ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు.
హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్‌ను కోల్‌కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.
కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్‌పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తలు
భారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి
న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.
మనుష్–దియా జోడీ ఓటమి
న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్‌లో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్వార్టర్స్‌లో రియా–రష్మిక జోడీ
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment