
లసిత్ మలింగా
ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్-11 సీజన్‌లో కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ సీనియర్ బౌలర్‌పై ఆసక్తి కనబర్చలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అయితే 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్‌లాడి 157 వికెట్లు పడగొట్టాడు.
తమ జట్టులో ఇంతకాలం ఆటగాడిగా కొనసాగిన మలింగాను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ముంబై జట్టు ప్రకటించింది. ఇప్పటికే ముంబై హెడ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయవర్ధనే, బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరితోపాటు సహాక సిబ్బంది టీంలో మలింగా చేరనున్నాడు.
తనను బౌలింగ్ కోచ్‌గా నియమించడంపై మలింగా స్పందిస్తూ.. ‘‘ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం గొప్ప అవకాశం. ముంబై గత దశాబ్ధంగా నా సొంత జట్టుగా ఉంది. ఇంతకాలం జట్టులో ఆటగాడిగా ఉండటం ఎంతో అనందంగా ఉంది. ఇప్పుడు మెంటర్‌గా ఉండటం కూడా సంతోషమే. నేను ఇప్పుడు మెంటర్‌గా కొత్త పని చేబట్టపోతున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment