
భారతదేశపు నాలుగో అతి పెద్ద రోగనిర్థారరణ సేవల సంస్థ న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని పని చేయనున్నారు. ఈ మేరకు మాజీ ఇండియన్ కెప్టెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ప్రకటించింది.
అంబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు న్యూబర్గ్ చేపట్టిన కార్యక్రమాలు తనకు నచ్చాయన్నారు మాజీ ఇండియన్ స్కిప్పర్ ధోని. కోవిడ్-19 మహమ్మారి కాలంలో అన్ని వయస్సుల వారి ఆరోగ్యం, బాగోగులపై అవగాహన కల్పించేందుకు వారు చేపట్టిన ప్రచారంలో తాను భాగస్వామి అవుతున్నట్టు వెల్లడించారు. న్యూబర్గ్ డయాగ్నాస్టిక్స్ ఛైర్మన్ డాక్టర్ జీఎస్‌కే వేలు మాట్లాడుతూ ధోని వంటి లెజెండ్ మా ప్రచారకర్తగా, అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటాన్ని మేము గౌరవంగా భావిస్తామన్నారు.
ప్రారంభించిన నాలుగేళ్లలోనే మూడు ఖండాలకు తన వ్యాపారాన్ని విస్తించింది న్యూబెర్గ్ సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల రాబడి సాధించింది. వచ్చే ఏడాది వెయ్యికోట్ల ఆదాయం లక్ష్యంగా ముందుకెళ్తోంది. న్యూబెర్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200లకు పైగా ల్యాబులు, 3000లకు పైగా శాంపిల్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment