రగులుతున్న 'పనౌటీ' వివాదం! తెరపైకి నాడు ఇందీరా గాంధీ.. | Rahus Panauti Jab BJP Recalls Indira Gandhis Insult Of Hockey Team | Sakshi
Sakshi News home page

రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని..

Published Thu, Nov 23 2023 12:52 PM | Last Updated on Thu, Nov 23 2023 1:29 PM

Rahus Panauti Jab BJP Recalls Indira Gandhis Insult Of Hockey Team - Sakshi

రెండు రోజుల్లో రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. ఎవరికి వారు మాటల తుటాలతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఐతే కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఓ ప్రచార ర్యాలీ మోదీని విమర్శిస్తూ చేసిన పనౌటీ వ్యాఖ్య ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలా అని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది.

ఈ వ్యాఖ్యల విషయమై రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏకంగా ఎలక్షన్‌ సంఘాన్ని కోరింది. అంతటితో ఆగకుండా 1982లో జరిగిన ఆసియా క్రీడల హాకీ ఫైనల్‌ మ్యాచ్‌ని గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కిపెట్టింది బీజేపి. ఆ టైంలో ఇందిరాగాంధీ నేరుగా హాకీ మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని, ఐతే భారత హాకీ జట్టు మ్యాచ్‌లో వెనుకబడి ఉండటంతో ఆమె మధ్యలో వెళ్లిపోయారంటూ నాటి సంఘటనను గుర్తు చేసింది బీజేపి. అలా మధ్యలో వెళ్లిపోయి ఇందిరా గాంధీ భారత జట్టుని అవమానించారు అని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన నిజంగా క్రీడాకారుల మనోస్థైర్యాన్ని దెబ్బతియడంతో సమానం అంటూ కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోసింది.

కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్‌ ప్రపంచ వరల్డ్‌ కప్‌లో అలా చేయలేదని చివరి వరకు ఉండి, భారత జట్టుని కలిసి ప్రశంసించి, స్టైర్యాన్ని నింపితే ఇలానా వ్యాఖ్యానించేదని చీవాట్లు పెట్టింది. రాహుల్‌ లాంటి అపరిపక్వత వ్యక్తి కూడా ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ మండిపడింది. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత్‌ శర్మ టీమ్‌ ఇండియా ప్రపంచ కప్పు ఫైనల్‌లో ఓడిపోవడానికి భిన్నమైన వివరణ ఇస్తూ విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ఫైనల్‌ మ్యాచ్‌ జరగడంతోనే టీమ్‌ ఇండియా ఓడిపోయిందన్నారు.

అందువల్ల దయచేసి గాంధీ కుటుంబ సభ్యల పుట్టిన రోజున టీం ఇండియా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్‌లు ఆడకూదనే విషయం అవగతమైందంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఏదీఏమైన రాహుల్‌ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఏకంగా రాజస్తాన్‌ ఎనికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ రోజు సాయంత్రంతో ఇరు పార్టీల ప్రచార ర్యాలీకి తెరపడనుంది. ఈ నెల 25న రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎ‍న్నికలు జరగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగునుంది. 

(చదవండి: ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్‌ షా ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement