![Glenn Phillips leaves the crease to Hit Sam Currans Outrageous Delivery - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/3/Untitled-10.gif.webp?itok=wMNgUThp)
Courtesy: IPL
Glenn Phillips: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్తాన్ రాయల్స్ షాక్ ఇచ్చింది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేయడానికి వచ్చిన సామ్ కరన్.. తన రెండో డెలివరీ వేసే క్రమంలో అతడి చేతి బంతి నుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లింది.
అయితే స్ట్రైక్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఆ బంతిని ఎదుర్కోవడానకి క్రీజు వదిలి చాలా దూరం వెళ్లాడు. అయినప్పటికీ బంతిని అందుకోలేక చతికల పడ్డాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను నవ్వులు పూయిస్తుంది. ఫిలిప్స్ ‘ఫీట్’పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పరుగుల కోసం ఎంత దూరమైనా సిద్ధమా అని కొందరు.. ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా వదలవా? అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫిలిప్స్ ఆత్రం చూసి సామ్ నోరెళ్లబెట్టాడు అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ సాధించాడు. రుతురాజ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 17.3 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సాధించింది. యశస్వీ జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివమ్ దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ రాజస్తాన్ రాయల్స్‌ను గెలిపించాయి. దీంతో ప్లేఆఫ్ ఆశలను రాయల్స్ సజీవంగా నిలుపుకుంది.
చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే
— Jabjabavas (@jabjabavas) October 2, 2021
Comments
Please login to add a commentAdd a comment