
ఇప్పుడిక మూడో టెస్టు వంతు. వాండరర్స్ దక్షిణాఫ్రికాలోనే వేగవంతమైన, బౌన్స్ అధికంగా ఉండే పిచ్. విదేశీ జట్లకు ప్రేక్షకుల నుంచి కనీస మద్దతు కూడా లభించదు. గత మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ స్ఫూర్తితోనైనా భారత బ్యాటింగ్ బల పడాలి. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్స్‌మెన్ బాధ్యతగా ఆడి భారీగా పరుగులు సాధించాలి. ఈ సిరీస్‌లో అయిదుగురు బ్యాట్స్‌మెన్ సిద్ధాంతం నడవదని తేలిపోయింది. ఆతిథ్య జట్టు తమ ఏకైక స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను తప్పించి అయిదుగురు పేసర్లను ఆడించే యోచన చేస్తే... భారత్ కూడా అశ్విన్‌ను పక్కన పెట్టాలి. అప్పుడు హార్దిక్ సహా అయిదుగురు పేసర్లు తుది జట్టులో ఉంటారు. కష్టమే అయినా... రహానేను తీసుకుని కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించాలి.
సెంచూరియన్‌లో మాదిరిగా ఇక్కడా టర్న్ కనిపిస్తే అది కొంతైనా ప్రభావం చూపుతుంది. నైపుణ్యానికి కొదవలేని ఈ జట్టు దేశం కోసం ఆడుతున్న సందర్భంలో మైదానంలో దానిని పూర్తిగా ప్రదర్శించింది. ఫీల్డింగ్ ప్రమాణాలు ఏమంత బాగోలేకున్నా బౌలర్లు విశేషంగా రాణించి అవకాశాలు కల్పించారు. రెండు టెస్టుల్లోనూ ప్రొటీస్ చివరి వరుస బ్యాట్స్‌మెన్ జోడించిన పరుగులు అంతిమంగా తేడా చూపించాయి. ఏదేమైనా పరువు దక్కించుకునేందుకు భారత్‌కు ఇది చివరి అవకాశం.
Comments
Please login to add a commentAdd a comment