ముంబై జట్టు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌... | Four Mumbai players test positive for COVID 19 ahead of Syed Mushtaq Ali Trophy | Sakshi
Sakshi News home page

ముంబై జట్టు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌...

Oct 27 2021 5:05 PM | Updated on Oct 27 2021 6:41 PM

Four Mumbai players test positive for COVID 19 ahead of Syed Mushtaq Ali Trophy - Sakshi

Four Mumbai players test positive for COVID 19: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ప్రారంభానికి ముందు ముంబై జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టులోని నలుగురు ఆటగాళ్లు  కరోనా బారిన పడ్డారు. షామ్స్ ములానీ, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి,సాయిరాజ్ పాటిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ దేశవాళీ టీ20 లీగ్‌ నవంబరు 4 నుంచి ప్రారంభంకానుంది. ఎలైట్‌ గ్రూపు-బిలో ఉన్న ముంబై లీగ్‌ స్టేజ్‌లో గౌహతిలో మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ క్రమం​లో ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్హహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ నలుగురు ఆటగాళ్లు సెల్ఫ్‌ ఐషోలేషన్‌కు వెళ్లారు. మిగితా ఆటగాళ్లకు నెగిటివ్‌గా తేలడంతో గౌహతి చేరుకున్నారు. కాగా ముంబై జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహిస్తున్నాడు.

ముంబై జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), ఆదిత్య తారే, శివమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి, శామ్స్ ములానీ, అథర్వ అంకోలేకర్, ధవల్ కులకర్ణి, హార్దిక్ తమోర్, మోహిత్ అవస్తీ, సిద్ధేష్ పాటిల్, సిద్ధేష్ లాడ్ అమన్ ఖాన్, అర్మాన్ జాఫర్, యశస్వి జైస్వాల్, తనుష్ కోటియన్, దీపక్ శెట్టి , రాయిస్తాన్ డయాస్

చదవండిT20 World Cup 2021: న్యూజిలాండ్‌కు మరో బిగ్‌ షాక్.. స్టార్‌ ఓపెనర్‌ దూరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement