
Sanju Samson In USA: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య చారులతతో కలిసి యూఎస్‌ఏలో పర్యటిస్తున్నాడు. ఐపీఎల్-2023 తర్వాత దొరికిన విరామ సమయాన్ని యూఎస్‌ఏ ట్రిప్‌లో తన సతీమణితో కలిసి ఆస్వాదిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో భార్య చారులతతో పలు ఫొటోలు షేర్ చేసిన సంజూ.. తాజాగా ఇద్దరు క్రికెటర్ దిగ్గజాలతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్, వెస్టిండీస్ మాజీ సారథి బ్రియన్ లారాతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘గ్రేట్ కంపెనీ’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు.
స్టైలిష్ లుక్
ఇందులో షేన్ బాండ్, లారా నడుమ నిలబడ్డ సంజూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. కాగా షేన్ బాండ్, బ్రియన్ లారా ఐపీఎల్-2023లో భాగమైన విషయం తెలిసిందే. బాండ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించగా.. లారా సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌గా సేవలు అందించాడు.
మరోవైపు.. సంజూ.. రాజస్తాన్ రాయల్స్ సారథిగా జట్టును ముందుకు నడిపిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు.
విండీస్‌తో వన్డేలకు
ఇక మొత్తంగా 14 మ్యాచ్‌లలో 362 పరుగులు సాధించాడు ఈ కేరళ బ్యాటర్. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ పర్యటనకు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో సంజూకు చోటు దక్కింది. విండీస్‌తో వన్డేలకు అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు.
2015లో తొలిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ శాంసన్.. ఇప్పటి వరకు 11 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 330, 301 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు భారత జట్టు వెస్టిండీస్ టూర్‌తో బిజీ కానుంది.
వెస్టిండీస్‌తో వన్డేలకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్.
చదవండి: కెప్టెన్ ఊచకోత.. జింబాబ్వే సంచలన విజయం.. మేటి జట్లను వెనక్కి నెట్టి టీమిండియా తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment