ఢిల్లీ బౌలింగ్ అద్భుతం: ధోనీ | mahendra singh dhoni praise Delhi Daredevils bowlers | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బౌలింగ్ అద్భుతం: ధోనీ

Published Fri, May 6 2016 10:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

ఢిల్లీ బౌలింగ్ అద్భుతం: ధోనీ

ఢిల్లీ బౌలింగ్ అద్భుతం: ధోనీ

సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమితో అష్టకష్టాలు పడుతున్న పుణే సూపర్ జెయింట్స్‌ మూడో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని పొగిడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా అమిత్ మిశ్రా, ఇమ్రాన్ తాహిర్ చాలా చక్కని బంతులతో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించాడు. బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. పటిస్టమైన ఢిల్లీని కేవలం 162 పరుగులకే పరిమితం చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ వల్లే గెలిచామని అభిప్రాయపడ్డాడు. మధ్య ఓవర్లలో బ్యాటింగ్ కాస్త మాములుగా అనిపించినా వెంటనే కుదురుకుని విజయాన్ని సాధించామని చెప్పాడు.

ఈ విజయంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది ధోనీ పరిస్థితి. వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ రేసులో దాదాపు అన్ని సీజన్లలో నిలిచే మహేంద్ర సింగ్ ధోనీ పరిస్థితి ప్రస్తుతం అలా కనపడటం లేదు. గురువారం ఢిల్లీపై నెగ్గి ఈ సీజన్‌లో ధోనీ నేతృత్వంలోని పుణే మూడో విజయం సొంతం చేసుకుంది. స్టార్ ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి వైదొలగడం, తరచూ మార్పులతో ఓటములు పుణేను వెంటాడాయి. అయితే డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్‌లో మూడో విజయం సొంతం చేసుకుని ధోనికి కాస్త ఊరట కలిగించినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement