prithi ashwin
-
అశ్విన్ రిటైర్మెంట్పై భార్య ప్రీతి తొలి రియాక్షన్.. వైరల్
‘‘గత రెండు రోజులుగా నాకు అంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం చెప్పాలో.. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడంలేదు. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్‌కు నీరాజనం సమర్పించాలా?... లేదంటే.. జీవిత భాగస్వామి కోణంలో ఆలోచించాలా? లేదంటే.. ఫ్యాన్ గర్ల్‌లా ఓ ప్రేమ లేఖను రాయాలా?.. లేదా ఈ భావోద్వేగాల సమాహారాన్ని పూసగుచ్చాలా?!అశ్విన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినపుడు చిన్నా, పెద్దా.. అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. గత 13- 14 ఏళ్లుగా ఎన్నో అనుభవాలు చవిచూశాం. అతిపెద్ద విజయాలు, ఎన్నెన్నో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు, ఓటమి ఎదురైనపుడు గదిలో నిశ్శబ్దాలు, మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ బోర్డు మీద రాసే రాతలు.. ఇలాంటి జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తున్నాయి.చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విజయం, సిడ్నీ డ్రా, గబ్బా గెలుపు... టీ20లలో పునరాగమనం.. వీటన్నింటి వల్ల మేము పొందిన ఆనందం అనిర్వచనీయం. అదే సమయంలో ఓటముల వల్ల మా హృదయం ముక్కలైనపుడు ఉండే భయంకర నిశ్శబ్దం కూడా నాకు గుర్తే.ప్రియమైన అశ్విన్.. నాకైతే మొదట్లో క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా సర్దాలో కూడా తెలిసేదే కాదు. నీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాకు క్రికెట్ ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే. ఆట పట్ల కూడా ప్రేమను కలిగించావు. నీ ప్యాషన్, క్రమశిక్షణ, కఠిన శ్రమ.. వీటన్నింటికి మరేదీ సాటిరాదు.అత్యుత్తమ గణాంకాలు, అరుదైన రికార్డులు, లెక్కలేనన్ని అవార్డులు.. అయినా సరే ప్రతిసారి మ్యాచ్‌కు ముందు నువ్వు సన్నద్ధమయ్యే తీరు, నీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దే విధానం గురించి ఎలా వర్ణించను?..నీ అంతర్జాతీయ కెరీర్ అత్యద్భుతంగా సాగింది. ఇక నీ మీద ఉన్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది. నీకు ఇష్టమైన రీతిలో కొత్త జీవితాన్ని గడుపు. నచ్చిన భోజనం తిను. కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించు. మన పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకో’’.... అంటూ ప్రీతి నారాయణన్ భావోద్వేగానికి లోనయ్యారు. టీమిండియా తాజా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణే ప్రీతి.తొలి స్పందన.. ఉద్వేగపూరిత నోట్ వైరల్అంతర్జాతీయ క్రికెట్‌కు తన భర్త రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రీతి ఈ మేర ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. అశూ ఇకపై తమకు మరింత దగ్గరగా ఉంటాడని భార్యగా ఆనందపడుతూనే.. మరోవైపు అభిమానిగా విచారం వ్యక్తం చేశారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అయితే, టెస్టు క్రికెట్ రారాజుగా వెలుగొందిన అశూ అన్నకు సరైన వీడ్కోలు లభించలేదన్నది వాస్తవం. బ్రిస్బేన్‌లో టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మకతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన అశూ తన నిర్ణయాన్ని చెప్పి నిష్క్రమించాడు.ఎందుకింత అకస్మాత్తుగా?ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మేనేజ్మెంట్ పట్ల అసంతృప్తితోనే అతడు గుడ్‌బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు తీసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్.. ఆయా ఫార్మాట్లలో 3503, 707, 184 పరుగులు సాధించాడు.ఇక అశ్విన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2011, నవంబరు 13న చిరకాల ప్రేయసి ప్రీతి నారాయణన్‌ను చెన్నైలో వివాహమాడాడు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు అఖీరా అశ్విన్(2015), ఆద్యా అశ్విన్(2016).చదవండి: 'అశ్విన్‌ను చాలా సార్లు తొక్కేయాలని చూశారు' -
చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు..
Ravichandran Ashwin- Prithi Narayanan: దశాబ్ద కాలంగా టీమిండియా కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. తన స్పిన్ మాయాజాలంతో ఇప్పటికే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక రికార్డులు సృష్టించిన అశూ.. వ్యక్తిగత జీవితంలోనూ సక్సెస్ఫుల్ ఫ్యామిలీమ్యాన్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో అతడి భార్య ప్రీతి నారాయణన్‌ది కీలక పాత్ర. అశ్విన్‌కు చిన్ననాటి స్నేహితురాలైన ఆమె.. 2011, నవంబరు 13న వివాహ బంధంతో అతడి జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు అఖీరా అశ్విన్, ఆద్య అశ్విన్ సంతానం. కాగా ఐపీఎల్-2023లో అశ్విన్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. లవ్‌స్టోరీ చెప్పిన ప్రీతి ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో జియో సినిమా ‘హ్యాంగవుట్’ షోలో అశ్విన్ సతీమణి ప్రీతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, వేదా క్రిష్ణమూర్తి(క్రికెటర్), దినేశ్ సైత్ తదితరులు కలిసి హోస్ట్ చేసిన ఈ షోలో ప్రీతి.. అశ్విన్‌తో తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. సీఎస్కే అకౌంట్ హ్యాండిల్ చేస్తునపుడు ‘‘మేమిద్దరం ఒకే స్కూళ్లో చదువుకున్నాం. అలా ఇద్దరికీ చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. అయితే, స్కూల్ చదువు పూర్తైన తర్వాత చాలాకాలం పాటు మేము ఒకరినొకరం కలిసే సందర్భాలు పెద్దగా రాలేదు. అప్పట్లో నేను ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసేదాన్ని. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న సమయంలో అశ్విన్‌ను చూశాను. ఆరడుగుల ఎత్తు.. తన లుక్ చూసి షాకయ్యా. మాటలు మొదలయ్యాయి. ఒకరోజు తను నన్ను క్రికెట్ గ్రౌండ్‌కి తీసుకువెళ్లి.. ‘‘నీతో కలిసి జీవితాంతం నడవాలనుకుంటున్నాను’’ అని నేరుగా తన మనసులో మాట చెప్పేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్లకు పైగా మా అనుబంధం అలాగే కొనసాగుతోంది’’ అని ప్రేమకథను రివీల్ చేసింది ప్రీతి. స్కూళ్లో అందరికీ ఆ విషయం తెలుసు ‘‘నిజానికి చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్ ఉండేది. ఏడో తరగతి నుంచే నేనంటే పడిచచ్చిపోయే వాడు. ఈ విషయం స్కూల్ మొత్తం తెలుసు. తర్వాత క్రికెట్ ఆడటంలో బిజీ అయిపోయాడు. పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ల కాబట్టి బర్త్‌డే ఫంక్షన్ల సమయంలో అప్పుడప్పుడూ కనిపించేవాడు. కానీ అప్పుడు ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండేవాళ్లం’’ అని అశ్విన్‌కు తనపై ఉన్న ఇష్టం గురించి చెబుతూ నవ్వులు చిందించింది ప్రీతి. తమ మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయని.. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకుంటుందని భార్యాభర్తల అనుబంధం గురించి వివరించింది. చదవండి: Virat Kohli: ఇప్పట్లో చల్లారేలా లేదు! కోహ్లి మరో పోస్ట్ వైరల్! రియల్ బాస్ ఎవరంటే! IPL 2023: మంచి బౌలరే.. కానీ ఇదేంటి? మరీ చెత్తగా.. ఇలాగే కొనసాగితే! -
తమ ఫస్ట్ నైట్ గురించి తెలిపిన క్రికెటర్ భార్య!
క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్, ప్రీతి అశ్విన్ దంపతులు తాజాగా ఆరు వసంతాలను పూర్తిచేసుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 13న భార్య ప్రీతికి అశ్విన్ ట్విట్టర్లో ఓ స్వీట్ మెసేజ్‌ను పోస్టు చేశాడు. ఈ ఆరేళ్లు కష్టసుఖాల్లో తనకు తోడుగా ఉన్న ప్రీతికి థ్యాంక్స్ చెప్పాడు. ఇందుకు ప్రీతి లవ్లీ మెసేజ్‌తో రిప్లే ఇచ్చింది. ’యువర్ వెల్కమ్. కష్టసుఖాల్లో మనం కలిసి సాగాం. కానీ, మన వివాహం ’కిటో’లోనూ కలిసిసాగేంత దృఢమైనదని నువ్వు భావించావా’అంటూ అశ్విన్ ఉద్దేశించి హ్యుమర్ అండ్ విట్ మెసేజ్‌ను పెట్టింది. కిటో అంటే కెటోజెనిక్ డైట్. ఇది తక్కువ కార్బన్ ఉన్న డైట్.. మనిషి ఆహారం తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం కొవ్వును కరిగించి కాలేయంలోకి కీటోన్స్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఆహారం తక్కువగా తీసుకున్న.. సమయంలోనూ మనిషి దృఢంగా ఉండేందుకు పనికొస్తోంది. కష్టనష్టాల్లోనూ చెక్కుచెదరకుండా కలిసి సాగుదామన్న ఉద్దేశంతో ప్రీతి ఈ మెసేజ్ పెట్టింది. ఆ తర్వా త ప్రీతి పెట్టిన మరో మెసేజ్ నెటిజన్స్ నిజంగానే స్టంపౌట్ చేసింది. తమ ఫస్ట్‌నైట్ సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రీతి అభిమానులతో పంచుకుంది. తెల్లవారే మ్యాచ్ ఉండటంతో తమ మొదటిరాత్రి నాడు అశ్విన్‌ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు తనకు సూచించారట. ’యాస్ ఇఫ్’ అంటూ కొంటె ఆలోచన వచ్చేలా ప్రీతి పెట్టిన ఈ హిలేరియస్ మెసేజ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ’ఆరేళ్ల కిందట ఇదే రోజు మేం కోల్‌కతాకు వెళ్లాం. తెల్లవారే మ్యాచ్ ఉండటంతో అతన్ని పడుకోనివ్వు అంటూ మా కుటుంబసభ్యులు నాకు సూచించారు. (మేం అలా చేయనట్టు).. కానీ, టీమ్‌కు సంబంధించిన రహస్య అల్లారంలు రాత్రాంతా మోగాయి. తర్వాత రోజు మేం బాటింగ్ చేశాం’ అని ప్రీతి సరదాగా వివరించింది. ’అది అశ్విన్‌కు తొలి టెస్ట్ మ్యాచ్. నేను ఎక్సైటింగా ఉన్నానో అంత నెర్వస్‌కు గురయ్యాను. తొలిసారి చూసినప్పుడు మైదానంలో అతన్ని గుర్తించలేకపోయాను. ఇప్పుడు అశ్విన్ ఏకంగా 300 వికెట్లు తీశాడు’ అని ఆనాటి అనుభవాన్ని ప్రితీ తెలిపింది. This day 6 years ago,we were married and off to Kolkatta.I was advised by my kind family to "let him sleep"(as iffffff)because he had a game the next day.But the team had hidden alarms that went off through the night.Thankfully we batted the next day @ashwinravi99 #Iamchamathu 💖 pic.twitter.com/uWdKIZPPSp — Prithi Ashwin (@prithinarayanan) 13 November 2017 -
క్రికెటర్ భార్య.. ఆ విషయాన్ని తెలివిగా చెప్పింది!
చెన్నై: 2016.. భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అద్భుతమైన సంవత్సరమనే చెప్పాలి. ఈ ఏడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అరుదైన పురస్కారాలను అశ్విన్ అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా, టెస్టుల్లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదండోయ్ అశ్విన్‌కు ఈ ఏడాది తండ్రిగా మరోసారి ప్రమోషన్ లభించింది. అశ్విన్ భార్య ప్రితీ చెన్నైలో ఈ నెల 21న రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరునాడే నగరంలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. అయితే, తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని ప్రితీ ట్విట్టర్లో సింబాలిక్‌గా చెప్పింది. కేవలం లవ్ సింబల్ మాత్రమే ఆమె ట్వీట్ చేసింది. తాజాగా ఈ విషయాన్ని చాలా తెలివిగా ప్రితీ వెల్లడించింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా ధోనీ పేరును అశ్విన్ ప్రస్తావించకపోవడంపై ధోనీ అభిమానులు ట్విట్టర్లో అశ్విన్‌పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి పోస్టుల్లో తన భార్యను దయచేసి ట్యాగ్ చేయవద్దని, ఆమె కీలక పనుల్లో మునిగి ఉందని అశ్విన్ తెలిపాడు. ఆ కీలక పని ఏమిటంటే తమ రెండో బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడమేనంటూ ప్రితీ తెలివిగా వెల్లడించింది. ఈ నెల 21న తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చానని, అయితే, తుఫాను కారణంగా ఐదురోజులు అన్నీ బంద్ ఉండటం, ఆ తర్వాత చెపాక్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఉండటంతో చెప్పలేకపోయానని, ఇంతలోనే బిడ్డ పుట్టిన రెండోరోజే అశ్విన్‌కు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం వచ్చిందని, దాని నుంచి దృష్టి మళ్లించడం ఇష్టంలేక తాను ఇన్నిరోజులు చెప్పలేదని ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రితీ అశ్విన్ పేర్కొంది.