Brian Lara To Work With West Indies As Performance Mentor: Says Reports - Sakshi
Sakshi News home page

IND Vs WI 2023: టీమిండియాతో వరుస సిరీస్‌లు.. వెస్టిండీస్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం!

Published Tue, Jul 4 2023 12:06 PM | Last Updated on Tue, Jul 4 2023 12:28 PM

Brian Lara to work with West Indies as performance mentor: Reports - Sakshi

భారత వేదికగా జరగున్న వన్డే ప్రంపచకప్‌-2023కు వెస్టిండీస్‌ అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ వంటి పసికూన చేతిల్లో ఓటమి పాలై కరీబియన్‌ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌లో వెస్టిండీస్‌కు ఇంకా కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది.

జూలై 7న శ్రీలంకతో వెస్టిండీస్‌ ఆడనుంది. ఇక క్వాలిఫయర్స్‌ ముగిసిన వెంటనే విండీస్‌ జట్టు స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టనుంది. స్వదేశంలో టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సుదీర్ఘ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో విండీస్‌ జట్టు తలపడనుంది. జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.
మెంటార్‌గా బ్రియాన్‌ లారా
ఇక గత కొంత కాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న విండీస్‌ జట్టును చక్కదిద్దే పనిలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు పడింది. టీమిండియాతో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో విండీస్‌ జట్టు మెంటార్‌గా దిగ్గజ ఆటగాడు బ్రియ‌న్ లారాను నియమించాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విండీస్ ప్రాక్టీస్ సెష‌న్స్‌కు లారా హాజ‌ర‌వుతోన్నట్లు స‌మాచారం. ఇక ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే విండీస్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మునిగి తెలుతోంది.

వెస్టిండీస్‌తో  టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ.

వెస్టిండీస్ సన్నాహక జట్టు: 
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.
చదవండి: భారత జట్టు హెడ్‌కోచ్‌గా ముజుందార్.. త్వరలోనే ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement