రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్ | rahane hits ton in 2nd test against srilanka | Sakshi
Sakshi News home page

రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

Published Sun, Aug 23 2015 2:44 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్ - Sakshi

రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో అజింక్యా రహానె (126) సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవర్నైట్ స్కోరు 70/1తో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ ఓవరాల్గా 370 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మురళీ విజయ్ (82) హాఫ్ సెంచరీకి తోడు రోహిత్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్ కౌశల్ 4 వికెట్లు తీశాడు. కాసేపట్లో భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 393, లంక 306 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement