Mumbai team
-
‘రంజీ’ రారాజు ముంబై... ఆటగాళ్లపై కోట్లాభిషేకం
విదర్భ ఇన్నింగ్స్‌లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్‌బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది. ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్‌లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్‌గా అవతరించింది. సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్‌మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించింది. 1934–35 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్‌కు ముందు 2015–16 సీజన్లో చివరిసారి ట్రోఫీని అందుకుంది. ఆటగాళ్లపై కోట్లాభిషేకం... ప్రైజ్‌మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్‌మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు. -
ముంబైకు టైటిల్ లాంఛనమే!
ముంబై: అత్యద్భుతం జరిగితే తప్పించి... ముంబై జట్టు 42వసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలవడం లాంఛనం కానుంది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విదర్భ జట్టు బ్యాటర్లు బుధవారం పట్టుదలతో ఆడారు. ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించింది. విదర్భ విజయం సాధిచాలంటే మ్యాచ్ చివరిరోజు మరో 290 పరుగులు సాధించాలి. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటిస్తారు. నాలుగో రోజు ఆటలో విదర్భ బ్యాటర్లు కరుణ్ నాయర్ (220 బంతుల్లో 74; 3 ఫోర్లు), కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (91 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు అథర్వ తైడె (64 బంతుల్లో 32; 4 ఫోర్లు), ధ్రువ్ షోరే (50 బంతుల్లో 28; 4 ఫోర్లు), అమన్ మోఖాడె (78 బంతుల్లో 32; 2 ఫోర్లు) కూడా ముంబై బౌలర్లకు అంత తొందరగా వికెట్ సమరి్పంచుకోకుండా క్రీజులో సాధ్యమైనంత ఎక్కువసేపు ఉండేందుకు ప్రయత్నించారు. విదర్భ కోల్పోయిన ఐదు వికెట్లు ముంబై స్పిన్నర్లకే లభించడం గమనార్హం. -
ముంబైకు చుక్కెదురు
ముల్లన్పూర్ (చండీగఢ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా జట్టు మూడు వికెట్ల తేడాతో ముంబైను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. శివమ్ దూబే (36 బంతుల్లో 48; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సర్భరాజ్ ఖాన్ (22 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం బరోడా జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి నెగ్గింది. విష్ణు సోలంకి (30 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బరోడా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై, ఢిల్లీ 39 పరుగుల తేడాతో విదర్భ జట్టుపై, కేరళ జట్టుపై అస్సాం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ చేరుకున్నాయి. -
43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఢిల్లీ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. 41సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ముంబైని ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 43 ఏళ్లలో ముంబై జట్టుపై ఢిల్లీకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా మ్యాచ్‌తో కలిపి ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లకు గానూ మూడింటిని డ్రా చేసుకొని.. రెండింటిలో ఓటమిపాలైంది. తాజాగా ముంబైపై విజయంతో సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై, ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. గ్రూప్-బిలో ఉన్న ఢిల్లీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప టార్గెట్ ఉండడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై తరపున సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు.ముంబై కెప్టెన్ అజింక్యా రహానే సహా ఓపెనర్ పృథ్వీ షాలు మ్యాచ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఢిల్లీ బ్యాటర్ వైభవ్ రవాల్ నిలిచాడు. Delhi successfully chase down the target in the fourth innings and complete a clinical 8️⃣-wicket win over Mumbai 👏👏#RanjiTrophy | #DELvMUM | @mastercardindia pic.twitter.com/NCyK8kn9zU — BCCI Domestic (@BCCIdomestic) January 20, 2023 చదవండి: స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది? -
Ranji Trophy: రహానే సేన చేతిలో హైదరాబాద్ పరాజయం
ముంబై: తమిళనాడుతో తొలి మ్యాచ్‌లో వెలుతురులేమితో ఓటమిని తప్పించుకున్న హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. రంజీ ట్రోఫీ టైటిల్‌ను 41 సార్లు సాధించిన ముంబై జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ సారథ్యంలోని హైదరాబాద్ ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 173/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగుల వద్ద ఆలౌటైంది. ముంబై ఎడంచేతి వాటం స్పిన్నర్ షమ్స్ ములానీ (7/94) హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. 437 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై... హైదరాబాద్‌కు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హైదరాబాద్ విఫలమై 67.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (65; 10 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమ్స్ ములానీ (4/82), తనుష్ కొటియాన్ (5/82) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. -
ఉత్తరాఖండ్‌తో క్వార్టర్ ఫైనల్.. చెలరేగి ఆడుతోన్న ముంబై..!
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో 41 సార్లు చాంపియన్ ముంబై తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఉత్తరాఖండ్‌తో సోమవారం ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 86 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తోనే ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన సువేద్ పర్కర్ (218 బంతుల్లో 104 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల తొలి రోజు స్కోర్లు ∙కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 213/7 (72 ఓవర్లలో) (సమర్థ్ 57, సౌరభ్ 4/67, శివమ్ మావి 3/40); ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్. ∙పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 219 ఆలౌట్ (71.3 ఓవర్లలో) (అభిషేక్ శర్మ 47, అనుభవ్ 3/36, పునీత్ 3/48); మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 5/0. ∙బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 310/1 (89 ఓవర్లలో) (సుదీప్ 106 బ్యాటింగ్); జార్ఖండ్‌తో మ్యాచ్. చదవండి: UAE T-20 League: యూఏఈ టి20 లీగ్‌లో ఐదు జట్లు మనవే -
ముంబై జట్టు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్...
Four Mumbai players test positive for COVID 19: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. షామ్స్ ములానీ, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి,సాయిరాజ్ పాటిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ దేశవాళీ టీ20 లీగ్ నవంబరు 4 నుంచి ప్రారంభంకానుంది. ఎలైట్ గ్రూపు-బిలో ఉన్న ముంబై లీగ్ స్టేజ్‌లో గౌహతిలో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్హహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ నలుగురు ఆటగాళ్లు సెల్ఫ్ ఐషోలేషన్‌కు వెళ్లారు. మిగితా ఆటగాళ్లకు నెగిటివ్‌గా తేలడంతో గౌహతి చేరుకున్నారు. కాగా ముంబై జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహిస్తున్నాడు. ముంబై జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), ఆదిత్య తారే, శివమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి, శామ్స్ ములానీ, అథర్వ అంకోలేకర్, ధవల్ కులకర్ణి, హార్దిక్ తమోర్, మోహిత్ అవస్తీ, సిద్ధేష్ పాటిల్, సిద్ధేష్ లాడ్ అమన్ ఖాన్, అర్మాన్ జాఫర్, యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్, దీపక్ శెట్టి , రాయిస్తాన్ డయాస్ చదవండి: T20 World Cup 2021: న్యూజిలాండ్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! -
ముంబై మహారథి శుభారంభం
పంచ్‌కులా (హరియాణా): ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సభ్యురాలిగా ఉన్న ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి పోటీలో ముంబై మహారథి 4–3తో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. 53 కేజీల బౌట్లో వినేశ్ (ముంబై) 8–0తో అంజుపై గెలిచింది. ముంబై తరఫున ఇలియాసోవ్ (57 కేజీలు), సచిన్ రాఠి (74 కేజీలు), నెమెత్ (76 కేజీలు) కూడా విజయం సాధించారు. పంజాబ్ రాయల్స్ తరఫున 65 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత బజరంగ్ పూనియా 8–2తో హర్ఫుల్పై గెలిచాడు. -
రాప్టర్స్ రాకింగ్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–4) నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ రాకింగ్ ప్రదర్శనతో టైటిల్ పట్టేసింది. ఆదివారం జరిగిన రసవత్తర టైటిల్ పోరాటంలో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్‌ను ‘ట్రంప్’గా ఎంచుకున్న ముంబై రాకెట్స్ ఇందులో గెలిచి శుభారంభం చేసింది. కిమ్ జీ జాంగ్–బెర్నడెత్ (ముంబై) జంట 15–8, 15–14తో మార్కస్ ఎలిస్–లారెన్ స్మిత్ (బెంగళూరు) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15–7, 15–10తో అంటోన్సెన్ (ముంబై)పై నెగ్గి 1–2తో రాకెట్స్ ఆధిక్యాన్ని తగ్గించాడు. బెంగళూరుకు ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో తి ట్రంగ్ వు 15–8, 15–9తో శ్రియాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో 3–2తో బెంగళూరు పైచేయి సాధించింది. అయితే రెండో పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ (బెంగళూరు) 15–7, 12–15, 3–15తో సమీర్ వర్మ (ముంబై) చేతిలో కంగుతిన్నాడు. దీంతో ఇరు జట్లు 3–3తో సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణాయక పురుషుల డబుల్స్‌లో మొహమ్మద్ అహ్సాన్–హెండ్ర సెతియవాన్ (బెంగళూరు) ద్వయం 15–13, 15–10తో కిమ్ జీ జాంగ్–లీ యంగ్ డే (ముంబై) జంటపై గెలువడంతో రాప్టర్ నాలుగో సీజన్ విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన బెంగళూరు రాప్టర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. -
విజేతకు ఇంకా డబ్బులు అందలేదు!
ముంబై: పుష్కర కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు సభ్యులకు ఇప్పటి వరకు టోర్నీకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా లభించలేదు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)లో పరిపాలన స్తంభించిపోవడంతో వారికి ఈ పరిస్థితి ఎదురైంది. నిబంధనల ప్రకారం బీసీసీఐ నేరుగా ఆటగాళ్లకు డబ్బు లు ఇవ్వకుండా సదరు సంఘం ద్వారానే చెల్లింపులు జరుపుతుంది. ఒక్కో ఆటగాడికి రోజూవారీ భత్యం కింద రూ.1500 లభిస్తుంది. దాదాపు నెల రోజులు సాగిన ఈ టోర్నీ ద్వారా ఒక్కో ఆటగాడికి రూ. 45 వేల వరకు రావాల్సి ఉంది. విజేతగా నిలిచిన జట్టుకు లభించే రూ. 20 లక్షల ప్రైజ్‌మనీ కూడా ముంబై ఆటగాళ్లకు దక్కలేదు. దీంతో పాటు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ ఫీజు కింద రూ. 35 వేల వంతున కూడా ఇవ్వాల్సి ఉంది. ఎంసీఏలో చెక్‌లపై సంతకం పెట్టే అధికారం కూడా ప్రస్తుతం ఎవరికీ లేకపోవడంతో ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
‘విజయ్ హజారే’ విజేత ముంబై
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించి అజేయంగా నిలిచిన ముంబై జట్టు 12 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీని గెల్చుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. పేసర్లు ధవల్ కులకర్ణి (3/30), శివమ్ దూబే (3/29) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 45.4 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో కీలక బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(8), అజింక్య రహానే(10), శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమైనా... ఆదిత్య తరే అద్భుత అర్ధశతకంతో (89 బంతుల్లో 71; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ముంబై 35 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. ఓవరాల్‌గా విజయ్ హజారే ట్రోఫీని ముంబై దక్కించుకోవడం ఇది పదోసారి. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆదిత్య తరేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. -
యు ముంబా చేతిలో జైపూర్ ఓటమి
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యు ముంబా జట్టు రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39–32తో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను కంగుతినిపించింది. యు ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (13 పాయింట్లు) అదరగొట్టాడు. రోహిత్ బలియన్ 7 పాయింట్లు సాధించాడు. పింక్‌పాంథర్స్ జట్టులో నితిన్ (8) రాణించాడు. అనూప్ 4, మోహిత్, సందీప్ ధుల్, అమిత్ తలా 3 పాయింట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యరాయ్ ఆసక్తిగా తిలకించారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ లీగ్‌లో శుభారంభం చేసిం ది. 48–37 స్కోరుతో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. నేడు యూపీ యోధతో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ముంబై రంజీ@ 500
విజయ్ మర్చంట్, సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండూల్కర్, పాలీ ఉమ్రీగర్, వినూ మన్కడ్, ఫరూఖ్ ఇంజినీర్... ఒకరా, ఇద్దరా భారత్‌కు ముంబై క్రికెట్ అందించిన దిగ్గజాల జాబితాకు ముగింపు లేదు! బాంబే తొలి తరం నుంచి నేటి రహానే, రోహిత్‌ల వరకు భారత క్రికెట్‌తో ఆ జట్టుకు విడదీయరాని బంధం. రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై సాధించిన విజయాలు, ఘనతలు, నెలకొల్పిన రికార్డులు మరే జట్టుకూ సాధ్యం కాలేదు. భారత దేశవాళీ క్రికెట్లో ఆల్‌టైమ్ అత్యుత్తమ టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై తమ 500వ రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగనుంది. ముంబై: రంజీ ట్రోఫీని 41 సార్లు సొంతం చేసుకున్న ముంబై జట్టు చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు ఇక్కడి వాంఖెడే మైదానంలో బరోడాతో జరిగే మ్యాచ్ రంజీల్లో ముంబైకి 500వది. చిన్న స్థాయి లీగ్‌ల నుంచి పటిష్టమైన వ్యవస్థ, పెద్ద సంఖ్యలో టోర్నీలు, ప్రతిభావంతులకు లభించే అవకాశాలు, అత్యుత్తమ కోచింగ్ సౌకర్యాలు... ఇలా అన్నీ వెరసి 83 ఏళ్లుగా రంజీల్లో ముంబైని ‘ది బెస్ట్’గా నిలబెట్టాయి. సన్నీ ఆట నేర్చిన మైదానాలతో, సచిన్ బ్యాట్‌కు పదును పెట్టిన పార్క్‌లతో కుర్రాళ్ల కలల కేంద్రం ముంబై క్రికెట్ దేశవాళీలో అద్భుతాలు చేసింది. ముంబై భాషలో ఆప్యాయంగా చెప్పుకునే ఖడూస్ (మొండి పట్టుదల) శైలి ఆ జట్టును, ఆటగాళ్లను కూడా ప్రత్యేకంగా మార్చింది. అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ఆటగాళ్లను అందించిన ముంబై, భారత జట్టులో అంతర్భాగంగా మారిపోయింది. తాజా మ్యాచ్ నేపథ్యంలో ముంబై రంజీ జట్టుకు సంబంధించిన కొన్ని విశేషాలు.... అత్యధిక పరుగులు: వసీం జాఫర్ (9759), అత్యధిక వికెట్లు: పద్మాకర్ శివాల్కర్ (361), అత్యుత్తమ బౌలింగ్: అంకిత్ చవాన్ (9/23), సీజన్లో అత్యధిక పరుగులు: శ్రేయస్ అయ్యర్ (1321), అత్యధిక స్కోరు: 855/6 డిక్లేర్డ్ (హైదరాబాద్‌పై). టాప్–5 వ్యక్తిగత స్కోర్లు: సంజయ్ మంజ్రేకర్ (377), విజయ్ మర్చంట్ (359 నాటౌట్), సునీల్ గావస్కర్ (340), అజిత్ వాడేకర్ (323), వసీం జాఫర్ (314 నాటౌట్). ఇతర దేశవాళీ జట్ల అత్యధిక టైటిల్స్: న్యూసౌత్‌వేల్స్ (ఆస్టేలియా–షెఫీల్డ్ షీల్డ్) 46; యార్క్‌షైర్ (ఇంగ్లండ్– 34); హైవెల్డ్ లయన్స్ (దక్షిణాఫ్రికా–29); ఆక్లాండ్ ఏసెస్, (న్యూజిలాండ్ –23). 1934–35లో జరిగిన తొలి రంజీ ట్రోఫీని ముంబై (నాటి బాంబే) గెలుచుకుంది. Üమొత్తం 83 సార్లు రంజీ ట్రోఫీ జరిగితే 41 టైటిల్స్ సాధించిన ముంబై మొత్తంగా 46 సార్లు ఫైనల్ చేరింది. కేవలం 5 ఫైనల్స్‌లో మాత్రమే ఆ జట్టు ఓటమి పాలైంది. Ü1958–59 సీజన్ నుంచి 1972–73 సీజన్ వరకు ముంబై వరుసగా 15 సార్లు విజేతగా నిలిచింది. Üముంబై తమ 100, 200, 300, 400వ రంజీ మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది. Üఎనిమిది సార్లు రంజీ విజేతగా నిలిచిన జట్లలో వసీం జాఫర్ సభ్యుడు. ముంబై క్రికెట్లో గట్టి పోటీ ఉండటమే ఆ జట్టు బలం. ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం. విఫలమైతే మరో అవకాశం దక్కడం చాలా కష్టం కాబట్టి ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు. – గావస్కర్ ముంబై రంజీ జట్టు ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్లను అందించింది. ఇక్కడే నేను ఎంతో నేర్చుకున్నాను. సింహం బొమ్మ ఉన్న జెర్సీని ధరించడాన్ని ప్రతీ ముంబై క్రికెటర్ గర్వంగా భావిస్తాడు. పాత విజయాలు చూసుకొని సంబరపడిపోకుండా మళ్లీ అంతే పట్టుదలతో ఆడటం వల్లే ముంబై వరుసగా టైటిల్స్ సాధించగలిగింది. – సచిన్ ► మొత్తం 499 మ్యాచ్‌లలో ముంబై 242 గెలిచి 26 ఓడింది. మరో 231 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిశాయి. -
యూపీ విజార్డ్స్‌పై ముంబై విజయం
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు తొలి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ముంబై 4–3 గోల్స్ తేడాతో నెగ్గింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో కళింగ లాన్సర్స్ ఆడుతుంది. -
గుజరాత్ లక్ష్యం 312
ప్రస్తుతం 47/0 ముంబైతో రంజీ ఫైనల్ ఇండోర్: మరో 265 పరుగులు.. ఒక రోజంతా సమ యం... చేతిలో పది వికెట్లు... తమ తొలి రంజీ టైటిల్‌ను అందుకునేందుకు గుజరాత్ ముందున్న లక్ష్యం ఇది. రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు గుజరాత్ ముందు 312 పరుగుల లక్ష్యా న్ని ఉంచింది. నాలుగో రోజు శుక్రవారం ఆట ముగి సే సమయానికి 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పార్థీవ్ సేన 47 పరుగులు చేసింది. క్రీజులో సూపర్ ఓపెనింగ్ జోడి ప్రియాంక్ పాంచల్ (34 బ్యాటింగ్; 7 ఫోర్లు), గోహెల్ (8 బ్యాటింగ్) ఉన్నారు. ఒకవేళ రోజంతా క్రీజులో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గుజరాత్ చాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే గెలుపు కోసం దూకుడుగా ఆడతారా.. లేక రక్షణాత్మక ఆటతీరుకు కట్టుబడతారా అనేది వేచిచూడాలి. అంతకుముందు ముంబై జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను 137.1 ఓవర్లలో 411 పరుగుల వద్ద ముగించింది. సీనియర్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ (91; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తన విలువైన ఆటతో జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. కెప్టెన్ ఆదిత్య తారే (69; 12 ఫోర్లు) సహకరించాడు. చింతన్ గజాకు ఆరు వికెట్లు, ఆర్పీ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
తొలి రోజు గుజరాత్‌దే
ముంబై 228 ఆలౌట్ ఇండోర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజే గుజరాత్ జట్టు పట్టు సాధించింది. తమ బౌలర్ల అద్భుత రాణింపుతో పటిష్ట ముంబైని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగింది. ఫలితంగా మంగళవారం ముంబై జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీనేజి సంచలనం పృథ్వీ షా (93 బంతుల్లో 71; 11 ఫోర్లు) తన బ్యాటింగ్ ఫామ్‌ను మరోసారి ప్రదర్శించగా.. సూర్యకుమార్ (133 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అభిషేక్ నాయర్ (94 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపిం చాడు. ఆర్పీ సింగ్, చింతన్ గజా, రుజుల్ భట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్లో 2 పరుగులు చేసింది. క్రీజులో సమిత్ గోహెల్ (2 బ్యాటింగ్), ప్రియాంక్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. -
రంజీ ఫైనల్లో ముంబై
పృథ్వీ షా సెంచరీ రాజ్‌కోట్: రంజీ ట్రోఫీలో 41 సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో ఆ జట్టు మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ ముగిసిన సెమీ ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెరీర్లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన 17 ఏళ్ల పృథ్వీ షా (175 బంతుల్లో 120; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగి తమ జట్టును గెలిపించాడు. శ్రేయస్ అయ్యర్ (40), వాఘేలా (36), సూర్యకుమార్ యాదవ్ (34) అతనికి అండగా నిలిచారు. 99 పరుగుల వద్ద పృథ్వీ గల్లీలో ఇంద్రజిత్ చక్కటి క్యాచ్ అందుకున్నా... విజయ్ శంకర్ నోబాల్ వేసినట్లు తేలడంతో షా బతికిపోయి తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ నెల 10నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో గుజరాత్‌తో ముంబై తలపడుతుంది. ►1993–94 సీజన్లో అమోల్ మజుందార్ తర్వాత రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. అసమాన ప్రతిభ ఉన్న ఈ కుర్రాడు మూడేళ్ల క్రితం 14 సంవత్సరాల వయసులో స్కూల్ క్రికెట్లో రికార్డు పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. నాడు 330 బంతుల్లో అతను ఏకంగా 546 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత ప్రణవ్ ధనవాడే 1009 పరుగులు చేసే వరకు అదే రికార్డుగా కొనసాగింది. తన అద్భుత ఆటతీరును గుర్తించి ముంబై రంజీ జట్టులో అవకాశం కల్పించగా, సెంచరీతో అతను దానిని నిలబెట్టుకోవడం విశేషం. -
శ్రేయస్ సెంచరీ
ఆధిక్యంలో ముంబై సౌరాష్ర్టతో రంజీ ఫైనల్ పుణే: సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఆధిక్యం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (142 బంతుల్లో 117; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 8 వికెట్లకు 262 పరుగులు చేసింది. సిద్ధేశ్ లాడ్ (22 బ్యాటింగ్), అబ్దుల్లా (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్ (48) ఆకట్టుకున్నాడు. 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబైని అయ్యర్, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 152 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే మ్యాచ్ మధ్యలో సౌరాష్ట్ర బౌలర్లు విజృంభించడంతో ముంబై మరోసారి తడబడింది. ఆదిత్య తారే (19), అభిషేక్ నాయర్ (19)తో సహా అందరూ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. హార్దిక్ రాథోడ్ 3, ఉనాద్కట్, జానీ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 192/8 ఓవర్‌నైట్ స్కోరు తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 93.2 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (66), ఉనాద్కట్ (31) రా ణించారు. ధవల్ 5, శార్దూల్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ముంబై 27 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ముంబై బెంబేలు
44 పరుగులకే ఆలౌటైన 40 సార్లు రంజీ చాంపియన్ కర్ణాటకకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఒకే రోజులో 22 వికెట్లు బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుది తిరుగులేని రికార్డు. ఏకంగా 40 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ఘన చరిత్ర కలిగిన దిగ్గజ జట్టు ఈసారి సెమీస్‌లో బెంబేలెత్తింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 44 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో 1977లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 42 పరుగులకే ఆలౌటయింది. అయితే ముంబైతో పాటు కర్ణాటక బ్యాట్స్‌మెన్ కూడా తడబడటంతో... తొలి రోజు బుధవారం ఏకంగా 22 వికెట్లు పడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటయింది. రాబిన్ ఉతప్ప (68) టాప్ స్కోరర్. కరుణ్ నాయర్ (49), మనీష్ పాండే (34) రాణించారు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసిన ఆనందం ముంబైకి మిగల్లేదు. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఊహించని విధంగా కేవలం 15.3 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటయింది. శ్రేయస్ అయ్యర్ (15), సూర్యకుమార్ (12) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ (6/20) సంచలన పేస్ బౌలింగ్‌తో ముంబైని వణికించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక 5 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసింది. ప్రస్తుతం కర్ణాటక ఓవరాల్‌గా 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. తమిళనాడు 192/3 కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో మహారాష్ట్రతో జరుగుతున్న సెమీస్‌లో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (56 బ్యాటింగ్), దినేశ్ కార్తీక్ (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
అగాధానికి... అంకిత్ చవాన్
27 ఏళ్ల చవాన్ 2008-09 సీజన్లో తొలిసారిగా ముంబై జట్టు తరఫున కెరీర్‌ను ఆరంభించాడు. 2012-13 సీజన్లో ముంబై 40వ సారి రంజీ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర వహించి నంబర్‌వన్ స్పిన్నర్‌గా మారాడు. పంజాబ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 23 పరుగులకు 9 వికెట్లు తీసిన చవాన్‌ను సచిన్ సైతం ప్రశంసించాడు. దేశవాళీ వన్డే, టి20ల్లో ముంబై తరఫున కచ్చితంగా ఆడేవాడు. దీంతో ఐపీఎల్ తొలి సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడినా 2011 నుంచి రాజస్థాన్ జట్టుతో ఉన్నాడు.