
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యు ముంబా జట్టు రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన పోరులో యు ముంబా జట్టు 39–32తో జైపూర్ పింక్‌పాంథర్స్‌ను కంగుతినిపించింది. యు ముంబా రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (13 పాయింట్లు) అదరగొట్టాడు. రోహిత్ బలియన్ 7 పాయింట్లు సాధించాడు. పింక్‌పాంథర్స్ జట్టులో నితిన్ (8) రాణించాడు.
అనూప్ 4, మోహిత్, సందీప్ ధుల్, అమిత్ తలా 3 పాయింట్లు చేశారు. ఈ మ్యాచ్‌ను జైపూర్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యరాయ్ ఆసక్తిగా తిలకించారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ లీగ్‌లో శుభారంభం చేసిం ది. 48–37 స్కోరుతో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. నేడు యూపీ యోధతో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment