India Tour Of West Indies: అనిల్ కుంబ్లే.. ఈ రైట్‌ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. తన సుదీర్ఘ కెరీర్‌లో మేటి జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ కర్ణాటక బౌలర్.. భారత్ తరఫున 132 టెస్టులాటి 619 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా స్టార్ టెస్టు స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు.
1990లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కుంబ్లే.. భారత జట్టు సారథిగానూ సేవలు అందించాడు. కెరీర్లో ఎదురైన సవాళ్లంటినీ అధిగమించి మేటి బౌలర్‌గా ఎదిగాడు. ఇక కుంబ్లేకు వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే చాలు పూనకాలే! బ్రియన్ లారా వంటి దిగ్గజాలను పెవిలియన్‌కు పంపితే ఆ మజానే వేరని భావించేవాడట!
దవడ పగిలినా
దవడ విరిగిపోయినా మైదానం వీడక బౌలింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా టీమిండియా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అనిల్ కుంబ్లే 2002 నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వా టెస్టు సందర్భంగా మెర్విన్ ధిల్లాన్ షార్ట్ డెలివరీ కారణంగా బంతి బలంగా తాకి అనిల్ కుంబ్లే దవడ పగిలింది. దీంతో మ్యాచ్‌కు దూరమవ్వాల్సి పరిస్థితి. విరామ సమయంలో తన భార్య చేతనకు ఫోన్ చేసి విషయం చెప్పాడు కుంబ్లే. సర్జరీ కోసం ఇంటికి వస్తున్నానని ఆమెతో అన్నాడు.
కానీ.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి దిగాడు. 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్రియన్ లారా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ విషయం గురించి కుంబ్లే జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘నా భార్య చేతనకు కాల్ చేసి.. సర్జరీ చేయించుకోవాలి ఇంటికి వస్తున్నా అని చెప్పాను.
జోక్ చేస్తున్నా అనుకుంది
అందుకోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేస్తానని తను నాతో అంది. ఇక కాల్ కట్ చేసే ముందు.. ‘‘నేను వెళ్లి బౌలింగ్ చేస్తాను’’అని తనతో అన్నాను. కానీ చేతన నమ్మలేదు. నేను జోక్ చేస్తున్నా అనుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు తాను బౌలింగ్ కొనసాగించడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు.
కాగా ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. 2002 నాటి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా పర్యటనలో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. విండీస్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించింది ఇతడే!
జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Comments
Please login to add a commentAdd a comment