మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత | Former India cricketer Hemant Kanitkar dead | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత

Published Wed, Jun 10 2015 5:11 PM | Last Updated on Wed, Oct 3 2018 7:14 PM

మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత - Sakshi

మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత

ముంబై: భారత టెస్ట్ మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని సొంత నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని బీసీసీఐ తెలిపింది. 1963-64, 1977-78 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర తరపున క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించారు.

1974-75 మధ్యకాలంలో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడారు. బీసీసీఐ ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారు. హేమంత్ కనిత్కర్ మరణం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సంతాపం ప్రకటించారు. కనిత్కర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement