dhaval Kulkarni
-
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్‌గా మాజీ క్రికెటర్
దేశవాళీ క్రికెట్ సీజన్ (2024-25)కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ మెంటార్‌గా భారత మాజీ పేసర్ ధావల్ కులకర్ణిని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. కులకర్ణి దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ముంబై జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మెరకు ఎంసీఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కులకర్ణికి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటకి దేశీవాళీ క్రికెట్లో మాత్రం ముంబై తరపున అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కులకర్ణి.. టీమిండియా తరపున 12 వన్డేలు, రెండు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం కులకర్ణి 96 మ్యాచ్‌ల్లో ఏకంగా 285 వికెట్లు పడగొట్టాడు. రంజీట్రోఫీ 2023-24 సీజన్ ట్రోఫీని ముంబై సొంతం చేసుకోవడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించాడు.రికార్డు స్ధాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకున్న అనంతరం కులకర్ణి.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పకున్నాడు. ఈ క్రమంలోనే అతడి సేవలను ఉపయెగించుకోవాలని భావించిన ఎంసీఏ.. మెంటార్ పదవిని కట్టబెట్టింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్
టీమిండియా వెటరన్, ముంబై స్టార్ పేసర్ ధవల్ కులకర్ణి తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ఘనంగా ముగించాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి కులకర్ణి తప్పుకున్నాడు. ఈ ఫైనల్ పోరులో విధర్బను 164 పరుగుల తేడాతో చిత్తు చేసిన ముంబై.. 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది. తన కెరీర్ చివర మ్యాచ్‌లో కూడా కులకర్ణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ధవల్ 4 వికెట్లు పడగొట్టాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో విధర్బ చివరి వికెట్‌ను కూడా కులకర్ణినే పడగొట్టడం గమనార్హం. ఉమేశ్ యాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ముంబైని ఛాంపియన్స్‌గా కులకర్ణి నిలిపాడు. ముంబై తరపున 96 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కులకర్ణి.. 281 వికెట్లు పడగొట్టాడు. ఇక 2016లో ధోని సారథ్యంలో టీమిండియా తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. అతడికి ధోని నుంచి మంచి సపోర్ట్ కూడా ఉండేది. కానీ తర్వాత కులకర్ణి విఫలం అవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ధవల్ కులకర్ణి మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి చాలా కాలం పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. వీరిద్దరూ మంబైకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ధవల్ పలు ఐపీఎల్ సీజన్లు ఆడాడు. ఈ క్రమంలో కులకర్ణి రిటైర్మెంట్పై హిట్‌మ్యాన్ స్పందించాడు. "ది వారియర్ ఆఫ్ ముంబై, వెల్డన్, వాట్ ఏ కెరీర్" అంటూ రోహిత తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. -
అక్షర్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
దుబాయ్: భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ తొలిసారిగా కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ను చేరుకున్నాడు. సోమవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ 13వ స్థానాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా రాణించిన బుమ్రా 125 స్థానాలు మెరుగుపరుచుకొని 97వ ర్యాంకుకు చేరుకోగా... ధవల్ కులకర్ణి 29 స్థానాలు ఎగబాకి 88వ ర్యాంకులో నిలిచాడు