13 పాయింట్లతో మెరిసిన పింక్‌పాంథర్స్ రెయిడర్
గుజరాత్ జెయింట్స్‌పై జైపూర్ విజయం
పుణే: స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దాంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ తొమ్మిదో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోరులో పింక్‌పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సూపర్ రెయిడ్‌లతో అర్జున్ అదరగొట్టగా... నీరజ్ నర్వాల్ (8 పాయింట్లు) అతడికి సహకరించాడు.
గుజరాత్ జెయింట్స్ జట్టు తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ చెరో 9 పాయింట్లు సాధించారు. తాజా సీజన్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ 9 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్ కేవలం ఐదు విజయాలతో పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 44–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది.
వారియర్స్ తరఫున విశ్వాస్ 14 పాయింట్లు, ప్రణయ్ 9 పాయింట్లతో రాణించగా... బెంగళూరు తరఫున స్టార్ రెయిడర్, ‘డుబ్కీ కింగ్’ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment