He Had Crush On Me Since 7th Grade Whole School Knew It: Ravichandran Ashwin Wife Prithi Ashwin - Sakshi
Sakshi News home page

Ashwin- Prithi: చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్‌! స్కూల్‌ మొత్తం ఆ విషయం తెలుసు! ఓరోజు సడెన్‌గా..

Published Thu, May 4 2023 12:43 PM | Last Updated on Thu, May 4 2023 1:10 PM

R Ashwin Wife: He Had Crush On Me Since 7th Grade Whole School Knew It - Sakshi

Ravichandran Ashwin- Prithi Narayanan: దశాబ్ద కాలంగా టీమిండియా కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. తన స్పిన్‌ మాయాజాలంతో ఇప్పటికే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక రికార్డులు సృష్టించిన అశూ.. వ్యక్తిగత జీవితంలోనూ సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీమ్యాన్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో అతడి భార్య ప్రీతి నారాయణన్‌ది కీలక పాత్ర.

అశ్విన్‌కు చిన్ననాటి స్నేహితురాలైన ఆమె.. 2011, నవంబరు 13న వివాహ బంధంతో అతడి జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు అఖీరా అశ్విన్‌, ఆద్య అశ్విన్‌ సంతానం. కాగా ఐపీఎల్‌-2023లో అశ్విన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

లవ్‌స్టోరీ చెప్పిన ప్రీతి
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో జియో సినిమా ‘హ్యాంగవుట్‌’ షోలో అశ్విన్‌ సతీమణి ప్రీతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా, వేదా క్రిష్ణమూర్తి(క్రికెటర్‌), దినేశ్‌ సైత్‌ తదితరులు కలిసి హోస్ట్‌ చేసిన ఈ షోలో ప్రీతి.. అశ్విన్‌తో తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.

సీఎస్‌కే అకౌంట్‌ హ్యాండిల్‌ చేస్తునపుడు
‘‘మేమిద్దరం ఒకే స్కూళ్లో చదువుకున్నాం. అలా ఇద్దరికీ చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. అయితే, స్కూల్‌ చదువు పూర్తైన తర్వాత చాలాకాలం పాటు మేము ఒకరినొకరం కలిసే సందర్భాలు పెద్దగా రాలేదు.

అప్పట్లో నేను ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో పనిచేసేదాన్ని. తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాండిల్‌ చేస్తున్న సమయంలో అశ్విన్‌ను చూశాను. ఆరడుగుల ఎత్తు.. తన లుక్‌ చూసి షాకయ్యా. 

మాటలు మొదలయ్యాయి. ఒకరోజు తను నన్ను క్రికెట్‌ గ్రౌండ్‌కి తీసుకువెళ్లి.. ‘‘నీతో కలిసి జీవితాంతం నడవాలనుకుంటున్నాను’’ అని నేరుగా తన మనసులో మాట చెప్పేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్లకు పైగా మా అనుబంధం అలాగే కొనసాగుతోంది’’ అని ప్రేమకథను రివీల్‌ చేసింది ప్రీతి.

స్కూళ్లో అందరికీ ఆ విషయం తెలుసు
‘‘నిజానికి చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్‌ ఉండేది. ఏడో తరగతి నుంచే నేనంటే పడిచచ్చిపోయే వాడు. ఈ విషయం స్కూల్‌ మొత్తం తెలుసు. తర్వాత క్రికెట్‌ ఆడటంలో బిజీ అయిపోయాడు. 

పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ల కాబట్టి బర్త్‌డే ఫంక్షన్ల సమయంలో అప్పుడప్పుడూ కనిపించేవాడు. కానీ అప్పుడు ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండేవాళ్లం’’ అని అశ్విన్‌కు తనపై ఉన్న ఇష్టం గురించి చెబుతూ నవ్వులు చిందించింది ప్రీతి. తమ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయని.. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకుంటుందని భార్యాభర్తల అనుబంధం గురించి వివరించింది.

చదవండి: Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్‌ వైరల్‌! రియల్‌ బాస్‌ ఎవరంటే! 
IPL 2023: మంచి బౌలరే.. కానీ ఇదేంటి? మరీ చెత్తగా.. ఇలాగే కొనసాగితే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement