ఎంసీఎల్ కు దాదా దూరం! | Ganguly to miss MCL after sustaining back injury: Reports | Sakshi
Sakshi News home page

ఎంసీఎల్ కు దాదా దూరం!

Published Wed, Jan 27 2016 8:28 PM | Last Updated on Wed, Oct 3 2018 7:14 PM

Ganguly to miss MCL after sustaining back injury: Reports

దుబాయ్: మాస్టర్ క్రికెట్ లీగ్కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దూరమయ్యే అవకాశముంది. ఇటీవల ప్రాక్టిస్ సెషన్లో దాదా గాయపడ్డాడు. డాక్టర్ల సలహా మేరకు ఈ ఆరంభ టోర్నీకి దూరం కావాలని గంగూలీ నిర్ణయించినట్టు సమాచారం.

ఎంసీఎల్ టి-20 టోర్నమెంట్లో మాజీ క్రికెట్ దిగ్గజాలు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దాదా లిబ్రా లెజెండ్‌ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉంది. కాగా ప్రాక్టీస్ సెషన్లో గంగూలీ సింగిల్ తీసే సమయంలో వెనుక నుంచి బంతి వచ్చి వీపుభాగాన తగిలింది. దీంతో కనీసం రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మంగళవారం జరిగిన కెప్టెన్ల మీడియా సమావేశానికి గంగూలీ గైర్హాజరుకావడంతో అతను టోర్నీ అందుబాటులో ఉండేది సందేహంగా మారింది. ఈ నెల 28న ఈ టోర్నీ ఆరంభకానుంది. అయితే టోర్నీలో ఆడకపోయినా దాదా దుబాయ్కు వెళ్లి తన జట్టు సభ్యులతో గడిపే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement