
లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్
జైపూర్ : లెజెండరీ ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్తాన్ రాయల్ టీం మెంటర్‌గా మంగళవారం నియమితులయ్యారు. రాజస్తాన్ రాయల్స్ మొదటి మూడు సీజన్ల(2008-11) సమయంలో కోచ్‌గానూ, కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. షేన్ వార్న్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే రాజస్తాన్ రాయల్స్ టీం మొదటి టైటిల్ విజేతగా నిలిచింది.
నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా క్రికెట్ కెరీర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో ప్రత్యేక అనుంబంధం ఉంది. రాయల్స్ టీం యజమానులు తనపై చూపిన ఆప్యాయతకు కృతజ్ఞుడిని.’ అని షేన్ వార్న్ విలేకరులతో అన్నారు. రాజస్తాన్ రాయల్స్ టీం తరపున మూడు సీజన్ల పాటు ఆడిన వార్న్ 52 మ్యాచ్‌లకు సారధ్యం వహించాడు. మొత్తం 56 వికెట్లు సాధించాడు. షేన్ వార్న్ రాకతో జట్టుకు కొత్త ఊపు వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో లోథా ప్యానెల్ రాజస్తాన్ రాయల్స్‌పై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment