టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. విలాసంతమైన మెర్సిడెజ్ బెంజ్ జీఎల్‌ఈ ఎస్‌యూవీకి యజమాని అయ్యాడు. కాగా 2010లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర క్రికెటర్ ఉనాద్కట్.. అదే ఏడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో టీమిండియా తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కట్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3, 9, 14 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ టూర్-2023లో భాగంగా టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ రైట్ ఆర్మ్ ఫాప్ట్‌బౌలర్.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
రూ. కోటి!
విండీస్‌తో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో కేసీ కార్టీ వికెట్ తీసి రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కరేబియన్ దీవి పర్యటన తర్వాత జయదేవ్ ఉనాద్కట్ తాజాగా కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. కోటి వరకు Mercedes-Benz GLE SUVని అతడు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
బ్లాక్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న కారును ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఉనాద్కట్ క్రికెట్‌బాల్‌పై సంతకం చేసి షో రూం నిర్వాహకులకు ఇవ్వడం విశేషం. ఈ అత్యాధునిక కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఇక SUV కొనుగోలు చేసిన సందర్భంగా.. భార్యతో కలిసి కారు వద్ద ఉనాద్కట్ దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అప్పట్లో 11.50 కోట్లు!
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2018 వేలం సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే. ఈ పేసర్ కోసం రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆ సీజన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాద్కట్ రికార్డు సృష్టించాడు.
చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా!
Comments
Please login to add a commentAdd a comment