17 పాయింట్లతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ ప్లేయర్
మాజీ చాంపియన్ జట్టు ఖాతాలో 11వ విజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 35–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో విజృంభించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తన సూపర్ రెయిడింగ్‌తో ఆకట్టుకున్న అర్జున్ ప్రత్యర్థి డిఫెన్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. బెంగళూరు బుల్స్ స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... బుల్స్ 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. తాజా సీజన్‌లో 20 మ్యాచ్‌లాడిన పింక్ పాంథర్స్ 11 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 64 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. మరోవైపు 20 మ్యాచ్‌లాడిన బుల్స్ 2 విజయాలు, 17 పరాజయాలు, ఒక ‘టై’తో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది.
మరోవైపు యూపీ యోధాస్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. తాజా సీజన్‌లో ఇప్పటికే హరియాణా స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా... యూపీ యోధాస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 31–24 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 11 పాయింట్లు సాధించగా... స్టీలర్స్ తరఫున వినయ్, విశాల్ చెరో 6 పాయింట్లు సాధించారు.
లీగ్‌లో ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లాడిన యోధాస్ 11 విజయాలు 6 పరాజయాలు, 3 ‘టై’లతో 69 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్న స్టీలర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. లీగ్‌లో భాగంగా నేడు తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment