
జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం
ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చింది. భారత్ నుంచి ఈ గౌరవం దక్కిన 24వ క్రికెటర్ జహీర్. గత నెలలోనే సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఉండే ఈ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు సేవలు అందించిన వారికి గౌరవ సభ్యత్వం ఇస్తుంది. ప్రస్తుతం 300 మందికిపైగా గౌరవ సభ్యులు ఈ క్లబ్‌లో ఉన్నారు.