మాజీ క్రికెటర్ కనిత్కర్ కన్నుమూత
ముంబై: భారత టెస్ట్ మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోని సొంత నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని బీసీసీఐ తెలిపింది. 1963-64, 1977-78 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర తరపున క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించారు.
1974-75 మధ్యకాలంలో రెండు టెస్టు మ్యాచ్ లు ఆడారు. బీసీసీఐ ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారు. హేమంత్ కనిత్కర్ మరణం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సంతాపం ప్రకటించారు. కనిత్కర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.