రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతున్న విదర్భ
కరుణ్ నాయర్, అక్షయ్ అర్ధ సెంచరీలు
ముంబై: అత్యద్భుతం జరిగితే తప్పించి... ముంబై జట్టు 42వసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలవడం లాంఛనం కానుంది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విదర్భ జట్టు బ్యాటర్లు బుధవారం పట్టుదలతో ఆడారు. ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించింది.
విదర్భ విజయం సాధిచాలంటే మ్యాచ్ చివరిరోజు మరో 290 పరుగులు సాధించాలి. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటిస్తారు. నాలుగో రోజు ఆటలో విదర్భ బ్యాటర్లు కరుణ్ నాయర్ (220 బంతుల్లో 74; 3 ఫోర్లు), కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (91 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 90 పరుగులు జోడించారు.
అంతకుముందు అథర్వ తైడె (64 బంతుల్లో 32; 4 ఫోర్లు), ధ్రువ్ షోరే (50 బంతుల్లో 28; 4 ఫోర్లు), అమన్ మోఖాడె (78 బంతుల్లో 32; 2 ఫోర్లు) కూడా ముంబై బౌలర్లకు అంత తొందరగా వికెట్ సమరి్పంచుకోకుండా క్రీజులో సాధ్యమైనంత ఎక్కువసేపు ఉండేందుకు ప్రయత్నించారు. విదర్భ కోల్పోయిన ఐదు వికెట్లు ముంబై స్పిన్నర్లకే లభించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment