క్రికెటర్‌ భార్య.. ఆ విషయాన్ని తెలివిగా చెప్పింది! | Ashwin turns father for 2nd time | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ భార్య.. ఆ విషయాన్ని తెలివిగా చెప్పింది!

Published Mon, Dec 26 2016 7:42 PM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

క్రికెటర్‌ భార్య.. ఆ విషయాన్ని తెలివిగా చెప్పింది! - Sakshi

క్రికెటర్‌ భార్య.. ఆ విషయాన్ని తెలివిగా చెప్పింది!

చెన్నై: 2016.. భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అద్భుతమైన సంవత్సరమనే చెప్పాలి. ఈ ఏడాది ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా, ఐసీసీ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా అరుదైన పురస్కారాలను అశ్విన్‌ అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా, టెస్టుల్లో నంబర్‌ 1 బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదండోయ్‌ అశ్విన్‌కు ఈ ఏడాది తండ్రిగా మరోసారి ప్రమోషన్‌ లభించింది. అశ్విన్‌ భార్య ప్రితీ  చెన్నైలో ఈ నెల 21న రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరునాడే నగరంలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో భారత్‌ సంచలన విజయం సాధించింది.

అయితే, తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని ప్రితీ ట్విట్టర్‌లో సింబాలిక్‌గా చెప్పింది. కేవలం లవ్‌ సింబల్‌ మాత్రమే ఆమె ట్వీట్‌ చేసింది. తాజాగా ఈ విషయాన్ని చాలా తెలివిగా ప్రితీ వెల్లడించింది. క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్న సందర్భంగా ధోనీ పేరును అశ్విన్‌ ప్రస్తావించకపోవడంపై ధోనీ అభిమానులు ట్విట్టర్‌లో అశ్విన్‌పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి పోస్టుల్లో తన భార్యను దయచేసి ట్యాగ్‌ చేయవద్దని, ఆమె కీలక పనుల్లో మునిగి ఉందని అశ్విన్‌ తెలిపాడు.


ఆ కీలక పని ఏమిటంటే తమ రెండో బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడమేనంటూ ప్రితీ తెలివిగా వెల్లడించింది. ఈ నెల 21న తాను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చానని, అయితే, తుఫాను కారణంగా ఐదురోజులు అన్నీ బంద్‌ ఉండటం, ఆ తర్వాత చెపాక్‌ స్టేడియంలో టెస్టు మ్యాచ్‌ ఉండటంతో చెప్పలేకపోయానని, ఇంతలోనే బిడ్డ పుట్టిన రెండోరోజే అశ్విన్‌కు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం వచ్చిందని, దాని నుంచి దృష్టి మళ్లించడం ఇష్టంలేక తాను ఇన్నిరోజులు చెప్పలేదని ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ప్రితీ అశ్విన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement