mentor
-
కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బ్రావో
న్యూఢిల్లీ: టి20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ఈ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లగా, అతని స్థానంలో బ్రావోను ఎంచుకున్నట్లు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కేకేఆర్ టీమ్ యాజమాన్యానికి చెందిన ఇతర టి20 జట్లు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్‌లకు కూడా ఇన్చార్జ్గా ఉండేలా ఈ గ్రూప్‌తో బ్రావో దీర్ఘకాలిక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు ముందు రోజే గురువారం తాను ఆటగాడిగా అన్ని స్థాయిల నుంచి రిటైర్ అవుతున్నట్లు బ్రావో ప్రకటించాడు. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో 2011 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం ఉన్న సమయంలో అతను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే తరఫున ఆడిన 10 సీజన్లలో 3 సార్లు టైటిల్ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. రిటైర్ అయ్యాక గత రెండు సీజన్లు చెన్నైకే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్..?
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో జహీర్ పేరును అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. జహీర్, ఎల్ఎస్జీ యాజమాన్యం మధ్య ప్రస్తుతం ఆర్ధిక పరమైన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్యాకేజీ కాస్త అటూ ఇటైనా డీల్‌కు ఓకే చెప్పాలనే జహీర్ భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే జహీర్ ఎల్ఎస్జీలో మెంటార్షిప్తో పాటు బౌలింగ్ కోచ్ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్, మోర్నీ మోర్కెల్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఎల్ఎస్జీ మెంటార్షిప్, బౌలింగ్ కోచ్ పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. జహీర్ స్వతహాగా ఫాస్ట్ బౌలర్ కావడంతో బౌలింగ్ కోచ్ పదవిని కూడా అతనికే కట్టబెట్టాలని ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ భావిస్తుందట. రెండు పదవులు రానుండటంతో ఈ డీల్ పట్ల జహీర్ కూడా సానుకూలంగా ఉన్నాడని సమాచారం.వాస్తవానికి జహీర్ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి ఆశించాడని టాక్. అయితే గంభీర్ పట్టుబట్టడంతో ఆ పదవి మోర్నీ మోర్కెల్‌కు దక్కిందని తెలుస్తుంది. కాగా, ప్రస్తుతం లక్నో హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా ఆడమ్ వోగ్స్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ ఉన్న విషయం తెలిసిందే.జహీర్ గురించి వివరాలు..జహీర్ గతంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో పని చేశాడు. 45 ఏళ్ల జహీర్ టీమిండియా తరఫున 92 టెస్ట్‌లు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. జహీర్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 100 గేమ్‌లు ఆడాడు. జహీర్ చివరిగా 2017లో ఐపీఎల్ ఆడాడు.లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరి, 2024 సీజన్లో చేరలేకపోయింది. లక్నో.. గుజరాత్ టైటాన్స్‌తో కలిసి 2022 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2025 విషయానికొస్తే.. బీసీసీఐ ఈ నెలాఖరులోగా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఆర్టీఎం ఆప్షన్ సహా ఆరు రిటెన్షన్స్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఫ్రాంచైజీలు భారీ వేలాన్ని రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ ప్రస్తుతానికి అందుకు అనుకూలంగా లేదని టాక్. -
IPL: కేకేఆర్ మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త మెంటార్ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాలని కేకేఆర్ టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్ సైతం సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ద్రవిడ్ వచ్చే సీజన్ (2025) నుంచి కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు.మరోవైపు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్ కోచ్ పదవి విషయంలో గంభీర్-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. గంభీర్ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కావడంతో తనే బ్యాటింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా ఎంచుకోవచ్చు.టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్ కోచ్‌గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే కేకేఆర్ మెంటార్షిప్ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్ కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్‌కప్ 2024తో ముగిసిన విషయం తెలిసిందే. -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్‌గా మాజీ క్రికెటర్
దేశవాళీ క్రికెట్ సీజన్ (2024-25)కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ మెంటార్‌గా భారత మాజీ పేసర్ ధావల్ కులకర్ణిని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. కులకర్ణి దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ముంబై జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మెరకు ఎంసీఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కులకర్ణికి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటకి దేశీవాళీ క్రికెట్లో మాత్రం ముంబై తరపున అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కులకర్ణి.. టీమిండియా తరపున 12 వన్డేలు, రెండు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం కులకర్ణి 96 మ్యాచ్‌ల్లో ఏకంగా 285 వికెట్లు పడగొట్టాడు. రంజీట్రోఫీ 2023-24 సీజన్ ట్రోఫీని ముంబై సొంతం చేసుకోవడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించాడు.రికార్డు స్ధాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకున్న అనంతరం కులకర్ణి.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పకున్నాడు. ఈ క్రమంలోనే అతడి సేవలను ఉపయెగించుకోవాలని భావించిన ఎంసీఏ.. మెంటార్ పదవిని కట్టబెట్టింది. -
లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం..!? సురేష్ రైనాకు..
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు మెంటార్‌గా టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే లెజెండ్ సురేష్ రైనాను నియమించేందుకు ఎల్ఎస్జి సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే అతడితో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రైనా చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. 'లక్నో ఫ్రాంచైజీతో రైనా ఒప్పందం కుదర్చుకోలేదని, అవన్నీ తప్పుడు వార్తలేనని' ఓ జర్నలిస్ట్ ఓ ట్వీట్ చేశాడు. అందుకు రైనా స్పందిస్తూ.. ఈ వార్తలు ఎందుకు నిజం కాకూడదు? అంటూ రిప్లే ఇచ్చాడు. దీంతో రైనాను కొత్త అవతారంలో చూడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా గత రెండు సీజన్లగా తమ జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌ను.. ఐపీఎల్-2024 వేలానికి ముందు లక్నో ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. ప్రస్తుతం లక్నో మోంటార్ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే గంభీర్ స్ధానాన్ని మిస్టర్ ఐపీఎల్‌తో భర్తీ చేసేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో సురేష్ రైనా అద్భుతమైన రికార్డు ఉంది. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. -
CWC 2023: ఆఫ్ఘన్ల విజయాల వెనుక మన "అజేయుడు"
ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరుస సంచలనాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడిషన్‌లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఆతర్వాత 1992 వరల్డ్‌కప్ విన్నర్ పాకిస్తాన్‌ను, తాజాగా 1996 వరల్డ్ ఛాంపియన్స్ శ్రీలంకను మట్టికరిపించారు. పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో లంకేయులను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆఫ్ఘన్లు.. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయాలని ఆశిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్ ఆఫ్ఘన్లు ఈ తరహాలో రెచ్చిపోవడం వెనుక ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆఫ్ఘన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ కాగా.. రెండవ వ్యక్తి ఆ జట్టు మెంటార్ ఆజయ్ జడేజా. గతంలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజా.. ఆఫ్ఘన్లకు క్రికెట్‌తో పాటు క్రికెటేతర విషయాల్లోనూ తోడ్పడుతూ వారి విజయాలకు దోహదపడుతున్నాడు. వాస్తవానికి జట్టులో మెంటార్ పాత్ర నామమాత్రమే అయినా జడేజా మాత్రం ఆఫ్ఘన్లకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. వన్ టు వన్ కోచింగ్‌తో పాటు జట్టు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తన టైమ్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా చలామణి అయిన జడేజా.. ఆఫ్ఘన్లకు ఫీల్డింగ్ మెళకువలు కూడా నేర్పుతున్నాడు. అలాగే భారత్‌లో స్థితిగతులపై అవగాహన లేని చాలామంది ఆఫ్ఘన్ క్రికెటర్లకు తోడ్పాటునందిస్తున్నాడు. జడేజా మెంటార్షిప్లో ఆఫ్ఘన్లు మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా, 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడాడు. జడేజా టీమిండియాకు 13 వన్డేల్లో నాయకత్వం వహించాడు. 15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. -
‘మాతో పోలిస్తే అంతరం చాలా ఎక్కువ’
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో వస్తున్న కొత్త తరం ఆటగాళ్లలో దూకుడు లోపించిందని ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే ధాటైన ఆట వారి నుంచి రావాలని ఆమె సూచించింది. సరిగ్గా చెప్పాలంటే తనతో పాటు సింధు తర్వాత వచ్చిన ప్లేయర్లు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారని సైనా చెప్పింది. ‘నిజాయితీగా చెప్పాలంటే మా ఇద్దరికీ, కొత్తగా వచ్చిన మహిళా షట్లర్లకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాక్ చేసే మాలాంటి ప్లేయర్లు ఇప్పుడు భారత్‌కు కావాలి. త్వరలోనే మహిళల బ్యాడ్మింటన్‌లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని సైనా పేర్కొంది. ‘బ్యాడ్మింటన్ ప్రోస్’ పేరుతో కొత్తగా రానున్న బ్యాడ్మింటన్ అకాడమీకి సైనా మెంటార్‌గా వ్యవహరించనుంది. మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్, విజయ్ లాన్సీ కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ‘ప్రోస్ అకాడమీకి ప్రత్యేక కోచ్‌ల బృందం ఉంది. నాకున్న అనుభవాన్ని వారితో పంచుకునేందుకే మెంటార్‌గా పని చేయబోతున్నా. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్యాడ్మింటన్ అకాడమీలు రావడం సానుకూల పరిణామం’ అని సైనా పేర్కొంది. భారత షట్లర్ పారుపల్లి కశ్యప్, ప్రస్తుతం భారత టీమ్ కోచ్‌ల బృందంలో ఒకడైన గురుసాయిదత్ కూడా ఈ అకాడమీకి మెంటార్లుగా పని చేస్తారు. -
టీమిండియాతో వరుస సిరీస్‌లు.. వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం!
భారత వేదికగా జరగున్న వన్డే ప్రంపచకప్-2023కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిల్లో ఓటమి పాలై కరీబియన్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో వెస్టిండీస్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్ ఆడనుంది. ఇక క్వాలిఫయర్స్ ముగిసిన వెంటనే విండీస్ జట్టు స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టనుంది. స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో విండీస్ జట్టు తలపడనుంది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ సిరీస్ ప్రారంభం కానుంది. మెంటార్‌గా బ్రియాన్ లారా ఇక గత కొంత కాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న విండీస్ జట్టును చక్కదిద్దే పనిలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పడింది. టీమిండియాతో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో విండీస్ జట్టు మెంటార్‌గా దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారాను నియమించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విండీస్ ప్రాక్టీస్ సెషన్స్‌కు లారా హాజరవుతోన్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో మునిగి తెలుతోంది. వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: భారత జట్టు హెడ్‌కోచ్‌గా ముజుందార్.. త్వరలోనే ప్రకటన -
విషప్రయోగంతోనే అవతార్ ఖాందా కన్నుమూత?
బ్రిటన్‌లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతోంది. అవతార్ సింగ్ ఖాందా.. కేఎల్ఎఫ్ చీఫ్ మాత్రమే కాదు, మార్చి 19వ తేదీన లండన్‌లోని భారత్ హైకమిషన్ ఎదుట భారతీయ జెండాను అవమానించేందుకు ఖలీస్తానీలు ప్రయత్నించిన కుట్రకు ప్రధాన సూత్రధారి కూడా. ఈ ఘటనకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ తన దర్యాప్తులో ఖాందానే ప్రధాన నిందితుడిగా పేర్కొంది కూడా. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉండి. పోలీసులకు అమృత్‌పాల్ సింగ్ దొరకకుండా తిరిగిన రోజుల్లోనూ అవతార్ అతనికి సహకరించినట్లు తేలింది కూడా. అవతార్ ఖాందా బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే.. కేఎల్ఎఫ్ ఉగ్రవాది కుల్వంత్ సింగ్ తనయుడే ఈ అవతార్. బాంబ్ ఎక్స్పర్ట్ కూడా. 2007లో యూకేకి స్టడీ వీసా మీద వెళ్లి.. 2012లో అక్కడే ఆశ్రయం పొందాడు. 2020 జనవరిలో కేఎల్ఎఫ్ మాజీ చీఫ్ హర్మీత్ సింగ్ హత్యానంతరం.. కేఎల్‌ఎఫ్‌లో రాంజోధ్ సింగ్ కోడ్ నేమ్‌తో అవతార్ కొనసాగాడు. దీప్ సింగ్ మరణాంతరం వారిస్ పంజాబ్ దే చీఫ్‌గా అమృత్‌పాల్ సింగ్ నియామకంలోనూ అవతార్ సింగ్‌దే కీలక పాత్ర కూడా. మెంటార్ రోల్లో అమృత్‌పాల్ ప్రతీ వ్యవహారాన్ని అవతార్ చూసుకుంటూ వచ్చాడు కూడా. ఇక 37 రోజులపాటు అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉండగా.. ఆ సమయంలో యూకే నుంచి అవతార్ సహాయసహకారాలు అందించాడని దర్యాప్తు బృందాలు నిర్ధారించుకున్నాయి. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అవతార్ సింగ్ బర్మింగ్హమ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నా.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాల నడుమ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 23వ తేదీన పంజాబ్ మోగాలో అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోగా.. అసోం దిబ్రుఘడ్ జైలుకు అతన్ని తరలించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్, అతని ఎనిమిది మంది అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి. సంబంధిత వార్త: వేట ముగిసింది.. అమృత్‌పాల్ అరెస్ట్ -
రతన్ టాటా శిష్యుడు.. వేల కోట్లకు అధిపతి!
భారత్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ లెన్స్‌కార్ట్‌లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. కంపెనీకి చెందిన పాత, కొత్త షేర్లను 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4100 కోట్లు)తో సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్ విలువ 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33,000 కోట్లు). ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరిదో తెలుసా? పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, సుమీత్ కపాహి ఈ లెన్స్‌కార్ట్ సంస్థను స్థాపించారు. ఇందులో కేకేఆర్ అండ్ కంపెనీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టెమాసెక్ హోల్డింగ్స్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వీరిలో పీయూష్ ప్రముఖ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన తర్వాత సెలబ్రిటీ అయ్యారు. అయితే కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న అమిత్ చౌదరి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఎవరీ అమిత్ చౌదరి? అమిత్ చౌదరి లెన్స్‌కార్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కంపెనీకి సీవోవో. అనలిటిక్స్ రంగంలో ప్రావీణ్యం ఉన్న అమిత్ చౌదరి కంపెనీని అభివృద్ధి దిశగా ముందుండి నడిపించారు. వ్యాపారంలో వృద్ధిని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. లెన్స్‌కార్ట్ ఆఫ్‌లైన్ స్టోర్లను పెంచడంలో కీలకపాత్ర పోషించారు. కోల్‌కతాలో జన్మించిన అమిత్ చౌదరి స్థానిక భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నారు. బీఐటీ మెస్రా నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ పట్టా అందుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను తన మెంటర్‌గా చెబుతుంటారు. 2019లో రతన్ టాటాను కలిసిన ఆయన తాను రతన్ టాటాను ఎంతలా ఆరాధించేది తెలుపుతూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో పలువురిని బాగా ఆకట్టుకుంది. రతన్ టాటా అమిత్ చౌదరి కోసం 2016లో లెన్స్‌కార్ట్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇది తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాదు.. కష్టాల్లో ఉన్న స్టార్టప్ కంపెనీ అండగా నిలిచేందుకు. అలా అప్పట్లో రతన్ టాటా నుంచి సాయం పొందిన ఆయన శిష్యుడు నేడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఇదీ చదవండి: సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి! సెబీ నజరానా.. -
గుజరాత్ జెయింట్స్ మెంటార్‌గా మిథాలీ రాజ్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అహ్మదాబాద్ జట్టు ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెపె్టన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా వ్యవహరించనుంది. మిథాలీ లాంటి స్టార్‌ను తమ బృందంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని డైరెక్టర్ ప్రణవ్ అదానీ చెప్పారు. డబ్ల్యూపీఎల్ కోసం ఆమె రిటైర్మెంట్ను పక్కన పెట్టి తొలి టోర్నీలో ఆడవచ్చని వినిపించింది. అయితే తాజా ప్రకటనతో మిథాలీ ప్లేయర్‌గా ఆడే అవకాశాలు లేవని తేలిపోయింది. గుజరాత్లో విమెన్స్ క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు.. మెంటార్‌గా మిథాలీ సపోర్ట్ అందించనుంది. మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత వారం జరిగిన ఫ్రాంచైజీల వేలంలో అదానీ గ్రూప్ రూ. 1298 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. విమెన్స్ క్రికెట్ డెవలప్కావడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యంగ్‌స్టర్స్ క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పింది. -
కీలక పదవిలో బ్రియాన్ లారా.. గాడిన పెట్టేందుకేనా!
వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారాను కీలక పదవి వరించింది. దశ దిశ లేకుండా ఉన్న విండీస్ జట్టును గాడిన పెట్టేందుకు లారాను పర్ఫార్మెన్స్ మెంటార్(Performance Mentor)గా బాధ్యతలు అప్పజెప్పింది. కొన్నాళ్లుగా విండీస్ జట్టు ప్రదర్శన నాసిరకంగ తయారైంది. చిన్న జట్ల చేతిలోనూ అనూహ్యంగా పరాజయాలు చవిచూస్తూ అవమానాలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌ను గాడిన పెట్టేందుకే లారాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ) పేర్కొంది. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టు, బోర్డు అకాడమీ కోసం పనిచేయనున్నాడు. ఆటగాళ్లకు వ్యూహాత్మక సలహాలను అందించడంలో, వారి గేమ్ సెన్స్‌ను మెరుగుపరచడంలో ప్రధాన కోచ్‌లకు సహాయం చేయడమే లారా పని అని బోర్డు తెలిపింది. ''ఆస్ట్రేలియాలోని ఆటగాళ్లు, కోచ్‌లతో సమయం గడిపాను. సీడబ్ల్యూఐతో చర్చించాను. గేమ్ విషయంలో ఆటగాళ్లకు సహాయం చేయగలనని నేను నమ్ముతున్నా. అలాగే వారి వ్యూహాలను మరింత విజయవంతంగా అమలు చేసేలా సాయం చేయగలను. వారితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా'' అని లారా పేర్కొన్నాడు. వచ్చే వారంలో జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ముందుగా టెస్ట్ టీమ్ తో కలిసి లారా పనిచేయనున్నాడు. క్రికెట్లో దిగ్గజంగా పేరు పొందిన లారా తన కెరీర్లో విండీస్ తరపున 131 టెస్టులు ఆడి 52.88 సగటుతో 11,953 పరుగులు చేశాడు. వన్డేల్లో 10,405 పరుగులు కొట్టాడు. 2004లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగులు కొట్టి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 400 రన్స్(క్వాడ్రపుల్ సెంచరీ) కొట్టింది లారా ఒక్కడే. 19 ఏళ్లు దాటినా ఇప్పటికి లారా రికార్డు చెక్కుచెదరలేదు. Brian Lara joins the West Indies management as a performance mentor.#BrianLara #WestIndies pic.twitter.com/CnRGFffyWc — 100MB (@100MasterBlastr) January 27, 2023 చదవండి: మహిళల టి20 వరల్డ్‌కప్: కివీస్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్ క్రిస్టియానో రొనాల్డోకు అవమానం.. -
సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా!
టి20 ప్రపంచకప్ 2022 నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ అమితుమీ తేల్చుకోనుంది. సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి.. దీంతో పాక్ కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ వారికి ఎక్కడో సుడి రాసిపెట్టుంది. అందుకే ఆ తర్వాత పాక్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా గెలవడం.. ఆపై సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సెమీస్‌లో మాత్రం అద్భుత ఆటతీరును కనబరిచింది. సూపర్-12 వరకు కిందా మీదా పడి ఎలాగోలా గెలిచిన పాకిస్తాన్ జట్టేనా సెమీస్‌లో కివీస్‌పై నెగ్గింది అన్న అనుమానాలు వచ్చాయి. మరి రెండు రోజుల వ్యవధిలో పాక్ జట్టులో అంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి కారణం మాత్రం ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అని క్రీడా పండితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్ పాకిస్తాన్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. పాక్ దశను మార్చే పనిలో ఉన్న హేడెన్ దాదాపు సక్సెస్ అయినట్లే. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాకిస్తాన్ విజేతగా నిలిస్తే హేడెన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లే. ఇదంతా ఎందుకు.. అసలు ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్‌ను ఎప్పుడైతే మెంటార్‌గా ఏంచుకుందో అప్పుడే పాక్ సగం సక్సెస్ అయినట్లే. అయితే హేడెన్ ప్రభావం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అది కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో. నిజానికి గతేడాది టి0 ప్రపంచకప్‌కు ముందే అంటే సెప్టెంబర్‌లోనే మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. కానీ ఆ ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ప్రధాన కోచ్ అంటే అన్ని విషయాలు పరిశీలిస్తాడు. అదే బౌలింగ్ లేదా బ్యాటింగ్ కోచ్ అయితే కేవలం వారి పరిధి వరకే పనిచేస్తారు. ప్రస్తుతం పాక్ ప్రధాన కోచ్‌గా సక్లెయిన్ ముస్తాక్ ఉన్నాడు. పీసీబీ ఎంపిక చేసింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇటు చూస్తే ఈసారి ప్రపంచకప్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో.బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న హేడెన్‌కు ఆసీస్ పిచ్‌లపై అపార అనుభవం ఉంది. అందుకే ఉన్నపళంగా మాథ్యూ హేడెన్‌ను మెంటార్‌గా నియమించిన పీసీబీ మహ్మద్ యూసఫ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎన్నుకుంది. హేడెన్ అనుభవాన్ని పాకిస్తాన్ చక్కగా ఉపయోగించుకుందనడానికి సెమీస్ మ్యాచ్ ఉదాహరణ. ముందు బౌలింగ్‌తో కివీస్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత అసలు ఫామ్‌లో లేని బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు అసలు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరి వీటన్నింటి వెనుక కారణం హేడెన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే మ్యాచ్ ముగియగానే హేడెన్ వద్దకు పరిగెత్తుకొచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అతన్ని ప్రేమతో హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సూపర్-12 దశలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ముందుకు సాగుతుందా లేదా అని డైలమాలో ఉన్నాడు.. కానీ ఇదే సమయంలో హేడెన్ మాత్రం మా కుర్రాళ్లు తప్పుకుండా రాణిస్తారు.. ఈసారి కప్ పాకిస్తాన్‌దే అని ప్రతీ మ్యాచ్‌కు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. హేడెన్ వ్యాఖ్యలని బట్టి చూస్తే పాక్ విజయంపై అతను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక పరిస్థితులు కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. 1992 వన్డే వరల్డ్కప్లాగే ఇప్పుడు కూడా పాక్ టైటిల్ కొట్టబోతుంటూ పలువురు జోస్యం చెబుతున్నారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు. ఇప్పుడు బాబర్ ఆజం కెప్టెన్‌గా తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోబోతున్నాడంటూ పేర్కొంటున్నారు. మరి హేడెన్ దిశానిర్ధేశం పాక్ జట్టుకు ఎంత వరకు పనిచేస్తుందనేది ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యాకే తెలుస్తుంది. కాగా కివీస్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో హేడెన్ ఇచ్చిన స్పీచ్‌ను పీసీబీ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ జోస్యాల సంగతి పక్కనబెడితే టి20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పాక్ సంగతి పక్కనబెడితే ఇంగ్లండ్ అంతకంటే బలంగా కనిపిస్తుంది. టీమిండియాతో సెమీస్‌లో ఇంగ్లండ్ ఆడిన ఆటతీరు చూస్తే అర్థమవుతుంది. కానీ పాక్ జట్టులో ప్రస్తుతం బౌలింగ్ విభాగం నెంబర్‌వన్‌గా ఉంది. షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్, నసీమ్ షా పేస్ త్రయానికి తోడుగా మమ్మద్ నవాజ్ స్పిన్ కూడా పెద్ద బలం. మరి అరివీర భయంకరంగా కనిపిస్తున్న పాక్ పేసర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇవన్నీ పక్కనబెడితే క్రికెట్ అభిమానులు మాత్రం ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరేమో 1992 సీన్ రిపీట్ కాబోతుందని.. పాకిస్తాన్‌దే కప్ అని పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పాక్‌కు అంత సీన్ లేదని.. మ్యాచ్ కచ్చితంగా వన్‌సైడ్ అవుతుందని.. ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలవనుందని తెలిపారు. చదవండి: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! -
గౌతమ్ గంభీర్‌కు మరిన్ని కీలక బాధ్యతలు
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యాజమాన్యం మరిన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా యజమానిగా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ ఆధీనంలో ఉన్న అన్ని సూపర్ జెయింట్స్ జట్లకు గంభీర్‌ను గ్లోబల్ మెంటార్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీతో (ఐపీఎల్) పాటు డర్బన్ ఫ్రాంచైజీ (సౌతాఫ్రికా టీ20 లీగ్) కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆర్పీఎస్జీ గ్రూప్ తాజా నిర్ణయంతో గంభీర్‌కు ఎల్ఎస్జీ మెంటార్షిప్తో పాటు డర్బన్ ఫ్రాంచైజీ మెంటార్షిప్ కూడా దక్కనుంది. గడిచిన ఐపీఎల్ సీజన్లో గంభీర్ పనితనాన్ని మెచ్చి గ్లోబల్ మెంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్స్ గా నియమించినట్లు ఆర్పీఎస్జీ గ్రూప్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుత తరంలో చురుకైన క్రికెటింగ్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్లో గంభీర్ ముఖ్యుడని ఆర్పీఎస్జీ పేర్కొంది. కాగా, గంభీర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గడిచిన ఐపీఎల్లో అంచనాలకు మించి రాణించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఏ మాత్రం అంచనాలు లేని ఎల్ఎస్జీని గంభీర్ అన్నీ తానై ముందుండి నడిపించాడు. యువ ఆటగాళ్లను సానబెట్టడంలో గంభీర్ సక్సెస్ కావడంతో ఎల్ఎస్జీ గత సీజన్లో టాప్-4లో నిలిచింది. ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలోని డర్బన్ ఫ్రాంచైజీ వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్ఏ20 లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక్కడ పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ యాజమాన్యలే చేజిక్కించుకోవడంతో ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గంభీర్ ఇండియా క్యాపిటల్స్ జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. -
యువరాజ్ సింగ్ సరికొత్త అవతారం.. న్యూయార్క్ స్ట్రైకర్స్ మెంటార్‌గా!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. అబుదాబి టీ10 లీగ్-2022 సీజన్‌కు గానూ న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు మెంటార్‌గా యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. కాగా యువరాజ్ అబుదాబి టీ10 లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. 2019 ఈ టోర్నీ సీజన్లో మరాఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించాడు. ఇక 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న యువీ.. బీసీసీఐ అనుమతితో కొన్ని గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఆడాడు. అదే విధంగా లీజెండ్స్ లీగ్ క్రికెట్, రోడ్ సెప్టీ వంటి లీగ్‌ల్లో కూడా యువరాజ్ భాగంగా ఉన్నాడు. అబుదాబి టీ10 లీగ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఒప్పందం కుదర్చుకుంది. చదవండి: ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో! -
T20 World Cup 2022: పాకిస్తాన్ మెంటార్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్..
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసంతమ జట్టు మెంటార్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను పిసిబీ నియమించింది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూగా హేడెన్ పాకిస్తాన్ మెంటార్‌గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించింది. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది టోర్నీలో పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతర సహాయక సిబ్బందితో కలిసి హేడెన్ పనిచేయున్నాడు. కాగా అతడు ఆక్టోబర్ 15న పాకిస్తాన్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్‌లో ఆడనుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఆసియాకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్11న దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్! -
విద్యార్థుల మెరుగైన కెరీర్ కోసం ‘ఇంటర్సెల్’తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదారాబాద్: విద్యార్థులకు మెరుగైన కేరీర్ ఎదుగుదల అవకాశాలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఆ దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే.. ఆన్లైన్ మెంటారింగ్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ప్లాట్ ఫామ్ అయిన ‘ఇంటర్సెల్’తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషనరేట్ ఆఫ్ కాలేజియెట్ ఎడ్యుకేషన్(సీసీఈటీఎస్)తో ఇంటర్సెల్ ఎంవోయూ కుదుర్చుకుంది. ► విద్యార్థులు ఇంటర్సెల్ ప్లాట్‌ఫామ్‌పై తమ సంబంధిత రంగాల్లోని నిపుణుల నుంచి గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్ పొందుతారు. ► రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో మెంటారింగ్ సిస్టమ్ అమలుకు అవసరమైన సహాయాన్ని, మద్దతును సీసీఈటీఎస్ అందిస్తుంది. ► ఇంటర్సెల్ వర్చువల్ మెంటార్ నెట్వర్క్ విద్యార్థులు, యువ వృత్తినిపుణులు ప్రపంచవ్యాప్తంగా మెంటార్లతో కనెక్ట్ కావడానికి ఒక నిర్మాణాత్మక వేదికను అందిస్తుంది. ► ఈ ఎంవోయూ మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య కమిషనర్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కెరీర్ అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది. ఇంటర్సెల్తో ఈ భాగస్వామ్యం మన రాష్ట్ర విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును నిర్మించాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఇంటర్సెల్ వ్యవస్థాపకుడు, సీఈవో అరుణభ్ వర్మ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య, తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ కెరీర్ పురోభివృద్ధికి తోడ్పడటానికి మేం ఎదురు చూస్తున్నాం. మా ప్లాట్‌ఫామ్‌తో, విద్యార్థులు విభిన్న రంగాల్లోని అత్యుత్తమ కెరీర్ మెంటార్లను యూక్సెస్ చేసుకుంటారు. వారు కెరీర్ విజయానికి మార్గనిర్దేశం చేయడానికి అందుబాటులో ఉంటారు.’ అని చెప్పారు. ఇంటర్ సెల్ అంటే ఏమిటి? ఇంటర్సెల్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ, ఎస్ఏఏఎస్ ఆధారిత ఆన్లైన్ మెంటారింగ్ ప్లాట్‌ఫామ్. 30కిపైగా దేశాలకు చెందిన మెంటార్లు, 250కిపైగా కెరీర్ స్పైషలైజేషన్లతో ఇంటర్సెల్ విద్యార్థులు, యువ వృత్తి నిపుణులకు లైవ్ వన్ టూ వన్ మెంటారింగ్ సెషన్లను అందిస్తుంది. ఇంటర్సెల్ వద్ద మెంటార్లు అత్యంత గౌరవనీయమైన పరిశ్రమ నిపుణులు. వీరు విభిన్న రంగాలు, పరిశ్రమల్లో 5వేలకు పైగా బ్రాండ్లలో అపారమైన అనుభవాన్ని కలిగి ఉంటారు. ఇదీ చదవండి: Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు! -
కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న శ్రీశాంత్
టీమిండియా మాజీ బౌలర్, వివాదాస్పద ఆటగాడు శాంతకుమరన్ శ్రీశాంత్ త్వరలో మరో కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది చివర్లో (నవంబర్) ప్రారంభమయ్యే అబుదాబీ టీ10 లీగ్ నుంచి మెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సారధ్యం వహించనున్న బంగ్లా టైగర్స్‌కు శ్రీశాంత్ తన సేవలందించనున్నాడు. ఈ జట్టుకు హెడ్ కోచ్‌గా బంగ్లా మాజీ ఆల్‌రౌండర్ ఆఫ్తాబ్ అహ్మద్ వ్యవహరించనుండగా.. అదే దేశానికే చెందిన నజ్ముల్ అబెదిన్ ఫహీమ్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేయనున్నాడు. ఈ ఇద్దరితో కలిసి శ్రీశాంత్ కోచింగ్ టీమ్‌లో ఉంటాడని బంగ్లా టైగర్స్ యాజమాన్యం శనివారం వెల్లడించింది. కాగా, అబుదాబీ ఐదో సీజన్ కోసం బంగ్లా టైగర్స్ కీలక మార్పులు చేసింది. ఐకాన్ ప్లేయర్ కోటాలో షకీబ్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడంతో పాటు విధ్వంసకర ఆటగాళ్లు ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కొలిన్ మన్రో (న్యూజిలాండ్).. స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ (పాకిస్థాన్), శ్రీలంక యువ సంచలనం మతీశ పతిరణను జట్టులో చేర్చుకుంది. సఫారీ స్టార్ ఆటగాడు డుప్లెసిస్ సారధ్యంలో గత సీజన్ బరిలో నిలిచిన బంగ్లా టైగర్స్ మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మార్చిలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్.. తొలిసారి కోచింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు. గతంలో టీమిండియా క్రికెటర్‌గా, సినిమాల్లో హీరోగా నటించిన ఈ కేరళ స్పీడ్‌స్టర్.. త్వరలో సరికొత్త అవతారంలో క్రికెట్ ఫ్యాన్స్ ముందుకు రానున్నాడు. ఐపీఎల్ (2013 సీజన్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్ కెరీర్‌కు అర్థంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. 2022 ఐపీఎల్ వేలంలో కనీస ధర యాభై లక్షలకు తన పేరును నమోదు చేసుకున్న శ్రీశాంత్‌ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు -
బెంగాల్ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్‌కు కీలక పదవి
టీమిండియా సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి బెంగాల్ క్రికెట్లో కొత్త పదవి చేపట్టనుంది. బెంగాల్ మహిళల జట్టు ఆటగాళ్లకు మెంటార్ కమ్ ప్లేయర్‌గా వ్యవహరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) పేర్కొంది. టీమిండియా సీనియర్ పేసర్‌గా సేవలందిస్తున్న ఝులన్ గోస్వామి బెంగాల్ వుమెన్స్ టీమ్‌లో అన్ని ఫార్మాట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తుందని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా పేర్కొన్నారు. గురువారం సాయంత్రంజరిగిన అధ్యక్షత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఇక అండర్-16 కోచ్‌గా అరిన్దామ్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నాడని.. అతనికి అసిస్టెంట్ కోచ్ ఎవరనేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. కాగా అండర్-25 కోచ్‌గా ఉన్న ప్రణబ్ రాయ్‌కు పార్థసారథి భట్టాచార్య అసిస్టెంట్‌గా వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. ఇక అండర్-19 కోచ్‌గా ఉన్న దెవాంగ్ గాంధీకి సంజీబ్ సన్యాల్ అసిస్టెంట్‌గా ఉండనున్నాడు. 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. చదవండి: Washington Sundar: సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్ -
సీఎస్కే జెర్సీ తీశాడు.. టీమిండియా జెర్సీ వేశాడు!
హెలికాప్టర్ షాట్లతో దరువు.. కీపింగ్‌లో చురుకు, వ్యూహాల్లో పదును.. మాటల్లో కుదరు, మిస్టర్ కూల్‌గా నిక్‌నేమ్.. యువ క్రికెటర్లకు ఇన్స్పిరేషన్, రెండు వరల్డ్‌కప్‌లు(టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్)గెలిపించిన నాయకత్వం.. నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన సారథ్యం, వివాదాలకు దూరం.. విజయాలతో సావాసం.. ఇవన్నీ కలిస్తేనే ఎంఎస్ ధోని. నాయకుడిగా టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ధోని.. ఇప్పుడు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో ధోని తన పనికి పదును పెడుతున్నాడు. ఒక కెప్టెన్‌గా ఎంతో సక్సెస్ చవిచూసిన మిస్టర్ కూల్.. మెంటార్‌గా రాణించాలనే తపనతో ఉన్నాడు. తనపై పెట్టిన బాధ్యతను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వర్తించే ధోని.. మరో కొత్త పాత్రలో మెరవడానికి సిద్ధమైపోయాడు. ఆదివారం(అక్టోబర్ 24వ తేదీ) టీమిండియా-పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో ధోని వ్యూహ రచన ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశమైంది. ఒక జట్టులో మెంటార్ పాత్ర పరిమితంగానే ఉంటుందనేది వాస్తవమే అయినప్పటికీ, అక్కడ ఉన్నది ధోని కాబట్టి అతనికి ప్రాధాన్యత ఉంటుందనేది కూడా అంతే వాస్తవం. ఇలా ఐపీఎల్ ముగిసిందో లేదో వెంటనే వరల్డ్‌కప్ ప్రారంభమైంది. ధోనిని టీమిండియా మెంటార్‌గా నియమించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్ణయం కూడా అంతే వేగంగా జరిగిపోయింది. అంతే సీఎస్కే జెర్సీని ఇలా తీశాడో లేదో ఇలా టీమిండియా జెర్సీ వేశాడు మిస్టర్ కూల్. కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్లు టీమిండియాతో కలిసిపోయాడు ధోని. ఏకైక నాయకుడు ధోని.. భారత మాజీ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన ధోని.. టీ20 వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లలో కూడా పలు రికార్డులను సాధించాడు. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించడమే కాకుండా, ఓవరాల్‌గా ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన రికార్డును కూడా నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ధోని 32 డిస్మిసల్స్ సాధించి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 2007 నుంచి 2017 వరకూ టీమిండియాకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. ఇప్పటివరకూ జరిగిన ప్రతీ టీ20 వరల్డ్‌కప్‌లోనూ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫలితంగా టీ20 వరల్డ్‌కప్ ఆడినంత కాలంగా ఒక జట్టుకు కెప్టెన్‌గానే కొనసాగిన ఏకైక ప్లేయర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ధోని. మళ్లీ బ్లూ జెర్సీలో ధోని ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కేకు టైటిల్ అందించడం ద్వారా ధోని తనలోని కెప్టెన్సీ పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో సీఎస్కే దారుణంగా విఫలమైనప్పటికీ, ఈ ఏడాది ఏ జట్టుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందునుంచి ముందుండి నడిపించాడు ధోని. ప్రాక్టీస్ ముందుగానే మొదలు పెట్టి ఆటపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఏ పనినినైనా ఇష్టంగా చేయాలని అంటారు. ధోని నమ్ముకుంది క్రికెట్‌ను, అందుకే విలక్షణమైన నాయకుడిగా ఎదిగాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లోనే కప్‌ను గెలిచిన ధోని.. ఆపై వెనుదిరిగి చూసిందే లేదు. మళ్లీ మెన్ ఇన్ బ్లూతో కలిసి పనిచేస్తున్న ధోని.. ఈ వరల్డ్‌కప్‌లో తన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తాడో చూడాల్సిందే. -
మెంటార్‌గా ధోని పని ప్రారంభించాడు.. అందుకే శార్దూల్
Shardul Thakur T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021కు సంబంధించి టీమిండియా మెంటార్‌గా ఎంఎస్ ధోని ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెంటార్‌గా ధోని తన పనిని ప్రారంభించాడంటూ ఫ్యాన్స్ మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు. అదేంటి.. ఇంకా టి20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ధోని ఎలా ప్రారంభించాడని సందేహ పడకండి. తాజాగా శార్దూల్ ఠాకూర్ .. అక్షర్ పటేల్ స్థానంలో టి20 ప్రపంచకప్ టీమిండియా జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ అన్‌ఫిట్.. జట్టులోకి మరో ఆల్‌రౌండర్! దీనివెనుక ధోనినే పరోక్షంగా కారణమంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో శార్దూల్ ఠాకూర్ సీఎస్కేకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని నాయకత్వంలోని సీఎస్కే ఈ సీజన్లో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. సీఎస్కే ఆడిన 15 మ్యాచ్‌ల్లో శార్దూల్ 18 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేగాక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఈ రెండు అంశాలు శార్దూల్‌కు ప్లస్‌గా మారాయని.. ధోని దగ్గరుండి అతనికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చాడని సీఎస్కే ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శార్దూల్‌పై ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. లార్డ్ శార్దూల్ ఈజ్ బ్యాక్.. బీసీసీఐ అతన్ని సెలెక్ట్ చేయలేదు.. అతని టాలెంట్‌తో ఎంపికయ్యాడు.. ధోని మెంటార్‌గా వచ్చాడు.. పని మొదలుపెట్టాడు.. అంటూ మీమ్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. 🇮🇳 #T20WorldCup Call up 💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/sf6d9JmS4C — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 13, 2021 Lord Is Here #WorldCup pic.twitter.com/AUHlGEI2OU — Aakash Chopra (@cricketaakash) October 13, 2021 Lord Shardul Thakur replacing Axar Patel in #TeamIndia be like 🙈 pic.twitter.com/I5RSZilRhr — Paapsee Tannu ( Tax chor ) 2.0 🐦 (@tiranga__1) October 13, 2021 -
మెంటార్‌గా ధోని: ‘బీసీసీఐని ఒక ప్రశ్న అడుగుతున్నా..’
ముంబై: యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా టీమిండియాకు భారత మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అయితే ధోని ఎంపికపై బీసీసీఐని కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శించారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందిస్తూ బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. చదవండి: MS Dhoni: ధోనీకి షాక్ ''ధోనిని మెంటార్‌గా నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం నన్ను పూర్తిగా నిరాశపరిచింది. ధోనిని ఎంపిక చేయడంపై రెండు రోజులు ఆలోచించా. అయితే ధోనిని నేను తప్పుబట్టడం లేదు. వాస్తవానికి ధోనికి నేను వీరాభిమానిని. అతను మెంటార్‌గా జట్టుకు ఎంతవరకు ఉపయోగపడతాడనే దానిపై మాట్లాడడం లేదు. కేవలం బీసీసీఐని మాత్రమే ఒక ప్రశ్న అడుగుతున్నా. ప్రస్తుతం టీమిండియాకు కోచ్, కెప్టెన్ రూపంలో బలమైన వ్యక్తులు ఉన్నారు. రవిశాస్త్రి, కోహ్లి టీమిండియాను పలుమార్లు నెంబర్‌వన్ స్థానంలో ఉంచారు. అందులోనూ ధోని సారధ్యంలో కోహ్లి చాలా మ్యాచ్‌లు ఆడాడు. ధోని వ్యూహాలపై కోహ్లికి మంచి అవగాహన ఉంటుంది. తాజగా ఇప్పుడు ధోనిని మెంటార్‌గా నియమించడం వల్ల రాత్రికి రాత్రే జట్టులో పెద్ద మార్పులేం చోటుచేసుకోవు. చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు MS Dhoni T20 World Cup Mentor: కెప్టెన్‌గా సూపర్ సక్సెస్.. మరి మెంటార్‌గా ఈ విషయమే నన్ను ఆశ్చర్యపరిచింది. అయినా ధోని తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకే మొగ్గు చూపేవాడు. ఇప్పుడు మెంటార్‌గా వచ్చాడు కాబట్టి మళ్లీ అదే రిపీట్ అవుతుంది. అయితే తాజాగా ఇంగ్లండ్ గడ్డపై టీమీండియా టెస్టు సిరీస్ ఆధ్యంతం నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తోనే మంచి ఫలితాలను రాబట్టింది. మెంటార్, కోచ్ ఇద్దరు జట్టుతో ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి.. దాని ప్రభావం మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, అప్గానిస్తాన్, మరో రెండు క్వాలిఫయర్స్ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. కోహ్లి సారధ్యంలోని 15 మంది జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. శిఖర్ ధావన్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లను పరిగణలలోకి తీసుకోకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం.. -
MS Dhoni: కెప్టెన్‌గా సూపర్ సక్సెస్.. మరి మెంటార్‌గా..
సాక్షి,వెబ్‌డెస్క్: ఎంఎస్ ధోని.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది కావొస్తున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. టీమిండియాకు మూడు మేజర్ ఐసీసీ టోర్నీ టైటిల్స్ అందించిన ధోనికి కెప్టెన్‌గా మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. ఆటకు దూరమైనా అతనిచ్చే సలహాలు ప్రస్తుతం జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు ఉపయోగంగా మారుతాయి. అందుకేనేమో.. ఎలాగైనా 2021 టీ 20 ప్రపంచకప్ కొట్టాలని భావించిన టీమిండియా ఎంఎస్ ధోనిని మెంటార్‌గా ఎంపికచేసింది. మరి ధోని మెంటార్‌గా టీమిండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ పట్టుకొస్తుందా అనేది చూడాలి. చదవండి: T20 World Cup 2021: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని ఆరంభమే ఒక అద్భుతం 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర ప్రదర్శన అందరికి గుర్తుండే ఉంటుంది. రాహుల్ ద్రవిడ్ సారధ్యంలోని టీమిండియా లీగ్‌లో బెర్ముడాపై విజయం మినహా మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసి తొలిరౌండ్లోనే నిష్ర్కమించింది. ఈ విషయం అభిమానులకు మింగుడుపడలేదు. చాలాకాలం పాటు టీమిండియా చెత్త ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అప్పుడప్పుడే టీ20 ఫార్మాట్ క్రికెట్లో సంచలనాలు చేస్తుంది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే.. అభిమానులకు మరింత మజా లభిస్తుందని భావించిన ఐసీసీ అదే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలని భావించింది. టీమిండియాకు ఇక్కడే సమస్య మొదలైంది. చదవండి: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే టీమిండియా జట్టులో అంతా యువరక్తంతో నిండి ఉండాలని బీసీసీఐ భావించింది. జట్టులోని సీనియర్లకు సెలవిస్తూ మొత్తం జట్టునంతా యువకులతో నింపేసింది. ఈ జట్టును నడిపించడానికి ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా తొలి ప్రపంచకప్‌లోనే అద్భుతాలు చేసింది. ధోని కెప్టెన్సీలో ఆ ప్రపంచకప్‌లో భారత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాలు సాధిస్తూ వచ్చింది. ఇక ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్‌ను జోగిందర్ శర్మతో వేయించడం.. శ్రీశాంత్ క్యాచ్ పట్టడం.. టీమిండియా గెలవడం చకచకా జరిగిపోయాయి. అలా ఆరంభంలోనే ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు. మ్యాచ్‌లో ఉన్నప్పడు ధోని బ్రెయిన్ ఎంత చురుకుగా ఉంటుందనేది ఒక ఉదాహరణ. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు ధోని తర్వాతి కాలంలో చాలానే తీసుకున్నాడు. తన సలహాలతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేశాడు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించాడు. అయితే 2007 టీ20 ప్రపంచకప్‌ను పునరావృతం చేసే అవకాశం ధోనికి మరోసారి రాలేదు. ఐదుసార్లు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని టైటిల్ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. మరి అలాంటి ధోనికి ఇప్పుడు మెంటార్‌గా బాధ్యతలు అప్పగించడం వరకు బాగానే ఉంది. మరి ఆ బాధ్యతను ధోని సక్రమంగా నిర్వర్తిస్తాడా అనేది ఆసక్తికరం. ఇక ఐపీఎల్ మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న అతను... బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం ‘మెంటార్’గా ఉండేందుకు అంగీకరించాడు. కెప్టెన్, కోచ్‌లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు. అయితే రవిశాస్త్రి రూపంలో హెడ్ కోచ్, టాప్ ప్లేయర్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్న టీమ్‌కు అదనంగా ధోని మార్గనిర్దేశనం అవసరమా అనేదే చర్చనీయాంశం! చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా -
సింగీతం... స్క్రిప్ట్ మెంటార్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌ను సి. అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే... తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సింగీతం పుట్టినరోజు సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 21) ఈ చిత్రానికి ఆయన మెంటార్‌గా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ‘‘మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. -
ప్రభాస్ కోసం లెజండరీ డైరెక్టర్
ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ సహనిర్మాతలు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త తెలిసింది. విభిన్న చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. సింగీతం శ్రీనివాసరావు స్కెచ్ పోస్టర్ని రిలీజ్ చేసింది. దాంతో పాటు ‘లెజండరీ చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనను మా ఇతిహాసానికి స్వాగతిస్తునందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక రచనలు మాకు మంచి మార్గదర్శకంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలం. క్వారంటైన్ సమయాన్ని కూడా మా సినిమా కోసం వినియోగించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసింది.(చదవండి: కాంబినేషన్ రిపీట్?) A long awaited dream finally comes true. We are thrilled to welcome #SingeetamSrinivasaRao Garu to our epic. His creative superpowers will surely be a guiding force for us.#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/Mxvbs2s7R9 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2020 గత వారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా సింగీత శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఇక ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాకు వస్తే.. ఈ చిత్ర షూటింగ్ 2021లో ప్రారంభమయ్యి.. 2022లో విడుదల కానుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. -
రాజస్తాన్ జట్టు మెంటార్‌గా వార్న్
దుబాయ్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్ ఇప్పుడు మరో పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు వార్న్‌ను టీమ్ మెంటార్‌గా ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. టీమ్ కోచ్, తన విక్టోరియా జట్టు మాజీ సహచరుడు అయిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి వార్న్ పని చేస్తాడు. ‘నా కుటుంబంలాంటి జట్టు రాజస్తాన్‌తో రాయల్స్‌తో మళ్లీ జత కట్టడం సంతోషంగా ఉంది. ఈ జట్టు కోసం ఏ రూపంలో అయినా పని చేయడాన్ని నేను ప్రేమిస్తాను. అందుకే ఇకపై ద్విపాత్రాభినయానికి సిద్ధమయ్యాను’ అని వార్న్ వ్యాఖ్యానించాడు. జట్టు మెంటార్‌గా పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాన్ని ఈ మాజీ లెగ్‌స్పిన్నర్ తాజా సీజన్లో రాయల్స్ మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌ను షేన్ వార్న్ నాయకత్వంలోనే రాజస్తాన్ గెలుచుకుంది. అప్పటినుంచి ఏదో ఒక రూపంలో టీమ్‌తో అతను తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారమే అతను తన 51వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. -
ధోని సహాయం చేసే స్టయిలే వేరు: పంత్
న్యూఢిల్లీ: వర్ధమాన క్రీడాకారులకు సహాయం చేయడంలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. సమస్య పరిష్కారానికి పలు విధానాలను సూచించే ధోని... చివరకు ఆ సమస్యను మనమే పరిష్కరించుకునేలా చేస్తాడని ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొ న్న పంత్ చెప్పుకొచ్చాడు. మైదానంలోనూ, బయట ధోనినే తన మెంటార్ అని తెలిపాడు. ‘ధోని నా గురువు. ఆటలో లేదా వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా నేను మహీ భాయ్‌ని సంప్రదిస్తా. అప్పుడు ధోని నా సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పకుండా దాన్నుంచి బయటపడే అన్ని మార్గాలను సూచిస్తాడు. ఎందుకంటే నేను పూర్తిగా ఎవరిపై ఆధారపడకూడదనేది అతని అభిమతం. క్రీజులో కూడా మహీ భాయ్ ఉంటే అంతా సవ్యంగా జరిగిపోతుంది. అతని భాగస్వామ్యం చాలా ఇష్టం. కానీ మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది’ అని రిషభ్ చెప్పాడు. -
యామునాచార్యుని రాజనీతి
యామునాచార్యుడు విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రవర్తక ఆచార్యులలో ముఖ్యుడైన నాథమునికి మనుమడు. గొప్ప పండితుడు. చోళదేశంలోని వీరనారాయణపురంలో నివసించేవాడు. తండ్రిపేరు ఈశ్వరముని. యామునాచార్యుడు ఒకసారి తన గురువు దగ్గర చదువుకుంటుండగా, రాజపురోహితుడు అక్కడకు వచ్చి, తనకు చెల్లించవలసిన రుణాన్ని వెంటనే చెల్లించమని లేఖ పంపాడు. గురువు కడు పేదవాడు. విషయం తెలుసుకున్న యామునాచార్యుడు ఆ లేఖను చింపాడు. మరొక పత్రం తీసుకుని దానిమీద ఒక శ్లోకం రాసి, దూతకి ఇచ్చి పంపాడు. రాజపురోహితుడు ఆ శ్లోకాన్ని రాజుకు చూపించాడు. రాజు, తన పురోహితునితో శాస్త్రవాదనకు రమ్మని యామునని పిలిపించాడు. ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వాదనలో యామునాచార్యుడు గెలిచాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజు తన రాజ్యంలోని అర్ధభాగాన్ని కానుకగా ఇచ్చాడు. అధిక సంపద చేతికి అందటంతో, యామునాచార్యుడు భోగలాలసుడయ్యాడు. అతడిని అర్ధకామాల నుంచి తప్పించి, భగవంతుని వైపు ధ్యాస మళ్లించాలని యామునాచార్యుని తాతగారి ప్రశిష్యుడైన శ్రీరామమిశ్రుడు ఉపాయం ఆలోచించాడు. యామునుడికి ఇష్టమైన ముండ్లముస్తె కూరను ప్రతిరోజూ అందచేయడం ప్రారంభించాడు. ఇలా ఆరుమాసాలు గడిచింది. తరవాత ఒకనాడు యామునాచార్యుడు భోజన సమయానికి ఆ కూర లేకపోవటంతో, వంటవానిని అడిగాడు. అందుకు అతడు, ‘‘ఎవరో ఒక వృద్ధుడు ఆ కూరను ఇన్ని రోజులు తీసుకువచ్చాడు. ఎందుచేతనో నాలుగు రోజులుగా తీసుకురావట్లేదు’’ అన్నాడు. యామునాచార్యుని ఆజ్ఞ మేరకు శ్రీరామమిశ్రుడు వచ్చి, ‘మీ తాతగారైన నాథముని మీ కోసం ఒక నిక్షేపాన్ని నాకు ఇచ్చి, మీకు అందచేయమన్నారు, మీరు నా వెంట శ్రీరంగానికి రావాలి’ అన్నాడు. యామునాచార్యుడు శ్రీరామమిశ్రుని వెంట శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడకు రాగానే, ‘ఇదే మీ తాతగారు మీకు ఇమ్మని చెప్పిన నిక్షేపం’ అని శ్రీరంగనాథుని రెండు పాదాలను చూపాడు. యామునాచార్యుడికి కళ్లు తెరుచుకున్నాయి. కుమారుడికి రాజ్యం అప్పచెప్పి, రాజనీతి బోధించి, సన్యసించాడు. (యామునాచార్యుడు బోధించిన రాజనీతి ఇకపై వారం వారం) -
శ్రీ శివకుమారస్వామి
సామాన్యప్రజల సేవయే పరమార్థంగా మఠాన్ని నడిపిన మానవతావాది. నిరక్షరాస్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాప్రదాత. మనుషుల్లో దేవుడిగా పూజలందుకున్న ఈ ధార్మికవేత్త తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్ శ్రీశివకుమార స్వామి. 111 ఏళ్ల తమ సుదీర్ఘజీవనంలో ఆధ్యాత్మిక బోధలతో జాతిని చైతన్యవంతం చేసి అభినవ బసవణ్ణగా అందరి మన్ననలను పొందారు. ఆధ్యాత్మిక శక్తి పుంజం 1908 సంవత్సరంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించిన ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక బాటపట్టి ఉద్ధాన శివయోగి వద్ద శిష్యుడిగా చేరాడు. తన సాధనాసంపత్తిని ధారపోసి అతనిని ఆధ్యాత్మిక శక్తిపుంజంగా తయారు చేసి ‘శివకుమార స్వామి’గా లోకానికి అందించారు గురువులైన శ్రీ ఉద్ధాన శివయోగి. గురువుల ఆదేశానుసారంగా తుమకూరులో సిద్ధగంగ మఠాన్ని స్థాపించారు శివకుమారస్వామి. భక్తినావ–సామాజిక తోవ 9 దశాబ్దాల పాటు సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన శివకుమారస్వామి ఆధ్యాత్మిక, భక్తి బోధలకే పరిమితం కాకుండా సమాజసేవనూ బాధ్యతగా స్వీకరించి సంఘసేవకుడిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల్ని నెలకొల్పి లక్షలాదిమంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించి గొప్ప విద్యాదాతగా పేరుగాంచారు. విద్యతోపాటు క్రమశిక్షణను, సత్ప్రవర్తనను పెంపొందించేందుకు కృషి చేసిన ఈ మహనీయుడు లక్షలాదిమంది అభాగ్యుల ఆకలి బాధలు తీర్చిన అన్నదాత కూడా. వరించిన పురస్కారాలు శ్రీ శివకుమారస్వామిని వివిధ పురస్కారాలు కోరి వరించాయి. వీరి సేవలకు గుర్తింపుగా 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి గౌరవించగా, భారత ప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సామాన్యుడే మాన్యుడు వీరి ఆశీస్సుల కోసం ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు సైతం పరితపించేవారు. వీరిమాటను శిరోధార్యంగా భావించేవారు. కానీ వీరు అతి సామాన్యుడిలా శతాధిక వయసులో కూడా రోజూ శిష్యులను కలుసుకుని మాట్లాడేవారు. వారి దైనందిన సమస్యలకు ఆధ్యాత్మిక మార్గంతో పరిష్కారాలను సూచించేవారు. ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ ‘వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికైనా అవసరం. వ్యక్తిగత క్రమశిక్షణకు బాటలు వేసేది ఆధ్యాత్మిక మార్గం. అదే మన జీవితాలను సరైన దారిలో నిలబెడుతుంది. సమాజంలోని ప్రతీ వ్యక్తి సత్యనిష్టాగరిష్టుడైతే సమస్యలన్నవే ఎదురుకావు. సమాజం ఉన్నతంగా పురోగమించాలంటే మనిషి సరైన దారిలో నడవాలి‘ అంటూ అలాంటి మార్గాన్ని ఆచరణలో చూపించి చైతన్యజ్యోతులను ప్రసరింపజేసిన మహనీయుడు శివగంగస్వామి. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు -
క్షమాపణలు చెప్పిన షేన్ వార్న్
పుణే : ఈ దఫా ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. అభిమానుల అంచనాల మేరకు రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలో స్పిన్ దిగ్గజం టీమ్ మెంటర్ షేన్ వార్న్ క్షమాపణలు తెలియజేశారు. ‘గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో రాజస్థాన్ రాయల్స్ ఘోరంగా విఫలం అయ్యింది. అందుకు అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. జట్టు సభ్యులు తమ శక్తిమేర ఆడటానికి యత్నిస్తున్నారు. కాస్త ఓపిక పట్టండి. వచ్చే మ్యాచ్‌ల్లో గెలుపు సాధించి తీరతాం’ అంటూ వార్న్ ఓ ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ 4 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గత రాత్రి పుణే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిన విషయం తెలిసిందే. 204 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 140 పరుగులకే అలౌట్ అయ్యి ఘోర పరాజయం చవిచూసింది. Apologies to all the @rajasthanroyals fans as that was a terrible display tonight in all 3 departments. The boys are trying & will come good so don’t lose hope, stay patient - we will get it right. Win the next 2 games and be 4/3 at the halfway stage - 2/5 is not ok !#IPL2018 — Shane Warne (@ShaneWarne) 20 April 2018 -
రాజస్తాన్ రాయల్స్ మెంటార్‌గా వార్న్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్... ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ మెంటార్‌గా నియమితుడయ్యాడు. రెండేళ్ల నిషేధం అనంతరం ఈ సీజన్లో బరిలో దిగుతున్న రాయల్స్... తొలి ఐపీఎల్ (2008) టైటిల్‌ను వార్న్ కెప్టెన్సీ, కోచింగ్‌లోనే గెల్చుకుంది. ‘నా క్రికెట్ ప్రయాణంలో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్సాహవంతులైన, యువకులతో కూడిన జట్టుతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఈ మేటి లెగ్ స్పిన్నర్ తెలిపాడు. -
రాజస్తాన్ రాయల్స్ మెంటర్‌గా లెజెండరీ స్పిన్నర్
జైపూర్ : లెజెండరీ ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ రాజస్తాన్ రాయల్ టీం మెంటర్‌గా మంగళవారం నియమితులయ్యారు. రాజస్తాన్ రాయల్స్ మొదటి మూడు సీజన్ల(2008-11) సమయంలో కోచ్‌గానూ, కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. షేన్ వార్న్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే రాజస్తాన్ రాయల్స్ టీం మొదటి టైటిల్ విజేతగా నిలిచింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా క్రికెట్ కెరీర్లో రాజస్తాన్ రాయల్స్‌తో ప్రత్యేక అనుంబంధం ఉంది. రాయల్స్ టీం యజమానులు తనపై చూపిన ఆప్యాయతకు కృతజ్ఞుడిని.’ అని షేన్ వార్న్ విలేకరులతో అన్నారు. రాజస్తాన్ రాయల్స్ టీం తరపున మూడు సీజన్ల పాటు ఆడిన వార్న్ 52 మ్యాచ్‌లకు సారధ్యం వహించాడు. మొత్తం 56 వికెట్లు సాధించాడు. షేన్ వార్న్ రాకతో జట్టుకు కొత్త ఊపు వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో లోథా ప్యానెల్ రాజస్తాన్ రాయల్స్‌పై రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. -
కోచ్‌గా కనిపించనున్న మలింగా!
ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్-11 సీజన్లో కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ సీనియర్ బౌలర్‌పై ఆసక్తి కనబర్చలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అయితే 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్‌లాడి 157 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టులో ఇంతకాలం ఆటగాడిగా కొనసాగిన మలింగాను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ముంబై జట్టు ప్రకటించింది. ఇప్పటికే ముంబై హెడ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయవర్ధనే, బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరితోపాటు సహాక సిబ్బంది టీంలో మలింగా చేరనున్నాడు. తనను బౌలింగ్ కోచ్‌గా నియమించడంపై మలింగా స్పందిస్తూ.. ‘‘ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం గొప్ప అవకాశం. ముంబై గత దశాబ్ధంగా నా సొంత జట్టుగా ఉంది. ఇంతకాలం జట్టులో ఆటగాడిగా ఉండటం ఎంతో అనందంగా ఉంది. ఇప్పుడు మెంటర్‌గా ఉండటం కూడా సంతోషమే. నేను ఇప్పుడు మెంటర్‌గా కొత్త పని చేబట్టపోతున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. -
‘తొలి గురువు నానమ్మే’
సాక్షి, న్యూఢిల్లీ : నానమ్మే నా తొలి గురువు, నా మార్గదర్శి‘ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ జయంతి సందర్భంగా రాహుల్‌గాంధీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘దాదీ.. నీతో గడిపిన ఆనందక్షణాలు నాకింకా గుర్తున్నాయి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆదివారం ఇందిరా గాంధీ వందవ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు శక్తిస్థల్‌లోని ఇందిరాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరాగాంధీతో సన్నిహింతగా ఉన్న ఒక ఫొటోనే ట్విటర్లో పోస్ట్ చేశారు. I remember you Dadi with so much love and happiness. You are my mentor and guide. You give me strength. #Indira100 — Office of RG (@OfficeOfRG) 19 November 2017 Remembering Smt. #IndiraGandhi on her Birth Centenary. Her steely determination, clarity of thought & decisive actions made her a towering personality. Undoubtedly and rightfully India's #IronLady. pic.twitter.com/oY5TLVz5tW — Pranab Mukherjee (@CitiznMukherjee) 19 November 2017 -
గురు పరంపర ఆగిపోకూడదు
ఏ బస్సులోనో, రైల్లోనో గురువు మన పక్కనే కూర్చుని ఉన్నా, ఆయన సరస్వతీ స్వాధీనుడనీ, మహాజ్ఞాని అనీ గుర్తుపట్టలేం. మనమెలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉంటాడు. ఆయన నోరు విప్పినప్పుడు ఆ తేడా అర్థమవుతుంది – ఆయన ఒక జ్ఞాని అని తెలుస్తుంది. పర్వతసానువులమీద కురిసిన వర్షజలాలు అక్కడే ఉండిపోతే ఏం ప్రయోజనం? జనావాసాల పక్కనుంచి నదిగా ప్రవహిస్తూ పోతే చుట్టుపక్కల భూములన్నీ సస్యశ్యామలమవుతాయి.’నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం, అస్మద్ ఆచార్య పర్యంతాం వందేగురు పరంపరాం’. ఆ గురుపరంపర వంశంలా, నదిలా అలా వెడుతూనే ఉండాలి. ఆగిపోకూడదు. అందుకే గురువు కూడా శిష్యుడికోసం పరితపిస్తాడు. ఆ కారణంగానే గురువు విషయంలో మార్జాల కిశోరన్యాయం అన్వయం అవుతుందంటారు. పిల్లిపళ్ళకు పదునెక్కువ. పిల్లి చర్మం మెత్తగా ఉంటే పిల్లి పిల్లల చర్మం ఇంకా మెత్తగా ఉంటుంది. అటువంటి పిల్లి దాని పిల్లలను రక్షించుకోవడానికి వాటిని పళ్ళతో కరుచుకున్నా, జాగ్రత్తగా పట్టుకుని ఒక సురక్షిత స్థానానికి తీసుకెళ్ళి భద్రంగా దాచుకుంటుంది. గురువు శిష్యుణ్ణి అలా దాచుకుంటాడు, అలా రక్షించుకుంటాడు. పతనమైపోకుండా కాపాడుకుంటాడు. గురువు మాట సింహస్వప్నం. ఏనుగు కలలో కనిపిస్తే ఎలా ఉంటుందో, సింహగర్జనకు మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో గురువుగారి మాటకు అజ్ఞానమన్న చీకటి అలా విచ్చిపోతుంది. శిష్యుడు దారితప్పి జారిపోకుండా గురువు కాపాడుకుంటూ ధర్మపథంవైపు నడిపిస్తుంటాడు. అలా నడిపించి రక్షించగలిగిన వాడు కనుక గురువు విష్ణువు. అందుకని మార్జాల కిశోరన్యాయం అన్వయమవుతుంది. ’మర్కట కిశోరన్యాయం’ అని మరొకటి ఉంది. తల్లికోతిని దాని పిల్ల పట్టుకుంటుంది. కోతిది చాంచల్యజీవనం. ఎప్పుడు ఎటు దూకిపోతుందో తెలియదు. పక్కన ఉన్న పిల్ల ఎటు తిరుగుతున్నా తల్లికోతిని ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. తల్లి కోతి కదలగానే దానికన్నా ముందే అది పరుగెత్తుకొచ్చి పొట్టకు కరుచుకుపోతుంది. ఇక్కడ తల్లికోతి పిల్లను పట్టుకోదు. పిల్లకోతే తల్లికోతిని పట్టుకుని పోతుంటుంది. చెట్లెక్కినా, గోడలెక్కినా ఎక్కడికి దూకినా పిల్లకోతి గట్టిగా పట్టుకునే ఉంటుంది. పిల్లని తల్లి రక్షించదు. తల్లిని పట్టుకుని పిల్ల దానికది రక్షించుకుంటుంటుంది. అది మర్కటకిశోర న్యాయం. శిష్యుడు గురువుగారిని పట్టుకుంటాడు. పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు. సమర్ధుడైన గురువును చేరుకోవడానికి శిష్యుడు వెంపర్లాడతాడు. ఈ గురువే నాకు కావాలి. నేనీయన శిష్యుడిని అనిపించుకోవాలని ఎంత వెంటపడతాడో! వెళ్ళి గురువుగారిని పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు.అయితే ఈ రెండు న్యాయాలు ఒక స్థాయికి చేరుకున్నాక ఇక గురువుకి, శిష్యుడికి అన్వయం కావు. కారణం– పిల్లి తన పిల్లను ఎన్నాళ్ళు రక్షిస్తుందంటే–పిల్ల తనంత తానుగా ఆహారం తినగలిగే వరకే రక్షిస్తుంది. కోతికూడా దాని పిల్ల దానంతట అది ఆహారం స్వీకరించడం వచ్చేవరకే పోషిస్తుంది. అందుకే ఒక స్థాయి దాటిన తర్వాత మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం రెండూ వీరికి అన్వయం కావు.గురువు మాత్రం తన శరీరం పడిపోయినా తన శిష్యుడిని కాపాడుకుంటూనే ఉంటాడు. అందుకే గురుశిష్యుల అనుబంధం తండ్రికీ, కొడుకుకీ మధ్య ఉన్న సంబంధం కన్నా గొప్పది. గురువుగారి శరీరం పడిపోతే గయాశ్రాద్ధం పెట్టే అధికారం శిష్యుడికి ఉంది. అంతగా రక్షణగా ఉంటాడు కాబట్టి గురువు విష్ణువు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గురువు సర్వకాలాల్లో ఉంటాడు
పరమాత్మ అంతటానిండి ఉన్నప్పటికీ, ఆయన గురువు రూపంలో తిరుగుతుంటాడు. కానీ ఆ గురువును పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. భగవాన్ రమణులు ఏమంటారంటే... ‘సాలగ్రామం కూడా గులకరాళ్ళలోనే ఉంటుంది. దాన్ని గుర్తించగలిగిన వాడు మాత్రమే దానిని కనిపెట్టి, అర్చించి, దాని అనుగ్రహంచేత ఉన్నతస్థానాన్ని పొందినట్లుగానే గృహస్థాశ్రమంలోనే ఉండి అందరితో కలసి తిరుగుతున్న గురువు భిన్నంగా ఏమీ కనబడకపోయినప్పటికీ ఆయన ఏ కారణం చేత మనకన్నా అధికుడై ఉన్నాడో, ఆయనను ఎందుకు అనుసరించాల్సి ఉంటుందో, అనుసరిస్తే మనల్ని ఆయన ఎక్కడకు చేర్చగలడో గ్రహించి, ఆయన సాక్షాత్ రాశీభూతమైన పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకుని పట్టుకోగలగడం గులకరాళ్ళలోంచి సాలగ్రామాన్ని వేరుచేయడం వంటిదే.’ అటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపం కనుక గురువు విషయంలో ఉపాసనలో పెద్దలు ఒక మాట చెబుతారు. శృంగేరీ పీఠానికి ఆధిపత్యం వహించిన మహాపురుషులు, ఒకనాడు జీవన్ముక్తులు, ఈనాడు విదేహముక్తిని పొందినవారు, అంటే శరీరంలో ఉన్నప్పటికీ తాను ఈ శరీరం కాదనీ, తాను ఆత్మ అనీ, బాగా రూఢిచేసుకుని ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుని ఆత్మగా మాత్రమే ఈ భూమిమీద చరించి శరీరంతో సంపర్కం లేకుండా తనంత తాను శరీరం పడిపోయేవరకు శరీరాన్ని పోషించి శరీరాన్ని సాక్షిగా చూసి పడిపోయిన శరీరాన్ని చూసి ‘హమ్మయ్య, విడిపోయింది, నాకున్న ఉపాధి’ అని పరమసంతోషంతో అనంతమైన ఈ బ్రహ్మాండాలలో తేజోరూపంగా వ్యాపకత్వాన్ని పొందినవాడు ఎవరో అటువంటివాడు విదేహముక్తిని పొందిన గురువు. ఆయన శరీరంతో లేకపోయినా అటువంటి గురువు సర్వకాలాల్లో ఉంటూనే ఉంటాడు, సర్వకాలాల్లో శిష్యుని రక్షణ బాధ్యతలు స్వీకరిస్తూనే ఉంటాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే...సనాతన ధర్మంలో చాలా గురు స్వరూపాలు శరీరాన్ని విడిచి పెట్టేసినప్పటికీ కూడా వాళ్ళు విదేహముక్తిని పొంది, వాళ్ళ శరీరాలు భూస్థాపితం చేయబడి దానిమీద తులసికోట ఉంచి బృందావనం అన్నా, శివలింగముంచి అధిష్ఠానం అన్నా తరువాత కాలంలోకూడా వారు ఎలుగెత్తి పిలిచిన తమ శిష్యుల యోగక్షేమాలను కనిపెట్టుకునే ఉన్నారు. అందుకే వారి గురుస్వరూపాన్ని అంతగా ఆరాధన చేస్తారు. పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి శృంగేరీలో ఉంటే నిత్యం వారికున్న ప్రధాన వ్యాపకమేది అంటే ... పొద్దున్నేలేచి అనుష్ఠానం అయిపోయిన తరువాత వారు గురువుల అధిష్ఠానాల దగ్గరకు వస్తారు. సచ్చిదానంద శివానంద నృసింహ భారతి, అలాగే నృసింహ భారతి, చంద్రశేఖర భారతి, శ్రీమత్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి మొదలైనవారి అధిష్ఠానాలకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. వారితోపాటూ గురుపాదుకలు వెడతాయి. వాటికి ప్రతిరోజూ నమస్కారం చేస్తారు. గురుపాదుకలకు నివేదనం కూడా చేస్తారు. గురువుగారితో ప్రత్యక్షంగా వ్యవహరించినట్లే. దానికి ప్రతిగా గురువుగారు వెన్నంటి రక్ష చేస్తూనే ఉంటారు. -
గురు శిష్యులు
ఒకసారి ఓ గురుశిష్యులిద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఎటో వెళుతున్నారు. శిష్యుడికి ఆ గురువంటే అమితమైన గౌరవాభిమానాలు. గురువుముందు బిగ్గరగా మాట్లాడడం గాని, అతనికంటే ఒక్క అడుగు కూడా ముందు నడవడం గాని చేసేవాడు కాదు. వినయ విధేయతలతో మసలుకునేవాడు. వారలా వెళుతూ ఉండగా మార్గంలో ఒక వాగు దాటవలసి వచ్చింది. అప్పుడు గురువు, శిష్యుడికి జాగ్రత్తలు చెబుతూ వాగులోకి దిగాడు. కాని శిష్యుడు వెంటనే గురువుగారి చెయ్యి పట్టుకొని ఒడ్డుకు లాగి, ‘‘గురువుగారూ.. ముందు నేను వాగు దాటుతాను. తరువాత మీరొద్దురుగాని.. అందాకా ఇక్కడే ఉండండి’’ అన్నాడు వినయంగా. ‘‘లేదు లేదు నేనే ముందు వాగు దాటుతాను’’ అంటూ కోప్పడ్డాడు గురువు. శిష్యుడు మొండిగా ‘‘నేనే దాటుతాను గురువుగారూ’’ అని పట్టుబట్టాడు. చివరికి గురువే కాస్త మెత్తబడి, ‘సరే నువ్వేదాటు.. ఏం చేస్తాం.. అని అనుమతించాడు. గురువు అనుమతి పొందిన శిష్యుడు తానే ముందుగా వాగుదాటాడు. తరువాత గురువు కూడా దాటాడు. మొత్తానికి గురుశిష్యులిద్దరూ వాగుదాటి, ఓ చెట్టుకింద కూర్చున్నారు. అప్పుడు గురువు శిష్యుడితో మాట్లాడుతూ.. ‘‘నీకు బాగా తలబిరుసుతనం ఎక్కువైంది. నామాట వినకుండా నీ పంతమే నెగ్గించుకొని నాకన్నా నువ్వే ముందు వాగు దాటావు. గురువు పట్ల ఇలాంటి అవిధేయత పనికిరాదు.’’ అన్నాడు కోపంగా... అప్పుడు శిష్యుడు, ‘‘గురువుగారూ.. నేను మీ పట్ల అవిధేయత చూపలేదు. ఎప్పుడూ చూపను కూడా..! నేను కేవలం నా బాధ్యతను గుర్తించి, మీ హక్కును నెరవేర్చాను. అయితే ఇప్పుడు మీమాట వినకపోడానికి ఒక కారణముంది’’ అన్నాడు వినయంగా. ‘‘ఏమిటది?’’ అడిగాడు గురువు ఆశ్చర్యంగా ..‘‘అసలే వర్షాకాలం రోజులు. వాగేమో ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వాగు దాటేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే, నేనొక్కణ్ణే కొట్టుకుపోతాను. ఒకవేళ మీరు ముందుగా వాగు దాటితే, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రమాదమేమైనా మీకు గాని జరిగితే, మీతోపాటు వేలాదిమందిని ముంచినవాణ్ణి అయిపోతాను.’’ అన్నాడు శిష్యుడు.. ‘అదేమిటి.. అదెలా?’’ అన్నాడు గురువు ఆశ్చర్యంగా.. ‘‘గురువర్యా.. అదంతే.. నాలాంటి వేలమంది శిష్యులు కలిసి కూడా మీలాంటి ఒక గురువును తయారు చేయలేరు. అదే మీరు చల్లగా ఉంటే, నాలాంటి శిష్యుల్ని వేలాదిమందిని తయారు చేయగలరు.’’ అన్నాడు శిష్యుడు. శిష్యుని మాటలు విన్న గురువు అమితానంద భరితుడై శిష్యుణ్ణి మనసారా దీవించాడు. అతడి ఉన్నతి కోసం దైవాన్ని ప్రార్థించాడు. ఆ శిష్యుడు సికిందర్ చక్రవర్తి అయితే గురువు అరిస్టో. ప్రపంచ విజేతగా ప్రఖ్యాతి పొందిన యూనాన్ చక్రవర్తి సికిందర్‌ను ‘తండ్రి ఔన్నత్యం గొప్పదా.. గురువు ఔన్నత్యం గొప్పదా..’ అని అడిగితే, ‘తండ్రి నన్ను ఈలోకంలోకి తీసుకు వచ్చాడు. నా ఉనికికి కారణం ఆయన. అయితే, గురువు నన్ను, నా స్థానాన్ని ఆకాశానికెత్తాడు.’ అని సమాధానం చెప్పాడు.పవిత్ర ఖురాన్లో సైతం దేవుడు, ప్రవక్తవారి ముందు అనుచరుల్ని పెద్దగా గొంతెత్తి మాట్లాడకూడదని ఆదేశించాడు. అందుకని, తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల పట్ల వినయ విధేయతలతో మసలుకోవాలి. వారిని గౌరవించాలి. వారి ఆశీర్వాదాలు, దుఆలు పొందాలి. అంతేకానీ, గురువును అవహేళన చేయడం, గురు నింద చేయడం తగదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
డేర్‌డెవిల్స్ మెంటార్‌గా ద్రవిడ్
గుర్గావ్: ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్.... భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను మెంటార్‌గా నియమించుకుంది. ప్యాడీ ఆప్టన్‌ను చీఫ్ కోచ్‌గా తీసుకుంది. గతంలో ఈ ఇద్దరు రాజస్తాన్ రాయల్స్ తరఫున కలిసి పని చేశారు. గత మూడు సీజన్లలో నిరాశాజనక ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ ఈ జోడిపై భారీగా ఆశలు పెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్‌కే పని చేసిన ముంబై మాజీ ఓపెనర్ జుబిన్ బరుచాను ఢిల్లీ టెక్నికల్ డెరైక్టర్‌గా ఎంపిక చేసుకుంది. టీఏ శేఖర్, ప్రవీణ్ ఆమ్రే, శ్రీధరన్ శ్రీరామ్‌లు సహాయక సిబ్బందిగా పని చేయనున్నారు. ఈ సీజన్ కోసం ఢిల్లీ జట్టుకు రెండు దశల్లో శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు. రాజస్తాన్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పటికీ ఢిల్లీ జట్టుతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టానని ద్రవిడ్ చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులతో ఢిల్లీ జట్టు సమతుల్యంగా ఉందని చెప్పిన ఈ మాజీ బ్యాట్స్‌మన్ ఈసారి విజయవంతమవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జయవర్ధనేపై శ్రీలంక బోర్డు గుర్రు
కొలంబో: మహేలా జయవర్ధనే.. శ్రీలంక మాజీ కెప్టెన్. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి తనదైన ముద్రను సంపాదించుకున్న ఆటగాడు. 2014 చివర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు మెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే జయవర్ధనేకు కష్టాలు తీసుకొచ్చేటట్లు కనబడుతోంది. దాదాపు ఏడాదిన్నర క్రితమే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జయవర్ధనే అప్పుడే వేరే జట్టుకు సలహాదారుగా పనిచేయడమేమిటని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) పెద్దలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒక జట్టుకు కోచ్ తదితర పాత్రలు పోషించాలంటే ఏ క్రికెటర్ అయినా వీడ్కోలు సమయం నుంచి కనీసం రెండేళ్లు కాల వ్యవధి తీసుకుంటాడని జయవర్ధనే తీరును ఎస్ఎల్సీ చైర్మన్ తిలంగా సుమిథిపాలా తప్పుబట్టారు. ఈ రకంగా చేయడం వల్ల ఒక జట్టులోని బలంతో పాటు బలహీనతల కూడా అవతలి జట్టుకు చేరే వేసే ప్రమాదం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది స్పోర్ట్స్ ఎథిక్స్ కు విఘాతం కల్గిస్తుందని పేర్కొన్నారు. తన దృష్టిలో కోచ్ గా పని చేసే సామర్థ్యం ఉండాలంటే జట్టు నుంచి బయటకొచ్చిన తరువాత రెండేళ్లు కాలపరిమిత తీసుకోవాలని తిలంగా స్పష్టం చేశాడు. మరోవైపు క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై జయవర్ధనే స్పందించాడు. తాను కేవలం ఇంగ్లండ్ క్రికెటర్లకు సాంకేతికంగా సాయపడటానికి మాత్రమే ఈ బాధ్యతను తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకంగా స్పిన్ విషయంలో వీక్ గా ఉండే ఇంగ్లండ్‌ను తీర్చిదిద్దడం తన కర్తవ్యంలో ఒక భాగమని స్పష్టం చేశాడు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ కు జయవర్ధనే మెంటర్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు బలహీనతల్ని చేరేవేస్తాడనే భయం క్రికెట్ బోర్డు పెద్దల్లో పట్టుకోవడమే ఈ తాజా వ్యాఖ్యలకు కారణం. -
ద్రవిడ్ వల్లే పరిణతి చెందా: వాట్సన్
బెంగళూరు: రాజస్థాన్ రాయల్స్ టీమ్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ వల్లే ఓ క్రికెటర్‌గా అన్ని విభాగాల్లో పరిణతి చెందినట్టు ఆ జట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ‘ద్రవిడ్‌లాంటి వ్యక్తి మెంటర్‌గా ఉండడం అనేది అత్యద్భుతమైన విషయం. అతడు మా జట్టులో ఉండబట్టే నేను అత్యంత స్వల్ప కాలంలోనే అభివృద్ధి చెందగలిగాను. వ్యక్తిగతంగానైతే నాకు అతని సాన్నిహిత్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో ద్రవిడ్‌తో కలిసి ఆడడం నాకు దక్కిన గౌరవం. ఇక ఫాల్క్‌నర్ బెంగళూరుతో ఆడిన ఇన్నింగ్స్‌లాగే గతంలోనూ ఆసీస్ తరఫున పలుమార్లు ఆడాడు. అతను నిలకడైన ఆల్‌రౌండర్‌గా రూపుదిద్దుకోవడం మంచి పరిణామం’ అని వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్లో ఆసీస్ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నా ఐసీసీ టి20 టోర్నీల్లో మాత్రం తేలిపోవడం బాధ కలిగిస్తోందని చెప్పాడు. -
మీ దైవంతో టచ్‌లో ఉన్నారా?
దేవుడు అనేక రూపాలలో మనిషి జీవితంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చినట్టు తెలీదు. వెళ్లిన తర్వాత మాత్రమే వచ్చివెళ్లినట్లు తెలుస్తుంది! జీవితాన్ని మించిన గురువు లేదు. గురువును మించిన దైవమూ లేదు. అంతమాత్రాన జీవితాన్ని నేరుగా దైవం అనేందుకు లేదు! మధ్యలో కొందరు గురువులు, కొందరు శిష్యులు నలిగిపోవాలి. నాలుగు వీధులు తిరగాలి. కాళ్లు అరగాలి. కంఠనాళాలు తెగిపోవాలి. అప్పుడే దైవోద్భవం జరుగుతుంది. దేవుడు తేటగా పైకి తేలతాడు. అయితే చూడండి, ఈ నలిగిపోవడం, తిరగడం, అరగడం, తెగిపోవడం వంటివన్నీ దేవుడు లేడని ‘కనిపెట్టడానికి’ కూడా జరుగుతుంటాయి. అప్పుడు కూడా ఏదో ఒక రూపంలో దేవుడు తేటగానో, తీక్షణంగానో పైకి తేలతాడు తప్ప ‘సప్రెస్’ అయిపోడు. చివరికేమిటి? అంతా కలసి దేవుడు ఉన్నాడని చెప్పడం కోసం జీవిస్తున్నారా? పరమార్థం అదే కావచ్చు. ఒక మంచి గురువులా ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తుంది జీవితం. ‘నువ్వేం చెప్పినా అర్థమవుతుందిలే. చెప్పుకుంటూ పో’ అని చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పరుగులు తీసేవాళ్లని కూడా వదిలిపెట్టదు. బిడ్డ వినడం లేదని తల్లి వెంటపడకుండా ఉంటుందా? గురుశిష్య బంధమూ అంతే. ఏథెన్స్ తత్వవేత్త సోక్రటీస్కు జీవితమే గురువు. ఈ మహాజ్ఞాని జీవితాన్ని చాలా ప్రశ్నలు అడిగాడు. జ్జానం అంటే ఏమిటి? స్నేహం, ప్రేమ, సౌందర్యం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, సత్యం, మతం, దైవం.. ఇవన్నీ ఏమిటి? అని జీవితాన్ని సతాయించాడు. మరి సమాధానాలు దొరికాయా? అవి ఆయనకు అక్కర్లేదు. అడగడమే అయన తెలుసుకున్న జ్ఞానం, ఆయన నమ్మిన దైవం. ఎంతెంతమంది శిష్యులు సోక్రటీస్కు! అతడొక దైవం అయిపోయాడు వారికి. ముఖ్యంగా ప్లేటోకి. ప్లేటోలాంటి శిష్యుడే ఈ కాలపు సర్ అలెక్స్ ఫెర్గూసన్. ఈ స్కాట్లాండ్ ఫుట్‌బాల్ టీమ్ మేనేజర్ తన ఇంట్లో గోడ కి ఒక బెల్టుని దేవుడిపటంలా వేలాడదీసుకున్నాడు! ఆ బెల్టు ఆయన చిన్ననాటి టీచర్ ఎలిజబెత్ థాంప్సన్ది. అలెక్స్ శ్రద్ధగా వినకపోయినా, సరైన సమాధానం చెప్పకపోయినా ఎలిజబెత్ టీచర్ తన బెల్టు తీసి రెండు అంటించేవారట. ఆమె తన పాలిటి దైవం అంటారు అలెక్స్. ‘‘టీచర్ నన్ను అలా దండించకపోయి ఉంటే, జీవితం నాకు ఇవాళ ఇన్ని అందించి ఉండేది కాదు’’ అంటారు అలెక్స్. పాఠశాల జీవితం నుంచి బయట పడి ఏళ్లు గడిచినా, నిన్న మొన్నటి వరకు అలెక్స్ తన ‘దైవం’తో టచ్‌లో ఉన్నారు. కానీ విషాదం, ఆమె చనిపోయినప్పుడు ఆయన దగ్గర లేరు. కనీసం కడసారి చూసేందుకైనా వీలుకానంత దూరంగా విదేశాల్లో ఉన్నారు. తిరిగి స్కాట్లాండ్ వచ్చిన కొన్ని నెలలకు అలెక్స్‌కు పోస్టులో ఒక పార్సిల్ వచ్చింది. తెరచి చూస్తే ‘బెల్టు’! దాంతో పాటు టీచర్ మేనల్లుడి చేతిరాతతో ఉన్న ఉత్తరం. ‘‘ఈ బెల్టు గురించి మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ టీచర్ ఎలిజబెత్’’ అని రాసి ఉంది అందులో! ప్రస్తుతం అలెక్స్ ఇంటి గోడకు వేలాడుతున్న బెల్టు అదే! అలెక్స్‌కు ఆ బెల్టు దైవంతో సమానం. దేవుడు అనేక రూపాలలో మనిషి జీవితంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చినట్టు తెలీదు. వెళ్లినప్పుడు మాత్రమే వచ్చివెళ్లినట్లు తెలుస్తుంది! అదీ గురుసాన్నిధ్యంలో ఉన్నవారికే తెలుస్తుంది. -
‘మెంటర్’గా మాస్టర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అనంతరం సచిన్ టెండూల్కర్ మరోసారి ఆటతో నేరుగా మమేకం కానున్నాడు. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘అడిడాస్’ రూపొందించిన కార్యక్రమంలో భాగంగా అతను కొత్త తరం యువ ఆటగాళ్లకు మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. ఇందు కోసం దేశవ్యాప్తంగా 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఉన్నారు. వీరు కాకుండా ఇప్పటికే భారత జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కోహ్లి, రోహిత్ శర్మ, రైనాలతో కూడా అడిడాస్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇదో కొత్త తరహా ఆలోచన. యువ ఆటగాళ్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ క్రికెటర్లకు మెంటర్‌గా వ్యవహరించడం అంటే నాకెంతో ఇష్టమైన క్రికెట్‌కు చేరువగా ఉండటంతో పాటు...నా వైపునుంచి ఆటకు సేవ చేయడం కూడా’ అని సచిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమం కోసం ‘అడిడాస్’ సంస్థ... ఉన్ముక్త్, రసూల్, విజయ్ జోల్, మనన్ వోహ్రా, మన్‌ప్రీత్ జునేజా, రుష్ కలారియా, చిరాగ్ ఖురానా, ఆకాశ్‌దీప్ నాథ్, వికాస్ మిశ్రా, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్లను ఎంపిక చేసింది.