భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్‌కు అదిరే ఆరంభం లభించింది. చిట్ట చివరి నిమిషం వరకు ఆతిథ్య కళింగ లాన్సర్స్‌దే విజయమని భావించినా యూపీ విజార్డ్స్ ఆటగాళ్లు అద్భుతమే చేశారు. దీంతో సోమవారం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విజార్డ్స్ 8-6 గోల్స్‌తో కళింగ లాన్సర్స్‌ను ఓడించింది.
నమోదైన గోల్స్ అన్నీ ఫీల్డ్ గోల్సే. ఈ లీగ్ కొత్త నిబంధన ప్రకారం ప్రతి ఫీల్డ్ గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణిస్తున్నారు. తొలి క్వార్టర్ వరకు విజార్డ్స్ 4-2తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత పుంజుకున్న లాన్సర్స్ ఆట చివరి వరకు 6-4తో పైచేయిలోనే ఉంది. అయితే 60వ నిమిషంలో విజార్డ్స్ తరఫున ఆకెన్‌డెన్, ఆకాశ్‌దీప్ రెండు గోల్స్ సాధించడంతో ఆతిథ్య జట్టు అవాక్కయ్యింది. జోలీ (9వ నిమిషంలో), కెన్నెత్ (14) మిగతా గోల్స్ చేశారు. లాన్సర్స్ నుంచి ప్రదీప్ (15), గ్లెన్ టర్నర్ (29, 37) గోల్స్ సాధించారు.
యూపీ విజార్డ్స్ థ్రిల్లింగ్ విజయం
Published Tue, Jan 19 2016 3:23 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
Advertisement
Advertisement