Indian cricket captain
-
ఎంఎస్ ధోనితో జట్టు కట్టిన న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్
భారతదేశపు నాలుగో అతి పెద్ద రోగనిర్థారరణ సేవల సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని పని చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఇండియన్ కెప్టెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ప్రకటించింది. అంబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు న్యూబర్గ్ చేపట్టిన కార్యక్రమాలు తనకు నచ్చాయన్నారు మాజీ ఇండియన్ స్కిప్పర్ ధోని. కోవిడ్-19 మహమ్మారి కాలంలో అన్ని వయస్సుల వారి ఆరోగ్యం, బాగోగులపై అవగాహన కల్పించేందుకు వారు చేపట్టిన ప్రచారంలో తాను భాగస్వామి అవుతున్నట్టు వెల్లడించారు. న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ఛైర్మన్ డాక్టర్ జీఎస్కే వేలు మాట్లాడుతూ ధోని వంటి లెజెండ్ మా ప్రచారకర్తగా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటాన్ని మేము గౌరవంగా భావిస్తామన్నారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే మూడు ఖండాలకు తన వ్యాపారాన్ని విస్తించింది న్యూబెర్గ్ సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల రాబడి సాధించింది. వచ్చే ఏడాది వెయ్యికోట్ల ఆదాయం లక్ష్యంగా ముందుకెళ్తోంది. న్యూబెర్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200లకు పైగా ల్యాబులు, 3000లకు పైగా శాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. -
రూ. 11 కోట్లకు చేరువలో ‘విరుష్క’ విరాళాల సేకరణ
ముంబై: కరోనాపై పోరులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘కెట్టో’ ద్వారా కనీసం రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని వీరిద్దరు నిర్ణయించారు. ‘విరుష్క’ విజ్ఞప్తికి అద్భుత స్పందన వచ్చింది. గడువు ముగిసేందుకు మరో రెండు రోజుల సమయం ఉందనగా ఇప్పటికి ‘విరుష్క’ విరాళాల సేకరణ మొత్తం రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. ఇందులో ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ విరాళం రూ. 5 కోట్లు ఉండటం విశేషం. వసూలైన మొత్తాన్ని విరుష్క ‘ఏసీటీ గ్రాంట్స్’ అనే సంస్థకు అందిస్తారు. -
విరాట్ విజయం @ 28
భారత్ తిరుగులేని ప్రదర్శనకు మరో భారీ విజయం దక్కింది. తొలి టెస్టులాగే రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో గెలుపుతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో 120 పాయింట్లతో శిఖరాన నిలబడింది. కోహ్లి సేన సమష్టి బౌలింగ్ ప్రదర్శన ముందు విండీస్ చేవలేని బ్యాటింగ్ మళ్లీ తలవంచింది. ఫలితంగా కరీబియన్ పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా మూడు సిరీస్‌లనూ కైవసం చేసుకొని వెనుదిరిగింది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే కింగ్స్టన్ గడ్డపై విరాట్ కోహ్లి కెరీర్ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే వేదికపై మరో అరుదైన ఘనతతో సగర్వంగా నిలబడ్డాడు. తాజా ఫలితంతో భారత టెస్టు కెప్టెన్‌గా అతని ఖాతాలో 28వ విజయం చేరింది. దీంతో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా ధోని (27)ని వెనక్కి నెట్టి కోహ్లి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 48వ టెస్టులోనే ఈ ఘనత సాధించి రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లను చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కింగ్స్టన్ (జమైకా): టెస్టుల్లో తమ బలాన్ని చూపిస్తూ భారత జట్టు విండీస్ గడ్డపై మరో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. 468 పరుగుల అసాధ్యమైన విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌటైంది. బ్రూక్స్ (119 బంతుల్లో 50; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా, షమీ చెరో 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఇదే టూర్లో టి20, వన్డే సిరీస్ లు కూడా భారత్ ఖాతాలోనే చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సాధించిన విహారి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌కు సంబంధించి ఈ సిరీస్‌లో అందుబాటులో ఉన్న 120 పాయింట్లు భారత్ ఖాతాలో చేరాయి. బ్రూక్స్ మినహా... తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భరతం పడితే... రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్ల సమష్టి ప్రదర్శన భారత్‌కు విజయాన్ని అందించింది. మ్యాచ్ మూడో రోజే ఓపెనర్లను కోల్పోయి ఓటమికి బాటలు వేసుకున్న విండీస్ నాలుగో రోజు నిలవలేకపోయింది. ఆదివారం 46.5 ఓవర్లు ఆడి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయి టీ విరామానికి ముందే భారత్‌కు తలవంచింది. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్రూక్స్, బ్లాక్‌వుడ్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించడమే చెప్పుకోదగ్గ అంశం. ఇది మినహా ఆ జట్టు బ్యాటింగ్ ఎప్పటిలాగే పేలవంగా సాగింది. 14 ఓవర్ల పాటు భారత బౌలింగ్‌ను నిరోధించిన అనంతరం ఛేజ్ (12)ను జడేజా ఎల్బీగా అవుట్ చేయడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. ఈ దశలో కొంత అదృష్టం కూడా కలిసొచ్చి బ్రూక్స్, బ్లాక్‌వుడ్ నిలబడ్డారు. లంచ్ తర్వాత బ్లాక్‌వుడ్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కోహ్లి చక్కటి ఫీల్డింగ్‌తో బ్రూక్స్ రనౌట్ కాగా, మరో రెండు బంతులకు హామిల్టన్ (0) పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ హోల్డర్ (35 బంతుల్లో 39; 9 ఫోర్లు) ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా అది ఎక్కువ సేపు సాగలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్:117; భారత్ రెండో ఇన్నింగ్స్: 168/4 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) కోహ్లి (బి) షమీ 16, బ్రాత్‌వైట్ (సి) పంత్ (బి) ఇషాంత్ 3; బ్రేవో (రిటైర్డ్‌హర్ట్) 23; బ్రూక్స్ (రనౌట్) 50; ఛేజ్ (ఎల్బీ) (బి) జడేజా 12; హెట్‌మైర్ (సి) మయాంక్ (బి) ఇషాంత్ 1; బ్లాక్‌వుడ్ (సి) పంత్ (బి) బుమ్రా 38; హోల్డర్ (బి) జడేజా 39; హామిల్టన్ (సి) రాహుల్ (బి) జడేజా 0; కార్న్‌వాల్ (సి) పంత్ (బి) షమీ 1; రోచ్ (సి) పంత్ (బి) షమీ 5; గాబ్రియెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (59.5 ఓవర్లలో ఆలౌట్) 210 వికెట్ల పతనం: 1–9, 2–37, 2–55 (రిటైర్డ్‌హర్ట్), 3–97, 4–98, 5–159, 6–177, 7–177, 8–180, 9–206, 10–210. బౌలింగ్: ఇషాంత్ శర్మ 12–3–37–2, బుమ్రా 11–4–31–1, షమీ 16–2–65–3, జడేజా 19.5–4–58–3, విహారి 1–0–3–0. మరో సాధికారిక ప్రదర్శనతో మేం అనుకున్న భారీ విజయాన్ని అందుకున్నాం. ఈ రోజు అత్యుత్తమ భారత కెప్టెన్‌గా నిలవగలిగానంటే జట్టు సభ్యులందరు, వారి అత్యుత్తమ ఆటనే కారణం. పేరుకు ముందు ‘సి’ అని ఉండటం తప్ప నా దృష్టిలో కెప్టెన్ ప్రత్యేకం ఏమీ కాదు. మా బ్యాట్స్‌మెన్ బాగా ఆడితే బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ఈ సిరీస్ సమష్టి విజయం. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఈ టెస్టులో విహారి ఇన్నింగ్స్ అత్యుత్తమం. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విహారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో మేమెంతో ప్రశాంతంగా కూర్చున్నాం. తప్పులు సరిదిద్దుకునేందుకు, ఆటను మెరుగుపర్చుకునేందుకు అతను ఎప్పుడూ వెనుకాడడు. ప్రాణం పెట్టి ఆడే రకం. జట్టు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఇంత స్వల్ప కెరీర్లోనే విహారికి జట్టు ఎందుకు మద్దతునిస్తోందో అతను చూపించాడు. –కోహ్లి -
83.. భారత క్రికెట్లో ఒక మరుపురాని జ్ఞాపకం
న్యూఢిల్లీ : జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఈ తేదీ ఒక సంచలనం. భారత క్రికెట్ అభిమానులకు ఒక మరుపురాని జ్ఞాపకం. సరిగ్గా ఇదే తేదీన 36 ఏళ్ల కిందట కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు లార్డ్స్ మైదానంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అభేద్యమైన వెస్టిండీస్ జట్టును ఫైనల్లో మట్టికరిపించి.. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. మొట్టమొదటి విశ్వ క్రికెట్ కిరీటాన్ని స్వదేశానికి సగర్వంగా తీసుకొచ్చింది. 36 వసంతాల కిందటి ఈ అద్భుత విజయమే.. భారత క్రికెట్‌ను సమూలంగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచకప్ విజయం ప్రపంచ క్రికెట్లో భారతదేశ ఉనికిని బలంగా చాటింది. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఘట్టమిది. 1983లో భారత జట్టుకు సరైన సదుపాయాలు కూడా లేవు. జట్టుకు కావాల్సిన అవసరాలను కూడా తీర్చలేని స్థితిలో నాటి భారత క్రికెట్ బోర్డు ఉండేది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు సన్మానం చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి. భారత జట్టు ఈ అపూర్వ విజయాన్ని సాధించిన తర్వాత క్రికెటర్లను సన్మానించడానికి.. ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్లో సంగీత కచేరీ నిర్వహించి విరాళాలు సేకరించారు. ఇక, 1983నాటి ప్రపంచకప్ పరిస్థితులను పరిశీలిస్తే.. అప్పటివరకు ఏ అంచనాలు లేని కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ వంటి బలమైన దేశాలను మట్టికరిపించింది. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కు భారత జట్టును చేర్చడంలో కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. లీగ్‌మ్యాచ్‌లో జింబాబ్వేపై కపిల్ వీరోచితమైన ప్రదర్శనతో 175 పరుగులు చేసి భారత జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ప్రపంచకప్ ఫైనల్ రోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల టీవీలు, రేడియోల ముందు భారత అభిమానులు మ్యాచ్‌ను తిలకించారు. భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 183 పరుగులు చేసింది. భారత జట్టుకు ఉన్న మదన్ లాల్ , మోహిందర్ అమర్నాథ్ వంటి బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ పటిమతో వెస్టిండీస్‌ను 140 పరుగులకు ఆలౌట్ చేసి ప్రపంచకప్‌ను భారతదేశం ఒడిలోకి చేర్చి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. ఆ మధుర క్షణాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మనస్సుల్లో భద్రంగా ఉన్నాయి. -
తన కెప్టెన్‌పై ట్వీట్లు పేల్చిన సెహ్వాగ్!
టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో మరోసారి తనమార్క్ చూపించాడు. సెహ్వాగ్ కెరీర్ దాదాపుగా గంగూలీ కెప్టెన్సీలోనే కొనసాగింది. తన కెప్టెన్ గంగూలీతో ఆడిన క్రికెట్ ఆడిన రోజులను దాదా ఆటతీరుపై ట్వీట్లు పేల్చాడు సెహ్వాగ్. రెండు పాండాల ఫొటోలను పోస్ట్ చేసి, అద్దాలు పెట్టుకోకుంటే ఇలా ఉండే వ్యక్తి ఎవరంటూ ప్రశ్నను సంధించాడు. కొద్దిసేపయ్యాక కళ్లచుట్టూ నలుపు చారలున్నది గంగూలీ అని, మరొ పాండా చైనీస్ గంగూలీ అని పోస్ట్ చేశాడు సెహ్వాగ్. అసలు విషయం ఏంటంటే.. గంగూలీకి కళ్లరెప్పలు వేగంగా ఆడించడం అలవాటన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. కళ్లు మిటకరిస్తూ స్పిన్నర్ల బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొంటూ వారి బంతులను స్డేడియం బయటకు అవలీలగా పంపేస్తాడని డాషింగ్ క్రికెటర్ రాసుకొచ్చాడు. గంగూలీ కెప్టెన్సీలోనే సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్ సింగ్, మరికొందరు ఆటగాళ్లు ఎదిగిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ ట్వీట్లకు విశేష స్పందన రావడం విశేషం. మజా ఆ గయా వీరూ బాయ్ అని బాక్సర్ విజేందర్ సింగ్ రీట్వీట్ చేశాడు. ఓ ఫాలోయర్ అయితే, మా డాడీ గంగూలీ అలా కళ్లు మిటకరిస్తూ భారీ సిక్సర్ కొట్టే సీన్‌ను రిపీట్చేసి చూసేవారని పోస్ట్ చేశాడు. దాదాతో తన అనుబంధాన్ని ఇప్పటికే పలుమార్లు పంచుకున్న సెహ్వాగ్.. తాజాగా ట్వీట్లతో గంగూలీ ఆటపై ట్వీట్లు చేసి ఫాలోయర్లకు ఆనందాన్ని పంచుతున్నాడు. When someone you know,takes their glasses off :) pic.twitter.com/77KmDwPokm — Virender Sehwag (@virendersehwag) 3 February 2017 Dada Ganguly and Chinese Ganguly . Great memories of the Prince@SGanguly99 blinking his eyes and smashing spinners out of the stadium. https://t.co/3KyaJxJDqq — Virender Sehwag (@virendersehwag) 3 February 2017 -
భారత్‌ను విజయపథంలో నడపడమే నా లక్ష్యం
-
చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే
ఐదుగురు సభ్యులతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ లోధా కమిటీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిర్ణయం కార్యదర్శిగా షిర్కే ఏకగ్రీవ ఎన్నిక ఆంధ్ర క్రికెట్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత మాజీ క్రికెటర్, ఆంధ్రకు చెందిన మన్నవ శ్రీకాంత్ (ఎమ్మెస్కే) ప్రసాద్ భారత సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఏడాది క్రితం సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్... ఈసారి అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. ముంబై: భారత క్రికెట్లో ఇది ఆశ్చర్యకర పరిణామం. లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాల్సిన దశలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సమావేశంలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. కేవలం ముగ్గురు సెలక్టర్లతోనే కమిటీని ఏర్పాటు చేయాలన్న లోధా కమిటీ ప్రతిపాదనను తుంగలో తొక్కుతూ గతంలో మాదిరిగానే ఐదుగురు సభ్యులతో సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆంధ్రకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వం వహిస్తారు. భారత్ తరఫున ప్రసాద్ 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు. గత కమిటీలో ఉన్న గగన్ ఖోడాను కూడా కొనసాగించారు. రాజస్తాన్‌కు చెందిన ఖోడా (సెంట్రల్ జోన్) ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. సెలక్షన్ కమిటీలోకి కొత్తగా దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్)లను కూడా ఎంపిక చేశారు. ఇక జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశ్ ప్రసాద్‌ను కొనసాగించారు. టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ముగ్గురు సభ్యులతో సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనేది లోధా కమిటీ ప్రతిపాదన. కానీ బీసీసీఐ పట్టించుకోలేదు. దీనిపై లోధా కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రరుుంచే ఆలోచనలో ఉంది. షిర్కే ఏకగ్రీవ ఎన్నిక: బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన 87వ వార్షిక సర్వసభ్య సమావేశంలో... అజయ్ షిర్కేను బోర్డు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాస్తవానికి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షుడు అయిన దగ్గరి నుంచి మహారాష్ర్టకు చెందిన షిర్కే ఈ బాధ్యతల్లో ఉన్నారు. అయితే అధికారికంగా ఎన్నిక లాంఛనాన్ని పూర్తి చేశారు. గత ఏడాది ఎన్నుకున్న కమిటీలను కూడా కొనసాగించారు. ఇందులో ఏవైనా ఖాళీలు ఏర్పడితే వాటిని పూరించే బాధ్యతను అధ్యక్ష, కార్యదర్శులకు అప్పగించారు. అలాగే బోర్డు అంబుడ్సమన్గా వ్యవహరిస్తున్న ఏపీ షా పదవీ కాలం పూర్తయినందున... కొత్త అంబుడ్సమన్ను కూడా ఠాకూర్, షిర్కే ఎంపిక చేస్తారు. ఠాకూర్ లేకపోతే పవార్: ఇక ఐసీసీ సమావేశాల్లో బీసీసీఐ ప్రతినిధిగా బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పాల్గొనాలని ఏజీఎంలో నిర్ణయించారు. ఇటీవల ఐసీసీలో మనోహర్ తీసుకుంటున్న భారత వ్యతిరేక నిర్ణయాలను ఆపాలంటే శ్రీనివాసన్‌ను ఐసీసీకి పంపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించారు. అయితే ఠాకూర్ బృందం దీనిని తోసిపుచ్చింది. ఒకవేళ ఠాకూర్ అందుబాటులో లేకపోతే శరద్ పవార్ ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో మాత్రం బీసీసీఐకి షిర్కే ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే 30న బీసీసీఐ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. లోధా కమిటీ ప్రతిపాదనలపై ఆ సమావేశంలో నిర్ణయిస్తారు. ‘ఇది నాకు గొప్ప గౌరవం. 2017 చాంపియన్స ట్రోఫీతో పాటు 2019 ప్రపంచకప్ వరకూ ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో నాకు స్పష్టత ఉంది. మేం వీలైనంత ఎక్కువగా గతేడాది దేశవాళీ మ్యాచ్‌లు చూశాం. జింబాబ్వే, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ ఆటగాళ్లను పరిశీలించాం. సందీప్ పాటిల్ సారథ్యంలో గత కమిటీ బాగా పని చేసింది. అదే విజన్‌తో మేం కూడా ముందుకు వెళతాం’ - ఎమ్మెస్కే ప్రసాద్. ‘సెలక్టర్ల ఎంపిక ప్రక్రియను నేను, అధ్యక్షుడు ఠాకూర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రి కలిసి చూశాం. దరఖాస్తు చేసుకున్న వారందరితో మాట్లాడాం. గత కమిటీలో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వారి స్థానంలో కొత్త వారిని తీసుకున్నాం. కమిటీలో ఉన్న వారిలో సీనియర్ అయిన ఎమ్మెస్కేను చీఫ్‌గా ఎంపిక చేశాం’ - బోర్డు కార్యదర్శి షిర్కే -
జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం
ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చింది. భారత్ నుంచి ఈ గౌరవం దక్కిన 24వ క్రికెటర్ జహీర్. గత నెలలోనే సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఉండే ఈ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు సేవలు అందించిన వారికి గౌరవ సభ్యత్వం ఇస్తుంది. ప్రస్తుతం 300 మందికిపైగా గౌరవ సభ్యులు ఈ క్లబ్లో ఉన్నారు. -
దాదాకు దీదీ విషెస్
కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 45వ ఏట అడుగుపెట్టాడు. శుక్రవారం దాదా జన్మదినం. గంగూలీకి పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గంగూలీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిండునూరేళ్లు సుఖసంతోషాలతో జీవిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇందుకు దాదా రీ ట్వీట్ చేస్తూ దీదీకి కృతజ్ఞతలు చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ కెప్టెన్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు దాదాకు శుభాకాంక్షలు తెలిపారు. గంగూలీ తన కెరీర్లో 113 టెస్టులాడి 7213 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 311 మ్యాచ్‌లాడి 11,363 పరుగులు చేశాడు. టీమిండియా కెప్టెన్‌గా విదేశాల్లో 28 టెస్టుల్లో 11 మ్యాచ్‌లను గెలిపించాడు. భారత కెప్టెన్‌గా ఇది రికార్డు. -
క్రికెట్ సే... సినిమా తక్!
భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ తనయుడు అబ్బాస్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇందులో అబ్బాస్ సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారని భోగట్టా. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. నిర్మాత కె. సురేశ్‌బాబు ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారని సమాచారం. నిజానికి, అజరుద్దీన్ కుమారుడి అసలు పేరు - అసదుద్దీన్. తనను తాను అబ్బాస్‌గా చెప్పుకుంటారు. తండ్రి లానే అబ్బాస్ కూడా క్రికెట్ ఆడుతుంటారు. ‘హైదరాబాద్ అండర్-22’ టీమ్‌లో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడారు. అయితే, మోచేతికి తగిలిన గాయంతో ఆటకు దూరమయ్యారు. ‘‘అందుకే, ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఆ మాటకొస్తే, మొదటి నుంచి నా దృష్టి సినీ రంగం మీదే. సినిమాలంటే నాకు అంత పిచ్చి ప్రేమ. నటుణ్ణి కావాలనేది నా మనసులోని కోరిక’’ అని అబ్బాస్ చెప్పుకొచ్చారు. గమ్మత్తేమిటంటే, అజరుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీయే తనకు స్ఫూర్తి అంటున్నారు అబ్బాస్. ‘‘సంగీతా ఆంటీ నటించిన సినిమాలు టీవీలో చూడడం నాకు స్ఫూర్తినిచ్చింది. రెండేళ్ళ క్రితమే ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించారు. మా నాన్న గారికి కూడా నచ్చింది. అయితే, అప్పటికి నేను సినీ నటనకు పూర్తిగా సిద్ధం కాలేదు. ఇప్పుడు రెడీ’’ అని ఈ ఔత్సాహిక హీరో వ్యాఖ్యానించారు. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళని ఈ చిత్రానికి ‘ఇద్దరికీ కొత్తగా’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. అన్నట్లు, పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్గా నడిచే ఈ సినిమాలో క్రికెట్ ప్రస్తావనలు మాత్రం ఉండే అవకాశం లేదట! నిజానికి, నటుడిగా తెర మీదకు రావడం ఇదే తొలిసారి అయినా, అబ్బాస్‌కు ఈ మధ్యే కొద్దిగా సినీ రంగ అనుభవం వచ్చింది. తండ్రి అజరుద్దీన్ జీవితం ఆధారంగా తయారవుతున్న ‘అజర్‘ చిత్రానికి సహాయ దర్శకుడిగా అబ్బాస్ పనిచేశారు. సెట్స్‌లో చుట్టూతా బోలెడంతమంది టెక్నీషియన్లుండగా, నటీనటులు పనిచేస్తుంటే దగ్గర నుంచి చూడడం ఈ కుర్రాడికి చాలా ఉపయోగపడిందట! సినిమా రూపకల్పనకు సంబంధించిన విశేషాలను నేర్చుకొనేందుకు ఉత్సాహపడుతున్న అబ్బాస్ ఇటు నటుడిగా కూడా సత్తా చాటతారేమో చూడాలి. -
డేర్‌డెవిల్స్ మెంటార్‌గా ద్రవిడ్
గుర్గావ్: ఈ సీజన్ ఐపీఎల్ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్.... భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను మెంటార్‌గా నియమించుకుంది. ప్యాడీ ఆప్టన్‌ను చీఫ్ కోచ్‌గా తీసుకుంది. గతంలో ఈ ఇద్దరు రాజస్తాన్ రాయల్స్ తరఫున కలిసి పని చేశారు. గత మూడు సీజన్లలో నిరాశాజనక ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ ఈ జోడిపై భారీగా ఆశలు పెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్‌కే పని చేసిన ముంబై మాజీ ఓపెనర్ జుబిన్ బరుచాను ఢిల్లీ టెక్నికల్ డెరైక్టర్‌గా ఎంపిక చేసుకుంది. టీఏ శేఖర్, ప్రవీణ్ ఆమ్రే, శ్రీధరన్ శ్రీరామ్‌లు సహాయక సిబ్బందిగా పని చేయనున్నారు. ఈ సీజన్ కోసం ఢిల్లీ జట్టుకు రెండు దశల్లో శిక్షణను ఏర్పాటు చేస్తున్నారు. రాజస్తాన్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పటికీ ఢిల్లీ జట్టుతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టానని ద్రవిడ్ చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులతో ఢిల్లీ జట్టు సమతుల్యంగా ఉందని చెప్పిన ఈ మాజీ బ్యాట్స్‌మన్ ఈసారి విజయవంతమవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎంసీఎల్ కు దాదా దూరం!
దుబాయ్: మాస్టర్ క్రికెట్ లీగ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దూరమయ్యే అవకాశముంది. ఇటీవల ప్రాక్టిస్ సెషన్లో దాదా గాయపడ్డాడు. డాక్టర్ల సలహా మేరకు ఈ ఆరంభ టోర్నీకి దూరం కావాలని గంగూలీ నిర్ణయించినట్టు సమాచారం. ఎంసీఎల్ టి-20 టోర్నమెంట్లో మాజీ క్రికెట్ దిగ్గజాలు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దాదా లిబ్రా లెజెండ్ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉంది. కాగా ప్రాక్టీస్ సెషన్లో గంగూలీ సింగిల్ తీసే సమయంలో వెనుక నుంచి బంతి వచ్చి వీపుభాగాన తగిలింది. దీంతో కనీసం రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మంగళవారం జరిగిన కెప్టెన్ల మీడియా సమావేశానికి గంగూలీ గైర్హాజరుకావడంతో అతను టోర్నీ అందుబాటులో ఉండేది సందేహంగా మారింది. ఈ నెల 28న ఈ టోర్నీ ఆరంభకానుంది. అయితే టోర్నీలో ఆడకపోయినా దాదా దుబాయ్‌కు వెళ్లి తన జట్టు సభ్యులతో గడిపే అవకాశముందని సమాచారం. -
గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు: తివారి
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బెంగాలీల గురించి ఢిల్లీ సారథి గౌతమ్ గంభీర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని బెంగాల్ ఆటగాడు మనోజ్ తివారి ఆరోపించాడు. అలా చేయడం వల్లే తాను స్పందించాల్సి వచ్చిందన్నాడు. ‘గంగూలీ, బెంగాలీల గురించి గౌతీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దాదాతో మాట్లాడా. అనవసరంగా అతని పేరును లాగుతున్నారని సౌరవ్ బాధపడ్డారు. అయితే గంగూలీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మేం సహించం. గంభీర్ ఎలాగూ నిజం చెప్పడు. అతను చెబుతున్నట్లు నేనే గనుక తప్పు చేస్తే నాకెందుకు 40 శాతమే జరిమానా పడుతుంది. గంభీర్ తప్పు చేశాడో లేదో అతనికి విధించిన 70 శాతం జరిమానాను చూస్తే తెలిసిపోతుంది’ అని తివారి వెల్లడించాడు. స్లెడ్జింగ్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పిన తివారి, వేరొకరి తల్లిని దూషించడం సరైంది కాదన్నాడు. మరోవైపు మనోజ్ తివారి ఆరోపణలను గంభీర్ ఖండించాడు. తివారి దిగజారి మాట్లాడుతున్నాడని, తానెప్పుడూ గంగూలీని విమర్శించలేదని గంభీర్ వివరించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు మాని... తివారి ఆటపై దృష్టి పెట్టాలని గంభీర్ హితవు పలికాడు. -
ఆస్పత్రిలో సిద్ధూ
న్యూఢిల్లీ: నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అంటే క్రికెటర్ మాత్రమే కాదు... మాటల మాంత్రికుడు. అతనిలో ఉరిమే ఉత్సాహం, హాస్యం కలగలిసి సెలయేరులా పదాల ప్రవాహం సాగిపోతుంది. మ్యాచ్ ఏదైనా కామెంటరీతో ఆనందాన్ని రెట్టింపు చేసే సిద్ధూ ఇప్పుడు దానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. అతను ప్రమాదకరమైన ‘డీప్ వీన్ త్రోంబోసిస్’ వ్యాధి బారినపడటం ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసింది. నరాల్లో రక్తం గడ్డకట్టే ఈ వ్యాధితో అతను మంచాన పడ్డాడు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. ఇలాంటి స్థితిలోనూ సిద్ధూ సై్థర్యం కోల్పోలేదు. ‘కొంచెం కుంగిపోయాను కానీ పూర్తిగా కుప్పకూలిపోలేదు (డౌన్ బట్ నాటౌట్), ప్రాణాంతకమైన వ్యాధి డీవీటీ వచ్చింది. దేవుని దయ వల్ల కోలుకుంటా. జీవితం చాలా సున్నితమైంది. ప్రార్థనలతో కాపాడుకోవాలి’ అని దేవునిపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు. -
ఆర్మీ విమానం నుంచి ధోనీ జంప్
-
మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత
ముంబై: భారత టెస్ట్ మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని సొంత నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని బీసీసీఐ తెలిపింది. 1963-64, 1977-78 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర తరపున క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించారు. 1974-75 మధ్యకాలంలో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడారు. బీసీసీఐ ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారు. హేమంత్ కనిత్కర్ మరణం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సంతాపం ప్రకటించారు. కనిత్కర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
గోపీచంద్ అకాడమీనే స్ఫూర్తి!
- సొంత శిక్షణా కేంద్రం ఏర్పాటుపై లక్ష్మణ్ వ్యాఖ్య - మంచి ఫలితాలు సాధిస్తామన్న మాజీ క్రికెటర్ సాక్షి, హైదరాబాద్: అకాడమీ ఏర్పాటు చేసి భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేయాలన్న తన కోరికకు బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ప్రేరణగా నిలిచాడని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. అతనిలాగే తాను అంకిత భావంతో పని చేసి ఫలితాలు సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘గతంలో ఎంతో మంది ఆటగాళ్లు అకాడమీలు ఏర్పాటుచేసి సరైన ఫలితాలు రాబట్టడంతో విఫలమయ్యారు. కానీ పుల్లెల గోపీచంద్ మాత్రం ఎంతో పట్టుదలతో, అంకితభావంతో పని చేసి ఈ రంగంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. అదే నాకు స్ఫూర్తినిచ్చింది. బ్యాడ్మింటన్‌లో అతని అకాడమీ ద్వారా ఎంత మంది స్టార్లు వెలుగులోకి వచ్చారో అదే తరహాలో నా క్రికెట్ అకాడమీ నుంచి విజయాలు దక్కాలని ఆశిస్తున్నా’ అని లక్ష్మణ్ అన్నాడు. ఏప్రిల్ 4న వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్న నేపథ్యంలో లక్ష్మణ్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. తాను అకాడమీ ఏర్పాటు కోసం ఎలాంటి మౌలిక సౌకర్యాల గురించి ఆలోచించానో, అవన్నీ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో సిద్ధంగా ఉండటంతో వెంటనే ప్రారంభిస్తున్నట్లు ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు. నగరంలో శిక్షకులుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న అశోక్ సింగ్, విన్సెంట్ వినయ్ కుమార్, రమేశ్ ఈ అకాడమీలో ప్రధాన కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా మరికొందరు యువ కోచ్‌లు సహకరిస్తారు. ఏప్రిల్ 4 నుంచి మే 31 వరకు రెండు నెలల పాటు ఇక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం ఒక సెషన్, సాయంత్రం మరో సెషన్ నిర్వహిస్తుండగా.. ఒక్కో సెషన్లో వంద మంది వరకు శిక్షణకు అవకాశం ఉంది. ఇందు కోసం రూ.10 వేల చొప్పున ఫీజు నిర్ధారించారు. అత్యుత్తమ సౌకర్యాలతో... దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీనిధి స్కూల్ మైదానంలో 3 టర్ఫ్ వికెట్లు, 2 ఆస్ట్రోటర్ఫ్ వికెట్లు, 2 మ్యాటింగ్ వికెట్లు, 2 సిమెంట్ వికెట్లు ఉన్నాయి. లక్ష్మణ్‌తో అకాడమీ ఏర్పాటు గురించి నాలుగేళ్ల క్రితమే చర్చించామని, ఇప్పుడు అది సాకారం అయిందని ఈ సందర్భంగా శ్రీనిధి చైర్మన్ డాక్టర్ మహి చెప్పారు. ఆర్థికంగా లాభదాయకం కాకపోయినా క్రికెట్‌పై ఉన్న అభిమానంతోనే వీవీఎస్ దీనిని ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. -
‘ధోని’ సినిమా చూపిస్తున్నాడు!
- తెరపై భారత క్రికెట్ కెప్టెన్ బయోగ్రఫీ - ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ రాజ్‌పుత్ ముంబై: క్రికెట్ ప్రపంచంలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. సాధారణ కుటుంబ నేపథ్యంనుంచి వచ్చి భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిన అతను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోని అనేక మలుపులు, విశేషాలతో ‘ఎం.ఎస్. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా రూపొందుతోంది. ధోని గురించి క్రికెట్ వీరాభిమానులకు కూడా తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. ‘ఎ వెడ్నస్ డే’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహిస్తుండగా...‘కై పో చే’ చిత్రంలో వెలుగులోకి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ధోని నాయకత్వంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచి సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ధోనికే చెందిన ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్- రితి స్పోర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రతో ఇటీవల రూపొందించిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ధోని సినిమా విడుదలవుతుంది. గతంలోనే ధోనిపై సినిమా నిర్మాణంలో ఉందని, అయితే బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిని కొట్టిపారేసిన బోర్డు, ధోని ప్రొఫెషనల్ కెరీర్‌కు సమస్య రానంత వరకు అతని సినిమాపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. -
సిరీస్ మధ్యలో మార్పులెందుకు?
రాహుల్ ద్రవిడ్ ప్రశ్న న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటన పూర్తిగా ముగియక ముందే సహాయక సిబ్బందిని మార్చడంపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్పులు చేయాల్సిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ప్రొఫెషనల్ క్రీడలో మార్పులు సహజం. దానిని ఎవరూ తప్పుపట్టరు. అయితే కొత్త సహాయక బృందం ఈ సిరీస్ వరకేనా, తర్వాత కూడా కొనసాగుతుందా అనేదానిపై స్పష్టత లేదు. సాధారణంగా సహాయక సిబ్బందితో కూడా ఆటగాళ్లకు అనుబంధం ఏర్పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో క్రికెటర్ల విజయం, వైఫల్యంపై కూడా వారి ప్రభావం ఉంటుంది. కాబట్టి సిరీస్ మధ్యలో మార్చితే అనవసరపు సందిగ్ధత ఏర్పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని రవిశాస్త్రి చక్కదిద్దగలడని విశ్వాసం వ్యక్తం చేసిన ద్రవిడ్...‘కొత్త వాతావరణం’లో ఇమడగలడా లేదా అనేది ఫ్లెచర్ స్వయంగా తేల్చుకోవాలని సూచించారు. -
ఫుట్‌బాల్ అభివృద్ధికి తోడ్పడతా: గంగూలీ
కోల్‌కతా: భారత్‌లో క్రికెట్ గ్లామర్ ముందు ఫుట్‌బాల్ వెనుకబడిందని, ఈ ఆట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. కొత్తగా రాబోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో అట్లెటికో డి కోల్‌కతా ఫ్రాంచైజీకి గంగూలీ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ జట్టు జెర్సీని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ‘ఫుట్‌బాల్‌కు ఏదైనా చేసేందుకు ఇది మాకు దక్కిన అవకాశంగా భావిస్తున్నాం. ఇంత ప్రసిద్ధి చెందిన క్రీడ భారత్‌లో క్రికెట్ హోరులో పడి నిర్లక్ష్యానికి గురైంది. ఫుట్‌బాల్‌ను అమితంగా ఆరాధించే కోల్‌కతా నుంచి కచ్చితంగా జట్టు ఉండాలనే భావనతో రంగంలోకి దిగాం. సీఏం ఆశీస్సులతో తొలి టైటిల్‌ను మేమే గెలవాలని అనుకుంటున్నాం’ అని గంగూలీ అన్నాడు. ప్రతీ బెంగాలీ రక్తంలోనే ఫుట్‌బాల్ ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. -
అజారుద్దీన్ జీవిత కథతో సినిమా
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర, వెండితెరకెక్కనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రముఖ క్రీడాకారుడు క్రికెట్‌కు అందించిన విశేష సేవలను ఎవరూ మరచిపోరు. అయితే ఈయన వ్యక్తిగత జీవితం మాత్రం పలు ఆసక్తికరమైన మలుపులు తిరగడం గమనార్హం. అజారుద్దీన్ నవ్రిన్ అనే హైదరాబాద్ యువతిని వివాహం చేసుకుని తొమ్మిదేళ్లు కాపురం చేసి ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడాకులు పొందారు. ఆ తరువాత నటి సంగీత బిజ్లానీతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 1986లో వీరిద్దరూ ఒకటయ్యారు. అయితే 14 ఏళ్ల సంసార జీవితం అనుభవించిన తరువాత 2010లో విడిపోయారు. ఆ తరువాత ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణితో అజారుద్దీన్ షికార్లు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను అజారుద్ధీన్ ఖండించారు. అజారుద్దీన్‌కు తొలి భార్య నవ్రిన్కు అసాద్, అరుష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో 19 ఏళ్ల అరుష్ ఇటీవల బైక్ ప్రమాదంలో మరణించాడు. ఇలాంటి మలుపులతో కూడిన అజారుద్దీన్ జీవిత ఇతివృత్తంతో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. బాలీవుడ్ మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి అజారుద్దీన్ నుంచి అనుమతి పొందినట్లు తెలిసింది. దీనికి కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. -
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి గుండెపోటు
-
మొహాక్... మహీ!
రాంచీ: మైదానంలో ఎవరికీ చిక్కని వ్యూహాలతో తన జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ ఎం.ఎస్.ధోని తన వేషభాషలతో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఫుట్‌బాల్ క్రీడను అమితంగా ఇష్టపడే ఈ జార్ఖండ్ డైనమైట్ దాదాపు పదేళ్ల క్రితం నుంచే హెయిర్ స్టయిల్లో తనదైన ముద్రను వేస్తూ వస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో అందరికీ జులపాల జుట్టుతో అభిమాన పాత్రుడయ్యాడు. ఏకంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ కూడా అతడి అభిమాన జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత వెంటనే వెంట్రుకలను చిన్నగా కత్తిరించి కనిపించాడు. వన్డే ప్రపంచకప్ గెలవగానే గుండుతో కనిపించాడు. ఇలా రకరకాల స్టయిల్స్‌తో కేవలం రాంచీ అభిమానులకే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులకు కొత్త స్టైల్స్ పరిచయం చేశాడు. అయితే తాజాగా చాంపియన్స్ లీగ్ టి20లో సరికొత్తగా ‘మొహాక్’ స్టయిల్‌కు తెర లేపాడు. రెండు వైపులా వెంట్రుకలను నున్నగా షేవ్ చేసి మధ్యలో ఓ స్ట్రిప్‌లా ఉంచుకుని అభిమానులను సంభ్రమాశ్చర్యంలో ముంచా డు. పాశ్చాత్య దేశాల్లో ఇది సహజమే అయినా భారత అభిమానులను మాత్రం ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్ ఇలాగే కనిపించేవాడు. అప్పట్లో ధోని జులపాల నెత్తిని అతడి తండ్రి చీదరించుకునే వారట. చిన్నగా కత్తిరిస్తే ఏమవుతుందని అడిగేవారట. అయితే ఈ స్టయిల్ తన కు గొప్ప పేరు తెచ్చి పెడుతుందని ధోని అనేవాడు. తాజాగా ఈ మొహాక్ స్టయిల్ అప్పుడే రాంచీలో కుర్రాళ్లకు ఎక్కేసింది. సెలూన్లకు క్యూ కడుతున్నారు రాంచీలో ఉన్నప్పుడు ధోని క్షవరం కోసం అక్కడి కాయా సెలూన్‌కు వెళతాడు. ఈ విషయం తెలిసిన ప్రతిసారీ అభిమానులు అక్కడ గుమిగూడుతున్నారు. దీంతో వీరిని అదుపులో పెట్టడం పోలీసులకు కష్టసాధ్యంగా ఉంటుంది. 2006 నవంబర్‌లో ఓసారి ఇలాగే సెలూన్ వెళ్లినప్పుడు అభిమానుల తొక్కిసలాట జరిగింది. దీంతో అప్పటి రాంచీ ఎస్పీ అఖిలేష్ కుమార్ జా ధోనికి ఓ సలహా ఇచ్చారు. దయచేసి మరోసారి సెలూన్‌కు వెళితే మాకు సమాచారం ఇచ్చి వెళ్లండి అని కోరారు. అభిమానుల్లో ధోనికి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు రెట్టింపయింది.