
ముంబై: కరోనాపై పోరులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘కెట్టో’ ద్వారా కనీసం రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని వీరిద్దరు నిర్ణయించారు. ‘విరుష్క’ విజ్ఞప్తికి అద్భుత స్పందన వచ్చింది. గడువు ముగిసేందుకు మరో రెండు రోజుల సమయం ఉందనగా ఇప్పటికి ‘విరుష్క’ విరాళాల సేకరణ మొత్తం రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. ఇందులో ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ విరాళం రూ. 5 కోట్లు ఉండటం విశేషం. వసూలైన మొత్తాన్ని విరుష్క ‘ఏసీటీ గ్రాంట్స్’ అనే సంస్థకు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment