హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు తొలి విజయం సాధించింది.
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు తొలి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ముంబై 4–3 గోల్స్ తేడాతో నెగ్గింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో కళింగ లాన్సర్స్ ఆడుతుంది.