
సింగీతం శ్రీనివాసరావు
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌ను సి. అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే... తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక బ్లాక్‌బస్టర్స్‌ను రూపొందించిన లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్‌కు స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సింగీతం పుట్టినరోజు సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 21) ఈ చిత్రానికి ఆయన మెంటార్‌గా చేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ‘‘మా ఎపిక్‌కు సింగీతం శ్రీనివాసరావుగారిని ఆహ్వానిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నాం. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శక శక్తిగా ఉంటుంది’’ అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment