PKL 2023: డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ గెలుపు బోణీ | PKL 2023 Jaipur Pink Panthers Beat Gujarat Giants 1st Win For Season | Sakshi
Sakshi News home page

PKL 2023: జైపూర్‌ గెలుపు బోణీ.. బుల్స్‌ చేతిలో యోధాస్‌ చిత్తు

Published Tue, Dec 12 2023 8:27 AM | Last Updated on Tue, Dec 12 2023 8:56 AM

PKL 2023 Jaipur Pink Panthers Beat Gujarat Giants 1st Win For Season - Sakshi

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు తొలి గెలుపు (PC: PKL)

Pro Kabaddi League 2023- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు తొలి విజయం సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 35–32తో గెలిచింది. విరామ సమయానికి 12–20తో వెనుకబడి ఉన్న జైపూర్‌ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుంది.

రెయిడర్‌ అర్జున్‌ దేశ్వాల్‌ అత్యధికంగా 15 పాయింట్లు స్కోరు చేసి జైపూర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ సీజన్‌లో జైపూర్‌ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. మరోవైపు.. గుజరాత్‌ జెయింట్స్‌ ఐదింట మూడు గెలిచి 17 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది.

బెంగళూరు బుల్స్‌ చేతిలో యూపీ యోధాస్‌ ఓటమి
ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 38–36తో యూపీ యోధాస్‌ను ఓడించి ఈ సీజన్‌లో ఐదో మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరు తరఫున వికాశ్, భరత్‌ 11 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మంగళవారం జరిగే మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ తలపడుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement