దేశవాళీ క్రికెట్ సీజన్ (2024-25)కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ మెంటార్‌గా భారత మాజీ పేసర్ ధావల్ కులకర్ణిని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. కులకర్ణి దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ముంబై జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఈ మెరకు ఎంసీఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కులకర్ణికి అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేనప్పటకి దేశీవాళీ క్రికెట్‌లో మాత్రం ముంబై తరపున అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కులకర్ణి.. టీమిండియా తరపున 12 వన్డేలు, రెండు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం కులకర్ణి 96 మ్యాచ్‌ల్లో ఏకంగా 285 వికెట్లు పడగొట్టాడు. రంజీట్రోఫీ 2023-24 సీజన్ ట్రోఫీని ముంబై సొంతం చేసుకోవడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించాడు.
రికార్డు స్ధాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకున్న అనంతరం కులకర్ణి.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పకున్నాడు. ఈ క్రమంలోనే అతడి సేవలను ఉపయెగించుకోవాలని భావించిన ఎంసీఏ.. మెంటార్ పదవిని కట్టబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment