Ranji Trophy quarter-finals
-
ఉత్తరాఖండ్‌తో క్వార్టర్ ఫైనల్.. చెలరేగి ఆడుతోన్న ముంబై..!
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో 41 సార్లు చాంపియన్ ముంబై తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఉత్తరాఖండ్‌తో సోమవారం ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 86 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తోనే ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన సువేద్ పర్కర్ (218 బంతుల్లో 104 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల తొలి రోజు స్కోర్లు ∙కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 213/7 (72 ఓవర్లలో) (సమర్థ్ 57, సౌరభ్ 4/67, శివమ్ మావి 3/40); ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్. ∙పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 219 ఆలౌట్ (71.3 ఓవర్లలో) (అభిషేక్ శర్మ 47, అనుభవ్ 3/36, పునీత్ 3/48); మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 5/0. ∙బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 310/1 (89 ఓవర్లలో) (సుదీప్ 106 బ్యాటింగ్); జార్ఖండ్‌తో మ్యాచ్. చదవండి: UAE T-20 League: యూఏఈ టి20 లీగ్‌లో ఐదు జట్లు మనవే -
శివ కుమార్ ‘సిక్సర్’
ఆరు వికెట్లతో చెలరేగిన ఆంధ్ర బౌలర్ - తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 91 పరుగులకే ఆలౌట్ - రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ రోహ్తక్: మహారాష్ట్రతో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శివ కుమార్ (6/41) నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. దీంతో బన్సీలాల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు మహారాష్ట్ర 41.5 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ మోత్వాని (23) టాప్ స్కోరర్. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. ప్రశాంత్ (26 బ్యాటింగ్), ప్రదీప్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీరామ్ (31) ఫర్వాలేదనిపిం చినా... భరత్ (11), కైఫ్ (0)లు నిరాశపర్చారు. ప్రస్తుతం ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్రని ఆంధ్ర బౌలర్లు వణికించారు. 10 పరుగులకే ఓపెనర్లు గుగాలే (0), ఖడివాలే (6)లు వెనుదిరిగారు. అయితే మోత్వాని నిలబడినా.. రెండో ఎండ్‌లో జాదవ్ (6), బావ్నే (2)లు కూడా పెవిలియన్‌కు చేరడంతో మహారాష్ట్ర 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మోత్వాని అవుటైన తర్వాత సంక్లేచా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఓవరాల్‌గా ఆరుగురు సిం గిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో మహా రాష్ర్ట స్వల్ప స్కోరుకు పరిమితమైంది. విజయ్ కుమార్, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు తీశారు. -
ఆంధ్ర X మహారాష్ట్ర
16 నుంచి రంజీ క్వార్టర్స్ న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మంగళవారం విడుదలైన ‘డ్రా’ ప్రకారం ఆంధ్ర జట్టు మహారాష్ట్రను ఎదుర్కోనుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న కైఫ్ సేన క్వార్టర్స్‌లో అదే జోరును చూపాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈనెల 25 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. తొలి రెండు క్వార్టర్స్ విజేతల మధ్య సెమీస్ బెంగళూరులో.. మూడు, నాలుగు మ్యాచ్‌ల మధ్య విజేతలు సెమీస్ కోల్‌కతాలో జరుగుతాయి. మార్చి 8 నుంచి ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్స్ ‘డ్రా’ కర్ణాటక x అస్సాం (ఇండోర్‌లో); ఢిల్లీ x ముంబై (కటక్‌లో); విదర్భ x తమిళనాడు (జైపూర్‌లో); ఆంధ్ర x మహారాష్ట్ర (లాహిలో).