
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. అబుదాబి టీ10 లీగ్-2022 సీజన్‌కు గానూ న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు మెంటార్‌గా యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. కాగా యువరాజ్ అబుదాబి టీ10 లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. 2019 ఈ టోర్నీ సీజన్‌లో మరాఠా అరేబియన్స్‌కు యువీ ప్రాతినిథ్యం వహించాడు.
ఇక 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న యువీ.. బీసీసీఐ అనుమతితో కొన్ని గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లలో ఆడాడు. అదే విధంగా లీజెండ్స్ లీగ్ క్రికెట్, రోడ్ సెప్టీ వంటి లీగ్‌ల్లో కూడా యువరాజ్ భాగంగా ఉన్నాడు. అబుదాబి టీ10 లీగ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో న్యూయార్క్ స్ట్రైకర్స్ ఒప్పందం కుదర్చుకుంది.
చదవండి: ICC T20I Rankings: దుమ్ము రేపిన మంధాన.. నెంబర్ 1 స్థానానికి చేరువలో!
Comments
Please login to add a commentAdd a comment