
Photo Courtesy: CPL
Sam Curran Replaced With Dominic Drakes: సామ్ కరన్ స్థానంలో కరేబియన్ క్రికెటర్ డొమినిక్ డ్రేక్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రకటించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు స్వాగతం పలికింది. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పితో బాధపడిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానాన్ని డొమినిక్‌తో భర్తీ చేశారు.
కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వెస్బెర్ట్ తనయుడైన డొమినిక్.. ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. అయితే, ఇటీవల ముగిసిన కరేబియన్ లీగ్‌లో మాత్రం అదరగొట్టాడు. సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు... టోర్నీలో మొత్తంగా 16 వికెట్లు తీశాడు. ముఖ్యంగా.. ఫైనల్‌లో ... 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు తొలి టైటిల్ అందించడంలో డొమినిక్ కీలక పాత్ర పోషించాడు.
తద్వారా ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’గా నిలిచాడు. ఇక నెట్ బౌలర్‌గా యూఏఈకి వచ్చి ఐపీఎల్ బబుల్‌లో ఉన్న 23 ఏళ్ల డొమినిక్.. ఇప్పుడు సీఎస్‌కేలో సామ్ కరన్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్ గురువారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో డొమినిక్ తుది జట్టులో చోటు దక్కించచుకుంటాడా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఐపీఎల్-2021 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో తొమ్మిదింట గెలిచిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2021: నిజంగా గుండె పగిలింది.. కనీసం చివరి మ్యాచ్ అయినా ఆడనివ్వండి!