
సాక్షి, న్యూఢిల్లీ : నానమ్మే నా తొలి గురువు, నా మార్గదర్శి‘ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 100వ జయంతి సందర్భంగా రాహుల్‌గాంధీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘దాదీ.. నీతో గడిపిన ఆనందక్షణాలు నాకింకా గుర్తున్నాయి’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఆదివారం ఇందిరా గాంధీ వందవ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు శక్తిస్థల్‌లోని ఇందిరాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరాగాంధీతో సన్నిహింతగా ఉన్న ఒక ఫొటోనే ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
I remember you Dadi with so much love and happiness. You are my mentor and guide. You give me strength. #Indira100
— Office of RG (@OfficeOfRG) 19 November 2017
Remembering Smt. #IndiraGandhi on her Birth Centenary. Her steely determination, clarity of thought & decisive actions made her a towering personality. Undoubtedly and rightfully India's #IronLady. pic.twitter.com/oY5TLVz5tW
— Pranab Mukherjee (@CitiznMukherjee) 19 November 2017
Comments
Please login to add a commentAdd a comment