
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించి అజేయంగా నిలిచిన ముంబై జట్టు 12 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెల్చుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. పేసర్లు ధవల్ కులకర్ణి (3/30), శివమ్ దూబే (3/29) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 45.4 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో కీలక బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(8), అజింక్య రహానే(10), శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమైనా... ఆదిత్య తరే అద్భుత అర్ధశతకంతో (89 బంతుల్లో 71; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ముంబై 35 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. ఓవరాల్‌గా విజయ్ హజారే ట్రోఫీని ముంబై దక్కించుకోవడం ఇది పదోసారి. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆదిత్య తరేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment