్రేమకథను రివీల్ చేసింది ప్రీతి. స్కూళ్లో అందరికీ ఆ విషయం తెలుసు ‘‘నిజానికి చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్ ఉండేది. ఏడో తరగతి నుంచే నేనంటే పడిచచ్చిపోయే వాడు. ఈ విషయం స్కూల్ మొత్తం తెలుసు. తర్వాత క్రికెట్ ఆడటంలో బిజీ అయిపోయాడు. పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ల కాబట్టి బర్త్‌డే ఫంక్షన్ల సమయంలో అప్పుడప్పుడూ కనిపించేవాడు. కానీ అప్పుడు ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండేవాళ్లం’’ అని అశ్విన్‌కు తనపై ఉన్న ఇష్టం గురించి చెబుతూ నవ్వులు చిందించింది ప్రీతి. తమ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయని.. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకుంటుందని భార్యాభర్తల అనుబంధం గురించి వివరించింది. చదవండి: Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్ వైరల్! రియల్ బాస్ ఎవరంటే! IPL 2023: మంచి బౌలరే.. కానీ ఇదేంటి? మరీ చెత్తగా.. ఇలాగే కొనసాగితే! -
‘అత్యుత్తమ ఫినిషర్’.. నా కెరీర్ ముగిసిపోలేదు.. అందుకే ఇప్పుడిలా!
IPL 2022 RR Vs RCB- Dinesh Karthik Comments: కీలక సమయంలో 23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తిక్. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ షాబాజ్ అహ్మద్(45 పరుగులు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది.. సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా డీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన దినేశ్ కార్తిక్‌న ఐపీఎల్ మెగా వేలం బరిలోకి రాగా.. ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టీమిండియా వెటరన్ ఆటగాడి కోసం రూ. 5 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు తగినట్లుగా అద్భుత ప్రదర్శనతో దినేశ్ కార్తిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లలో పంజాబ్‌పై 32(నాటౌట్), కేకేఆర్‌పై 14 (నాటౌట్).. తాజాగా రాజస్తాన్‌పై 44 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ముఖ్యంగా మంగళవారం నాటి ఇన్నింగ్స్‌తో డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యుత్తమ ఫినిషర్ అంటూ అతడు కితాబులు అందుకుంటున్నాడు. 36 ఏళ్ల వయసులో ఏమాత్రం ఆడగలడు అని సందేహాలు వ్యక్తం చేసిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ... క్రికెటర్‌గా తన కెరీర్ ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకు తన క్రికెట్ ప్రయాణంలో తోడుగా నిలిచిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ‘‘గతేడాది ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది అనిపించింది. అందుకే ఈసారి ఎలాగైనా రాణించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. నెట్స్‌లో కష్టపడ్డాను. నాకు శిక్షణ ఇచ్చిన వ్యక్తికే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుంది. నిజానికి ప్రతిసారి.. నాకు నేనే.. ‘‘నీ పని అయిపోలేదు’’ అని చెప్పుకొంటూ.. నేను ఇంకా క్రికెట్ ఆడగలననే నమ్మకాన్ని పెంపొందించుకున్నాను. నా పని నేను చేసుకుంటూనే విమర్శలకు సమాధానం చెప్పాలనకున్నా. నా ప్రయాణం ఇక్కడి వరకు చేరడంలో చాలా మంది పాత్ర ఉంది. టీ20 క్రికెట్లో అనూహ్య పరిణామాలు ఉంటాయి. ముందుగా ప్లాన్ చేసినట్లుగానే కాకుండా అప్పటికప్పుడు టార్గెట్‌కు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా రాజస్తాన్‌తో ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 🗣️🗣️ "I am not done yet; I have a goal and I want to achieve something"@DineshKarthik on his transformation and goals ahead 👍 #TATAIPL #RRvRCB pic.twitter.com/ctOu0q4j79 — IndianPremierLeague (@IPL) April 5, 2022 చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం" -
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ..
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక యార్కర్ల కింగ్ లసిత్ మలింగను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా గత ఏడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి మలింగ తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా మలింగ పనిచేశాడు. అయితే ఈ సిరీస్‌లో బౌలింగ్ పరంగా శ్రీలంక జట్టు అద్భుతంగా రాణించింది. ఇక ఐపీఎల్లో 11 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మలింగ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 122 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇప్పటికీ కొనసాగుతోన్నాడు. ఇటువంటి అద్భుతమైన బౌలర్ జట్టుకు కోచ్‌గా రావడం రాజస్తాన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లకు మలింగ్ తన అనుభవాన్ని పంచనున్నాడు. ఇక శ్రీలంక దిగ్గజం, రాజస్తాన్ ఫ్రాంచైజీ ఆపరేషన్స్ డైరెక్టర్ కూమార సంగర్కాకరతో కలిసి మలింగ పనిచేయనున్నాడు. మరో వైపు మెగా వేలంలో రాజస్తాన్.. దేవదత్ పడిక్కల్, బౌల్ట్, హెట్‌మైర్, అశ్విన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చదవండి: IPL 2022- CSK: అలా కాదు.. ఇలా.. ! నెట్ సెషన్లో పాల్గొన్న యువ ప్లేయర్‌కు ధోని సూచనలు! -
ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’
Glenn Phillips: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన సామ్ కరన్.. తన రెండో డెలివరీ వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లింది. అయితే స్ట్రైక్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఆ బంతిని ఎదుర్కోవడానకి క్రీజు వదిలి చాలా దూరం వెళ్లాడు. అయినప్పటికీ బంతిని అందుకోలేక చతికల పడ్డాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను నవ్వులు పూయిస్తుంది. ఫిలిప్స్ ‘ఫీట్’పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పరుగుల కోసం ఎంత దూరమైనా సిద్ధమా అని కొందరు.. ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా వదలవా? అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫిలిప్స్ ఆత్రం చూసి సామ్ నోరెళ్లబెట్టాడు అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది. యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్‌ను గెలిపించాయి. దీంతో ప్లేఆఫ్ ఆశలను రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే pic.twitter.com/I4heCusEzr — Jabjabavas (@jabjabavas) October 2, 2021 -
ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు.. కానీ కార్తిక్
Irfan Pathan Lauds Kartik Tyagi.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ కార్తిక్ త్యాగి హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్లో పంజాబ్‌కు నాలుగు పరుగులు అవసరమైన దశలో కార్తిక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేసి నికోలస్ పూరన్, దీపక్ హుడా వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సందర్భంగా కార్తిక్ త్యాగిపై అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్పాన్ పఠాన్ కూడా కార్తిక్ త్యాగిపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. 'కార్తిక్ త్యాగి ఒక యంగ్‌స్టర్.. ఎలాంటి అనుభవం లేని ఆటగాడు. ఒక అన్‌క్యాప్ ప్లేయర్ ఇలాంటి ప్రదర్శన కనబరచడం సంతోషం కలిగించింది. ఆఖరి ఓవర్లో ప్రత్యర్థి జట్టుకు నాలుగు పరుగులు ఇవ్వకుండా అడ్డుకోవడం అంత సులువు కాదు. కానీ కార్తిక్ ఆ ఒత్తిడిని అధిగమించి సూపర్ బౌలింగ్ కనబరిచాడు. త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టే అవకాశం ఉంది.' అని తెలిపాడు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్ జట్టు... కార్తీక్ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది. చివరకు 2 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అనూహ్య విజయాన్నందుకుంది. ముందుగా రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. మయాంక్ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు. చదవండి: Fabian Allen: ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్ -
సంజు శాంసన్ క్యాచ్ అద్భుతం.. కానీ: సచిన్
న్యూఢిల్లీ: నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దుబాయ్‌లో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ గాల్లోకి ఎగిరి పట్టిన క్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అచ్చం ఇలాంటి సంఘటనే గతంలో టిమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఎదురైంది. దీనిపై సచిన్ స్పందిస్తూ గురువారం ట్విటర్లో రెండు వీడియోలను పంచుకున్నారు. ‘నిన్నటి మ్యాచ్‌లో సంజు పట్టిన క్యాచ్ అద్బుతం. అయితే ఆ క్యాచ్ పట్టె సమయంలో అలా వెనక్కి పడటం వల్ల తలకు అయిన గాయం నొప్పిని తట్టుకోలేము. ఎందుకంటే అచ్చం అలాంటే సంఘటనే నేను కూడా గతంతో ఎదుర్కొన్నాను. 1992 ప్రపంచ కప్‌లో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను కూడా అలానే గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టి వెనక్కి పడ్డాను. దీంతో నా తలకు స్వల్ప గాయమైంది’ అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. (చదవండి: కోల్‌కతా పేస్‌కు రాయల్స్ కుదేల్) అయితే నిన్నటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ సమయంలో 17వ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ టామ్ కరన్ వేసిన చివరి బంతిని ప్యాట్ కమిన్స్ డీప్ బ్యాక్వర్డ్ స్కేర్లోకి గట్టిగా బాదాడు. ఈ బంతిని బౌండరీ దాటకుండా సంజు శాంసన్ గాల్లోకి ఎగిరి పట్టుకున్నాడు. ఈ క్రమంలో శాంసన్ అలానే వెనక్కి పడడంతో అతడి తలకు స్వల్ప గాయమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. Thanks for sharing this! 🙂 https://t.co/2r4e7cEdCm — Sachin Tendulkar (@sachin_rt) September 30, 2020 -
డాన్స్ ఇరగదీసిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్
-
వైరల్: శాంసన్‌ను డిస్ట్రబ్ చేసిన పిజ్జా బాయ్!
హైదరాబాద్ : ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్‌ను పిజ్జా డెలివరీ బాయ్ డిస్ట్రబ్ చేశాడు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శాంసన్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ 12వ ఓవర్ చివరి బంతి వేస్తుండగా.. పిజ్జా డెలివరీ బాయ్ సైట్ స్క్రీన్ అడ్డుగా వచ్చాడు. ఇబ్బందిగా ఫీలైన శాంసన్.. శంకర్‌ను బంతి వేయకుండా అడ్డుకున్నాడు. దీంతో ఒక్కసారి ఏం జరిగిందోనని మైదానంలో అభిమానులు అవాక్కయ్యారు. తీరా పిజ్జా డెలివరీ బాయ్ వల్ల శాంసన్ శంకర్‌ను ఆపాడని తెలిసి నిట్టూర్చారు. పిజ్జా బాయ్ ఎంత పని చేశాడంటూ కామెంటేటర్స్ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. పిజ్జా బాయ్ ఆటంకం కలిగించినా శాంసన్ ఏ మాత్రం డిస్ట్రబ్ కాలేదు. 55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు అద్భుత సెంచరీ సాధించాడు. శాంసన్ సెంచరీ చేసిన రాజస్తాన్ విజయం సాధించలేకపోయింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు వార్నర్ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు చెలరేగడంతో సన్‌రైజర్స్ తొలి విజయం నమోదు చేసింది. When pizza delivery boy halted play https://t.co/UbCj2gWNad via @ipl — Yogesh Gajjar (@imyogesh_07) March 30, 2019 -
అజింక్య రహానేకు రూ. 12 లక్షల జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేపై భారీ జరిమానా పడింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దాంతో రహానేపై మ్యాచ్ రిఫరీ రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో ఓ జట్టు కెప్టెన్‌పై జరిమానా పడటం ఇది రెండో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత నెలలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు కోహ్లిపై కూడా రూ. 12 లక్షల జరిమానా పడింది. -
గెలిచేదాకా నడిపించాడు
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ! మూడు సార్లు చాంపియన్ జట్టు ప్లే ఆఫ్ ఆశలకు దాదాపు తెరదించేలా రాజస్తాన్ రాయల్స్ షాకిచ్చింది. మ్యాచ్‌కు ముందు అన్నీ గెలిస్తే ముందుకు వెళ్లొచ్చులే అనుకున్న రోహిత్ సేన అంచనాలను బట్లర్ మరో సూపర్ ఇన్నింగ్స్‌తో తుంచేశాడు. దీంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. ముంబై: బట్లర్ మళ్లీ కదంతొక్కాడు. రాజస్తాన్ రాయల్స్‌ను గెలిచేదాకా నడిపించాడు. నిలకడకు వేగం జోడించే ఈ ఓపెనర్ అజేయ పోరాటంతో రాయల్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై జయభేరి మోగించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లూయిస్ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (31 బంతుల్లో 38; 7 ఫోర్లు) రాణించారు. స్టోక్స్, ఆర్చర్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (53 బంతుల్లో 94 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ప్రదర్శన ఇచ్చాడు. కెప్టెన్ రహానే (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు. బౌండరీలతో మొదలైంది...కానీ టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంటే... బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, లూయిస్ బౌండరీలతో దడదడ లాడించారు. క్రిష్ణప్ప గౌతమ్ వేసిన తొలి ఓవర్లో యాదవ్ 2, లుయీస్ ఒక ఫోర్ బాదాడు. ఆరంభం నుంచే పుంజుకున్న ముంబై ఇన్నింగ్స్ ఓవర్‌కు 8 పరుగులు చొప్పున సాగింది. దీంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసేటప్పటికే ఏకంగా ఆరుగురు బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. తొమ్మిదో ఓవర్లో లూయిస్ సిక్సర్లతో వేగం పెంచాడు. శ్రేయస్ గోపాల్ తొలి బంతిని లెగ్‌సైడ్‌లో ఫ్లాట్ సిక్స్‌గా మలిచిన అతను తర్వాతి బంతిని లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌గా తరలించాడు. తొలి సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్ కోల్పోకుండా 86 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లో ఆర్చర్... ఓపెనర్ సూర్యకుమార్‌తో పాటు కెప్టెన్ రోహిత్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గిపోయింది. మళ్లీ అజేయ పోరాటం... తొలి ఓవర్లోనే రాజస్తాన్ షార్ట్(4) వికెట్‌ను కోల్పోయింది. రహానే క్రీజులోకి రాగా... షరామామూలుగానే బట్లర్ తన నిలకడ కొనసాగించాడు. కుదిరితే బౌండరీతో లేదంటే సింగిల్స్‌తో ఎక్కడా ఇన్నింగ్స్‌ను తడబడకుండా నిలబెట్టాడు. కృనాల్ వేసిన ఐదో ఓవర్లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టిన బట్లర్ ఆ తర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాత హార్దిక్ బౌలింగ్‌లో, బుమ్రా ఓవర్లో కూడా బౌండరీలు బాదాడు. దీంతో రాజస్తాన్ తొలి పది ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన బట్లర్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక హార్దిక్ బౌలింగ్‌లో రహానే నిష్క్రమించాడు. తర్వాత బట్లర్‌కు జతైన సంజూ శామ్సన్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. లక్ష్యానికి 4 పరుగుల ముందు అతను నిష్క్రమించగా, సిక్సర్ కొట్టి బట్లర్ రాయల్స్ విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ యాదవ్ (సి) ఉనాద్కట్ (బి) ఆర్చర్ 38; లూయిస్ (సి) శామ్సన్ (బి) కులకర్ణి 60; రోహిత్ శర్మ (సి) ఉనాద్కట్ (బి) ఆర్చర్ 0; ఇషాన్ కిషన్ (సి) శామ్సన్ (బి) స్టోక్స్ 12; హార్దిక్ (సి) శామ్సన్ (బి) స్టోక్స్ 36; కృనాల్ (సి) గౌతమ్ (బి) ఉనాద్కట్ 3; కటింగ్ నాటౌట్ 10; డుమిని నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–87, 2–87, 3–108, 4–119, 5–131, 6–166. బౌలింగ్: గౌతమ్ 2–0–23–0, కులకర్ణి 4–0–43–1, ఆర్చర్ 4–0–16–2, స్టోక్స్ 4–0–26–2, గోపాల్ 2–0–21–0, ఉనాద్కట్ 4–0–37–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: షార్ట్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా 4; బట్లర్ నాటౌట్ 94; రహానే (సి) యాదవ్ (బి) హార్దిక్ 37; శామ్సన్ (సి) సబ్– చహర్ (బి) హార్దిక్ 26; స్టోక్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–9, 2–104, 3–165. బౌలింగ్: బుమ్రా 3–0–34–1, మెక్లీనగన్ 4–0–28–0, కృనాల్ 4–0–24–0, హార్దిక్ 4–0–52–2, మార్కండే 3–0–32–0 టి20ల్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధ సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో సెహ్వాగ్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్–2012లో); మసకద్జా (జింబాబ్వే–2012లో), కమ్రాన్ అక్మల్ (లాహోర్ వైట్స్–2017లో) ఈ ఘనత సాధించారు. -
రాజస్తాన్ రాయల్స్ మెంటర్‌గా లెజెండరీ స్పిన్నర్
జైపూర్ : లెజెండరీ ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్తాన్ రాయల్ టీం మెంటర్‌గా మంగళవారం నియమితులయ్యారు. రాజస్తాన్ రాయల్స్ మొదటి మూడు సీజన్ల(2008-11) సమయంలో కోచ్‌గానూ, కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. షేన్ వార్న్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే రాజస్తాన్ రాయల్స్ టీం మొదటి టైటిల్ విజేతగా నిలిచింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా క్రికెట్ కెరీర్లో రాజస్తాన్ రాయల్స్‌తో ప్రత్యేక అనుంబంధం ఉంది. రాయల్స్ టీం యజమానులు తనపై చూపిన ఆప్యాయతకు కృతజ్ఞుడిని.’ అని షేన్ వార్న్ విలేకరులతో అన్నారు. రాజస్తాన్ రాయల్స్ టీం తరపున మూడు సీజన్ల పాటు ఆడిన వార్న్ 52 మ్యాచ్‌లకు సారధ్యం వహించాడు. మొత్తం 56 వికెట్లు సాధించాడు. షేన్ వార్న్ రాకతో జట్టుకు కొత్త ఊపు వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో లోథా ప్యానెల్ రాజస్తాన్ రాయల్స్‌పై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. -
రాజస్థాన్ జోరును ముంబై అడ్డుకుంటుందా?
అహ్మదాబాద్: ఐపీఎల్-7లోఇప్పటికే ప్లే ఆప్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జోరును అడ్డుకుని ప్లే ఆప్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా గత మ్యాచ్‌లో అతడు ఆడలేదు. అజింక్య రహానే స్థానంతో ఉన్ముక్త్ చాంద్‌ను తీసుకున్నారు. స్టీవెన్ స్మిత్ బదులు బ్రాడ్ హగ్, ప్రవీణ్ తాంబే స్థానంలో అంకిత్ శర్మ జట్టులోకి వచ్చారు. ముంబై కూడా మూడు మార్పులతో బరిలోకి దిగింది. లసిత్ మలింగ, సీఎం గౌతమ్, ఆండర్సన్ స్థానంలో క్రిష్ మార్ సంతోకి, శ్రేయాస్ గోపాల్, మైఖల్ హసీని తీసుకున్నారు.