టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ప్రపంచక్రికెట్‌ను ఉమ్రాన్ మాలిక్ శాసిస్తాడని లారా కొనియాడాడు. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా గత రెండు సీజన్లగా ఎస్‌ఆర్‌హెచ్ కోచింగ్ స్టాప్‌లో లారా కూడా భాగంగా ఉన్నాడు.
ఈ క్రమంలో అతడి స్కిల్స్‌ను లారా దగ్గర నుంచి చూశాడు. మాలిక్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్ తన స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కూడా చోటు దక్కలేదు. శనివారం ఫ్లోరిడా వేదికగా జరిగే నాలుగో టీ20లో ఉమ్రాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో లారా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. "ఉమ్రాన్ ఒక పేస్ బౌలింగ్ సంచలనం. కానీ పేస్ బౌలింగ్ ఏ మాత్రం బ్యాటర్లను ఇబ్బంది పెట్టదనే విషయాన్ని మాలిక్ వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. ఫాస్ట్ బౌలర్లు బంతితో అద్బుతాలు చేసే విధంగా ఉండాలి. అతడు ఇంకా తన బౌలింగ్ స్కిల్స్‌ను పెంచుకోవాలి.
అయితే ఉమ్రాన్‌కు ఇప్పుడు కేవలం 23 ఏళ్ల మాత్రమే. ఇంకా అతడికి చాలా భవిష్యత్తు ఉంది. వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలు పేస్‌తో పాటు కొన్ని ట్రిక్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవారు. ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్‌లో డేల్ స్టెయిన్‌తో కలిసి పనిచేశాడు. కాబట్టి అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఉమ్రాన్ వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని" జోస్యం చెప్పాడు.
చదవండి: సెంచరీతో చెలరేగిన పుజారా.. భారత సెలక్టర్లకు వార్నింగ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment