డేర్‌డెవిల్స్ మెంటార్‌గా ద్రవిడ్
గుర్గావ్: ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్.... భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను మెంటార్‌గా నియమించుకుంది. ప్యాడీ ఆప్టన్‌ను చీఫ్ కోచ్‌గా తీసుకుంది. గతంలో ఈ ఇద్దరు రాజస్తాన్ రాయల్స్ తరఫున కలిసి పని చేశారు. గత మూడు సీజన్లలో నిరాశాజనక ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ ఈ జోడిపై భారీగా ఆశలు పెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్‌కే పని చేసిన ముంబై మాజీ ఓపెనర్ జుబిన్ బరుచాను ఢిల్లీ టెక్నికల్ డెరైక్టర్‌గా ఎంపిక చేసుకుంది. టీఏ శేఖర్, ప్రవీణ్ ఆమ్రే, శ్రీధరన్ శ్రీరామ్‌లు సహాయక సిబ్బందిగా పని చేయనున్నారు. ఈ సీజన్ కోసం ఢిల్లీ జట్టుకు రెండు దశల్లో శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు.
రాజస్తాన్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పటికీ ఢిల్లీ జట్టుతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టానని ద్రవిడ్ చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులతో ఢిల్లీ జట్టు సమతుల్యంగా ఉందని చెప్పిన ఈ మాజీ బ్యాట్స్‌మన్ ఈసారి విజయవంతమవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.