ఉత్తరాఖండ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌.. చెలరేగి ఆడుతోన్న ముంబై..! | Parkar Puts Mumbai on Top Day1In Quarterfinals | Sakshi
Sakshi News home page

Ranji Trophy Quarterfinals: ఉత్తరాఖండ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌.. చెలరేగి ఆడుతోన్న ముంబై..!

Published Tue, Jun 7 2022 8:12 AM | Last Updated on Tue, Jun 7 2022 8:21 AM

Parkar Puts Mumbai on Top Day1In Quarterfinals  - Sakshi

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ నాకౌట్‌ పోరులో 41 సార్లు చాంపియన్‌ ముంబై తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఉత్తరాఖండ్‌తో సోమవారం ప్రారంభమైన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 86 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తోనే ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన సువేద్‌ పర్కర్‌ (218 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు.   

ఇతర క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల తొలి రోజు స్కోర్లు 
కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌: 213/7 (72 ఓవర్లలో) (సమర్థ్‌ 57, సౌరభ్‌ 4/67, శివమ్‌ మావి 3/40); ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌.  
పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌: 219 ఆలౌట్‌ (71.3 ఓవర్లలో) (అభిషేక్‌ శర్మ 47, అనుభవ్‌ 3/36, పునీత్‌ 3/48); మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 5/0. 
బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌: 310/1 (89 ఓవర్లలో) (సుదీప్‌ 106 బ్యాటింగ్‌); జార్ఖండ్‌తో మ్యాచ్‌.
చదవండి: UAE T-20 League: యూఏఈ టి20 లీగ్‌లో ఐదు జట్లు మనవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement